మాంచెస్టర్: భారత్-న్యూజిలాండ్ జట్ల తొలి సెమీస్ ఫలితం నేడు తేలిపోనుంది. మంగళవారం భారత్-కివీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడ్డాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులతో ఉన్నప్పుడు చిరు జల్లులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరు పెంచి నాలుగున్నర గంటలపాటు కొనసాగింది. రెండు సార్లు పిచ్‌ను పరీక్షించిన రిఫరీ, అంపైర్లు చివరకు ఆటను రిజర్వ్‌డే నాడు ఆడించేందుకు నిర్ణయించారు. మ్యాచ్‌ను సాధ్యమైనంత వరకూ నిన్ననే జరపాలని చూసిన అది సాధ్యం కాలేదు. దాంతో చివరి అవకాశంగా రిజర్వ్ డే నాడు మ్యాచ్‌ను కొనసాగించనున్నారు. దీంతో బుధవారం 46.2వ బంతి నుంచి మ్యాచ్ ప్రారంభమైంది. టేలర్ (67 బ్యాటింగ్; 85 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), లాథమ్( 3 బ్యాటింగ్)లు బ్యాటింగ్‌కు దిగారు.
రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగించడం భారత్‌కే ఎక్కువ అనుకూలమనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది. మ్యాచ్ నిన్న జరిగిన పక్షంలో టీమిండియా 20 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి వచ్చేది. కాగా, వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment