విషాదం.. కొత్త పెళ్లి కొడుకు మృతి | Hours after Marriage groom dies in Makkah | Sakshi
Sakshi News home page

విషాదం.. కొత్త పెళ్లి కొడుకు మృతి

Published Sun, Jan 7 2018 12:54 PM | Last Updated on Sun, Jan 7 2018 3:09 PM

Hours after Marriage groom dies in Makkah - Sakshi

మక్కా: పెళ్లైన కొద్ది గంటల్లోనే పెళ్లి కొడుకు మృతి చెందాడు. పెళ్లై ఒక్క రోజు కూడా గడవకముందే అగ్నిప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. వివరాలు.. అఫ్ఘనిస్తాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి సౌదీలోని మదీనాలో ఓ యువతితో వివాహం జరిగింది. అనంతరం మక్కాలో కొత్తగా కొనుగోలు చేసిన వారి అపార్ట్‌మెంట్‌కు ఆనందంగా వెళ్లారు. దురదృష్టవశాత్తూ పెళ్లైన పదిగంటలకే వారి కొత్త ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో పెళ్లి కొడుకు మృతి చెందగా, పెళ్లి కూతురు అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కింది అంతస్థులో చెలరేగిన మంటలు పైకి ఎగబాకడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మిగతావారిని అక్కడి నుంచి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాల తెలియాల్సి ఉందని, విచారణ ప్రారంభించామని మక్కా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి అల్ షరీఫ్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement