కొన్ని రోడ్డు ప్రమాద వీడియోలు చూస్తే ఒక్కసారిగా షాక్‌కు గురవుతాము. అలాంటి రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని చూస్తే ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు. తాజాగా ఇదే తరహా రోడ్డు ప్రమాదం ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని రాజస్‌మడ్ ప్రాంతంలో బైరూలాల్‌కు ఓ కిరాణం ఉంది. కాగా, కిరాణా షాపు ముందే తన ఆల్టో కారును పార్క్ చేసి ఉంచాడు. ఈ క్రమంలో అధిక వేగంతో ఉన్న ఓ స్వీఫ్ట్ కారు ఒక్కసారిగా వచ్చి ఆల్టో కారును ఢీకొట్టింది. కారు హైస్పీడ్‌లో ఉండటంలో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రమాద ఘటనపై లాల్ స్పందించాడు. తాను తన షాపు ముందు కారు నిలిపివేసినప్పుడే హైస్పీడ్‌లో ఉన్న స్వీఫ్ట్ కారు వచ్చి ఢీకొట్టిందని తెలిపాడు. అయితే, అప్పటి వరకు తన కూతురు ఆ కారులోనే ఆడుకుందని అన్నాడు. దేవుడి దయ వల్ల కొన్ని సెకన్ల వ్యవధిలో తన నాలుగేళ్ల పాప ప్రాణాలతో బయటపడిందని చెప్పుకొచ్చాడు.
#Watch: कहावत है 'जाको राखे साइयां मार सके ना कोय'... एकबार फिर यह सच साबित हुई है। राजस्थान में चार साल की बच्ची कार में खेल रही थी। उसके उतरने के महज 7 सेकंड बाद ही एक तेज रफ्तार वाहन ने कार को टक्कर मार दी। पूरी घटना का सीसीटीवी वीडियो सामने आया है।#Rajasthan #Accident pic.twitter.com/RmeLM2pnFQ
— Hindustan (@Live_Hindustan) December 1, 2022
Comments
Please login to add a commentAdd a comment