Makkah
-
మక్కాను సందర్శించిన కివీస్ క్రికెటర్ అజాజ్ పటేల్ (ఫొటోలు)
-
శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం
సీనియర్ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్ కుమారుడు షారూఖ్‌కపూర్ అనారోగ్యంతో సోమవారం మక్కాలో మృతి చెందాడు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తాలాట్టు కేట్కు దమ్మా, అవ న్ వరువాళా, ఆనంద పూంగాట్రు తదితర చిత్రాల దర్శకుడు రాజ్‌కపూర్. ఈయనకు భార్య సజీలాకపూర్, కుమారుడు షారూఖ్‌కపూర్, కుమార్తెలు షమీమా, షాని యా ఉన్నారు. కొడుకు షారూఖ్కపుర్ సోమవారం మక్కాలో అనూహ్యంగా మృతి చెందాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో ఆరోగ్యం బాగు అయితే మక్కా కు వస్తామని అతని తల్లి మొక్కుకున్నారట. షారూక్కపూర్కు ఆరోగ్యం బాగుపడడంతో రాజ్‌కపూర్ భార్య కొడుకును తీసుకుని మక్కా కు వెళ్లారు. అక్కడ వాతావరణం అతి శీతలంగా ఉండడంతో షారూఖ్‌కపూర్ ఇంతకు ముందే శ్వాసకోశ సంబంధిత సమస్య ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే వాతావరణ ప్రభావం అని భావించిన అతని తల్లి ఉదారంగా ఉన్నారు. దీంతో షారూఖ్‌కపూర్ శ్వాసకోశ సమస్య కారణంగా అనూహ్యంగా సోమవారం మక్కాలోనే కన్ను మూశాడు. దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ధిగ్భ్రాంతికి గురైంది. షారేఖ్కపూర్ మయసు 23 ఏళ్లు. చదువు పూర్తి కాగానే నటనలో శిక్షణ ఇప్పించాలని తండ్రి రాజ్‌కపూర్ భావించారట. అయితే చిన్న వయసులోనే షారూక్కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. -
సౌదీ రాజును అవమానపరిచిన ఇమ్రాన్!
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరితమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అవమానపరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ ప్రొటోకాల్‌ను కూడా ఉల్లఘించారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత వారం సౌదీ ప్రభుత్వం మక్కాలో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరైన ఇమ్రాన్ సౌదీ రాజు వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు. అయితే చివర్లో ఇమ్రాన్ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్ రాజుకు వివరించలోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సౌదీ రాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్ ప్రవర్తన కారణంగా ఆ తర్వాత సౌదీ, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. 57 దేశాలు సభ్యత్వం ఉన్న ఓఐసీ ప్రపంచంలోని ముస్లింల కోసం పనిచేస్తున్నట్టు ప్రకటించుకుంది. -
విషాదం.. కొత్త పెళ్లి కొడుకు మృతి
మక్కా: పెళ్లైన కొద్ది గంటల్లోనే పెళ్లి కొడుకు మృతి చెందాడు. పెళ్లై ఒక్క రోజు కూడా గడవకముందే అగ్నిప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. వివరాలు.. అఫ్ఘనిస్తాన్కు చెందిన 20 ఏళ్ల యువకుడికి సౌదీలోని మదీనాలో ఓ యువతితో వివాహం జరిగింది. అనంతరం మక్కాలో కొత్తగా కొనుగోలు చేసిన వారి అపార్ట్‌మెంట్‌కు ఆనందంగా వెళ్లారు. దురదృష్టవశాత్తూ పెళ్లైన పదిగంటలకే వారి కొత్త ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో పెళ్లి కొడుకు మృతి చెందగా, పెళ్లి కూతురు అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కింది అంతస్థులో చెలరేగిన మంటలు పైకి ఎగబాకడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మిగతావారిని అక్కడి నుంచి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాల తెలియాల్సి ఉందని, విచారణ ప్రారంభించామని మక్కా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి అల్ షరీఫ్ తెలిపారు. -
అనారోగ్యంలో ముహమ్మద్ తల్లి
ఇస్లాం/ప్రవక్త జీవితం అసలే తండ్రి నీడలేని బిడ్డ. ఇప్పుడు తను కూడా దూరమైతే బిడ్డ ఏమైపోతాడో అన్న ఆలోచనలు ఆమె గుండెను మెలిపెడుతున్నాయి. మక్కా చంద్రుడు మదీనాలో కనువిందు చేస్తున్నాడని, అతని నుదుటి భాగాన ప్రగతీ వికాసాల అదృష్టజ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తోందని ప్రజలు వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు. అమృతభరితమైన ఆ చిన్నారి ముద్దుముద్దు పలుకులు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మదీనా పిల్లలకు కాస్త సంస్కారం తక్కువ. అల్లరి చిల్లరగా ప్రవర్తించేవారు. వారి ఆటపాటల్లో ఆ అల్లరితనం కొట్టవచ్చినట్లు కనబడేది. కాని చిన్నారి ముహమ్మద్ (స)కు అలాంటి చౌకబారు ఆటల పొడే గిట్టేది కాదు. అయితే ఎవరైనా విలువిద్య సాధన చేస్తుంటే శ్రద్ధకనబరిచేవారు. కోనేటిలో ఈతకొట్టడానికి ఆసక్తి కనబరిచేవారు. ఈ విధంగా మదీనాలో ఓ నెల రోజులపాటు గడిపిన తరువాత, భర్త సమాధిని దర్శించుకొని తిరుగుప్రయాణమవ్వాలని నిర్ణయించుకున్నారు ఆమినా. మార్గమధ్యంలో ‘అబ్ వా’ అనే చోట అబ్దుల్లా సమాధి ఉంది. భర్త సమాధిని చూస్తూనే ఇన్నాళ్లూ కడుపులో దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. అప్పుడప్పుడే కాస్త మానుతున్న మనోగాయం మళ్లీ పచ్చి పుండుగా మారిపోయింది. వాతావరణం మార్పో, ప్రయాణ బడలికో, మనోవేదనో ఏదైతేనేం ఆమినా ఆరోగ్యం ప్రభావితమైంది. రోజురోజుకూ జ్వరతీవ్రత అధికం కాసాగింది. వెంట ఉన్న పరిచారిక శక్తివంచన లేకుండా సేవలందిస్తూనే ఉంది. ఆ కాలంలో అబ్ వా పరిసరాల్లోనే కాదు, యావత్తు అరేబియాలోనే వైద్యశాలలు లేవు. ఎవరికి ఎలాంటి వ్యాధిసోకినా నాటుమందులు, మంత్రతంత్రాలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆమినాకు ప్రాణభయంకన్నా, తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎక్కువైంది. తనేమైపోయినా ఫరవాలేదు. తన బిడ్డ క్షేమంగా ఉండాలి. అదీ తనక్కావలసింది. ఉమ్మెమన్ ఆమెలో ధైర్యాన్ని నూరిపోయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ‘అమ్మా! కొత్త వాతావరణం, కొత్త నీరు, కొత్త గాలి తదితర కారణాలవల్ల ఇలా జరిగింది. మీరు ఆందోళన చెందకండి. రెండు మూడు రోజుల్లో మీ ఆరోగ్యం తప్పకుండా కుదుటపడుతుంది. నా మాట నమ్మండి’. కాని ఆమినాకు ఇవేమీ అర్థం కావడం లేదు. అసలే తండ్రి నీడలేని బిడ్డ. ఇప్పుడు తను కూడా దూరమైతే , బిడ్డ ఏమైపోతాడో అన్న ఆలోచనలు ఆమె గుండెను మెలిపెడుతున్నాయి. అవును. నిజమే! తల్లిదండ్రులు లేని లోటును ఎవరు మాత్రం ఎలా తీర్చగలరు? ఎంత ప్రేమ చూపించినా అది తల్లిదండ్రుల ప్రేమకు సాటిరానేరాదు. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
మక్కాలో భారీ హోటల్
హైదరాబాద్: ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో నిర్మించనున్న భారీ హోటల్ ఇది. ఒక్కో టవర్‌లో 44 అంతస్తుల చొప్పున 12 టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 10 వేల గదులు, 70 రెస్టారెంట్లు, అరడజను హెలీప్యాడ్లు ఉండే ‘ది అబ్రాజ్ కుదాయ్’ అనే ఈ హోటల్ ప్రపంచంలోనే అతిపెద్దది కానుంది. 46 లక్షల చదరపు అడుగుల మొత్తం విస్తీర్ణంలో...14 లక్షల చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 10 టవర్లలో ఫోర్ స్టార్ సౌకర్యాలు, రెండు టవర్లలో ఫైవ్ స్టార్ వసతులు ఉంటాయి. ఇప్పటికే పనులు ప్రారంభమైన ఈ హోటల్‌ను 2017లోగా పూర్తిచేయాలని యోచిస్తున్నారు. అన్నట్టు.. ఈ హోటల్ నిర్మాణానికయ్యే మొత్తం ఎంతో తెలుసా? 225 కోట్ల పౌండ్లు. మన రూపాయల్లో చెప్పాలంటే.. దాదాపు 22,400 కోట్లు..! -
సుమారు లక్షమందికి హజ్ యాత్రికులకు నో ఎంట్రీ!
రియాద్: సరైన అనుమతి లేని హజ్ యాత్రికులు మక్కాలోకి ప్రవేశించకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధాజ్క్షల్ని జారీ చేసింది. సుమారు 98 వేల మంది యాత్రికులకు సరియైన అనుమతి పత్రాలు లేవని సౌదీ అరేబియా గుర్తించింది. హజ్ యాత్రకు సంబంధించిన నియమ, నిబంధనల్ని ఉల్లంఘించిన 85 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మక్కా నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులు, ఇతర చెక్ పాయింట్ల వద్ద మక్కా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ అబ్దుల్లా భారీ బందోబస్తు విధించారు. గత సంవత్సరం అనుమతి లేని 4 వేల మందిని అడ్డకున్నట్టు సమాచారం. అనుమతుల్లేకుండా ప్రవేశిస్తే దేశ బహిష్కరణతోపాటు, పదేళ్ల నిషేధాన్ని కూడా విధిస్తామన్నారు.