
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్‌లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్‌కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.
చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్‌లో టాపర్‌గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్‌లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్‌గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్‌గా నిలుస్తానని అనుకోలేదన్నారు.
మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.
మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్‌పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు.
ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
Comments
Please login to add a commentAdd a comment