బ్యూటిప్స్
► గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గోళ్ళపై çపసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి.
► బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి.
► పుచ్చకాయ గుజ్జును శరీరానికి రాసుకుంటే రక్షణ, పోషణ లేక కమిలిన చర్మం మామూలుగా తయారవుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. చర్మం కొత్తకాంతిని సంతరించుకుంటుంది.
► రుబ్బిన మినపపిండిలో చిటికెడు గంధపుపొడి కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుని, తెల్లవారి కడగాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజులపాటు చేస్తే మచ్చలు, గీతలు పోతాయి.
► ఒక స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ బాదం పొడి, ఒక కోడిగుడ్డు, నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మర్దన చేసిన తర్వాత పదిహేను నిమిషాల సేపు అలాగే వదిలేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే మృతకణాలు, యాక్నె పోయి ముఖం తాజాగా మారుతుంది. యాక్నె లేకపోయినప్పటికీ జిడ్డు చర్మానికి ఈ ప్యాక్ బాగా పని చేస్తుంది.