కాసేపట్లో వివాహం.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి | Car Fell Into The Chambal River At Rajasthan | Sakshi
Sakshi News home page

పెళ్లింట తీవ్ర విషాదం.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి

Published Sun, Feb 20 2022 11:25 AM | Last Updated on Sun, Feb 20 2022 4:11 PM

Car Fell Into The Chambal River At Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.

వివరాల ప్రకారం.. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నకోటా పోలీసులు క్రేన్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

(చదవండి: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement