
మాంచెస్టర్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, కెప్టెన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విలియమ్సన్ 95 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. దాంతో తాజా వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ 548 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మార్టిన్ గప్టిల్(547 పరుగులు, 2015 వరల్డ్‌కప్)ఒక వరల్డ్‌కప్‌లో కివీస్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు బద్ధలైంది.
అయితే ఈ రికార్డు సాధించిన వెంటనే విలియమ్సన్ ఔటయ్యాడు. భారత స్పిన్నర్ చహల్ వేసిన 36 ఓవర్ రెండో బంతికి జడేజాకు క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. గప్టిల్(1) ఆదిలోనే పెవిలియన్ చేరగా, నికోలస్(28) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. విలియమ్సన్‌తో కలిసి 68 పరుగులు జత చేసిన తర్వాత రెండో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆపై రాస్ టేలర్‌తో కలిసి 65 పరుగులు భాగస్వామ్యం సాధించిన తర్వాత విలియమ్సన్ ఔటయ్యాడు.