
నాకు ఇప్పుడు ఏడవ నెల. పైల్స్ ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు రోజూ బ్లీడ్ అవుతున్నాయి. మలబద్ధకం కూడా ఉంది. ఎలాంటి చికిత్స అవసరం ఉంటుంది?
– మీనాక్షి, అనంతపురం.
మొలలు లేదా పైల్స్ అనేవి మలద్వారం లేదా వివిధ వీనస్ రెక్టమ్‌లో వాపు వస్తే ప్రెగ్నెన్సీలో మలబద్ధకం ఇంకా పెరిగి బ్లీడింగ్ అవుతుంది. ఇది చాలామందిలో చూస్తాం. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇవి ఉంటాయి. మలవిసర్జన సమయంలో నొప్పి, మంట ఉంటుంది. ఇలా బ్లీడింగ్ అవకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువ తాగటం, పండ్ల రసాలు తీసుకోవటం మంచిది. పీచుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
వీటి ద్వారా ప్రెగ్నెన్సీలో పైల్స్ బయటకు కనిపించవు. కేవలం రెక్టల్ ఎగ్జామినేషన్‌లో తెలుస్తుంది. ఎక్స్‌టర్నల్ పైల్స్ బయటికి కనిపిస్తాయి. వీటితో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. గర్భంలో శిశువు పెరిగే కొద్దీ బరువు మోషన్ ప్లేస్‌లో పడుతుంది. మలబద్ధకం వలన మలవిసర్జన సమయంలో ముక్కడం, ఒత్తిడి చేసినప్పుడు ఈ పైల్స్ మరింత ఎక్కువ అవుతాయి.
ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో ఈ లక్షణాలు పెరుగుతాయి. అందరికీ ఇలాగే ఉండకపోవచ్చు. కేవలం సమస్య అయితేనే వీటికి చికిత్స చేయాలి. ప్రెగ్నెన్సీలో అన్నీ మందులు వాడటం మంచిది కాదు. కాబట్టి, నివారణ పద్ధతులను సూచిస్తాం. ఐస్ ప్యాక్స్‌తో మోషన్ ఏరియాలో నొప్పి తగ్గించుకోవాలి.
ఫ్రీ మోషన్ అయేటట్టు లాక్సేటివ్స్ ఇస్తాము. పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్‌కి నొప్పి తగ్గుతుంది. హెమరాయిడ్ క్రీమ్స్ కొన్ని దురుద, నొప్పి, మంటను తగ్గిస్తాయి. వాటిలో ఎక్కువ స్టెరాయిడ్ లేని క్రీమ్స్ సూచిస్తాం. లోకల్ అనస్థీíషియా జెల్స్ కూడా వాడొచ్చు. కొంతమందికి పైల్స్ లేకుండా కూడా మోషన్ ప్లేస్‌లో బ్లీడింగ్ కావచ్చు.
అప్పుడు వెంటనే గైనకాలజిస్ట్‌ను కలవాలి. అవసరానికి బట్టి కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తారు. అందుకే, వెంటనే డాక్టర్‌ని కలవాలి. సాధారణ కాన్పులో పుషింగ్ టైమ్‌లో పైల్స్ మీద ఒత్తిడి ఎక్కువ పడి, బ్లీడ్ కావచ్చు. అందుకే డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీ చేయించుకోవాలి. డెలివరీ అయిన వెంటనే ఒత్తిడి తగ్గుతుంది.
కాబట్టి పైల్స్ చాలామందికి తగ్గిపోతాయి. లైఫ్ స్టయిల్‌లో మార్పులు చేసుకోవాలి. హెమరాయిడ్స్‌కి లోకల్ క్రీమ్స్, సపోజిటరీస్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో జాగ్రత్తగా వాడాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. తరచు వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు కూర్చోవటం, నిలబడి ఉండటం చేయకూడదు.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్‌హైదరాబాద్
(చదవండి: మెనోపాజ్‌లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్‌ఫుల్..!)
Comments
Please login to add a commentAdd a comment