నేలకు దించారు | India's defeat in the second match | Sakshi
Sakshi News home page

నేలకు దించారు

Published Thu, Oct 20 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

నేలకు దించారు

నేలకు దించారు

రెండో వన్డేలో భారత్ ఓటమి 
6 పరుగులతో కివీస్ విజయం
సెంచరీతో చెలరేగిన విలియమ్సన్  
మూడో వన్డే ఆదివారం  


మూడు టెస్టుల్లో ఘన విజయం, ఆ తర్వాత తొలి వన్డేలోనూ భారీ తేడాతో గెలుపు... న్యూజిలాండ్ జట్టు మన గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి వరుస విజయాలతో పండుగ చేసుకున్న భారత జట్టు జోరుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత గడ్డపై కివీస్ బోణీ చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా... చివరకు విలియమ్సన్ సేనదే పైచేరుు అరుుంది.

 
243 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో భారత్ స్కోరు 183/8... మిగిలిన 55 బంతుల్లో గెలుపు కోసం 60 పరుగు చేయాలి. ఎలాంటి ఆశలు లేని ఈ దశలో హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ 49 పరుగుల భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న పాండ్యా ఈ సారి బ్యాట్‌తో మెరిశాడు. మరో 11 పరుగులు చేయాల్సిన సమయంలో అతను వెనుదిరగడంతో భారత్ విజయం వాకిట కుప్పకూలింది. 


న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తన క్లాస్ చూపించాడు. సహచరులంతా విఫలమైన వేళ ఒంటరిగా నిలబడి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత తన కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటైన దశలో 19వ ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ధోని తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాడు. ఇటీవల తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఇరు జట్ల కెప్టెన్ల పోరులో విలియమ్సన్ గెలిచాడు.

    
గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (128 బంతుల్లో 118; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని సాధించాడు. బుమ్రా, మిశ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (37 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధోని (65 బంతుల్లో 39; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో వన్డే ఆదివారం మొహాలీలో జరుగుతుంది.

 
కీలక భాగస్వామ్యం
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా... కివీస్ జట్టులో మూడు మార్పులు జరిగారుు. కివీస్ ఓపెనర్ గప్టిల్ (0) పేలవ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్‌‌స రెండో బంతికే అతడిని బౌల్డ్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం అందించాడు. అరుుతే మరో ఓపెనర్ లాథమ్ (46 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు అలవోకగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాది విలియమ్సన్ జోరు ప్రదర్శించాడు. 46 పరుగుల వద్ద విలియమ్సన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పాండ్యా వదిలేయడం కివీస్‌కు కలిసొచ్చింది. వీరిద్దరి అటాకింగ్ ఆటతో తర్వాతి పది ఓవర్లలో 65 పరుగులు వచ్చారుు.

 
ఆ వికెట్ తర్వాత...

పార్ట్‌టైమర్ జాదవ్ మరోసారి జట్టుకు అదృష్టం తెచ్చాడు. తన తొలి ఓవర్లోనే లాథమ్‌ను అవుట్ చేసి అతని భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ఆ తర్వాత ఒక వైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడ్డా... మరో ఎండ్‌లో కివీస్ పతనం మొదలైంది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ టేలర్ (21) మిశ్రా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 109 బంతుల్లో విలియమ్సన్ సెంచరీ పూర్తరుుంది. ఈ పర్యటన మొత్తంలో కివీస్ తరఫున ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ దశలో అండర్సన్ (21)ను అవుట్ చేసి మిశ్రా మళ్లీ దెబ్బ తీశాడు. మిశ్రా తన తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో విలియమ్సన్‌ను కూడా పెవిలియన్ పంపించడంతో ఆ జట్టు కోలుకోలేకపోరుుంది. ఆ తర్వాత మరో 24 పరుగులు మాత్రమే చేసి కివీస్ తర్వాతి ఐదు వికెట్లు కోల్పోరుుంది. ఒక దశలో ఆ జట్టు వరుసగా 11 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోరుుంది. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 37 డాట్ బాల్స్ వేయగా, మొత్తం కలిపి కివీస్ పరుగులు తీయని బంతులు 161 ఉండటం చూస్తే భారత బౌలర్లు ఎంతగా కట్టడి చేశారో అర్థమవుతుంది.

 
కోహ్లి విఫలం

ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు తక్కువ వ్యవధిలోనే తొలి నాలుగు  వికెట్లు కోల్పోరుుంది. టాప్-4 ఆటగాళ్లలో ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముందుగా రోహిత్ (15)ను అవుట్ చేసి బౌల్ట్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. అరుదైన రీతిలో కోహ్లి (9) కూడా విఫలమయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడిన బంతిని కీపర్ రోంచీ చక్కగా అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్‌‌స ముగిసింది. చక్కటి షాట్లు ఆడిన రహానే (49 బంతుల్లో 28; 3 ఫోర్లు) కుదురుకుంటున్న దశలో సౌతీ దెబ్బ తీశాడు. ఫైన్ లెగ్ దిశగా రహానే పుల్ షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అండర్సన్ క్యాచ్ పట్టాడు. అరుుతే అతని చేతుల్లో పడే ముందు బంతి నేలకు తగిలినట్లు కని పించింది. పదే పదే రీప్లేలు చూసిన తర్వాత థర్డ్ అంపైర్ రహానేను అవుట్‌గా ధ్రువీకరించారు. ఆ తర్వాతి ఓవర్లోనే మనీశ్ పాండే (19) రనౌట్‌గా వెనుదిరిగాడు.

 
ఆదుకున్న ధోని, జాదవ్
ఈ దశలో జత కలిసిన ధోని, జాదవ్ దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా జాదవ్ కెప్టెన్‌ను మించి ధాటిగా ఆడాడు. సాన్‌ట్నర్ వేసిన రెండు వరుస ఓవర్లలో అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం హెన్రీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి జాదవ్ నిష్ర్కమించాడు. అనంతరం ధోని, అక్షర్ కలిసి 33 పరుగులు జోడించినా... కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో పరుగులు నెమ్మదిగా వచ్చారుు. ఈ దశలో సౌతీ అద్భుత రిటర్న్ క్యాచ్‌తో ధోనిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత గప్టిల్ తన తొలి ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో భారత్ ఓటమికి మరింత చేరువైంది. ఇలాంటి స్థితిలో పాండ్యా, ఉమేశ్ (18 నాటౌట్) జోడి గెలుపుపై ఆశలు రేపినా...చివరకు ఓటమి తప్పలేదు.

 

 

13   భారత్‌ను భారత గడ్డపై న్యూజిలాండ్ 13 ఏళ్ల తర్వాత ఓడించింది. ఈ కాలంలో ఇరు జట్ల మధ్య 8 వన్డేలు జరిగారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement