kiwis
-
మక్కాను సందర్శించిన కివీస్ క్రికెటర్ అజాజ్ పటేల్ (ఫొటోలు)
-
అలెన్ అదరహో
బర్మింగ్హమ్: ఇంగ్లండ్ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (53 బంతుల్లో 83; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (34 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీలు చేశారు. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ (21 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ (3/23), ఇష్ సోధి (3/33) రాణించారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్
డ్యూనెడిన్: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 88 పరుగుల తేడాతో బంగ్లాపై జయభేరి మోగించింది. ముందుగా న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. రాస్ టేలర్ (69; 7 ఫోర్లు), నికోల్స్ (64; 7 ఫోర్లు), కెప్టెన్ లాథమ్ (59; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 47వ అర్ధసెంచరీ సాధించిన రాస్ టేలర్ వన్డేల్లో అత్యధిక పరుగులు (8,026) చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు స్టీఫెన్ ఫ్లెమింగ్ (8,007) పేరిట ఉండేది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 47.2 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌటైంది. షబ్బీర్ రహమాన్ (102; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. టిమ్ సౌతీ (6/65) ధాటికి బంగ్లా విలవిల్లాడింది. -
సెంచరీతో కివీస్‌ను గెలిపించిన గప్టిల్
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (88 బంతుల్లో 118; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బంగ్లాదేశ్‌పై మళ్లీ శతక్కొట్టాడు. దీంతో శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్ నెగ్గిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో మిథున్ (57; 7 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహ్మాన్ (43; 7 ఫోర్లు) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, ఆస్టల్, నీషమ్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 36.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది. తొలి వన్డేలో అజేయ సెంచరీ బాదిన గప్టిల్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో వికెట్‌కు కెప్టెన్ విలియమ్సన్ (65 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి 143 పరుగులు జోడించాడు. అనంతరం టేలర్ (21 నాటౌట్, 3 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్ మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. -
జో లాలీ... నిదరోయే నా తల్లి...
జో లాలీ... లాలీ జో... బజ్జోవే నా తల్లి అంటూ తన గారాలపట్టి సమైరాను నిద్రపుచ్చుతున్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. కివీస్ పర్యటన ముగించుకొని వచ్చీరాగానే తన చిట్టితల్లితో సేదతీరుతున్న ఫొటోని రోహిత్ సామాజిక మాధ్యమాల్లో ఇలా పంచుకున్నాడు. -
గప్టిల్ సెంచరీ: కివీస్ గెలుపు
నేపియర్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (116 బంతుల్లో 117 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కడదాకా నిలిచి న్యూజిలాండ్‌ను గెలిపించాడు. బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. ముందుగా బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌల్ట్, సాన్‌ట్నర్ మూడేసి వికెట్లు, హెన్రీ, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 44.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసి గెలిచింది. నికోల్స్ (53; 5 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి శుభారంభమిచ్చిన గప్టిల్... టేలర్ (45 నాటౌట్, 6 ఫోర్లు)తో కలిసి 5.3 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో రెండో వన్డే జరుగుతుంది. -
ధోని మళ్లీ వచ్చాడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టి20ల్లో మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో అతను జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం ధోనిని సెలక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు. భారత్ ఆడిన గత రెండు టి20 సిరీస్‌లలో (సొంతగడ్డపై వెస్టిండీస్‌తో, ఆస్ట్రేలియాతో) ధోనికి చోటు దక్కలేదు. దాంతో పొట్టి ఫార్మాట్లో అతని ఆటకు ఫుల్స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా ధోనికి మరోసారి అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లు, న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ కోసం సోమవారం సెలక్టర్లు జట్లను ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు మాజీ కెప్టెన్‌కు సాధ్యమైనంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకే అతడిని తిరిగి టి20 జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ మరో ఎనిమిది వన్డేలు (ఆసీస్‌తో 3, న్యూజిలాండ్‌తో 5) మాత్రమే ఆడనుంది. ధోని గైర్హాజరులో పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, దినేశ్ కార్తీక్ రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. ఇప్పుడు ధోనితో పాటు వీరిద్దరు కూడా 15 మంది సభ్యుల టి20 జట్టులో ఉండటం విశేషం. ‘టి20 ఫార్మాట్లో పంత్‌లాంటి కుర్రాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిదని ధోని భావించాడు. అందుకే తనంతట తానే తప్పుకున్నాడు’ అని విండీస్‌తో సిరీస్‌కు ముందు కోహ్లి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడాలని నిర్ణయించుకోవడం అనూహ్యం. వన్డేలకు కార్తీక్... ఆసియా కప్ తర్వాత వన్డే టీమ్‌లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్ కూడా పునరాగమనం చేశాడు. పంత్ స్థానంలో అతనికి చోటు లభించింది. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాకు ఊహించినట్లుగానే రెండు ఫార్మాట్లలో కూడా స్థానం దక్కింది. వెస్టిండీస్ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడి స్థానం కోల్పోయిన షమీని కూడా వన్డేల కోసం ఎంపిక చేశారు. మరో పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు జట్లలోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో రెగ్యులరే అయినా టి20ల్లో పెద్దగా ఆడని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు కూడా చోటు దక్కింది. జాదవ్ తన ఆఖరి టి20 మ్యాచ్‌ను 2017 అక్టోబరులో ఆడాడు. పాండే, ఉమేశ్ ఔట్... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే రెండు జట్లలోనూ స్థానం కోల్పోయాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఆసీస్‌తో మూడు టి20ల్లోనూ పాండేకు ఆడే అవకాశమే రాలేదు. విండీస్‌తో రెండు టి20లు ఆడిన అతను 19, 4 నాటౌట్ పరుగులు చేశాడు. వన్డే, టి20ల్లోనూ సభ్యుడిగా ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు పక్కన పెట్టారు. పునరాగమనం తర్వాత 2 వన్డేలు, 1 టి20 ఆడిన ఉమేశ్ ఘోరంగా విఫలమయ్యాడు. టి20 టీమ్ సభ్యులుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశం లభించకుండానే చోటు కోల్పోయారు. ‘ఎ’ జట్టు తరఫున పంత్... భారత సీనియర్ జట్టులోకి వేగంగా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ జోరుకు సెలక్టర్లు చిన్న విరామం ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న పంత్‌పై వన్డేల్లో వేటు పడింది. విండీస్‌తో సిరీస్‌లో పంత్ మూడు వన్డేలు ఆడగా... ధోని జట్టులో ఉండటంతో వికెట్ కీపింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు టి20ల్లో కూడా ధోని పునరాగమనం చేయడంతో అతను ఇక్కడా తుది జట్టులో ఉండటం సందేహమే. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే పంత్ స్వదేశం పయనమవుతాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతను భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జనవరి 12, 15, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న భారత్... జనవరి 23నుంచి ఐదు వన్డేలు, 3 టి20ల కోసం కివీస్ పర్యటనకు వెళుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, అంబటి రాయుడు, జడేజా, షమీ. న్యూజిలాండ్‌తో టి20లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, పంత్. -
ఫైనల్లో కివీస్‌పై ఆసీస్ గెలుపు
ఆక్లాండ్ : డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో ట్రాన్స్-టాస్మన్ టీ20 ట్రై-సిరీస్ ఫైనల్లో కివీస్‌పై ఆసీస్ 19 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. రాస్ టేలర్(43) ఓ మాత్రంగా రాణించాడు. ఆసీస్ బౌలర్లలో అస్టన్ అగర్‌కు 3 వికెట్లు, రిచర్డ్సన్కు 2 వికెట్లు, టైకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 14.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. అప్పటికి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ నిబంధనలు ప్రకారం ఆసీస్ 19 పరుగులతో గెలిచినట్లు డిక్లేర్ చేశారు. కీలక సమయంలో వికెట్లు తీసిని అస్టన్ అగర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, సిరీస్ ఆసాంతం రాణించిన గ్లెన్ మాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. -
రెండో వన్డేలోనూ కివీస్‌దే విజయం
నెల్సన్: న్యూజిలాండ్, పాకిస్తాన్ వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌నూ వర్షం విడిచి పెట్టలేదు. దీంతో ఈ మ్యాచ్ ఫలితాన్నీ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతే తేల్చింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య కివీస్ జట్టు డీఎల్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ (60; 8 ఫోర్లు), షాదాబ్ ఖాన్ (52; 3 ఫోర్లు, 1 సిక్స్), హసన్ అలీ (51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. తర్వాత వర్షం వల్ల లక్ష్యాన్ని 25 ఓవర్లలో 151 పరుగులుగా నిర్దేశించారు. దీన్ని న్యూజిలాండ్ 23.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గప్టిల్ (71 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రాస్ టేలర్ (43 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం కివీస్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే శనివారం డ్యునెడిన్‌లో జరుగుతుంది. -
విలియమ్సన్ సెంచరీ: పాక్‌పై కివీస్ గెలుపు
వెల్లింగ్టన్: పాకిస్తాన్‌తో మొదలైన ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో కివీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ పూర్తిగా సాగలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 315 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (115; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. గప్టిల్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మున్రో (58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు); నికోల్స్ (43 బంతుల్లో 50; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్ 30.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (82 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌతీ 3, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు. బలమైన ఈదురు గాలులతో వికెట్ల మీది బెయిల్స్ పదే పదే పడిపోవడంతో వాటిని తీసేసి మ్యాచ్‌ను ఆడించారు. ఇరు జట్ల మధ్య 9న రెండో వన్డే జరుగనుంది. -
కివీస్, విండీస్ రెండో టి20 వర్షార్పణం
మౌంట్ మాంగనీ: కివీస్ ఓపెనర్ మున్రో (23 బంతుల్లో 66; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు చినుకుల్లో కలిసిపోయాయి. వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన రెండో టి20 మ్యాచ్ వర్షంతో రద్దయింది. వర్షంతో ఆలస్యంగానే ప్రారంభమైన ఈ మ్యాచ్ ఎంతో సేపు సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట నిలిచే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 102 పరుగులు చేసింది. మున్రో 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కాట్రెల్, బద్రీ, నర్స్, విలియమ్స్ తలా ఒక వికెట్ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉంది. -
కివీస్ ఇన్నింగ్స్ విజయం
వెల్లింగ్టన్: పేస్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో... విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు పోరాటపటిమ కనబరిచిన విండీస్ బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు మాత్రం అదే ఆటతీరును పునరావృతం చేయడంలో విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోరు 214/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో 105 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (91; 8 ఫోర్లు, ఒక సిక్స్) అవుటయ్యాక విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తీయగా... గ్రాండ్‌హోమ్, బౌల్ట్, వాగ్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 9న మొదలవుతుంది. -
'తొలి' గెలుపు కోసం
టెస్టుల్లో గెలుస్తోంది. వన్డేల్లో వణికిస్తోంది. ఐపీఎల్‌తో రాటుదేలింది. కానీ... ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న భారత్.. న్యూజిలాండ్‌పై టి20ల్లో గెలవలేకపోయింది. కివీస్‌తో ఆడిన ఐదుసార్లూ టీమిండియా ఓడింది. ఇందులో రెండు సొంతగడ్డపై ఆడినా... ఫలితం మారలేదు. ఈ నేపథ్యంలో టి20ల్లో నంబర్‌వన్ కివీస్‌పై తొలి విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది కోహ్లి సేన. న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత్ ఇప్పుడు దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఏ జట్టయినా... ఏ ఫార్మాట్లోనైనా కోహ్లిసేనదే విజయం. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో టి20ల్లో మాత్రం భారత్‌కు సవాల్ ఎదురుగా నిలిచింది. ప్రత్యర్థిపై మన గత రికార్డు ప్రతికూలంగా ఉండగా, తాజా ఫామ్ కూడా కివీస్‌కే అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు (బుధవారం) ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగే తొలి టి20లో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రాకు విజయంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బ్యాటింగ్‌లో మంచి హిట్టర్లున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్ కూడా నువ్వానేనా అన్నట్లు సాగడం ఖాయం. రోహిత్, కోహ్లి జోరు కొనసాగేనా... ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లి ఇద్దరు అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. ఇది భారత బ్యాటింగ్‌కు అత్యంత సానుకూలాంశం. శిఖర్ ధావన్ కూడా తోడైతే పరుగుల వరద ఖాయం. ఎందుకంటే తర్వాత వరుసలో మెరుపులు మెరిపించే హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండేలు ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించగల సమర్థులు. వీరిని ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి ధోని అందుబాటులో ఉండనే ఉన్నాడు. బౌలింగ్ విభాగం కూడా యువసత్తాతో పటిష్టంగా ఉంది. అయితే నెహ్రా కు వీడ్కోలు అవకాశం వల్ల బుమ్రా, భువనేశ్వర్లలో ఒకరు బెంచ్ కు పరిమితమవుతున్నారు. డెత్ ఓవర్లను నియంత్రించే ఈ జోడి బ్రేక్ అవడం కాస్త ఇబ్బందికరమే అయినా స్పిన్నర్లు అక్షర్ పటేల్, చహల్‌ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. ప్రత్యర్థి బలమూ బ్యాటింగే న్యూజిలాండ్ కూడా బ్యాటింగ్‌నే నమ్ముకుంది. ఈ జట్టు టి20 ఇన్నింగ్స్‌కు గప్టిలే వెన్నెముక. పవర్ ప్లేను సమర్థంగా వినియోగించుకొని చెలరేగుతాడు. గత 10 మ్యాచ్‌ల్లో అతను ఐదు అర్ధసెంచరీలు చేశాడంటే అతనెంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. వన్డేల్లో ధాటిగా ఆడిన లాథమ్‌ను టి20 తుది జట్టులోనూ కొనసాగించారు. ఒక్క నెహ్రా మినహా మిగతా బౌలర్లందరినీ ఎదుర్కొన్న అనుభవం కివీస్ బ్యాట్స్‌మెన్‌కు ఉంది. దీంతో పాటు ఇటీవలే ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లోనూ భారత్‌కు దీటుగా పరుగులు చేసింది. చివరి మ్యాచ్‌లో కివీస్ ధాటిని చూస్తే కోహ్లి రికార్డుకు బ్రేక్ పడుతుందేమోననే కలవరం కలిగింది. సాన్‌ట్నర్, సౌతీ, భారత సంతతి స్పిన్నర్ ఇష్ సోధిలు కోహ్లి సేన వెన్నువిరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన న్యూజిలాండ్... భారత్ గడ్డపై టి20 సిరీస్ టైటిల్‌తో స్వదేశం చేరాలని పట్టుదలగా ఉంది. బుమ్రా కూడా నం.1 ఇప్పుడు నంబర్‌వన్ వంతు జస్ప్రీత్ బుమ్రాది. తాజా ఐసీసీ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానంలో నిలిచాడు. 729 రేటింగ్ పాయింట్లతో అతను మొదటి ర్యాంకుకు ఎగబాకాడు. టి20 బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లి టాప్ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్/బుమ్రా, ఆశిష్ నెహ్రా, చహల్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, ఇష్ సోధి. పిచ్, వాతావరణం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లు కూడా కొంత ప్రభావం చూపించగలరు. వానతో ముప్పు లేదు. ►రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
లెక్క సరిచేయాలని..
ముంబై: వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగు పెట్టిన న్యూజిలాండ్‌కు తొలి వార్మప్ మ్యాచ్‌లోనే వాస్తవ పరిస్థితి అర్థమైంది. భారత ద్వితీయ శ్రేణి జట్టులాంటి బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఆటగాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కోలేక కివీస్ చతికిల పడింది. ప్రధాన వన్డే సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించింది. అదే జట్టుతో నేడు జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా రాణించాలని కివీస్ పట్టుదలగా ఉంది. -
‘ఎ’ వన్డేలకు సర్వం సిద్ధం
ఈ నెల 23 నుంచి విజయవాడలో భారత్, కివీస్ పోరు విజయవాడ స్పోర్ట్స్: భారత ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య ఇక్కడి మూలపాడు మైదానంలో జరిగే రెండు అనధికారిక టెస్టు (నాలుగు రోజుల) మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. దీంతో పాటు విశాఖపట్నంలో ఇరు జట్ల మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు సంబంధించిన వివరాలను కూడా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మూలపాడులోని గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 23 నుంచి 26 వరకు తొలి టెస్టు, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు రెండో టెస్టు జరుగుతాయి. ఇటీవలే ఈ మైదానంలో భారత్, వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య వన్డే, టి20 సిరీస్‌లు నిర్వహించారు. అనంతరం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ–వీడీసీఏ స్టేడియంలో అక్టోబర్ 6, 8, 10, 13, 15 తేదీల్లో భారత్, కివీస్ ఐదు వన్డేల్లో తలపడతాయి. ఇరు జట్లు ఈ నెల 21న విజయవాడ చేరుకుంటాయి. పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లకు హాజరై విజయవంతం చేయాలని ఏసీఏ విజ్ఞప్తి చేసింది. రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టుకు కరుణ్ నాయర్ నాయకత్వం వహిస్తుండగా... ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి, హైదరాబాద్ బౌలర్ సిరాజ్ ఈ జట్టులో ఉన్నారు. సమావేశంలో ఏసీఏ కోశాధికారి కె.రామచంద్ర రావు, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేశ్, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి బెర్త్ ఇంగ్లండ్‌దే
►కివీస్‌పై గెలుపుతో సెమీస్‌లోకి ►రాణించిన బట్లర్, రూట్, హేల్స్ ►చాంపియన్స్ ట్రోఫీ కార్డిఫ్: అందరికంటే ముందుగా ఆతిథ్య జట్టే సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’మ్యాచ్‌లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై జయభేరి మోగించింది. మొదట ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 310 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ హేల్స్ (62 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫామ్‌లో ఉన్న రూట్ (65 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బట్లర్ (48 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 44.3 ఓవర్లలో 223 పరుగుల వద్ద ఆలౌటైంది. విలియమ్సన్ (98 బంతుల్లో 87; 8 ఫోర్లు) వీరోచిత పోరాటం చేశాడు. ప్లంకెట్ 4, బాల్, రషీద్ చెరో 2 వికెట్లు తీశారు. వరుసగా రెండో విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. మళ్లీ... 300 దాటేసింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జేసన్ రాయ్ (13), అలెక్స్ హేల్స్ ప్రారంభించారు. అయితే జట్టు స్కోరు 37 పరుగుల వద్ద రాయ్‌ని మిల్నే బౌల్డ్ చేశాడు. ఆరంభంలో నెమ్మదించిన జట్టు స్కోరు... రూట్ రాకతో పరుగుపెట్టింది. రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించాక హేల్స్ కూడా మిల్నే బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మోర్గాన్ (13) విఫలమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ (53 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రూట్స్ మరో ఉపయుక్తమైన భాగస్వామ్యాన్ని అందించారు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జతయ్యాక రూట్... అండర్సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం స్టోక్స్... బౌల్ట్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. జట్టు స్కోరు పెంచే ప్రయత్నంలో బట్లర్ ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ స్కోరు 300 దాటింది. విలియమ్సన్ జోరు కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేన్ విలియమ్సన్ చక్కని పోరాటం చేశాడు. అతను ఉన్నంత సేపు కివీస్ విజయం దిశగా పయనించింది. కానీ అతని నిష్క్రమణతో అంతా మారిపోయింది. జట్టు స్కోరు 158 పరుగుల వద్ద మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఔట్ కావడంతో కోలుకోలేకపోయింది. చాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా& పాకిస్తాన్ వేదిక: బర్మింగ్‌హామ్ ; గ్రూప్: ‘బి’ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ధోనికి ‘సిరీస్’ పరీక్ష
⇒ ధోనిపై తీవ్రమైన ఒత్తిడి ⇒ చివరి వన్డేకు సిద్ధమైన విశాఖ ⇒ ఇరు జట్ల లక్ష్యం సిరీస్ విజయం ⇒ భారత జట్టులో ఒక మార్పు ⇒ ఆత్మవిశ్వాసంతో కివీస్ భారత కెప్టెన్‌గా ధోని సాధించిన విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరుుతే అతని నాయకత్వంలో గతంలోనూ చాలా సార్లు జట్టు ఘోరంగా విఫలమైంది. కానీ అలాంటి సందర్భాల్లోనూ ఏనాడూ అతను ఇంతటి శల్య పరీక్షను ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. కారణం... కోహ్లి అనూహ్య వేగంతో ఎదిగి పోవడం. ఒక వైపు టెస్టుల్లో అతను క్లీన్‌స్వీప్ కిరీటాన్ని తగిలించుకొని వస్తే, ఇప్పుడు ధోని వన్డే సిరీస్ గెలవడానికి శ్రమించాల్సి వస్తోంది. వెంటనే కెప్టెన్సీ పోయే ప్రమాదం లేకున్నా... ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా ఒక అద్భుతం చేస్తే గానీ ధోనిపై నమ్మకం పెరిగేలా లేదు. వైజాగ్‌తో ధోని అనుబంధం ప్రత్యేకమైంది. అతనిలోని సూపర్ హీరోను ప్రపంచానికి పరిచయం చేసిన మ్యాచ్ అతను ఇక్కడే ఆడాడు. ఇప్పుడు కెరీర్ చివరి దశలో అతను మరోసారి విశాఖ వేదికగా కీలక విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. మరో వైపు కివీస్ కూడా తొలిసారి భారత గడ్డపై సిరీస్ విజయంపై దృష్టి పెట్టడంతో సాగర తీరంలో మ్యాచ్‌పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోరుుంది. మరి ఇరు జట్లలో ఎవరిది పైచేరుు కానుందో! విశాఖపట్నం: భారత్‌తో టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు ఆటతీరు చూస్తే వన్డే సిరీస్ ఫలితం కోసం చివరి దాకా వేచి ఉండాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మెరుగైన ప్రదర్శనతో కివీస్ వన్డేల్లో రాత మార్చుకుంది. అనూహ్యంగా పటిష్ట భారత్‌కు గట్టి పోటీనిస్తూ సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. గతంలో సొంతగడ్డపై ఏనాడూ కివీస్ చేతిలో సిరీస్ ఓడిపోని భారత్, ఇప్పుడు ఆ రికార్డును నిలబెట్టుకునేందుకు పోరాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో వన్డే నేడు (శనివారం) ఇక్కడి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. విజయం తోనే సిరీస్‌ను ముగించాలని ధోనిసేన పట్టుదలతో ఉండగా, గత వన్డేలో విజయం స్ఫూర్తితో మరో గెలుపు అందుకోవాలని విలియమ్సన్ బృందం భావిస్తోంది. మరి భారత క్రికెట్ అభిమానులు విజయంతో దీపావళి చేసుకోగలరా చూడాలి. బుమ్రా జట్టులోకి... రాంచీ మ్యాచ్‌లో పరాజయం భారత జట్టును కలవరపరిచింది. అంతకు ముందు మ్యాచ్‌లో చెలరేగిన ధోని సొంతగడ్డపై విఫలమయ్యాడు. ఇప్పుడు నాలుగో స్థానంలోనే కొనసాగాలని భావిస్తున్న కెప్టెన్, ఆ స్థానానికి తగినట్లుగా కీలక ఇన్నింగ్స ఆడాల్సి ఉంది. కోహ్లి తిరుగు లేని ఫామ్ జట్టు బలంతో పాటు బలహీనతగా కూడా మారింది. అతను విఫలమైతే జట్టు కుప్పకూలిపోతుందేమో అనిపిస్తోంది. సిరీస్ మొత్తం విఫలమైన రోహిత్ శర్మ చివరి మ్యాచ్‌లోనైనా ఆడితే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. రహానే గత వన్డేలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా, ఓపెనర్‌గా ఆడుతున్న అతను భారీ స్కోరు చేయాల్సి ఉంది. మనీశ్ పాండే, కేదార్ జాదవ్ నాలుగో వన్డే వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటారని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి స్థానంలో పూర్తి ఫిట్‌గా ఉన్న బుమ్రా రానున్నాడు. మరో పేసర్‌గా ఉమేశ్ ఉన్నా, జట్టు మరో సారి స్పిన్నర్లు అక్షర్, మిశ్రాలపై ఆధారపడుతోంది. జాదవ్ ఆఫ్‌స్పిన్ కూడా జత కలిస్తే కివీస్‌ను కట్టడి చేయవచ్చు. తొలి మ్యాచ్ బౌలింగ్ ప్రదర్శన స్థారుులో మళ్లీ బంతులు వేయలేకపోరుున పాండ్యా కూడా ఆల్‌రౌండర్‌గా మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. సిరీస్ ఫలితం ఆఖరి వన్డే దాకా వెళ్లడంతో ఇక జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్‌లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దాదాపుగా లేనట్లే. బ్యాట్స్‌మెన్‌దే భారం తొలి టెస్టు నుంచి విఫలమవుతూ వచ్చిన గప్టిల్ గత మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా విఫలమైన టేలర్ కూడా చివరి రెండు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వడంతో కివీస్ శిబిరానికి ఊరట లభించింది. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్, లాథమ్‌లతో ఆ జట్టు బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. బ్యాటింగ్ బలం పెంచేందుకు... గత మ్యాచ్‌లో పక్కన పెట్టిన అండర్సన్‌ను కూడా మళ్లీ తీసుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌గా నీషమ్ తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. రాంచీ మ్యాచ్‌లో ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లను ఆడించిన కివీస్, ఈ సారి సోధి స్థానంలో పేసర్ హెన్రీని ఎంచుకోవచ్చు. ఇక బౌలింగ్‌లో సౌతీ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. కివీస్ గెలిచిన రెండు మ్యాచ్‌లను చక్కటి స్వింగ్‌తో మలుపు తిప్పింది సౌతీనే. ఐసీసీ నంబర్‌వన్ బౌలర్ బౌల్ట్నుంచి కూడా మన బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదం పొంచి ఉంది. కోహ్లిని నిరోధిస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని కివీస్ గుర్తించింది. ఈ సారి కూడా అదే తరహా వ్యూహంతో విలియమ్సన్ టీమ్ బరిలోకి దిగుతోంది. మూడు టెస్టులు, తొలి వన్డే తర్వాత భారత్‌తో పోలిస్తే ఎంతో బలహీనంగా కనిపించిన న్యూజిలాండ్ ఇప్పుడు సిరీస్ గెలుపుపై కూడా ఆశలు పెంచుకుందంటే ఆ జట్టు సమష్టి ప్రదర్శనే కారణం. ఇప్పుడు మరోసారి దానిని పునరావృతం చేయాలని జట్టు భావిస్తోంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, పాండే, జాదవ్, పాండ్యా, అక్షర్, మిశ్రా, ఉమేశ్, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, వాట్లింగ్, నీషమ్, అండర్సన్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, హెన్రీ. ⇒విరాట్ కోహ్లి ఇక్కడ ఆడిన మూడు వన్డేలలో వరుసగా 118, 117, 99 పరుగులు చేయడం విశేషం. ⇒విశాఖపట్నంలో భారత్ 5 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడింది. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లపై ఒక్కోసారి నెగ్గిన జట్టు, వెస్టిం డీస్ చేతిలో ఓడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం విండీస్‌తో జరగాల్సిన వన్డే హుదూద్ కారణం గా రద్దరుుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టి20లో భారత్, శ్రీలంకను చిత్తు చేసింది. వాన గండం వీడలేదు... తుఫాన్ బలహీన పడటంతో చివరి వన్డేకు ఇక ఇబ్బంది ఉండదని అనిపించింది. అరుుతే ఏ సమయంలోనైనా వాన కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. మ్యాచ్ జరిగే శనివారం రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అరుుతే అవుట్‌ఫీల్డ్‌ను మొత్తం కవర్ చేశామని, వర్షం వచ్చినా మ్యాచ్‌కు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని క్యురేటర్ నాగమల్లయ్య చెప్పారు. పిచ్‌పై ఎలాంటి పచ్చిక లేదు. బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు కొంత బౌన్‌సకు అవకాశం ఉంది. విరాట్ గొప్ప ఆటగాడు. ప్రతీ సారి అతని పరుగులు జట్టుకు ఉపయోగపడుతున్నారుు. దాని వల్ల కోహ్లి తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అరుుతే మేం అతనిపై అతిగా ఆధారపడటం లేదు. జట్టులో మంచి బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు మంచి ఆట ప్రదర్శించడం ముఖ్యం. గత మ్యాచ్ వైఫల్యంనుంచి నేను, పాండే నేర్చుకుంటాం. కెప్టెన్ బౌలింగ్ చేయమని కోరినప్పుడు పార్ట్టైమర్లా కాకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం ముఖ్యం. -కేదార్ జాదవ్ మా జట్టులో అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతంలో ఏ కివీస్ జట్టుకు సాధ్యం కాని ఘనతను సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. చాలా మందికి ఇదో సుదీర్ఘ పర్యటన. దీనిని విజయంతో ముగించాలని భావిస్తున్నాం. కోహ్లితో పాటు ఇతర బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడం కూడా కీలకం. గత మ్యాచ్‌లో చివరి జోడీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అరుుతే రాంచీ ప్రదర్శనను పునరావృతం చేయగలమని విశ్వాసంతో ఉన్నాం. - టిమ్ సౌతీ -
రెండో వన్డేలో భారత్ ఓటమి
-
నేలకు దించారు
►రెండో వన్డేలో భారత్ ఓటమి ►6 పరుగులతో కివీస్ విజయం ►సెంచరీతో చెలరేగిన విలియమ్సన్ ►మూడో వన్డే ఆదివారం మూడు టెస్టుల్లో ఘన విజయం, ఆ తర్వాత తొలి వన్డేలోనూ భారీ తేడాతో గెలుపు... న్యూజిలాండ్ జట్టు మన గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి వరుస విజయాలతో పండుగ చేసుకున్న భారత జట్టు జోరుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత గడ్డపై కివీస్ బోణీ చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా... చివరకు విలియమ్సన్ సేనదే పైచేరుు అరుుంది. 243 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో భారత్ స్కోరు 183/8... మిగిలిన 55 బంతుల్లో గెలుపు కోసం 60 పరుగు చేయాలి. ఎలాంటి ఆశలు లేని ఈ దశలో హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ 49 పరుగుల భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న పాండ్యా ఈ సారి బ్యాట్‌తో మెరిశాడు. మరో 11 పరుగులు చేయాల్సిన సమయంలో అతను వెనుదిరగడంతో భారత్ విజయం వాకిట కుప్పకూలింది. న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తన క్లాస్ చూపించాడు. సహచరులంతా విఫలమైన వేళ ఒంటరిగా నిలబడి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత తన కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటైన దశలో 19వ ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ధోని తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాడు. ఇటీవల తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఇరు జట్ల కెప్టెన్ల పోరులో విలియమ్సన్ గెలిచాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (128 బంతుల్లో 118; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఎనిమిదో సెంచరీని సాధించాడు. బుమ్రా, మిశ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (37 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధోని (65 బంతుల్లో 39; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో వన్డే ఆదివారం మొహాలీలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా... కివీస్ జట్టులో మూడు మార్పులు జరిగారుు. కివీస్ ఓపెనర్ గప్టిల్ (0) పేలవ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్స రెండో బంతికే అతడిని బౌల్డ్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం అందించాడు. అరుుతే మరో ఓపెనర్ లాథమ్ (46 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు అలవోకగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాది విలియమ్సన్ జోరు ప్రదర్శించాడు. 46 పరుగుల వద్ద విలియమ్సన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పాండ్యా వదిలేయడం కివీస్‌కు కలిసొచ్చింది. వీరిద్దరి అటాకింగ్ ఆటతో తర్వాతి పది ఓవర్లలో 65 పరుగులు వచ్చారుు. ఆ వికెట్ తర్వాత... పార్ట్‌టైమర్ జాదవ్ మరోసారి జట్టుకు అదృష్టం తెచ్చాడు. తన తొలి ఓవర్లోనే లాథమ్‌ను అవుట్ చేసి అతని భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ఆ తర్వాత ఒక వైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడ్డా... మరో ఎండ్‌లో కివీస్ పతనం మొదలైంది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ టేలర్ (21) మిశ్రా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 109 బంతుల్లో విలియమ్సన్ సెంచరీ పూర్తరుుంది. ఈ పర్యటన మొత్తంలో కివీస్ తరఫున ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ దశలో అండర్సన్ (21)ను అవుట్ చేసి మిశ్రా మళ్లీ దెబ్బ తీశాడు. మిశ్రా తన తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో విలియమ్సన్‌ను కూడా పెవిలియన్ పంపించడంతో ఆ జట్టు కోలుకోలేకపోరుుంది. ఆ తర్వాత మరో 24 పరుగులు మాత్రమే చేసి కివీస్ తర్వాతి ఐదు వికెట్లు కోల్పోరుుంది. ఒక దశలో ఆ జట్టు వరుసగా 11 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోరుుంది. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 37 డాట్ బాల్స్ వేయగా, మొత్తం కలిపి కివీస్ పరుగులు తీయని బంతులు 161 ఉండటం చూస్తే భారత బౌలర్లు ఎంతగా కట్టడి చేశారో అర్థమవుతుంది. కోహ్లి విఫలం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు తక్కువ వ్యవధిలోనే తొలి నాలుగు వికెట్లు కోల్పోరుుంది. టాప్-4 ఆటగాళ్లలో ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముందుగా రోహిత్ (15)ను అవుట్ చేసి బౌల్ట్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. అరుదైన రీతిలో కోహ్లి (9) కూడా విఫలమయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడిన బంతిని కీపర్ రోంచీ చక్కగా అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్స ముగిసింది. చక్కటి షాట్లు ఆడిన రహానే (49 బంతుల్లో 28; 3 ఫోర్లు) కుదురుకుంటున్న దశలో సౌతీ దెబ్బ తీశాడు. ఫైన్ లెగ్ దిశగా రహానే పుల్ షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అండర్సన్ క్యాచ్ పట్టాడు. అరుుతే అతని చేతుల్లో పడే ముందు బంతి నేలకు తగిలినట్లు కని పించింది. పదే పదే రీప్లేలు చూసిన తర్వాత థర్డ్ అంపైర్ రహానేను అవుట్‌గా ధ్రువీకరించారు. ఆ తర్వాతి ఓవర్లోనే మనీశ్ పాండే (19) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆదుకున్న ధోని, జాదవ్ ఈ దశలో జత కలిసిన ధోని, జాదవ్ దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా జాదవ్ కెప్టెన్‌ను మించి ధాటిగా ఆడాడు. సాన్‌ట్నర్ వేసిన రెండు వరుస ఓవర్లలో అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం హెన్రీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి జాదవ్ నిష్ర్కమించాడు. అనంతరం ధోని, అక్షర్ కలిసి 33 పరుగులు జోడించినా... కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో పరుగులు నెమ్మదిగా వచ్చారుు. ఈ దశలో సౌతీ అద్భుత రిటర్న్ క్యాచ్‌తో ధోనిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత గప్టిల్ తన తొలి ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో భారత్ ఓటమికి మరింత చేరువైంది. ఇలాంటి స్థితిలో పాండ్యా, ఉమేశ్ (18 నాటౌట్) జోడి గెలుపుపై ఆశలు రేపినా...చివరకు ఓటమి తప్పలేదు. 13 భారత్‌ను భారత గడ్డపై న్యూజిలాండ్ 13 ఏళ్ల తర్వాత ఓడించింది. ఈ కాలంలో ఇరు జట్ల మధ్య 8 వన్డేలు జరిగారుు. -
వన్డేల్లోనూ పని పట్టాలి
రేపు కివీస్‌తో భారత్ తొలి మ్యాచ్ దూకుడు కొనసాగిస్తామన్న రహానే ధర్మశాల: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో 1-4తో చిత్తు... ఆ తర్వాత జింబాబ్వేపై 3-0తో ఘన విజయం... 2016లో భారత వన్డే జట్టు రికార్డు ఇది. ఈ సంవత్సరం మన జట్టు చెప్పుకోదగ్గ సంఖ్యలో వన్డేలు ఆడకపోగా, తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగుతోంది. టెస్టుల్లో కివీస్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత అలాంటి ప్రదర్శనను కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. పైగా కోహ్లి నాయకత్వ పటిమతో ఇప్పుడు ధోనిపై కూడా అదే స్థారుులో అంచనాలు ఉండటంతో పాటు అతనిపై కూడా ఒత్తిడి ఉండటం ఖాయం. పూర్తిగా జూనియర్లతో జింబాబ్వేలో విజయవంతంగా జట్టును నడిపించినా... గత ఏడాది భారత్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవాన్ని అతను మర్చిపోకపోవచ్చు. టెస్టు టీమ్‌తో పోలిస్తే సౌతీ, అండర్సన్‌లాంటి స్పెషలిస్ట్‌లు జట్టులోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచగా... మన జట్టు కీలక బౌలర్లు అశ్విన్, షమీలకు వన్డేలనుంచి విశ్రాంతినిచ్చింది. ఆఖరి సారిగా న్యూజిలాండ్ గడ్డపై ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోరుుంది. ర్యాంకుల్లో కివీస్ జట్టు మనకంటే ఒక స్థానం ముందే ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొంది. కెప్టెన్ ధోని, కోహ్లిలతో పాటు జట్టు సభ్యులంతా నెట్స్‌లో పాల్గొన్నారు. తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ ఎక్కువ సేపు బౌలింగ్ చేశాడు. అశ్విన్ గైర్హాజరులో అతను మ్యాచ్ బరిలోకి దిగవచ్చు. ‘టెస్టుల్లాగే వన్డేల్లోనూ దూకుడుగా ఆడతాం. మా బలమేంటో మాకు బాగా తెలుసు. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉన్నాం. వన్డేలకు అనుగుణంగా ఆటను మార్చుకోవడం సమస్య కాదు. కొత్తగా జట్టుతో చేరిన కుర్రాళ్లు సత్తా చాటుతారని నమ్ముతున్నా’ అని మ్యాచ్ సందర్భంగా భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. భారత్‌లోనే ఇతర మైదానాలతో పోలిస్తే ధర్మశాల మరీ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలం కాదు. పేసర్లకు ఈ పిచ్ చక్కగా అనుకూలిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే కివీస్‌కు కూడా ఒక రకంగా అనుకూల మైదానం ఇది. ఈ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన భారత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. 2013లో ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్లతో ఓడగా... 2014లో వెస్టిండీస్‌పై 59 పరుగులతో నెగ్గింది. -
నంబర్‌వన్ భారత్
గదను అందుకున్న కోహ్లి కివీస్‌తో టెస్టు సిరీస్‌తో విజయంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్‌గా నిలవడం భారత్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. రెండో టెస్టు తర్వాతే అగ్రస్థానానికి చేరినా, సిరీస్ తర్వాత దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. కెప్టెన్ కోహ్లి తొలిసారిగా నంబర్‌వన్ గదను అందుకోవడం విశేషం. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ దీనిని అందజేశారు. ఇంగ్లండ్ చేతిలో ఓడితే తప్ప... ఇతర సిరీస్‌ల ఫలితాలు భారత్ టాప్ ర్యాంక్‌ను ప్రభావితం చేయలేవు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్‌సలో అశ్విన్ (900 రేటింగ్ పారుుంట్లు) మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. భారత్ తరఫున తొలిసారి ఒక బౌలర్ 900 పారుుంట్లను అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘ఏదో ఒక రోజు టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడ మే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నంబర్‌వన్ జట్టులో భాగం కావడం చాలా గర్వంగా అనిపిస్తోంది. కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు చివరకు సమష్టితత్వం మమ్మల్ని ఈ స్థారుుకి చేర్చింది. ఎంతో శ్రమ, పట్టుదల కనబర్చిన జట్టు సభ్యులందరి వల్లే ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ టీమ్‌గా మారేందుకు సహకరించినవారందరికీ కృతజ్ఞతలు. మున్ముందు ఈ విజయాలను కొనసాగిస్తామని విశ్వాసంతో ఉన్నా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
మూడో టెస్టుకు భువీ దూరం
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ వెన్నునొప్పి కారణంగా కివీస్‌తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. కోల్‌కతా టెస్టు సమయంలోనే తను ఇబ్బందిపడ్డాడని బీసీసీఐ తెలిపింది. భువనేశ్వర్ స్థానంలో ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ జట్టుతో చేరాడు. ఇండోర్‌లో శనివారం నుంచి జరిగే ఈ టెస్టులో తమ కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ జట్టు వెల్లడించింది. -
‘ఒక్కటే’ లక్ష్యం
కివీస్‌తో సిరీస్ కీలకం రోహిత్ శర్మ వ్యాఖ్య ముంబై: ప్రస్తుత సీజన్లో భారత జట్టు సరైన దిశలో సాగుతోందని స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘మా లక్ష్యం నంబర్‌వన్. ఇటీవల అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రోజుల వ్యవధిలోనే చేజార్చుకున్నాం. మళ్లీ ఈ సీజన్లో సాధిస్తాం’ అని రోహిత్ చెప్పాడు. ముంబై స్పోర్ట్స జర్నలిస్టుల సంఘం స్వర్ణోత్సవ వేడుక అవార్డుల కార్యక్రమానికి రోహిత్‌తో పాటు అజింక్యా రహానే, మాజీ బౌలర్ జహీర్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘వెస్టిండీస్‌తో చివరి టెస్టు వర్షం వల్ల జరగకపోవడం వల్లే టెస్టు ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాం. ఏకంగా 13 టెస్టులు జరగనున్న ఈ సీజన్లో రాణించి టాప్ ర్యాంకుకు చేరుకుంటాం. ముందుగా న్యూజిలాండ్ సిరీస్‌నుంచే మా జైత్రయాత్ర ప్రారంభిస్తాం’ అని అన్నాడు. రహానే మాట్లాడుతూ కివీస్‌తో త్వరలో జరిగే సిరీస్ కీలకమైందని. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. తదుపరి జరిగే టెస్టులన్నీ స్వదేశంలోనే ఉండటంతో ఈ సీజన్ మొత్తం ముఖ్యమైందని అన్నాడు. జహీర్ మాట్లాడుతూ ‘ఇలాంటి పెద్ద సీజన్‌తో క్రికెటర్ల టెస్టు కెరీర్ గ్రాఫ్ అమాంతం మారుతుంది. గెలిచినా... ఓడినా... ఫలితమేదైనా కానివ్వండి... ఆటగాళ్ల కెరీర్‌కు ఇది మేలే చేస్తుంది’ అని అన్నాడు. ఆశావహ దృక్పథంలో సీజన్‌ను మొదలు పెట్టాలని అతను సూచించాడు. -
'మా బ్యాటింగ్ చాలా హేళనగా ఉంది'
హమిల్టన్: న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఘోరంగా విఫలం కావడంతో ఆటగాళ్లపై కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తీవ్రంగా మండిపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించి కూడా మ్యాచ్ ను కోల్పోవడం చాలా అసంతృప్తిగా ఉందన్నాడు. తమ బ్యాటింగ్ చాలా హేళనగా ఉందంటూ విమర్శించాడు. 'మ్యా బాటింగ్ చాలా హేళనగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో పైచేయి సాధించి కూడా టెస్టు మ్యాచ్ ను నాలుగు రోజుల్లోపే కివీస్ కు సమర్పించాం.రెండో ఇన్నింగ్స్ లో మా బ్యాటింగ్ చాలా ఘోరంగా ఉంది. కనీసం బౌలర్లు పోరాడాలంటే బోర్డుపై సాధ్యమైనన్ని పరుగులుండాలి. దాన్ని చేరుకోలేకపోయాం. మ్యాచ్ ముగిసిన తీరు తీవ్రంగా కలిచివేసింది. కివీస్ బౌలింగ్-బ్యాటింగ్ అద్భుతంగా ఉంది' అని మాథ్యూస్ పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో లంచ్ కు ముందు వరకూ శ్రీలంక 71 పరుగులు చేసి వికెట్ కూడా కోల్పోలేదు. అప్పటికి లంకేయులు 126 పరుగులు ఆధిక్యంలో ఉండటంతో పాటు చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు, మరో 56 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో మాథ్యూస్ (77) ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్ లో(2) నిరాశపరిచాడు. చివరి టెస్టులో శ్రీలంక నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా 142/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ మరో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.న్యూజిలాండ్ ఆటగాళ్లలో విలియమ్సన్(108 నాటౌట్;164 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో రాణించి జట్టు ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ రోజు ఆటలో న్యూజిలాండ్ లంచ్ లోపే విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. -
కివీస్ జాతీయ జట్టులో కొత్త ముఖం
వెల్టింగ్టన్: త్వరలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మూడు వన్డేలకు న్యూజిలాండ్ జాతీయ జట్టులో తొలిసారి హెన్రీ నికోలస్(24)కు స్థానం దక్కించుకున్నాడు. గత ఏడాది దేశవాళీ లీగ్ ల్లో నికోలస్ ఆకట్టుకోవడంతో అతని స్థానం కల్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్ ల్లో కాంట్ బెర్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హెన్రీ ... 2014లో 75.66 వన్డే సగటును నమోదు చేశాడు. దీంతో పాటు అదే ఏడాది న్యూజిలాండ్ వ్యాప్తంగా జరిగిన దేశవాళీ మ్యాచ్ ల్లో హెన్రీ అత్యధిక వన్డే పరుగులను సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కివీస్ జట్టులో యువ రక్తాన్నిఎక్కించే ప్రయత్నంలో భాగంగానే హెన్రీని ఎంపిక చేసినట్లు ఆ జట్టు చీఫ్ కోచ్ మైక్ హెస్సెన్ తెలిపాడు. ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ తొలి మూడు వన్డేలకు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కు విశ్రాంతి కల్పించగా, మొదటి రెండు వన్డేలకు మరో బౌలర్ టిమ్ సౌతీ అందుబాటులో ఉండటం లేదు. మూడో వన్డే నాటికి సౌతీ జట్టుతో కలుస్తాడని హెస్సన్ స్పష్టం చేశాడు. డిసెంబర్ 26వ తేదీ నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.