Sardar Singh Sena
-
భారత్‌కు చావో.. రేవో
► నేడు మలేసియాతో పోరు గెలిస్తేనే ఫైనల్‌కు.. ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లా న్షా కప్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్ బెర్త్‌పై దృష్టి సారించిన భారత జట్టు నేడు (శుక్రవారం) కీలక మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో జరిగే ఈ పోరులో సర్దార్ సింగ్ సేన కచ్చితంగా నెగ్గితేనే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. నిజానికి బుధవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై నెగ్గితే భారత్‌కు ఈ మ్యాచ్ నామమాత్రంగానే ఉండేది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్న కివీస్‌ను వెనక్కి నెట్టాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ను గెలవడం తప్ప మరో దారి లేదు. మలేసియాతో ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అటు మలేసియా ఏడు గోల్స్ తేడాతో భారత్‌ను ఓడిస్తే ఫైనల్‌కు చేరుతుంది. -
భారత్ vs పాక్
► నేడు చిరకాల ప్రత్యర్థుల పోరు ► అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీ ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్ నేడు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కీలక సమరానికి సిద్ధమవుతోంది. గతేడాది కాంస్యంతో సరిపెట్టుకున్న సర్దార్ సింగ్ సేన ఈసారి మెరుగైన ఫలితం సాధించాలనే కసితో ఉంది. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన జట్టు పాక్‌తో మాత్రం పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో జపాన్‌పై నెగ్గినా రెండో మ్యాచ్‌లో ఆసీస్‌తో దారుణంగా ఓడింది. అలాగే ఆదివారం కెనడాపై నెగ్గేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు 3-1తో గట్టెక్కింది. అయితే పాక్‌తో మ్యాచ్ అంటే భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి కాబట్టి ఏమాత్రం అలక్ష్యం లేకుండా ఆడాల్సి ఉంటుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిన జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అటు పాక్ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించింది. అయినా భారత్‌తో మ్యాచ్ అనగానే సమీకరణాలు మారిపోతాయి. విజయమే లక్ష్యంగా ఆ జట్టు పోరాడుతుంది. భారత జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్, తల్విందర్, తిమ్మయ్య ఫామ్‌లో ఉన్నారు. మిడ్‌ఫీల్డ్‌లో సర్దార్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవలి దక్షిణాసియా క్రీడల ఫైనల్లో భారత్‌ను ఓడించి స్వర్ణం సాధించిన పాక్ జట్టులోని ఎనిమిది మంది యువ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఆ ఈవెంట్లో భారత్ పూర్తి స్థాయి జట్టును ఆడించలేదు. -
భారత్‌దే హాకీ సిరీస్
జపాన్‌పై 2-0తో గెలుపు భువనేశ్వర్ : జపాన్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 2-1తో నెగ్గింది. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. 36వ నిమిషంలో ఆకాశ్ దీప్ గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జపాన్ తరఫున 44వ నిమిషంలో వకరి పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రా కాగా... భారత్ రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.