groom died
-
విధి ఆడిన వింత నాటకం.. పెళ్లింట పెను విషాదం
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. రేపు పెళ్లిచేసుకోబోతున్న వరుడు.. విధి ఆడిన వింత నాటకంలో తనువు చాలించాడు. దీంతో, పెళ్ళిసందడితో ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. కరెంట్ షాక్ రూపంలో వరుడిని మృత్యువు వెంటాండింది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాకు చెందిన భూక్య బాలాజీ కాంతి దంపుతుల ఏకైక కుమారుడు భూక్య యాకుబ్. కాగా, యాకుబ్‌కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు(మోటార్) ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్లింట విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారితోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్ -
సంతోషంగా వధూవరులు డ్యాన్స్.. పెళ్లయిన కొద్దిసేపటికే విషాదం..
సాక్షి, నంద్యాల జిల్లా: బోయరేవులో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 24 గంటల్లో పెళ్లికుమారుడు దుర్మరణం చెందడం కలకలం రేపింది. బోయరేవుకు చెందిన శివకుమార్‌తో జూపాడు బంగ్లా మండలం భాస్కరపురానికి చెందిన మౌనిక అనే యువతితో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. పెద్దల సమక్షంలో నిన్న(శుక్రవారం) ఘనంగాపెళ్లి జరిగింది. సాయంత్రం బరాత్‌లో వధూవరులిద్దరూ సంతోషంగా నృత్యాలు కూడా చేశారు. అర్ధరాత్రి ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లిన వరుడు శివకుమార్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ.. -
రెండ్రోజుల్లో యువకుడు వివాహం.. పెళ్లి పత్రికలు పంచుతూ..
సాక్షి, మంచిర్యాల: మరో రెండ్రోజుల్లో ఆ యువకుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. భాగస్వామితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కాసిపేట మండలం సోమగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్(23) మృతిచెందాడు. సోమవారం ఎస్సై నరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్ పెళ్లి ఈ నెల 20న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. సోమగూడెంలో తమ బంధువులకు పత్రికలు పంచి తిరిగి మోటార్‌సైకిల్‌పై నెన్నెలకు బయల్దేరాడు. కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చదవండి: రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే! -
పెళ్లింట విషాదం.. కాలం కాటు వేసింది
తుమకూరు: తుమకూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ వరుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. అరసీకెరె తాలూకాలోని కమలాపురకు చెందిన నంజుండప్ప కుమారుడు ప్రసన్న(30)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో రెండు వారాల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రసన్నతో పాటు సంతోశ్(29), డ్రైవర్ చిన్నప్ప (30)తో కలిసి ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు తీసుకురావడానికి ఇన్నోవా కారులో బయలుదేరారు. తెల్లవారుజామున బెంగళూరు నగరం మాయసంద్ర మార్గంలో వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తురువెకెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కాసేపట్లో వివాహం.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. Rajasthan | 9 bodies have been recovered after a car fell into the Chambal river in Kota. Among those who have lost their lives including a groom were going to Ujjain for the wedding: Kota Police — ANI (@ANI) February 20, 2022 వివరాల ప్రకారం.. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నకోటా పోలీసులు క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (చదవండి: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?) -
ప్రేమించి పెళ్లాడింది.. కానీ ఆరు నెలలకే..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్న యువతి విగతజీవిగా మారింది. ఈ ఘటన ఆనేకల్‌లో చోటుచేసుకుంది. జిగణి సమీపంలోని రాజాపుర నివాసి యశవంత్, బెంగళూరు టీచర్స్‌కాలనీ కి చెందిన రాణి (28) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యశవంత్ ప్రభుత్వ ఉద్యోగి కాగా ఇతడికి ఇది రెండవ పెళ్లి. బుధవారం రాణి భర్త ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శవమైంది. భర్త, కుటుంబసభ్యులు కనీసం పట్టించుకోలేదు. కులాంతర పెళ్లి కావడంతో భర్త, అత్తమామలు చంపి ఉంటారని రాణి కుటుంబసభ్యులు ఆరోపించారు. జిగణి పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లయిన 21 రోజులకే మృత్యు ఒడిలోకి..
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): పెళ్లి సంబురం తీరకముందే రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడిని మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడంతో అదుపుతప్పి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేళ ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఎస్సై మధుసూదన్‌రావు, మృతుడి తండ్రి మురిమడుగుల రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం పొనకల్ సాయిబాబ టెంపుల్ కాలనీలో నివాసం ఉంటున్న రాజన్నకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మురిమడుగుల నరేశ్(23)కు గత డిసెంబర్ 10న వివాహం జరిగింది. నూతన సంవత్సరం పురస్కరించుకుని శుక్రవారం స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో లింగయ్యపల్లి గ్రామంలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి పిలవడంతో రాత్రి 9గంటల ప్రాంతంలో మరో స్నేహితుడు గుడ్ల శ్రావణ్‌కుమార్‌తో కలిసి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అతివేగం కారణంగా ధర్మారం రోడ్డు వైశ్య భవన్ సమీపంలో మూలమలుపు వద్ద మోటార్‌సైకిల్ అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలాల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిద్దరిని 108లో తరలిస్తుండగా నరేశ్ మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి సంబురం తీరకముందే.. నరేశ్‌కు డిసెంబర్ 10న వివాహం జరిగింది. ఆ సంబరం ఇంట్లో ఇంకా పూర్తి కాలేదు. చుట్టాల రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా సంబరం తీరకముందే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తన భర్త విగతా జీవిగా పండి ఉండడాన్ని చూసి నవ వధువు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చదవండి: కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్ ఏంటంటే -
పెళ్లయిన కొన్నాళ్లకే వరుడు కన్నుమూత.. విషాదంలో వధువు
బరంపురం: గంజాం జిల్లా సరగడ సమితిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యకాంత్ గౌడ కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. సమితిలోని చికిలి గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యకాంత్ గౌడకు మార్చి 10వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగి మూడు నెలలు కాకముందే ఆయన మృతిచెందిన వార్త జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదం నింపింది. సూర్యకాంత్ గౌడకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నమోదు కావడంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుదూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందారు. అయితే కరోనా భయంతో ఉపాధ్యాయుడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు, స్నేహితులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తహసీల్దార్ స్పందించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. చదవండి: తండ్రి సాహసం.. బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై.. -
రెండో రోజే ఆగిన పెళ్లి కొడుకు గుండె
హత్నూర (సంగారెడ్డి): పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లి కుమారుడి గుండె ఆగింది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రమైన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కడల అశోక్ (24)కు ఆందోల్ మండలం ముద్మాణిక్ గ్రామానికి చెందిన శ్రావణితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం సంప్రదాయ ప్రకారం పెళ్లి అనంతరం జరగాల్సిన తంతును సైతం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అశోక్ ఛాతీలో నొప్పి వస్తుందంటూ వాంతులు చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అశోక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి
చెన్నై ,టీ.నగర్: భార్యతో ఫోన్లో మాట్లాడుతూ తిన్న పరోటా గొంతులో చిక్కుకని ఊపిరాడక నవవరుడు మృతిచెందాడు. ఈ సంఘటన తిరుమాంబాక్కంలో జరిగింది. వివరాలు.. పుదుచ్చేరి కరువడి కుప్పం భారతీనగర్‌కు చెందిన పురుషోత్తమన్ (32) తిరుమాంబాక్కంలోని కార్ల విక్రయ షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య షణ్ముగ సుందరి. వీరికి ఆరు నెలల క్రితం వివాహమైంది. షణ్ముగ సుందరి సొంత ఊరు తిరునెల్వేలి. ఈమె కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. పురుషోత్తమన్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి పరోటా కొనుక్కుని వచ్చిన అతను దాన్ని తింటున్నాడు. అదే సమయంలో భార్య ఫోన్ చేసింది. ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేశాడు. ఆ సమయంలో పరోటా గొంతులో చిక్కుకోవడంతో మాట్లాడేందుకు వీలుకాలేదు. అతని గొనుగుడు మాత్రమే వినిపించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె ముత్యాలపేటలోని బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. వెంటనే వారు భారతీనగర్‌కు వెళ్లారు. ఇంటిలోపల గడియ పెట్టుకున్న పురుషోత్తమన్‌ను పిలుస్తూ తలుపులు తట్టాడు. తలుపులు తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ స్ఫృహతప్పిన స్థితిలో ఉన్న పురుషోత్తమన్‌ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్టు తెలిపారు. అతను తిన్న పరోటా గొంతులోనే చిక్కుకోవడంతో పురుషోత్తమన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. -
పెళ్లయి ఇంకా 13 రోజులైనా గడవలేదు..
పెళ్లయి ఇంకా 13 రోజులైనా గడవలేదు. ఇంట్లో వేసిన పెళ్లి పందిరి కూడా ఇంకా తీయనే లేదు. అప్పుడే ఆ వరుడికి నూరేళ్లు నిండిపోయాయి. జ్వరం ఆయన్ను కాటేసి ఆయన్ను వివాహం చేసుకున్న ఆ వధువుకు వైధవ్యం మిగిల్చింది. విజయనగరం పూల్‌బాగ్ కాలనీలోని పన్నగంటి ఈశ్వరరావు జ్వరంతోబాధపడుతూ బుధవారం మృతిచెందాడు. విజయనగరం ఫోర్ట్: జ్వరం బారిన పడి నవవరుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పూల్‌బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు (24) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి గత నెల 24న పూల్‌బాగ్ కాలనీకి చెందిన మౌనిక అనే మహిళతో వివాహాం జరిగింది. ఈ నెల నాలుగో తేదీన జ్వరం రావడంతో ఈశ్వరరావును కుటుంబ సభ్యులు నెల్లిమర్ల మిమ్స్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆయన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రెండ్రోజుల్లో పెళ్లి..అంతలోనే అనంత లోకాలకు..
రెండ్రోజుల్లో పెళ్లి... ఆ ఇంట్లో సందడే సందడి... సంబరాలు అంబరాన్నంటాయి... బంధువులు వచ్చేశారు... వివాహ పనులు ఊపందుకున్నాయి... ఇలాంటి తరుణంలో తీరని విషాదం చోటుచేసుకుంది... పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కాబోయే వరడు అందరినీ విడిచి.. తిరిగిరాని లోకాలకు వెళ్లాడు... కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగారు. కడప, లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కాబోయే పెళ్లి కుమారుడు దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. పులివెందుల పట్టణంలోని క్రిష్టియన్‌లైన్‌కు చెందిన గుడిసె మరియమ్మ, సంరాజుల కుమారుడు శేఖర్‌బాబు(25). ఈయనకు జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి పెళ్లి ఈ నెల 17న పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరగాల్సి ఉంది. బంధువులను పిలిచేందుకు పెళ్లి పత్రికలను తీసుకొని పులివెందుల నుంచి మోటారుసైకిల్‌పై సింహాద్రిపురం వెళ్లాడు. సింహాద్రిపురం వైపు నుంచి పులివెందులకు స్కూటీపై నక్కలపల్లెకు చెందిన అజయ్‌కుమార్‌రెడ్డి వస్తున్నాడు. ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. బైక్‌పై వెనుకవైపు కూర్చొని ఉన్న శేఖర్‌బాబు ఎగిరిపడి తల రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న ఏసు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అజయ్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శేఖర్‌బాబు మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెళ్లింట్లో విషాద ఛాయలు రెండు రోజుల్లో శేఖర్‌బాబు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మృతి చెందడంతో ఆయన ఇంటితోపాటు క్రిష్టియన్‌లైన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శేఖర్‌బాబు మృతదేహాన్ని చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ఘటనా స్థలానికి వైఎస్సార్సీపీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి చేరుకుని శేఖర్‌బాబు మృతదేహాన్ని సందర్శించారు. మృతి చెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందుల ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేఖర్‌బాబు మృతదేహాన్ని వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి పరిశీలించి నివాళులర్పించారు. -
పెళ్లి ఇంట విషాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ముత్తుకూరు: అంగరంగ వై భవంగా శనివారం వివాహం చేసుకోవాల్సిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితి లో మృత్యువాత పడ్డాడు. కారులో ఇంటి నుంచి బయలుదేరి కొద్ది గంటలకే సముద్రంలో మునిగి చనిపోయాడు. కన్నవాళ్లకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు. కృష్ణపట్నం పోర్టు పోలీసుల కథనం ప్రకారం..నెల్లూరు హరనాథపురానికి చెందిన చిల్లర వెంకట శివజయంత్ (27) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం వివాహం చేసుకోవాల్సిన తరుణంలో నెల్లూరుకు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం మిత్రులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి ఒంటరిగా కారులో బయలుదేరాడు. కృష్ణపట్నం సముద్రతీరంలో కారుని వదిలి, దక్షణాన పోర్టు వైపు ఒక కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లాడు. శుక్రవారం ఉదయం జయంత్ మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణపట్నం పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. కారును పోలీసు స్టేషన్ వద్ద ఉంచారు. మృతికి గల కారణాలను విచారిస్తున్నారు. -
పెళ్లయిన మరుసటి రోజే వరుడు ఆత్మహత్య.!
కర్ణాటక (చిక్కబళ్లాపురం): పెళ్లయిన మరుసటి రోజే వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు...సూలికుంటె గ్రామానికి చెందిన మునిరాజు (30)కు అక్క కూతురు చైత్రలో ఆదివారం చిక్కబళ్లాపురం గురరాజ కళ్యాణ మంటపంలో పెళ్లి జరిగింది. అనంతరం కళ్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చారు. అయితే సోమవారం రాత్రి మునిరాజు ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేఈబీలో లైన్మెన్గా పనిచేస్తున్న ముని రాజు డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేశారని, ఆమెను తన సోదరుడికే ఇచ్చి వివాహం చేయాలని అందులో పేర్కొన్నాడు. -
విషాదం.. కొత్త పెళ్లి కొడుకు మృతి
మక్కా: పెళ్లైన కొద్ది గంటల్లోనే పెళ్లి కొడుకు మృతి చెందాడు. పెళ్లై ఒక్క రోజు కూడా గడవకముందే అగ్నిప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. వివరాలు.. అఫ్ఘనిస్తాన్కు చెందిన 20 ఏళ్ల యువకుడికి సౌదీలోని మదీనాలో ఓ యువతితో వివాహం జరిగింది. అనంతరం మక్కాలో కొత్తగా కొనుగోలు చేసిన వారి అపార్ట్‌మెంట్‌కు ఆనందంగా వెళ్లారు. దురదృష్టవశాత్తూ పెళ్లైన పదిగంటలకే వారి కొత్త ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో పెళ్లి కొడుకు మృతి చెందగా, పెళ్లి కూతురు అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కింది అంతస్థులో చెలరేగిన మంటలు పైకి ఎగబాకడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మిగతావారిని అక్కడి నుంచి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాల తెలియాల్సి ఉందని, విచారణ ప్రారంభించామని మక్కా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి అల్ షరీఫ్ తెలిపారు. -
పెళ్లి పందిరి తీయకుండానే యువకుడి మృతి
గంగాధరనెల్లూరు: ఈ నెల 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొత్త పెళ్లి కొడుకు ఆస్పత్రికిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన గంగాధర నెల్లూరు మండలం కొట్రకోన పంచాయతీలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. లక్ష్మిరెడ్డిపల్లికి చెందిన రామ్మూర్తి కుమారుడు లోకనాథం (27) ఎంఎస్సీ వరకు చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాకపోవడంతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 30వ తేదీన తిరుపతికి చెందిన నదియాను పెళ్లి చేసుకున్నాడు. మరవళ్లు పూర్తయి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన సొంత పనుల నిమిత్తం బుల్లెట్లో గంగాధరనెల్లూరు బయలుదేరాడు. పెద్దకాల్వ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో లోకనాథం కిందపడిపోయాడు. పడిన చోట రాయి ఉండడంతో తలకు తీవ్రగాయమైంది. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పెళ్లయిన 20 రోజులకే కొడుకు మృతిచెందడంతో లక్ష్మిరెడ్డిపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి. కాళ్లపారాణి కూడా ఆరకుండానే, అచ్చటా ముచ్చటా తీరకుండానే భర్త మృతిచెందడంతో ఆ యువతి ఆవేదన వర్ణణాతీతం. భర్త మృతదేహంపై పడి ఆమె చేస్తున్న రోదనలను చూసి స్థానికులు కంటతడిపెట్టారు. ఉన్నత చదువు చదివినా ఉద్యోగం కోసం ప్రాకులాడకుండా ట్రాక్టర్లతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. 20 రోజుల క్రితం నచ్చిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. జీవితం సంతోషంగా సాగుతుందనే క్రమంలో విధి చిన్న చూపు చూసింది. పెళ్లి పందిరి కూడా తీయకుండానే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతలోకాలకు చేరుకున్నాడు. 20 రోజులకే భర్త మృతి చెందడం, వైధవ్యం కలగడంతో ఆ యువతి చేస్తున్న రోదనలు అన్నీఇన్నీ కావు. -
పెళ్లైన 24 గంటలు గడవకముందే...
ములకలచెరువు: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు గడవకముందే.. వరుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం గుడుపల్లెలో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మిద్ది నరసింహులు(22)కు గ్రామానికి చెందిన ప్రమీల(20)తో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం సాంప్రదాయంలో భాగంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఇంటికి వచ్చాడు. పడకగదిలో తన మొబైల్ చార్జింగ్ పెట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా అప్పటికే నరసింహులు చనిపోయాడు. శుక్రవారం ఎంతో సంతోషంగా.. అందరి ఆశ్వీరచనాలతో పెళ్లి చేసుకున్న నరసింహులు.. పెళ్లి దుస్తులు కూడా విప్పకముందే విగతజీవిగా మారడంతో స్తానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నరసింహులు మృతితో ప్రమీల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించిన బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పెళ్లింట విషాదం
తుర్కపల్లి : తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన అన్నంపట్ల నర్సయ్య, నర్సమ్మ దంపతుల పెద్దకూమారుడు అన్నంపట్ల కనకరాజు (25) పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడికి రంగారెడ్డి జిల్లా చెర్లపల్లికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. శనివారం మధ్యాహ్నం 12-05 నిమిషాలకు వధువు ఇంట్లో పెళ్లి జర గాల్సి ఉంది. గురువారం కనకరాజును తన ఇంట్లో పెళ్లికొ డుకుగా అలకరించారు. శుక్రవారం సాయంత్రం వరకు అత ని ఇల్లు బంధువులతో సందడిగా ఉంది. ఆ తర్వాత కాసేప టికి పెళ్లికొడుకుకు ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి రా వడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజపేటకు తీసు కువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11-30 నిమిషాలకు మృతి చెందాడు. పెళ్లికని వచ్చిన బంధువులు పెళ్లి కొడుకు చావును చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లిని కళ్లార చూద్దామనుకున్న తల్లిదండ్రులు కొడుకు శవమైండని బోరున విలపిస్తుంటే గ్రామస్తులు కంటతడిపెట్టారు. -
పెళ్లి ఇంట విషాదం
రాజాం రూరల్,న్యూస్‌లైన్: మరో పది రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాల్సి ఉంది. వరుడు ఉత్సాహంగా పెళ్లి పనులను చేస్తున్నాడు. శుభలేఖలను కూడా అతనే బంధువులు, స్నేహితులకు పంచిపెడుతున్నాడు. అందరూ తప్పనిసరిగా పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించి భోజనాలు చేసి మరీ వెళ్లాలని కోరుతున్నాడు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోతున్న తరుణంలో దేవునికి సైతం కన్నుకుట్టిందేమోగాని శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి మృత్యు కౌగిలిలోకి తీసుకుపోయి ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే నగరపంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన కెంబూరు రమేష్‌నాయుడు (28) శనివారం రాత్రి విజయనగరం జిల్లా బాడంగి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన అతను రణస్థలంలోని అరబిందో కంపెనీలో క్వాలటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే రెడాక్స్ శిక్షణ కేంద్రంలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రమేష్‌కు ఇటీవల బొబ్బిలికి చెందిన ఉమామహేశ్వరితో వివాహం కుదిరింది. ఈ నెల 16వ తేదీ వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. శుభలేఖలను కూడా బంధువులు, స్నేహితులకు పంచిపెట్టారు. ఈ క్రమంలో బొబ్బిలిలోని అత్తవారింటికి చెందిన బంధువులకు కార్డులు ఇవ్వడానికి బొబ్బిలికి చెందిన తన తోటి ఉద్యోగి సునీల్‌తో ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి బొబ్బిలి వెళ్తుండగా ఎదురుగా బొబ్బిలికి చెందిన భవానీశంకర్ మరో ద్విచక్రవాహనంతో వచ్చి ఢీకొన్నాడు. ఈ సంఘటనలో రమేష్, భవానీశంకర్‌లు అక్కడకక్కడే మృతి చెందగా సునీల్ తీవ్ర గాయాలపాయ్యాడు. విషయం తెలుసుకున్న సారధి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం మృతదేహాల ను గ్రామానికి తరలించి అంత్యక్రియ లు జరిపారు.కాగా విద్యావంతుడైన రమేష్ రెడాక్స్లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పించాడని గ్రామానికి చెందిన వాడాడ వంశీకృష్ణ, మజ్జి మదన్మోహన్,రాజాపు విజయ్‌కుమా ర్, కరణం ఢిల్లీశ్వరరావు, పాసినపల్లి మోహన్,పొట్నూరు కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు రాజాం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 150 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వేయిం చారని, ఆయన మృతి గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. -
రిసెప్షన్ రోజే ఫిట్స్‌తో వరుడి మృతి
గోదావరిఖని, న్యూస్‌లైన్: మూడుముళ్లు.. ఏడడుగులతో ఏకమైన జంటకు మూడో రోజే ఎడబాటు ఎదురైంది. రిసెప్షన్ తంతు ముగిసి బంధువులు ఇళ్లకు కూడా వెళ్లకముందే వరుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా యైటింక్లయిన్‌కాలనీ సదానందటాకీస్ ఏరియాలో చెందిన పిడుగు రాజేశం ఆర్టీ-1 ఏరియా వకీల్‌పల్లి గనిలో కోల్‌కట్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశం దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు రాజు(26)కు పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఇంటివద్దే రిసెప్షన్ జరిగింది. బంధుమిత్రులు వచ్చి నూతన జంటను ఆశీర్వదించి భోజనాలు చేశారు. బంధువులు నిద్రకు ఉపక్రమించారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో రాజు ఫిట్స్‌తో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే వరుడు మృతి చెందాడు. ఈ ఘటనతో వధూవరుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.