![Another Student Goes Missing In Kota Second Incident In Week - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/18/student.jpg.webp?itok=lEF7W_IG)
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్‌లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్‌పోర్టు నగరలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్‌కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్‌ను హాస్టల్‌లోనే వదిలి వెళ్లాడు.
వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్‌కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్‌లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment