

న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మక్కాను సందర్శించాడు

కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన అతడు.. సోషల్ మీడియా వేదికగా ఆ ఫొటోలు పంచుకున్నాడు

టీమిండియాపై కివీస్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం తర్వాత అజాజ్ పటేల్ మక్కాకు వెళ్లడం విశేషం

ముంబైలో జన్మించిన అజాజ్ పటేల్.. న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు

కివీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు

ఇటీవల టీమిండియాతో టెస్టుల్లో 3-0తో కివీస్ క్లీన్‌స్వీప్ చేయడంలో అజాజ్ పటేల్‌ది కీలక పాత్ర

ఈ సిరీస్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు

అజాజ్ పటేల్ ఇప్పటి వరకు మొత్తం 21 టెస్టుల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి






