Nail
-
Nail Rings Photos: ఇది నెయిల్ ఆర్ట్ కాదు.. నెయిల్ రింగ్స్ (ఫోటోలు)
-
Pushpa The Rule: పుష్పరాజ్ చిటికెన వేలు గోరు వెనుక ఇంత కథ ఉందా?
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.పుష్పగాడి దెబ్బకు ఇండియన్ బాక్సాఫీస్ షేకయ్యింది.బన్నిని పాన్ ఇండియా స్టార్‌ని చేయడమే కాకుండా.. నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. ఆడియన్స్ అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. అందుకే పుష-2(పుష్ప:ది రూల్) విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ని విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ వేలు గోరు హైలైట్ చేస్తూ చూపించారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే స్పెషల్ వీడియోలోనూ బన్నీ గోరును హైలైట్ చేశారు. అప్పట్లో అది పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు గోరుపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. సుకుమార్ ప్రత్యేకత అదే తన సినిమాలో అనవసరపు సీన్స్ ఉండకుండా జాగ్రత్త పడతాడు సుకుమార్. కథతో సంబంధం లేని సన్నివేశాలను అస్సలు పెట్టడు. ఆయన తీసే ప్రతి షాట్ విషయంలోనూ కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. ప్రతి సీన్ వెనుక ఓ అర్థం ఉంటుంది. క్యారెక్టర్ల పేర్లతో పాటు వారి గెటప్ వెనుకాల కూడా ఓ కథ ఉంటుంది. రంగస్థలం సినిమాలో జగపతి బాబు పాత్ర పేరు ఫణీంద్రభూపతి.పేరుకు తగ్గట్టే పాములా బుసలు కొడుతుంటాడు. అంతేకాదు పాముని ఎలాగైతే కొట్టి చంపుతారో.. చిట్టి బాబు(రామ్ చరణ్) కూడా ఫణీంద్రను అలా కొట్టి చంపుతాడు. అందుకే ఆ పాత్రకు ఆ పేరు పెట్టాడు. ఓ పాత్రను తీర్చిదిద్దడంలో సుకుమార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహారణ మాత్రమే. చిటికెన వేలు కథేంటి? పుష్ప-2లో ఇప్పటివరకు విడుదలైన ప్రచార పోస్టర్లు, వీడియోలలో అల్లు అర్జున్ చిటికెన వేలు గోరును హైలైట్ చేస్తూ చూపించారు. దీని వెనుక ఓ కథ ఉందంట. కొన్ని సంస్కృతుల్లో సమాజంలో తమ స్థాయిని చూపించుకునేందుకు ఇలా చిటికెన వేలు గోరును పెంచుకుంటారట. తాము సంపన్నులమని చెప్పుకోవడానికి కూడా ఇలా గోరును పెంచుకుంటారట. అలాగే రాజ్యాన్ని పరిపాలించడానికి తమకే అర్హత ఉందని చెప్పడానికి కూడా ఇలా చిటికెన వేలు గోరును పెంచుతారట. ఎర్రచందనం వ్యాపారాన్ని పుష్పరాజ్ తన చిటికెన వేలుపై నిలబెట్టి నడిపిస్తున్నాడని సూచనగా సుకుమార్ వేలు గోరును హైలైట్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఇది ఎంతవరకు నిజమే తెలియదు. గోరు హైలైట్ చేయడం వెనుక అసలు కథ ఏంటనేది తెలియాలంటే సుకుమార్ చెప్పేంత వరకు ఆగాల్సిందే. -
అమీర్‌పేట్‌లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
Pedicure: పెడిక్యూర్ చేసే విధానం, లాభాలు తెలుసా?!
అందంగా ఉండాలని ఎవరికుండదు? అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయని వారుండరు. అయితే చాలా మంది ముఖవర్చసును మెరుగుపరుచుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు గానీ, శరీరంలో మరే ఇతర అవయవాలపై అంత శ్రద్ధ చూపరు. కానీ ముఖంతోపాటు చేతులు, కాళ్లు కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే అందానికి పరిపూర్ణత చేకూరడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా జరుగుతుంది. పాదాల సంరక్షణకు పెడిక్యూర్, గోళ్ల సంరక్షణకు మెనీక్యూర్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని బ్యూటీపార్లర్లలో వివిధ ట్రీట్మెంట్లతోపాటు మెనీకూర్, పెడిక్యూర్‌లను అందిస్తున్నారు. పాదాలను గోళ్లను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే పెడిక్యూర్ అంటారు. పెడిక్యూర్ అనేది లాటిన్ పదం. లాటిన్ లో పెస్ లేదా పెడ్ అంటె పాదము, క్యూర్ అంటేరక్షణ అని అర్థం. చేతులు, చేతివేళ్లు, గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మెనీక్యూర్. మెనీక్యూర్ కూడా లాటిన్ పదమే. మానస్ అంటే చేయి, క్యూర్ అంటే జాగ్రత్త అని అర్థం. పెడిక్యూర్ మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవడమే పెడిక్యూర్. రోజంతా పనిచేసి అలసిపోయిన మోకాళ్లు, పాదాలు, మడమలు, కాలి వేళ్లు, గిలకలకు సున్నితమైన మజసాజ్ సాయంతో ఉపశమనం కలిగించడం పెడిక్యూర్‌లో ఒక భాగంగా ఉంటుంది. ఈ విధానంలో ప్యూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ బ్రష్, నెయిల్ కట్టర్, టబ్‌లను ఉపయోగిస్తారు. ఇలా చేస్తారు.. ముందుగా కాలి గోళ్ల పెయింట్‌ను తొలగిస్తారు. తరువాత గోళ్లను అనుకున్న రీతిలో కట్ చేస్తారు. తరువాత ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు, సుగంధ నూనే, నిమ్మరసం షాంపు వేసి 30 నిమిషాల పాటు పాదాలను నానబెడతారు. పాదాలు నానిన తరువాత ప్యూమిస్ స్టోన్ లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు అరికాళ్లు శుభ్రంగా రుద్దుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత మర్దనా ఆయిల్ లేదా మాయిశ్చరైజర్‌తో పాదాలను మొదట సుతిమెత్తంగా, తరువాత కాస్త గట్టిగా మసాజ్ చేస్తారు. తరువాత పాదాలను శుభ్రంగా తుడవడంతో పెడిక్యూర్ పూర్తవుతుంది. మసాజ్‌తో పాదాలకు ఉపశమనం కలిగి మనకు మానసికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నెలకు రెండు సార్లు పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటే పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. పెడిక్యూర్ కు కావాల్సి పరికరాలు అన్ని మన దగ్గర ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పెడిక్యూర్ రకాలు పెడిక్యూర్ చేసే విధానంలో ఉపయోగించే సామాగ్రి, క్రీములు, అవి ఇచ్చే ఫలితాలను బట్టి వివిధ రకాల పెడిక్యూర్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ► క్లాసిక్ లేదా రెగ్యులర్ పెడిక్యూర్. ►ప్రెంచ్ పెడిక్యూర్ ►జెల్ పెడిక్యూర్ ►పారఫిన్ పెడిక్యూర్ ►హాట్‌స్టోన్ పెడిక్యూర్ ►ఫిష్ పెడిక్యూర్ ►మిని పెడిక్యూర్ ►స్పా పెడిక్యూర్ ► ఐస్‌క్రీం పెడిక్యూర్ ►పెడిక్యూర్ ►వాటర్ లెస్ పెడిక్యూర్ ►సాల్ట్ పెడిక్యూర్ ►చాక్లెట్ పెడిక్యూర్ ►అథ్లెటిక్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్ ►రోజ్ పెడిక్యూర్ ►మిల్క్ అండ్ హనీ పెడిక్యూర్ ►వైన్ పెడిక్యూర్ ►షాంఘై పెడిక్యూర్ బేసిక్ క్యూర్‌ను ఇంట్లో ట్రై చేయవచ్చు, మిగిలినవి నిపుణులతోనే చేయించుకోవాలి. మెనీక్యూర్ ఎలాగంటే... ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పెయింట్‌ను తుడిచివేస్తారు. తర్వాతా గోళ్లను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి ట్రిమ్ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్ చేశాక, ఒక గిన్నెలో సోప్ వాటర్‌ను తీసుకుని దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి 10 నిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి గరుకుగా ఉంటే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. తరువాత అరిచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్ చేస్తారు. ఆపై రెండు చేతులను తడిలేకుండా టవల్‌తో తుడుస్తారు. క్యూటికల్ రిమూవర్‌తో గోరు చుట్టూ ఇంకా ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే తీస్తారు. దీనివల్ల గోరు పెద్దదిగాను అందంగాను కనిపిస్తుంది. తరువాత చేతులను శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్‌తో చేతులకు వేళ్లకు మర్థన చేస్తారు. ఇలా 15 రోజులకొకసారి చేయడం వల్ల చేతులు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాస్త ధరను భరించగలిగినవారైతే నిపుణులతో పెడిక్యూర్, మెనీక్యూర్ చేయించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. లాభాలేంటి? పెడిక్యూర్‌లో పాదాల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే... మెనీక్యూర్లో చేతుల ఆరోగ్యంపై ఫోకస్ చేస్తారు. రోజూవారి స్నానంలో పాదాలను చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. తరచుగా ఎదురయ్యే పాదాల పగుళ్లను పెడిక్యూర్ నివారిస్తుంది. గోళ్లకు రక్తప్రసరణ బాగా జరగడం వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు కూడా పుష్కలంగా పోషకాలు అందడంవల్ల పెరుగుదల మంచిగా ఉండి మరింత కాంతివంతంగా మెరుస్తాయి. పెడిక్యూర్ విధానం లో పాదాలకు మంచి మర్దన (మసాజ్) లభిస్తుంది. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్ వెయిన్స్ వంటివి తలెత్తవు. పాదాలకు చేసే మసాజ్‌తో శరీరం మొత్తం ఒకేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగడంతోపాటు, లింఫ్నోడ్స్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. సుతిమెత్తని పాదాలకు మసాజ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మసాజ్‌తో ఒత్తిడి తగ్గి మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. దీంతో మనలో ఆత్మ విశ్వాసం పెరిగి నూతనోత్సాహంతో మరిన్ని విజయాలు సాధించవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే బ్యూటీపార్లర్లు, స్పాలు అందించే క్యూర్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యవంతమైన శరీరమంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండడమే! చదవండి: దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ! -
సరికొత్త ఉపాయం.. ఉద్యోగాన్ని వదిలేసి...
దుబాయ్: కొడుకుపై నమ్మకంతో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో దిగేందుకు ఓ తండ్రి సిద్ధపడ్డాడు. కుమారుడి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. గోడలకు మేకులు కొట్టకుండానే బరువులను వేలాడదీసేందుకు దుబాయ్‌లో నివసిస్తున్న భారత టీనేజర్ సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు. జెమ్స్ వరల్డ్ అకాడమిలో ప్రస్తుతం 10వ గ్రేడ్ చదువుతున్న ఇషిర్ వాద్వా తన స్కూల్ ప్రాజెక్టు కోసం ఈ విభిన్న ఆలోచన చేశాడు. ఇంజినీరింగ్ చదువుతున్న తన సోదరుడు అవిక్ సాయంతో ఈ సరికొత్త మార్గాన్ని అన్వేషించారు. కుటుంబ సభ్యులతో ఇషిర్ వాద్వా ఈ పద్ధతిలో భాగంగా స్టీల్ టేపులను ముందుగా గోడకు అతికిస్తారు. ఆ తర్వాత నియోడిమియమ్ అయస్కాంతాన్ని ఉపయోగించి ఆ టేపులు బలంగా గోడకు అతుక్కొని ఉండేలా చేస్తారు. దీనికి వారు క్లాపిట్ అని పేరు పెట్టారు. తమ ఇంట్లోని హోం థియేటర్ సిస్టాన్ని ప్రస్తుతం క్లాపిట్కు తగిలించినట్లు ఇషిర్ తండ్రి సుమేశ్ వాద్వా తెలిపారు. ఎక్కువ వేతనం వస్తున్న తన ఉద్యోగాన్ని వదిలి క్లాపిట్ను తన కుటుంబ బిజినెస్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ‘ఖలీజ్ టైమ్స్’కు వెల్లడించారు. చదవండి: ఒక కారును ఇలా కూడా వాడొచ్చా! -
బ్యూటిప్స్
► గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గోళ్ళపై çపసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి. ► బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ► పుచ్చకాయ గుజ్జును శరీరానికి రాసుకుంటే రక్షణ, పోషణ లేక కమిలిన చర్మం మామూలుగా తయారవుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. చర్మం కొత్తకాంతిని సంతరించుకుంటుంది. ► రుబ్బిన మినపపిండిలో చిటికెడు గంధపుపొడి కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుని, తెల్లవారి కడగాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజులపాటు చేస్తే మచ్చలు, గీతలు పోతాయి. ► ఒక స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ బాదం పొడి, ఒక కోడిగుడ్డు, నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మర్దన చేసిన తర్వాత పదిహేను నిమిషాల సేపు అలాగే వదిలేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే మృతకణాలు, యాక్నె పోయి ముఖం తాజాగా మారుతుంది. యాక్నె లేకపోయినప్పటికీ జిడ్డు చర్మానికి ఈ ప్యాక్ బాగా పని చేస్తుంది. -
గోళ్లెక్కిన లేసులు
నెయిల్ ఆర్ట్ ఇది ‘ఓరియంటల్ లేస్’ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి లైట్ రెడ్, వైట్, ట్రాన్స్పరెంట్ కలర్ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడం చాలా సింపుల్‌గా ఉండటమే కాదు.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని పిల్లల చేతులకు వేస్తే, వారు భలేగా ముచ్చట పడతారు. ఇప్పటివరకు చీరలు, డ్రెస్సులకే లేసులు వేయడం చూసుంటారు.. కానీ గోళ్లకూ వేయాలనుకుంటే.. ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకుంటే సరి. 1. ముందుగా గోళ్లన్నిటికీ లైట్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత వైట్ పాలిష్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి. 2. ఇప్పుడు ఆ చుక్కలను మూడు పూరేకులుగా చేసుకోవాలి. 3. ఆ పైన పూరేకులను ఫొటోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి. 4. తర్వాత వైట్ కలర్ పాలిష్‌తో మునుపటి డిజైన్‌కి పై భాగంలో సన్నగా అయిదు చుక్కలు పెట్టుకోవాలి. 5. ఇప్పుడు ఆ చుక్కలకు ఇరువైపుల మరో రెండు రెండు చుక్కలు పెట్టాలి. 6. ఫొటోలో కనిపిస్తున్న విధంగా వైట్ పాలిష్ వేసిన చోట లైట్ రెడ్ కలర్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి. 7. ఆ ఎరుపు రంగు చుక్కలను కూడా పూరేకుల్లా చేసుకోవాలి. 8. తర్వాత ఆ ఎరుపు పూరేకులపై వైట్ కలర్‌తో మూడు గీతలు గీయాలి. చివరగా గోళ్లన్నిటి పై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో సింగిల్ కోట్ వేస్తే.. డిజైన్ లుక్కే మారిపోతుంది. -
చర్మంలోకి గోరు పెరుగుతుంది... ఏం చేయాలి?
డెర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 22 ఏళ్లు. నేను కొన్ని నెలల నుంచి షూ తొడుక్కోలేకపోతున్నాను. కారణం... నా కాలి బొటనవేలి గోరు చర్మం లోపలికి పెరుగుతోంది. దీని వల్ల అప్పుడప్పుడూ నొప్పి కూడా వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - శివరామ్, మహబూబ్‌నగర్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ గోరు చర్మం లోపలివైపునకు పెరుగుతోందని తెలుస్తోంది. ఈ సమస్యను ఒనైకోక్రిప్టోసిస్ లేదా అన్గ్యువస్ ఇన్కార్నేటస్ అంటారు. దీనికి కారణలు : మీకు సరిపడని పాదరక్షలు (మరీ ముఖ్యంగా మీరు 21 ఏళ్లలోపు ఉన్నప్పుడు) ధరించడం. మీ సైజు కంటే చిన్నవైన షూ అదేపనిగా తొడుగుతూ ఉండటం. మీ గోళ్ల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం... అంటే మీ గోరును అంచుల వెంట చాలా లోతుగా కట్ చేసి ఉండటం ఏదైనా ప్రమాదంలో మీ గోటికి గాయం కావడం. చికిత్స : మందులతో చేయాల్సిన చికిత్సల్లో భాగంగా మీకు ఐదు రోజుల పాటు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ కూడా ఉపయోగించాలి. అయితే వీటన్నింటినీ డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఇక మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి.. కాస్తంత గోరు వెచ్చగా ఉన్న నీటిలో ఉప్పు వేసి, మీ గోటిని రోజుకు మూడు సార్లు ఆ నీటితో తడపాలి. అప్పటికీ సమస్య అదేపనిగా బాధిస్తూ ఉంటే... గోటి లోపలి వైపునకు పెరుగుదలను అరికట్టే పార్షియల్ వెడ్జ్ రిసక్షన్ అనే (గోటిని పాక్షికంగా తొలగించే) శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. నా వయసు 42 ఏళ్లు. అండర్వేర్ ధరించే చోట చర్మం మడతలలో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. దురదగా కూడా ఉంటోంది. పరిష్కారం చూపండి. - సూరిబాబు, నల్లగొండ మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. ఆ తర్వాత ప్లెయిన్ టర్బినఫిన్ ఉన్న క్రీము మరో పదిరోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. మీరు ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
గోరంత రంగు... కొండత కథ
ఫ్లాష్ బ్యాక్ సౌందర్య వర్ణన చేసేటప్పుడు నఖశిఖ పర్యంతం వర్ణించేవారు మన పూర్వకవులు. అంటే, కొనగోటి నుంచి కొప్పు వరకు నానాలంకార ప్రయోగాలతో వర్ణిస్తూ పద్యాలల్లేవారు. కొప్పుల సంగతి సరే, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మరి కొనగోటి వర్ణనలకు ఎందుకంత ప్రాధాన్యం అంటారా..? నఖసౌందర్యానికి కూడా అప్పట్లో చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. వాటిని అందంగా తీర్చిదిద్దుకునేవారు. రంగు కోసం గోరింట పెట్టుకొనేవారు. గోరుపై గోరంత రంగు పడితేనే, దాని అందం కొండంత అవుతుందని భావించేవారు. నఖసౌందర్యం కోసం రకరకాల నెయిల్ పాలిష్‌లను ఇప్పటికీ అతివలు విరివిగా వాడుతూనే ఉన్నారు. అయితే, గోరింట పెట్టుకోవడం అమ్మమ్మల నాటి ఫ్యాషన్ అని, నెయిల్ పాలిష్‌లు పూసుకోవడం అల్ట్రా మాడర్న్ ఫ్యాషన్ అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ, అది నిజం కాదు. నెయిల్ పాలిషే చాలా చాలా పురాతనమైన ఫ్యాషన్. చైనీస్ మహిళలు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాడే గోళ్లకు రంగులు పూసుకునేవారు. ర వంశస్థుల పాలనలో క్రీస్తుపూర్వం 600 సంవత్సరం నాటికి నెయిల్ పాలిష్ చైనాలోని సంపన్న వర్గాల మహిళలకు తప్పనిసరి ఫ్యాషన్‌గా ఉండేది. వాళ్లు తేనెపట్టులోంచి సేకరించిన కొవ్వు, కోడిగుడ్డు సొన, శాకాహార రంగులు ఉపయోగించి, గోళ్లకు పూసుకునే రంగులు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కృత్రిమ పద్ధతుల్లో రకరకాల రసాయనాలు ఉపయోగించి తయారు చేసే నెయిల్ పాలిష్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దరిమిలా మారుమూల పల్లెలకూ వీటి వాడుక వ్యాపించింది. -
భూముల్లో ‘టేకు’, అన్నంలో ‘మేకు’
రెండోమాట ‘ప్రతీ పదేళ్లకు భారతదేశంలో 20 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని (హెక్టార్=2.47 ఎకరాలు)వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఇటీవల ప్రభుత్వాలు మళ్లించేస్తున్నాయి. వంద నగరాల అభివృద్ధి పేరిట ఆగమేఘాల మీద పట్టణీకరణ కోసం, ఉద్యోగాల కల్పన మిషపైన బీజేపీ హామీ పడింది. ఈ లక్ష్యాలను సాధించడానికి బీజేపీ సాగు భూములపైన ఒత్తిడి తెచ్చి రైతాం గం ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అందుకే, యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు సహితం మొదట రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉన్నందున తిరిగి ఆ బిల్లును రైతుల రక్షణ కోసం సవరించుకోవలసివచ్చింది. కనుకనే భారత పరిశ్రమాధిపతుల సమాఖ్య, భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య సహా యూపీఏ బిల్లును పారిశ్రామికాభివృద్ధి వ్యతిరేకంగా ప్రకటిం చి, అందులోని రైతాంగ అనుకూల అంశాలను నీరుగార్చాలని ఉద్య మించాయి’. - ప్రసిద్ధ విశ్లేషకుడు సుధీర్ కుమార్ పన్వార్ కానీ, ఇంతకుమించిన ‘పిదప బుద్ధులు’ దేశ, రాష్ట్ర పాలనా వ్యవస్థలో చోటు చేసుకోబోతున్నాయి! ఆహార భద్రతకు ప్రాణప్రదమైన పంట భూము లనూ, వ్యవసాయ క్షేత్రాలనూ, రైతులనీ ‘నష్టజాతకం’గా భావించిన పాలక పక్షాలు ‘పరిశ్రమాభివృద్ధి, ఉద్యోగాల కల్పన’ అనే తాయిలం చూపి ప్రజల, రైతు కుటుంబాల దృష్టిని మళ్లించడానికి చేయని ప్రయత్నం లేదని పెంద లాడే గుర్తించటం కూడా అవసరం! కారణం లేని తోరణం ఉండదు! ఇటీవల, దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, కొందరు రచయితలు, పత్రికలు సహా చిత్రమైన ‘సర్వే’ల పేరుతో వ్యవసాయంపై ఏవగింపు కలిగించే వ్యాసాలూ, సర్వేక్షణలూ ప్రచురిస్తున్నారు! ‘వ్యవసాయం దండగ మారిది, గిట్టుబాటు కానిది, రుణభారాన్ని మాత్రమే పెంచేది. కాబట్టి రంగం నుంచి తప్పు కోండ’న్న హెచ్చరికలను పాలకులు ప్రజల బుర్రల్లోకి ఎక్కించాలన్న తాపత్ర యంలో ఉన్నారు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సరసమైన ధరలకు అందించే బాధ్యత నుంచి పాలక పక్షాలు తప్పించుకుంటున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందించాల్సిన బాధ్యతను ఎన్నికలలో విజయావకాశాలు పెంచే హామీగానే ఉంచుతు న్నాయి. పంట నష్టాలను బీమా పథకాలతో పూరించే బాధ్యతనూ గాలికి వదిలేస్తున్నాయి. దేశానికి వెన్నెముక రైతు, వ్యవసాయ కార్మికులని తెలిసి తెలిసీ పంట భూములను బడా కార్పొరేట్ సంస్థలకు (బ్యాంక్ సంస్కరణల మేరకు) ధారాదత్తం చేయడానికి ‘భూసేకరణ’ చట్టాలను ఆర్డినెన్సు పేరిట దొడ్డిదారిలో రైతాంగంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. సేద్యానికి ఎసరు పెట్టే సర్వే ఈ క్రమంలోనే ప్రభుత్వాలకు ‘గొడుగు’లు పట్టే గణాంక, పరిశోధనా సంస్థల్లో ఒకటి - జాతీయ గణాంక సర్వేక్షణ సంస్థ (ఎన్ఎస్ఎస్)! ఇది జరి పిన నమూనా సర్వేక్షణ 70వ నివేదిక తాజాగా వెలువడింది. స్థూలంగా, ఆ సర్వే ఉద్దేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల సంక్షోభంలో పడిన వ్యవ సాయాన్నీ, రైతాంగాన్నీ, వారిపై ఆధారపడిన వృత్తిదారులను గానీ ఆదు కోవడం కాదు. రైతులు అధికాధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ, ఏటా పెరిగిపోతున్న రుణభారంతో కుంగిపోతున్నారు. దేశవ్యాపిత దృశ్యం లో భాగంగా తెలంగాణలో 83 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 90 శాతం రైతుల పరి స్థితి ఇదే. కనుక రైతుల సంఖ్య తరిగిపోతూ కౌలుదార్ల సంఖ్య పెరిగి పోతోందనీ, యంత్రాల వినియోగం పెరిగి వ్యవసాయం ఇక లాభసాటి కాని పరిస్థితి వచ్చిందంటూ ‘చావు కబురు’ సర్వే మన చెవుల్లో ఊది వెళ్లింది! ఆహా ర పంటల సాగుకన్నా పాడి సంపద మెరుగు కాబట్టి పశువులను పెంచుకో మంటోంది! సాగు వదిలేసి, ఇతర వ్యాపారాల్లోకి, కూలి పనుల్లోకి తరలి పోవటం మంచిదనీ ఉచిత సలహా ఇస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, భారత వ్యవసాయ రంగాన్ని ఎలా కుదించాలో చెప్పడమే ఆ సర్వే లక్ష్యం! అంతకన్నా గొప్ప ‘సలహా’ ప్రధాని మోదీ నుంచి దూసుకొచ్చింది. గత నెల 26వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ మోదీ వ్యవసాయం సాగాలంటే ఏం చేయాలో సలహా ఇచ్చారు. రైతులు తమ పొలంలో మూడింట ఒక వంతు మాత్రమే సాగు భూమిగా ఉంచుకోవాలి. మిగతా భూమిలో మూడింట ఒక వంతు పశువుల మేతకు, జంతువుల పెంపకానికి అట్టిపెట్టుకోవాలి. ఇక ఆపై మిగిలిన పొలంలో కలప (టేకు)నిచ్చే చెట్లు పెంచుకోండి! ఇదీ ఆ సూచన. ప్రధాని స్థాయిలో ఉన్న వారికి వాస్తవాలు తెలియవంటే నమ్మొచ్చా, లేదా వేళాకోళమా?! పండే వ్యవసాయ క్షేత్రం సగటు పరిమాణం (సైజు) 1.15 హెక్టారు. ఇందులో రైతు తన జీవనానికి, అమ్మకానికి 0.36 హెక్టార్ కొండ్రను అట్టిపెట్టుకోవాలనీ, మరో 0.36 హెక్టార్ భూమిని పశుమేతకు ఉంచుకోవా లనీ, మిగతా టేకు చెట్ల పెంపకానికి ఉంచుకోవాలనీ మోదీ సలహా! టేకు చెట్లు పెరిగి చేతికి అందడానికి ఎన్నేళ్లు పడుతుందో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీకి తెలియదా? శతాబ్దంలో నాలుగో వంతు - అంటే 25 సంవత్సరాలు పడుతుంది! ఈ లోగా రైతూ, అతని కుటుంబం ఎలా బతకాలి, వాళ్లని ఆదు కునే వాళ్లెవరని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలే, ప్రశ్నలే గాని సమాధానాలు రావు! బహుశా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ లేదా మరాఠీ మొగల్ శరద్ పవార్ లాంటి ‘బక్క రైతుల్ని’ దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ సలహా ఇచ్చి ఉంటారని మనం సర్దుబాటు చేసుకోవాలా! రాయల మాట గుర్తు చేసుకోండి! ఎందుకంటే, దేశంలో సన్నకారు, మధ్యరకం కమతాల సంఖ్య 2005-06 సంవత్సరాల మధ్య 83.29 శాతం ఉండేవి. అవి 2010-11 మధ్య 85 శాతా నికి పెరిగిపోయాయని మరచిపోరాదు. అందువల్ల మోదీ సలహా సన్నకారు రైతుల కమతాలకు పనికిరాదు. బక్కరైతు చావకుండా, బతక్కుండా సరి పెట్టుకోడానికే పనికొస్తుంది! ఈ రైతాంగ వ్యతిరేక విధానాన్ని చేపట్టడంతో ప్రధాని మోదీ - ముఖ్యమంత్రి చంద్రబాబుల్లో ఎవరికి ఎవరు గురువో, ఎవరు ‘లఘు’వో తెలుసుకోవటం కష్టమే! ఇద్దరూ దేశంలో రైతుల ఆత్మ హత్యల ‘పరంపర’ లక్షల్లో నమోదు కావడానికి కారణాలను పాలనా విధా నాల్లో చూడడం లేదు. అందుకే తప్పుడు ఆర్డినెన్సుల ద్వారా ‘అభివృద్ధి’ మంత్రం కింద రైతుల్ని ‘బేదఖల్’ చేస్తున్నారు! 2012లో మోదీ పాలనలోని గుజరాత్లో రైతుల ఆత్మహత్యలు పెచ్చరిల్లిపోయినప్పుడు, నాటి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఆర్.సి.ఫల్దూ పంటలు పండకపోవడానికి రైతులే కారణ మని ఎదురు బొంకాల్సివచ్చింది! ఆత్మహత్యలు చేసుకోడానికి ప్రయత్నించిన రైతులని పిరికిపందలైన నేరగాళ్లని ఆరోపిస్తూ, వీరు ప్రభుత్వ సహాయానికి అనర్హులని ‘బీజేపీ కిసాన్ మోర్చా’ నాయకుడు, హరియాణా వ్యవసాయ మంత్రి ఓపీ ధంకర్ వ్యాఖ్యానించిన సంగతిని రైతులు మరచిపోలేదు. దీనిని మించిన మరొక విషయం - ‘మనలో మాట’ పేరిట ప్రధాని మోదీ రేడియో ద్వారా రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విన్నాం. యూపీఏ 2013 ‘భూసేకరణ’ చట్టంలో భూసేకరణకు రైతుల అనుమతి అవసరమనీ, చట్టం వల్ల సమాజంపై పడనున్న ప్రభావం గురించి అభిప్రాయసేకరణ విధిగా జరగాలన్న ప్రతిపాదన ఉన్నదనీ, దీనివల్ల భూసేకరణ కార్యక్రమం ఆల స్యమై పోతుందని అన్న మానూ మరవరాదు! ప్రభుత్వాలు అనుసరి స్తున్న రైతాంగ వ్యతిరేక, బడా భూస్వామ్య, దేశ, విదేశీ బడా వ్యాపారవేత్తల, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా పాలక పక్షాల విధాన రూపకల్పన జరుగుతున్నందునే సర్వీసు (ఐటీ వగైరా) సంస్థల, వస్తువుల తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగాలు మాత్రమే ‘అభివృద్ధి’ని సాధిస్తున్నట్టు చూపు కుంటున్నారు గాని - ఆహార భద్రతకు వెన్నుదన్నుగా నిలబడుతున్న సామా న్య రైతు, వ్యవసాయ కార్మికుల బతుకులు చితికి పోతున్నా పాల కులకు ‘చీమ కుట్టడం’ లేదు! కాని సర్వీసు, తయారీ రంగాల ద్వారా లభిస్తున్న ఉద్యోగాలు సర్వీసు రంగంలో 2.5 శాతం, తయారీ రంగంలో 1.5 శాతం మాత్రమేనని గమనించాలి. చివరికి ఒక వైపున రైతు - వ్యవసాయ కార్మిక జంట ఫలసాయాన్ని ఆరగిస్తూనే, వ్యవసాయాన్ని వృథా వ్యయ ప్రయాసగా ముద్ర వేయడానికి సాహసిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో చరిత్రలో శాశ్వత కీర్తి పొందిన ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల ‘అరితి నీలపు దండ’ శ్రీకృష్ణదేవ రాయలు ‘ఆముక్త మాల్యద’లో రైతుల గురించి చెప్పిన ఆర్ద్రమైన మాటలను నేటి, రేపటి పాలకులు మరువరాదు ‘మా పాలకుల పాదాలలో (పదరేఖల) భాగ్యరేఖల సుడికి అసలు కార ణం - తమ భుజాలపైన నాగళ్లు మోసి మోసి, బొప్పిలు కట్టి కట్టి ప్రజలకూ, మాకూ ఇంత భోజనం పెడుతున్న ఆ రైతుల శ్రమేనని మరువరాదు. రాజులే కున్నా రాజ్యం ఉంటుంది, కాని రైతు లేకపోతే రాజ్యమే శూన్యం’! రాయల పాఠం కేంద్ర, రాష్ట్ర పాలకుల చెవికి ఎక్కుతుందా? - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
గోరంతను కొండత చేసి..!
-
రంగు... హంగు
నెయిల్ ఆర్ట్ గోళ్లను అందంగా అలంకరించుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. గోళ్లను క్యాన్వాస్గా చేసుకొని ఎన్నో డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటి పుణ్యమా అని సింపుల్‌గా ఉంటూనే, చూడచక్కగా గోళ్లను కళకళలాడేలా చేసుకోవచ్చు. 1. తయారీ ఇలా! గోళ్లను నచ్చిన షేప్‌లో తీర్చిదిద్దుకోవాలి. ఏ రంగు నెయిల్ పాలిష్ వేసుకోవాలో ఎంచుకోవాలి. ’ఠి’ ఆకారంలోని నెయిల్ స్టికర్ తీసుకొని పై ఫొటోలో చూపినట్లు గోటిపై అతికించాలి. (పెయింటర్స్ టేప్ అని హార్డ్‌వేర్ షాప్‌లో లభిస్తుంది. దీన్ని ఇంగ్లీష్ ‘వి’ షేప్‌లో కత్తిరించి, వాడచ్చు) 2. ముందుగా బేస్‌కోట్: బేస్‌కోట్ పాలిష్ తీసుకొని, బ్రష్‌తో ఒక పొర వేయాలి. స్టికర్ చివర్ల వరకు బేస్‌కోట్ వేయాలి. 3. నెయిల్ పాలిష్: బేస్‌కోట్ ఆరిన తర్వాత ఎరుపు, పసుపు, నీలం.. ఏదైనా నచ్చిన నెయిల్పాలిష్తో రెండు పూతలు వేయాలి. టేప్ చివర్లకు కూడా సరిగ్గా పాలిష్ అంటేలా వేయాలి. 4. టేప్ తొలగింపు: నెయిల్‌పాలిష్ పూర్తిగా ఆరేంతవరకు టేప్‌ను అలాగే ఉంచకూడదు. 3-4 నిమిషాలవ గానే గోరుకు అతికించిన స్టికర్ లేదా టేప్‌ను ఒకవైపు పట్టుకొని తీసేయాలి. సన్నని బ్రష్‌తో నెయిల్‌పాలిష్ రిమూవర్ అద్దుకొని, ఎక్కడైనా అదనంగా పాలిష్ అంటితే అక్కడ జాగ్రత్తగా తుడిచేయాలి. పాలిష్ ఆరాక మరో టాప్ కోట్ వేశారంటే గోళ్లు చూడముచ్చటగా ఉంటాయి.