మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల టార్గెన్ ఛేదించే క్రమంలో భారత్ ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(1) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కోహ్లి(1) కూడా నిరాశ పరిచాడు. ఆపై వెంటనే కేఎల్ రాహుల్(1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. మ్యాట్ హెన్నీ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి కోహ్లి(1) ఎల్బీ అయ్యాడు. దీనిపై భారత్ రివ్యూకు వెళ్లానా ప్రతికూల ఫలితమే వచ్చింది. ఇక మ్యాట్ హెన్రీ నాల్గో ఓవర్ తొలి బంతికి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్(1) ఔటయ్యాడు. ఈ ముగ్గురూ తలో పరుగు చేసి పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
న్యూజిలాండ్ 240 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద రిజర్వ్ డే(బుధవారం)నాడు తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ మరో 28 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగులు చేయడానికి శ్రమించింది. ఆ క్రమంలోనే మూడు దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment