అరుదైన ఆపరేషన్‌.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు! | Rare surgery to Remove 8cm Nail Embedded In Boy Brain in Patna | Sakshi
Sakshi News home page

అరుదైన ఆపరేషన్‌.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!

May 30 2025 11:51 AM | Updated on May 30 2025 12:56 PM

Rare surgery to Remove 8cm Nail Embedded In Boy Brain in  Patna

మెడను చీల్చుకుంటూ మెదడులోకి మేకు..

10 గంటల సర్జరీతో తొలగించిన లక్నో వైద్యులు

లక్నో: అరుదైన శస్త్రచికిత్సలో, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యులు ఒక బాలుడి మెడలో గుచ్చుకున్న డైరెక్ట్‌గా మేకు మెదడులోకి  దిగిపోయింది.  ఎనిమిది సెంటీమీటర్ల పొడవున్న ఇనుప మేకును తొలగించడానికి 10 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించడం విశేషంగా నిలిచింది.. ఈ ఘటన  ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  

బలరాంపూర్‌ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇనుప మేకుపై పడిపోయాడు. సుమారు 8 సెంటీమీటర్ల పొడవైన ఆ మేకు అతడి మెడను చీల్చుకుంటూ, అత్యంత సున్నితమైన మెదడు భాగంలో దిగబడింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కిందపడిన బాలుడి మెడకు గుచ్చుకున్న మేకు మెదడులోకి దిగబడింది. అత్యంత సున్నితమైన మెదడు భాగంలోకి దిగబడిన మేకును వైద్యులు పది గంటలపాటు శ్రమించి, విజయ వంతంగా వెలికి తీశారు. 

ఇదీ చదవండి: Miss world 2025 పెరిగిన ఇమేజ్‌!

బాధిత బాలుడిని కుటుంబసభ్యులు లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ (కేజీఎంయూ) కు తీసుకువచ్చారు. చాలా ప్రమాదకరమైన కేసుగా నిర్ధారణకు వచ్చిన ఆస్పత్రి  నిపుణుల బృందం మైక్రో సర్జికల్‌ సాంకేతికతను, న్యూరో నేవిగేషన్‌ వ్యవస్థను వాడుకుంటూ అత్యంత జాగ్రత్తగా రక్త నాళాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 10 గంటలపాటు సాగిన అత్యంత సంక్లిష్టమైన ఈ సర్జరీ విజయవంతమైంది. బాలుడు నెమ్మదిగా కోలుకున్నాడని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. అరుదైన ఈ ఆపరేషన్‌ వివరాలు త్వరలో అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయని చెప్పారు. 

చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బ‌హిష్క‌ర‌ణ‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement