piles
-
World Piles Day 2022: పైల్స్‌కు స‘మూల’ పరిష్కారం..
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ప్రస్తుతం ప్రజలు యుక్త వయసులోనే మూలవ్యాధి(పైల్స్/మొలలు) బారిన పడుతున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ రోగులు ఎక్కువగా కూర్చోలేరు. అలాగని తిరగనూ లేరు. గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్య విభాగానికి ప్రతిరోజూ పది మంది పైల్స్ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 120 మంది జనరల్ సర్జన్లు, పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ సగటున ఇద్దరు మొలల బాధితులు చికిత్స కోసం వస్తున్నట్టు సమాచారం. హెమోరాయిడ్స్‌గా పిలిచే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ నవంబర్ 20న వరల్డ్ పైల్స్ డేని నిర్వహిస్తున్నారు. సరైన వైద్యం తీసుకుంటే మూలవ్యాధిని సమూలంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. కారణమేంటంటే.. మల విసర్జన సరిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఇది ఎక్కువగా ఉండేవారిలో అన్నవాహిక చివరి భాగంలో మల ద్వారానికిపైన పురీషనాళం వద్ద రక్తనాళాల్లో వాపు చోటుచేసుకుంటుంది. దీనినే మూల వ్యాధి అంటారు. కొందరిలో మలద్వారం దగ్గర సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఆస్కారం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, మద్యపానం, నీరు తక్కువగా తాగడం, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. మల ద్వారం చుట్టూ దురదగా ఉండడం, మల విసర్జన సమయంలో వాపు, ఉబ్బు తగలడం, అధిక రక్తస్రావం దీని లక్షణాలు. చికిత్స, జాగ్రత్తలు ► ప్రస్తుతం మూలవ్యాధికి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్టాప్లర్, లేజర్, హాల్స్‌వంటి విధానాల వల్ల ఎక్కువ నొప్పి, గాయం లేకుండా మూలవ్యాధిని నయం చేయొచ్చు. ► మొలలు సోకిన వారు పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ప్రత్యేకంగా నీళ్లను తరచూ తాగాలి. పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మల విసర్జన చేయకూడదు. కారం, మాసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు, దుంప కూరలకు దూరంగా ఉండాలి. 90 శాతం మందులతోనే నయం పైల్స్ బాధితులకు గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆపరేషన్లూ చేస్తున్నాం. నూటికి 90 శాతం మూలవ్యాధి మందులతోనే నయమవుతుంది. కేవలం పది శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఆపరేషన్‌కూ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. లేజర్ చికిత్స ద్వారా అతి తక్కువ కోత, కుట్లతో శస్త్రచికిత్స చేయొచ్చు. – షేక్ నాగూర్‌బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
పైల్స్‌కు, క్యాన్సర్‌కు ఒకేలాంటి లక్షణాలు..!
మన జీర్ణ వ్యవస్థలో చివరన ఉండే భాగాన్ని కోలన్ అని, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్ ను కోలన్ క్యాన్సర్ అని అంటారు. పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణుతులు) ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరగడమే ఈ క్యాన్సర్‌కు కారణం. తొలుత ఈ కణుతులు హాని ఏమీ చేయకపోయినా... కొంతకాలం తర్వాత క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. మిగతా క్యాన్సర్లలాగే ఈ క్యాన్సర్‌కు కూడా ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా జీన్ మ్యూటేషన్స్, లావుగా ఉన్నవారిలో, ఫైబర్ చాలా తక్కువగా తీసుకునేవారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్‌కు తీసుకునే రేడియేషన్ వంటివి కొంతవరకు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు కావచ్చు. కోలన్ చివరి భాగం, మలద్వారం కొంచెం పైన ఉండే రెక్టమ్‌కు సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ క్యాన్సర్ 60 ఏళ్లు, ఆ పైబడిన వారిలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కోలన్, కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలు... కణితి ఎక్కడ వచ్చింది, పరిమాణం ఎంత, ఏయే భాగాలకు వ్యాపించింది అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా కనిపించే లక్షణాలు... 1. అజీర్తి లేక విరేచనాలు అవ్వడం 2. మలం, మలవిసర్జనలో మార్పులు 3. మలంలో రక్తం, రక్తపు చారికలు 4. పొట్ట కిందభాగంలో నొప్పి, పట్టేసినట్లు ఉండటం, గ్యాస్ పోతుండటం 5. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నొప్పి 6. అకారణంగా నీరసం, బరువు తగ్గడం 7. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఈ క్యాన్సర్ లక్షణాలను అశ్రద్ధ చేస్తే లివర్‌కు పాకే (మెటాస్టాసిస్) ప్రమాదం ఎక్కువ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతుండటం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ, అకస్మాత్తుగా జీర్ణవ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా, ఇంకా ఎక్కువవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయడానికి ముందుగా డాక్టర్లు... ఫ్యామిలీ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ వంటివి చేశాక కొలనోస్కోపీ, బేరియమ్ ఎనీమా ఎక్స్–రే చేస్తారు. కొలనోస్కోపీ అంటే ఒక సన్నటి గొట్టాన్ని మలద్వారంలో పెట్టి కెమెరా సహాయంతో పాలిప్స్ ఉన్నాయా అని చూస్తారు. కణుతులు ఏమైనా కనబడితే తొలగించి బయాప్సీకి పంపుతారు. మైక్రోస్కోపు సహాయంతో ఆ కణాలు క్యాన్సర్ కణాలా అని తేల్చుకుంటారు. బేరియమ్ ఎనీమా పరీక్షలో బాధితుల చేత బేరియమ్ తాగించి, పెద్దపేగుకు చేరుకున్నాక ఎక్స్‌రే తీసి చూస్తారు. కణుతులు ఉంటే ఈ ఎక్స్‌రేలో ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. బయాప్సీలో క్యాన్సర్ కణాలు అని తేలితే, క్యాన్సర్ దశ తెలుసుకోడానికి మిగతా పరీక్షలు చేస్తారు. చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, సీరమ్ సీఈఏ పరీక్షలతో అవసరమైతే పెట్ సీటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నదనే అంశాన్ని నిర్ధారణ చేస్తారు. నివారణ : యాభై ఏళ్లు పైబడినవారు ఒకసారి మలపరీక్ష, డాక్టర్ సలహా మేరకు సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవరచుకుంటే కొంతవరకు ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యలల్లోనూ సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు అది కేవలం పైల్స్ సమస్య అనే భావించకుండా... మలద్వారం, రెక్టమ్‌ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ లేదా వీటితో పాటు పెద్దపేగును మొత్తంగా చూసే కొలనోస్కోపీ, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంతేగానీ వేడి చేసిందనీ లేదా పైల్స్ సమస్య కావొచ్చేమోలే అని సొంతవైద్యం చేసుకుంటూ ఉంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలలో లేదా అజీర్తి, బ్యాక్టీరియా, వైరస్‌లతో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్లో కనిపించే లక్షణాలూ... కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ తొలిదశలో కనిపించే లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండవచ్చు. అందువల్ల పై లక్షణాలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. ప్రారంభదశలోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ ఉత్తమమైనది. ఈ రోజుల్లో ఈ సర్జరీలను లాపరోస్కోపిక్ (కీహోల్) పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో... వ్యాధి సోకిన భాగాన్ని హై– డెఫినిషన్ కెమెరాలు పెద్దదిగా, స్పష్టంగా కనిపించేట్లు చేస్తాయి. ఫలితంగా సర్జరీని మరింత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే, లాపరోస్కోపిక్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటాడు. రోగి ఆరోగ్యం, క్యాన్సర్ దశ, క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా రెండింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌లో కీమోథెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తర్వాత సర్జరీ చేస్తారు. ఒకవేళ చివరిదశలో గుర్తించినా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి మందుల సహాయంతో రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
Health Tips: పచ్చళ్లు అతిగా తింటే అనర్థమే! ముఖ్యంగా పురుషులకు..!
What Happens If We Eat Pickles Everyday: వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో, ఇతర ఊరగాయ పచ్చళ్లో రోటిపచ్చళ్లో వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లకోసం నాలుక తెంపుకుంటూ ఉంటారు. అయితే రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇంతకూ ఆ ముప్పు ఎందుకో, ఏమిటో చూద్దాం... తక్కువగా తినండి! నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కోవడం తెలుగు వారి స్వభావం. అన్నంలోనే కాదు, వేడివేడి ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం... పచ్చళ్లను తక్కువగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. బీపీ అమాంతం పెరిగితే! పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ప్రిజర్వేటివ్స్ వల్ల హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పొట్టలో, పేగుల్లో పొంచి ఉండే కొవ్వు.. గుండెజబ్బులు మార్కెట్లో విక్రయించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల.. మసాలాల కారణంగా.. పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. తద్వారా గుండెజబ్బులు కాచుకుని ఉంటాయి. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో కలిపిన వాటిని... అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది. చదవండి: Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే.. Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
మొలల నివారణా అదే... ప్రాథమిక చికిత్సా అదే!!
తాజా ఆకుకూరలతో పాటు ఆహార ధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అవే మొలలకు నివారణగానూ, తొలి (ప్రాథమిక) చికిత్సగానూ ఉపయోగపడతాయని వైద్యులు, ఆహారనిపుణులు పేర్కొంటున్నారు. మలద్వారం వద్ద రక్తనాళాలు బుడిపెల్లాగా ఉబ్బి, అక్కడేదో ఉన్నట్లుగానూ, ఒక్కోసారి స్పర్శకు తెలుస్తుండటాన్ని మొలలుగా చెబుతారు. ఈ సమస్యను మూలశంక అని కూడా అంటుంటారు. ఒక్కసారిగా ఒరుసుకుపోవడంతో కొందరిలో రక్తస్రావం కావడం, బట్టలకు అంటుకుని నలుగురిలో ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. మరికొందరిలో మలద్వారం వద్ద దురద, నొప్పితో బాధిస్తుంటాయి. మూలశంక సమస్య తొలిదశల్లోనే ఉన్నవారు... ముదురాకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆయా సీజన్లలో దొరికే తాజాపండ్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పాలిష్ చేయని ధాన్యాలు, చిరుధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగటం, ద్రవాహారాలు తీసుకోవడం చేయాలి. దీనికి తోడు దేహ కదలికలకు తోడ్పడే వ్యాయామాలూ చేయాలి. చదవండి: (Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..) ఈ అంశాలన్నీ కలగలసి మలాన్ని సాఫ్ట్‌గా చేస్తాయి. దాంతో మలద్వారం వద్ద ఎలాంటి ఆటంకమూ లేకుండా మృదువుగా విసర్జితమవుతుంది. ఈ అంశమే మొలలు రానివారికి ఓ నివారణగానూ, అప్పటికే మొలలు ఉన్నవారికి ప్రాథమిక చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్)లాగా చేస్తుంది. మొలల్లో గ్రేడ్లు ఉంటాయి. వాటి తీవ్రత ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు కొన్ని అడ్వాన్స్డ్ చికిత్సలతో పాటు, శస్త్రచికిత్స వరకూ అవసరం పడవచ్చు. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా ఉండాలంటే... మొలల సమస్యను కేవలం కేవలం డయటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామాలతోనే నివారించవచ్చు. -
Health: పైల్స్‌తో బాధపడుతున్నారా? వీటిని తగ్గించండి! ఇవి తింటే మేలు!
Diet Tips For Control Piles: కొందరికి నిద్రలేవగానే టాయిలెట్‌కి వెళ్లాలంటే నరకమే. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావం. నొప్పితో బాధపడుతుంటారు. అయితే పైల్స్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం వల్ల కొంత మేలు జరుగుతుంది. అవేమిటో చూద్దాం... ►పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు మొదలైనవి. ►ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మలబద్దకానికి దారితీసి, ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ►వేయించిన ఆహారం: ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది కాబట్టి ఫ్రై చేసిన వాటికి దూరంగా ఉండటం మంచిది. ►ఉప్పు అధికంగా తినొద్దు. ►కారంగా ఉండే ఆహారాలు: ఫైబర్ తక్కువగా ఉండకూడదు, కారంగా ఉండే ఆహారం నొప్పిని పెంచుతుంది. ►కెఫిన్ ఉన్న ఆహార పానీయాలు: ముఖ్యంగా కాఫీ, టీల వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. అందువల్ల వాటిని వీలయినంత వరకు తగ్గించడం మేలు. ►ఆల్కహాల్: కెఫిన్ పానీయాల మాదిరిగా, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలు మలాన్ని గట్టిగా ఉండేలా చేస్తాయి. తద్వారా మోషన్‌కి వెళ్లేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకని పైల్స్ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు ఆల్కహాల్ మానుకోవడం మంచిది. వీటిని తినండి.. ►బార్లీ ►క్వినోవా ►బ్రౌన్ రైస్ ►వోట్స్ ►చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోండి. ►క్యారట్ ►బీట్రూట్ ►బ్రోకలీ ►కాలీఫ్లవర్ ►కాలే ►క్యాబేజీ ►గుమ్మడికాయ ►బెల్ పెప్పర్స్ ►దోసకాయ ► జామపండు ►బొప్పాయి వంటి పండ్లు కూరగాయలు తినండి. చదవండి: ఔషధాల ఖజానా పుదీనా Urinary Incontinence: దగ్గినప్పుడల్లా మూత్రం పడుతోంది! ట్రీట్మెంట్ ఉందా? -
టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!
This is Why You Should Not Spend More Than 10 Minutes on the Toilet: చాలా మందికి టాయిలెట్లో ఎక్కువ సమయం గడపటం అలవాటు. టాయిలెట్లో తీరిగ్గా కూర్చుని ఫోన్ చూస్తూ గంటల కొద్ది సమయం ఈజీగా గడిపేస్తారు. ఐతే ఆ పొజిషన్లో ఎక్కువ సమయం కూర్చోవరటం ఎంత ప్రమాదమో తెలిస్తే 10 నిముషాలకంటే ఎక్కువ సమయం టాయిలెట్లో ఎప్పటికీ గడపరు. అవునండీ.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ సుందర్ల్యాండ్కి చెందిన క్లినికల్ లెక్చరర్ ఎన్‌హెచ్‌ఎన్ సర్జన్ డా. కరన్ రాజన్ మాటల్లో.. ‘టాయిలెట్లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం కూర్చుంటే మల మార్గంలో ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువయ్యి, రక్తనాళాలు ఉబ్బి ఫైల్స్ ఏర్పడతాయి. ఈ వ్యాధిని హెమోరాయిడ్ అని అంటారు. వీటిని తొలగించాలంటే శస్త్ర చికిత్స ఒక్కటే మార్గం. జీర్ణ ప్రక్రియ సజావుగా జరగడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ప్రతి రోజూ తీసుకుంటే మల విసర్జన సక్రమంగా ఉంటుంది' అని వివరించారు. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. మీ జీవితంలో ఫైల్స్ సమస్య ఎప్పటికీ తలెత్తకుండా ఉండాలంటే ఈ సూచనలు ఖచ్చితంగా పాటించడం ఒక్కటే మార్గం. కాబట్టి టాయిలెట్లో సిట్టింగ్ పొజిషన్లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం గడపకండే!! జాగ్రత్త మరి..! చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! -
ఆపరేషన్ లేకుండా పైల్స్ తగ్గుతాయా?
నా వయసు 60 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? – ఎమ్‌డి. మౌలానా, వరంగల్ పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైననొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు: ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ∙ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం ∙మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స: హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే చికిత్స చేయవచ్చు. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులను వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. -
పైల్స్ నయమవుతాయా?
నా వయసు 30 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా తరచూ ఈ సమస్య వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. కారణాలు : దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్టర్నల్ పైల్స్. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. ఫిషర్స్ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఫిస్టులా : మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. చికిత్స : జెనెటిక్ కన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు : ►మానసిక ఆందోళన ►థైరాయిడ్ సమస్య ►డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ►వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ►తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ►తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ►సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట...తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ :ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు :మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం వ్యాధినిర్ధారణ పరీక్షలు : యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
కేరాఫ్ డాక్టర్స్ విలేజ్!
ప్రకాశం, తాళ్లూరు: ఓ చిన్న పల్లె ఇప్పుడు పెద్ద టాపిక్‌గా మారింది. ఆ గ్రామంలో అంతా వైద్యులే.. అందుకే వీధులన్నీ ఖరీదైన బంగ్లాలతో దర్శనమిస్తాయి. అయితే అందులో వారు నివాసం ఉండేది మాత్రం కొద్ది నెలలే. మిగతా సమయమంతా సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలందిస్తూ ఉంటారు. అదే తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం పంచాయతీ పరధిలోని గంగపాలెం (తురకపాలెం). దీని కథ ఏంటో చదివేద్దాం! ఈ గ్రామంలో అంతా ముస్లింలే ఉండటం వల్ల తురకపాలెం అని కూడా పిలుస్తుంటారు. మొత్తం 150 నివాస గృహాలుంటాయి. జనాభా 450 మంది. వీరిలో 95 శాతం మంది ముస్లింలే. అయితే ప్రతి ఇంటికీ ఒకరిద్దరు చొప్పున మొత్తం 200 మంది మొలల చికిత్స వైద్య నిపుణులుండటం విశేషం. వీరంతా వివిధ పట్టణాలల్లో ప్రముఖ మొలల డాక్టర్లుగా ప్రసిద్ధి చెందారు. వంశపారపర్యంగా తమకు తెలిసిన వన మూలికలు, నాటు వైద్యంతో పాటు నూతన పరిజ్ఞానాన్ని సంపాదించుకొని పైల్స్, ఫిస్ట్ , ఫిషరీస్ వంటి వ్యాధులను నయం చేస్తూ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, కోల్‌కతా, కడప, అనంతపురం, రాజస్థాన్, ఒడిస్సా, ముంబై వంటి నగరాల్లో కూడా వైద్యసేవలందిస్తున్నారు. తురకపాలెంకు చెందిన షేక్ లాల్ కర్నూలు జనరల్ ఆస్పత్రిలో ఎండీగా పని చేస్తున్నారు. వంశపారంపర్య వృత్తి పోనీయకుండా.. తాతల నుంచి వంశపారంపర్యంగా చేస్తున్న వృత్తిని పోగొట్టకుండా ప్రస్తుతం యువత ఎంబీబీఎస్, ఎంఎస్, బీఏఎంఎస్, డీహెచ్ఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సుల్లో శిక్షణ పొంది వైద్యులుగా పనిచేస్తున్నారు. సోహేల్, లాల్, బాలాజీ, శిరాజుద్దీన్, మీరాజుద్దీన్, లాల్, మెబిన్, ఆరీఫ్, సద్దామ్తో పాటు 12 మంది ఎంబీబీఎస్ పట్టభద్రలు కాగా, మరో నలుగురు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. 41 మంది డీఏంఎంఎస్, బీఎఎంఎస్, డీహెచ్ఎంఎస్, బీపీటీ వంటి పట్టాలు పొందారు. రంజాన్ మాసంలో గ్రామాన సందడి.. గ్రామంలో వృద్ధులు, పని చేయలేనవారు తప్ప మిగిలిన వారంతా తమ గృహాలకు తాళాలు వేసుకుని పటిష్ట బందోబస్తు చేసి ఇతర ప్రాంతాలకు వెళతారు. ఎక్కడ వృత్తి చేస్తున్నా స్వగ్రామాన్ని మరువకుండా ఇక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ముతో మే, జూన్ నెలల్లో గ్రామానికి చేరుకుని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా మోహరం, రంజాన్ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. గ్రామంలో మసీదు, పీర్ల చావిడీ నిర్మించారు. గ్రామంలో నాలుగు కుటుంబాలు యాదవులు కాగా.. ఒక కుటుంబం ఆర్యవైశ్యులది. మత సామరస్యానికి ప్రతీకగా రామాలయం గ్రామంలో ఐదు కుటుంబాలు తప్ప అంతా ముస్లింలు అయినప్పటికీ రామాలయం నిర్మించి ప్రతి సంవత్సరం తమ మసీదుతో పాటు రామాలయానికి రంగులు వేయిస్తూ ఎంతో సుందరంగా ఉంచటం హిందువులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇక్కడున్నవారి పరిస్థితి? వైద్యులుగా ఖ్యాతి గడిస్తున్నప్పటికీ గ్రామంలో ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు మాత్రం తాగటానికి నీరు, ఇతర వసతులను ప్రభుత్వం కల్పించటంలో విఫలమైందని గ్రామస్తులు చెప్పారు. సైడు కాలువల లేక అపరిశుభ్రతగా ఉందన్నారు. తమగ్రామాన్ని పట్టించుకొనే నాథుడు లేడని, శ్మశాన స్థలాన్ని కూడా అధికారులు కేటాయించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవటంతో ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామంలో పెద్దల సహకారంతో ఎవరైనా తప్పుచేస్తే ఖండించి న్యాయం జరిగేలా చూస్తామని, పోలీస్టేషన్లకు వెళ్లటం ఇష్టం ఉండదని గ్రామస్తులంటున్నారు. దేశంలో ఏప్రాతంలో ఉన్నా అంతా నిరంతరం ఫోన్లో అందుబాటులో ఉంటామని, ఎవైనా కష్టాలు వచ్చినప్పుడు గ్రామానికి వచ్చి చర్చిస్తామని వైద్యులు చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సొంత ఊరు రావటం ఎంతో ఆనందదాయకం తాతల నుంచి వైద్య వృత్తి చూస్తున్నా. హైదరాబాద్ వైద్య వృత్తి చేస్తున్నా. సొంత ఊరు రావటం ఎంతో సంతోషం. బంధుమిత్రులను కలుసుకోవటం ఆనందం. ప్రార్థన స్థలం కబ్జాకు గురైంది.. నియత్రించే వారు లేరు. సయ్యద్సాహెల్, ఎంబీబీఎస్ గ్రామంలో మౌలిక వసతుల కరువు సాగర్ నీరు గ్రామంలో మూడు పాయింట్లు పెట్టారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నీరు ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. మేము అభివృద్ధి చెందిన గ్రామంలో మౌలిక వసతులు పెరగటం లేదు. సయ్యద్జాహార్, ఎంబీబీఎస్ సైడు కాలువలు లేవు దశాబ్దం క్రితం సీసీ రోడ్డు వేశారు. సైడు కాలువలు నేటికీ లేవు. గ్రామంలోనే ఉంటాను. రెండు నెలల పాటు అంతా వస్తుంటారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సయ్యద్ బాబు, గ్రామస్తుడు నాన్న స్ఫూర్తితో వైద్య విద్య పూర్తి చేశా పూర్వం నుంచి పెద్దలు చేస్తున్న నాటు వైద్యంను నాన్న కూడా చేస్తూ తెలంగాణలో స్థిర పడ్డారు. నేను ఎంబీబీఎస్ పూర్తి చేసి జడ్చర్లలో వైద్యునిగా పనిచేస్తూ ప్రజా సేవ చేస్తున్నాను. డాక్టర్ ఎస్. శిరాజుద్దీన్, ఎంబీబీఎస్ వైద్యునిగా సేవలు అందించటం సంతోషకరం వైద్య వృత్తిని చేపట్టి ప్రజలకు సేవ చేయటం సంతోషకరంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యాధికారిగా సేవలు అందిస్తున్నాను. గ్రామానికి చెందిన 16 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి వివిధ ప్రాంతాల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. డాక్టర్ షేక్ లాల్, ఎంబీబీఎస్ -
ఆపరేషన్ లేకుండా పైల్స్ నయం చేయవచ్చా?
నా వయసు 38 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? – రమేష్‌బాబు, కందుకూరు పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు : ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స : హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం మందులతోనే సమస్య నయమయ్యేలా చేయవచ్చు. పైల్స్ చికిత్స కోసం బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాల్సి ఉంటుంది.-డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
అమ్మాయి ఎప్పుడూ ఒంటరిగా.. పరధ్యానంగా!
హోమియో కౌన్సెలింగ్స్ మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. – నిరుపమ, గూడూరు మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మత. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది. డిప్రెషన్‌ను 1950–60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు: ∙మేజర్ డిప్రెషన్: ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙డిస్థిమిక్ డిజార్డర్: రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. ∙సైకియాటిక్ డిప్రెషన్: డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. ∙పోస్ట్ నేటల్ డిప్రెష : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. ∙సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్: సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. ∙బైపోలార్ డిజార్డర్: ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మెడనొప్పి చేతులకు ఎందుకు పాకుతోంది? నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి ఇప్పుడు చేతుల వరకూ పాకుతోంది. వేళ్లు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో మందులతో ప్రయోజనం ఉంటుందా? – సంజయ్, హైదరాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా తగ్గేలా చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పైల్స్ సమస్యకు పరిష్కారం చెప్పండి... నా వయసు 54 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – జీవరత్నం, కాకినాడ చాలా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు: గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు.హోమియోలో రోగి వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా మందులు ఇచ్చి వ్యాధిని నయం చేయచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
మొలల సమస్యను తగ్గించవచ్చు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి కూడా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అని చెప్పారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – ఎన్. శ్రీహరి, విశాఖపట్నం మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు: ∙గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది ∙గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి ∙గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత లోపలికి పోకుండా, వేలితో నెడితే లోనికి వెళ్తాయి ∙గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙కొబ్బరినీళ్లు ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
సిరలు ఉబ్బడం వల్లనే ఆ ఇబ్బంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 51 ఏళ్లు. విపరీతంగా ముక్కితే గానీ నాకు మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – కేశవరావు, హబ్సిగూడ ఇటీవల మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ గుక్కపడితే పాప నీలంగా మారుతోంది! పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 10 నెలలు. ఒక్కోసారి ఇక అదేపనిగా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటుంది. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా అవుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – షమీమ్‌బేగం, కొత్తగూడెం మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదిస్తే చాలు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ హైదరాబాద్ -
కూర్చోవడానికీ ఇబ్బందిగా ఉంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా బయటకు వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లు నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్ పైల్స్ అని చెప్పారు. హోమియోతో నయమవుతుందని తెలిసింది. తగిన సలహా ఇవ్వండి. – ఈశ్వర్‌కుమార్, జగ్గయ్యపేట ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి. మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి, మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి, ఇబ్బంది పెడతాయి. తీవ్రతను బట్టి వీటిని నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు. మొలల దశలు: గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. ⇔ వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. ⇔ కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్ధకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. ⇔ తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ⇔ సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ⇔ చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ⇔ మలబద్ధకమేగాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ⇔ మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీళ్ళు తక్కువగా తాగడం ⇔ ఎక్కువగా ప్రయాణాలు చేయడం lఅధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ⇔ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లు నొప్పి ⇔ మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: మలబద్ధకం లేకుండా చూసుకోవాలి ⇔ సమయానికి భోజనం చేయాలి ⇔ ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువుండేలా చూసుకోవాలి. ⇔ కొబ్బరినీళ్లు, నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ⇔ మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తగ్గించాలి. ⇔ మెత్తటి పరుపుపై కూర్చోవాలి. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులిచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. -
ఆ టైమ్‌లో చాలా ఇబ్బందిగా ఉంటోంది
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనరాజు, అనకాపల్లి మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ నా కిడ్నీ పాడైందా?! కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత పదేళ్ల నుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. కానీ ఒకసారి శరీరంలో చక్కెరస్థాయి పెరిగి కళ్లు తిరిగి పడిపోయాను. చికిత్స తర్వాత కొన్నాళ్ల పాటు డాక్టర్లు ఇన్సులిన్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం వారి సూచనల మేరకే మళ్లీ మందులు వాడుతున్నాను. అయితే కొంతకాలం నుంచి నా ముఖం చాలా ఉబ్బినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా కాళ్లలో వాపుతో పాటు మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండి కాస్త ఇబ్బంది కలుగుతోంది. ఈ లక్షణాలతో నేను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాను. ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు, ఆఫీసులోని కొలీగ్స్ అందరూ కిడ్నీ పాడైపోయిందని భయపెడుతున్నారు. అసలు నాకు ఏమైంది? వాళ్లు చెబుతున్నది నిజమేనా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శ్రీనివాస్, అనంతపురం మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖం ఉబ్బినట్లుగా ఉందని చెబుతున్నారు. అయితే వీటితో పాటు ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం లాంటి లక్షణాలతో ఏమైనా సతమతమవుతున్నారా... అనే విషయాలను కాస్త గమనించండి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచి నెఫ్రాలజిస్టును సంప్రదించండి. వారు మీకు ముందుగా సీరమ్ క్రియాటినిన్, అల్ట్రా సౌండ్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏమైనా అసాధారణ ఫలితాలు వస్తే మరింత లోతుగా పరిశీలించేందుకు జీఎఫ్ఆర్, స్కానింగ్ లాంటి పరీక్షల ద్వారా కిడ్నీ పనితీరును క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలితే అందుకు తగ్గట్లుగా చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. ఇందుకు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కిడ్నీ సమస్యకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన పలితాలు పొందగలుగుతారు. అలాకాకుండా మీరు చికిత్సపై అనుమానాలు పెంచుకుని డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే మీ సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్కు గురైన కిడ్నీకి చికిత్సను తాత్సారం చేస్తే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. ఒక్కోసారి ఏకంగా కిడ్నీనే తొలగించాల్సి వస్తుంది. డయాబెటిస్ ఉందని చెప్పి మీరు మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారాన్ని మితంగా తినండి. మద్యపానం, పొగతాగడం వంటి దురలవాట్ల జోలికి వెళ్లకండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, రోజుకు 4 నుంచి 6 లీటర్ల నీటిని తాగడం, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆహారాన్ని ఒక్కోసారి పెద్దమొత్తంలో తీసుకోకుండా... కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకునేలా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు విలువైన సమయాన్ని వృథా చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్సను పొందండి. డాక్టర్ సాయిరాం రెడ్డి సీనియర్ నెఫ్రాలజిస్టు అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ సికింద్రాబాద్ -
అసిడిటీ బాధ... తగ్గేదెలా..?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 41 ఏళ్లు. నేను చాలాకాలం నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం కొన్ని టాబ్లెట్లు కూడా వాడాను. ఇప్పుడు మళ్లీ అసిడిటీ కోసం కొన్ని మందులు వాడుతున్నాను. అయినా కడుపు నొప్పి, మలబద్దకం, తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - ప్రసాద్, చీరాల మీరు మందులు వాడుతున్నా ఫలితం లేదని అంటున్నారు. ఇప్పటివరకూ మీరు ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఆ ప్రొసీజర్ చేయించుకోండి. రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి అని రాశారు. మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవాళ్లలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఐబీఎస్ కాంపోనెంట్ ఉందా లేదా అని చూపించుకోండి. నా వయసు 27 ఏళ్లు. కడుపునొప్పి, బరువు తగ్గుదల ఉంటే పరీక్ష చేయించుకున్నాను. చిన్న పేగుల్లో టీబీ ఉందని డాక్టర్ చెప్పారు. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. ఇది పూర్తిగా నయమవుతుందా లేదా అన్నది తెలియజేయండి. - సంతోష్‌కుమార్, కాకినాడ చిన్న పేగుల్లో టీబీ వల్ల పేగుల్లో పుండ్లు పడే అవకాశం ఉంది. అయితే క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. చిన్నపేగుల్లో స్ట్రిక్చర్ మాదిరిగా వస్తే (పేగులు సన్నబారడం జరిగితే) టీబీ నియంత్రణలోకి వచ్చినా అప్పుడప్పుడూ నొప్పి తిరగబెట్టే అవకాశం ఉంది. మీరేమీ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకోసం చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఇంత చిన్నవయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల మున్ముందు సమస్య వస్తుందా? శాశ్వతమైన సమస్యకు దారితీస్తుందోమో అని భయంగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - శివరామకృష్ణ, ఏలూరు మీ సమస్యను విశ్లేషిస్తే... మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో కనిపించే సాధారణమైన సమస్య ఇది. కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు మోకాలి చిప్పపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (స్వాటింగ్) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇది ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాదు. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. నేను కొంతకాలంగా మలబద్ధకం, మలంలో రక్తం పడటం, మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా ఈ సమస్యకి పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉంటుందా? సలహా ఇవ్వగలరు. - రామరాజు, కాకినాడ మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఎన్నో రకాల జబ్బులకు దారితీస్తున్నాయి. వాటిలో ఎక్కువమందిని వేధిస్తున్నవి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. పైల్స్: మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపునకు గురవుతాయి. దాంతో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలుగుతుంది. దాన్నే పైల్స్ అంటారు. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువకాలం ఒత్తిడికి గురవడం, అధిక బరువులు ఎత్తడం, దీర్ఘకాలికంగా దగ్గు, వంశపారంపర్యత, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికం. పైన తెలిపిన కారణాల వల్ల మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి వాటిలోని కవాటాలు దెబ్బతినటం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడటంతో తీవ్రమైన నొప్పి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. పైల్స్‌లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని రెండురకాలైన పైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వాపునకు గురవడం వల్ల ఇది ఏర్పడుతుంది. అయితే ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్: మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకుని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉంటాయి. ఫిషర్స్: మలద్వారం వద్ద ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్స్ అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది. ఫిస్టులా: రెండు ఎపితీతియల్ కణజాలం మధ్య ఏర్పడే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. మానవ శరీరంలో ఎక్కడైనా ఇది ఏర్పడవచ్చు. కానీ సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి. ఇది ఊబకాయం ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది. రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన చర్మంపై చిన్న మొటిమలాగా ఏర్పడి, నొప్పి, వాపుతో కూడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది. శస్త్రచికిత్స తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు: ఊబకాయం రాకుండా జాగ్రత్త పడటం, పోషకాహారాన్ని... అదీ వేళకు తీసుకోవడం, ఆహారంలో పీచు ఎక్కువ ఉండేవిధంగా చూసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, మాంసాహారం తక్కువ తీసుకోవడం, మలవిసర్జన ప్రతిరోజూ ఉండేలా, అదీ సాఫీగా జరిగేలా చూసుకోవడం, వ్యాయామం చేయడం. హోమియోకేర్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్ధకం వంటి సమస్యలకు మూలకారణాలను గుర్తించి, వైద్యం చేయడం ద్వారా ఈ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
మామూలు కణుతులతో ఆందోళన అక్కర్లేదు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు నొప్పిగా ఉండటంతో పాటు రక్తం పడుతోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. దీనికి చికిత్స ఏదైనా ఉందా? - సునీల్‌కుమార్, నిజామాబాద్ పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మన మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బంతుల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈమధ్యకాలంలో ఈ సమస్య ఎక్కువ. మల విసర్జన తర్వాత ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే చికిత్స చేయవచ్చు. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు: ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు: మలబద్ధకం, తగినంత నీళ్లు తాగకపోవడం పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హోమియో చికిత్స: పైల్స్ ఉన్నవారికి హోమియో ద్వారా చికిత్స చేయవచ్చు. హోమియో చికిత్స ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే ఇవి తగ్గిపోతాయి. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులను వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నా ఒంటి మీద దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ (ఫెయిర్‌గానూ), మిగతా ప్రాంతంలో స్కిన్ కాస్త నల్లగా (డార్క్‌గా) కనిపిస్తుంది. నా మేని రంగు అంతా ఒకేలా ఉండి, దానికి నిగారింపు వచ్చేందుకు ఏం చేయాలి? - చందన, కాకినాడ దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. ఆ భాగాలతో పోలిస్తే సూర్యకాంతి పడేచోట అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల సన్ డ్యామేజీ వల్ల మేని రంగు కాస్త డార్క్‌గా ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా ఉండటంతో పాటు, మెరుస్తూ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి. * సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి. సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి. పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలతో మీ చర్మాన్ని నిగారింపుతో ఉండేలా చేస్తారు. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ బోన్ కేన్సర్ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 19 ఏళ్లు. అతడికి తొడ భాగంలో వాపు వచ్చింది. దగ్గరలో ఉన్న డాక్టర్‌ను కలిస్తే పరీక్షించి దాన్ని మామూలు కణితిగా నిర్ధారణ చేశారు. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? రాబోయే రోజుల్లో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా? - నిరంజన్, కోదాడ ఎముకల్లోని కణుతుల్లో రెండు రకాలు. ఒకటి ప్రమాదకరం కాని కణితి. దీన్ని బినైన్ అంటారు. ఇక రెండోది మాలిగ్నెంట్ కణితి. ఇది క్యాన్సర్ కణితి. దీన్ని ఎక్స్-రే, ఎమ్మారై ద్వారా నిర్ధారణ చేయవచ్చు. మామూలు కణుతులైతే చిన్న ఆపరేషన్ ద్వారా చికిత్స చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని మామూలు కణుతులే ఆ తర్వాత క్యాన్సర్ కణుతుల్లా మారే అవకాశం ఉంది. అయితే మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా అమ్మగారికి 50 ఏళ్లు. రెండేళ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. చికిత్స చేసి దాన్ని తొలగించారు. ఈమధ్యకాలంలో తుంటి నొప్పి ఉందని నడవలేకపోతున్నారు. వైద్యులు పరీక్షించి తర్వాత తుంటి ఎముకకు క్యాన్సర్ సోకిందని చెప్పారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో చెప్పండి. - కొండలరావు, నర్సీపట్నం ఇతర అవయవాల నుంచి ఎముకలకు పాకిన క్యాన్సర్‌ను సెకండరీ క్యాన్సర్ అని అంటారు. ఇవి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ (ముదిరిపోయిన దశ)లో కనిపిస్తాయి. ఇలాంటి క్యాన్సర్‌కు సర్జరీ, రేడియోథెరపీ లేదా రెండూ కలిసి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇది కాలికి సంబంధించిదా లేక చేతికి సంబంధించిందా, ఒక ఎముకకా లేక ఎక్కువ ఎముకలలో ఉందా అన్న విషయాలు నిర్ధారణ చేయాలి. దానికి అనుగుణంగా అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. చికిత్స ద్వారా నొప్పులు లేకుండా, ఒకరి మీద ఆధారపడటం వంటివి జరగకుండా చూడవచ్చు. మా బాబు వయసు పదేళ్లు. నెల్లాళ్ల క్రితం ఆడుకుంటుంటే కిందపడి చిన్న దెబ్బ తగిలింది. వారం తర్వాత నొప్పి, వాపు ఉందని ఎముకల డాక్టర్‌ను సంప్రదించాం. ఎముకల్లో కణితి ఉందేమోనని అనుమానించి, ఎక్స్-రే తీయాలన్నారు. బయాప్సీ కూడా చేయించాలని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏదైనా ఉందా? - రమాకాంత్‌రావు, నెల్లూరు ఎముల్లో కణుతులు సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత బయటపడే అవకాశం ఉంది. ఈ కణుతులను ఎక్స్-రే, ఎమ్మారై స్కానింగ్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎముకల్లో ఇన్ఫెక్షన్ ఇలా కనిపించే అవకాశం ఉంది. అతడికి నీడిల్ బయాప్సీ ద్వారా ఒక చిన్న ముక్కను తీసి పరీక్షించి, వ్యాధి నిర్ధారణ అయిన దాన్ని బట్టి చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కిశోర్ బి రెడ్డి హెడ్ ఆఫ్ ద మస్క్యులో స్కెలెటల్ ఆంకాలజీ, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ -
పట్టుకోల్పోతోంది చెయ్యి... పరిష్కారం చెప్పండి
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 30 ఏళ్లు. నాకు గత 6 నెలలుగా మలద్వారం దగ్గర బుడిపెల్లాగా ఏర్పడి మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. నొప్పి, మంట ఉండి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్ని కలిస్తే పైల్స్ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - రాములు, తుని ఈ మధ్య కాలంలో తరచుగా వినిపించే సమస్యల్లో ఇది ఒకటి. మలద్వారం చివరలో ఉండే సిరలు మలద్వారం గోడలలో మార్పుల వల్ల ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలలు... దశలు గ్రేడ్-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు, నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్-2: ఈ దశలో రక్తం పడొచ్చు. పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలకు వెళ్లిపోతాయి. గ్రేడ్-3: మలవిసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి కానీ విసర్జన అనంతరం వాటంతట అవి లోపలికి పోవు. వేలితో నెడితేనే లోనికి వెళ్తాయి. గ్రేడ్-4: ఈ దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోపలికి వెళ్లవు. కారణాలు: మలబద్దకం, శారీరక శ్రమ లే కపోవడం, స్థూలకాయం, చాలాసేపు కూర్చొని పనిచేయడం, అతిగా విరోచనాలు కావటం, మంచి పోషకాహారం తీసుకోకపోవడం, నీరు తక్కువ తాగడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, అధిక వేడి ప్రదేశంలో పనిచేయడం, తరచు గర్భస్రావం జరుగుతుండడం, మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారికి ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, నొప్పి, ఎప్పుడూ ఏదో గుచ్చుకుంటున్నట్లుగా ఉండటం, మలవిసర్జన సమయంలో ఇబ్బంది. నిర్ధారణ: రోగి లక్షణాలను బట్టి, మొలలు మరీ పెద్దదిగా ఉంటే మలద్వారంలోనికి ప్రోట్రోన్సిప్ పంపి చూడటంద్వారా నిర్ధారిస్తారు. నివారణ: మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం ముఖ్యం. రోజు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మసాలాలు, జంక్ ఫుడ్, మాంసం తక్కువ తీసుకోవడం, మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. హోమియో చికిత్స: హోమియోలో రోగి శరీర, మానసిక స్థితిని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తూ, క్రమేణా పూర్తిగా వ్యాధి నివారణ చేస్తారు. మీరు వీలయినంత త్వరలో మంచి హోమియో నిపుణులను సంప్రదించండి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ లివర్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. మా అన్నయ్యకు కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదనీ, రక్తసంబంధీకులలో ఎవరిదైనా కాలేయదానం అవసరమని డాక్టర్లు అంటున్నారు. నేను మా అన్నయ్యకు కాలేయం ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను అన్నివిధాలా అర్హురాలినని డాక్టర్లు వివిధ పరీక్షలు చేసి, నిర్ధారణ చేశారు. మా అన్నయ్యకు కాలేయం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? - విజయశ్రీ, నంద్యాల మీ అన్నయ్యకు మీరు కాలేయం ఇవ్వడానికి అన్నివిధాలా అర్హులని వైద్యులు నిర్ధారణ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేయాన్ని దానం చేయవచ్చు. కాలేయానికి పునరుత్పత్తి స్వభావం ఉంటుంది. మీ నుంచి 20-25 శాతం కాలేయాన్ని తొలగించి, దాన్ని మీ అన్నగారికి అమర్చుతారు. కాలేయ దానం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కాలేయానికి ఉన్న పునరుత్పత్తి శక్తి వల్ల దాతలోని కాలేయం మళ్లీ 6-8 వారాలలో యథాస్థితికి పెరుగుతుంది. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆటలూ ఆడవచ్చు. అందరిలాగే ఏవిధమైన ఇబందులూ లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ అన్నయ్యకు కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు మీరు తెలిపారు. కాబట్టి మీ అన్నయ్యకు వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయించాలని డాక్టర్లు సూచించారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ శస్త్రచికిత్స చేయించాలి. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి మీ అన్నయ్యకు మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కాలేయం చాలా కీలకమైన అవయవం. అది ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ మనం తిన్న ఆహారంలోని పదార్థాలను చిన్న పోషకాల్లోకి మార్చుతుంది. జీర్ణప్రక్రియలో భాగంగా పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డకట్టటానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. శరీరంలోకి చేరే విషాలను విరిచేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే చిన్న దెబ్బతగిలినా తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరు కాలేయాన్ని ఇవ్వడం ద్వారా మీ అన్నయ్యకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు. డాక్టర్ పి. బాలచంద్రన్ మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు గత మూడు నెలలుగా కుడి చేతిలో తిమ్మిర్లు వస్తున్నాయి. ఎక్కువ పనిచేసినప్పుడు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈమధ్య చెయ్యి పట్టుతప్పుతోంది. తగిన పరిష్కారం చెప్పండి. - కుమారస్వామి, నందిగామ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. చేతికి వెళ్లే నరం ఒత్తుకుపోవడం వల్ల తిమ్మిర్లు వస్తాయి. థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారికి కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొంతమందిలో నరం తీవ్రంగా ఒత్తుకుపోవడం వల్ల చేతిలో స్పర్శ తెలియకపోవచ్చు. చెయ్యి బలహీనంగా కూడా మారవచ్చు. మొదటి దశలో మణికట్టుకి పట్టీ వేయడం, మందుల ద్వారా తగ్గించడం సాధ్యమవుతాయి. అయితే చేతిలో బలం తగ్గినవారికి చిన్న సర్జరీ ద్వారా జబ్బు పెరగకుండా చూడవచ్చు. కాబట్టి మీరు ఇంకా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 60 ఏళ్లు. నాకు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయి. అప్పుడప్పుడూ మంటగా కూడా ఉంటున్నాయి. కాళ్లు రెండూ బరువుగా అనిపిస్తున్నాయి. నడుస్తుంటే తూలిపోతున్నట్లుగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - రామేశ్వర్, కాకినాడ నరాలు దెబ్బతిన్నప్పుడు మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. మీ వయసులో ఉన్నవారికి షుగర్ వ్యాధి వల్లగానీ లేదా విటమిన్ బి12 లోపం వల్లగానీ ఈ లక్షణాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. మీరు ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. ఎన్సీఎస్ అనే పరీక్ష ద్వారా నరాలు ఏమేరకు దెబ్బతిన్నాయో తెలుస్తుంది. కొంతమందిలో మరీ ముఖ్యంగా శాకాహారుల్లో విటమిన్ బి 12 లోపం వల్ల తిమ్మిర్లు, మంటలు కనిపించవచ్చు. షుగర్‌ను అదుపులో పెట్టుకోవడంతో పాటు విటమిన్ బి12 ఇంజెక్షన్లతో, ఇతర మందులతో మీ వ్యాధి లక్షణాలను అదుపు చేయవచ్చు. ఇంకొంతమంది ఎస్ఏసీడీ అనే జబ్బు వల్ల సరిగా నడవలేరు. చీకట్లో కిందపడి పోయే అవకాశం ఉంది. పాదాలు భూమి మీద ఆని ఉన్నదీ లేనిదీ గుర్తించలేరు. ఇన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు దగ్గర్లోని నరాల నిపుణులను సంప్రదించండి. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
పైల్స్ తగ్గాలంటే...
గృహవైద్యం పైల్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మలవిసర్జనలో రక్తం పడడానికి మలబద్ధకం కూడా ఒక కారణమే. పైల్స్ సమస్య అనేక అనుబంధ సమస్యలకు కూడా దారితీయవచ్చు. తొలిదశలో ఉన్న వారికి తక్షణ ఉపశమనం కోసం... కాకర కాయ ఆకులను నలిపి రసం తీయాలి. మూడు టీ స్పూన్ల రసాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పండిన అరటిపండు ఒక కప్పు పాలలో వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు మూడు -నాలుగుసార్లు చేయాలి. మూడు అంజూర్పండ్లను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే వీటినే తొలి ఆహారంగా తినాలి. అలాగే పగలు కూడా నానబెట్టి... ఆ పండ్లను రాత్రి పడుకోవడానికి ముందు తినాలి. -
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా హోమియోకేర్ వైద్యం
తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణం. ‘‘పైల్స్ లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ అనవచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు తీవ్రతరం, సర్వసాధారణం అవుతున్నాయి. పైల్స్ మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి. వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్త స్రావం కలగటాన్ని పైల్స్ అంటారు. పైల్స్కి కారణాలు, వాటిని తీవ్రతరం చేసే అంశాలు దీర్ఘకాలికంగా మలబద్దకం పొత్తిడుపు ఎక్కువ కాలం వత్తిడికి గురి అనటం దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని రెండురకాలుగా విభజిస్తారు. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. దానిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు. ఫిషర్స్ మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఫిస్టులా అనగా, రెండు ఎపితికల్ కణజాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అని అంటారు. మానవ శరీరంలో ఫిస్టులా అనేది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి. ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది. దానిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి నెలకు 1, 2 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం వలన సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది. కారణాలు: ఊబకాయం గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఊక్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కాలైటిస్ జబ్బులతో బాధపడే వారిలో. నిర్ధారణ పరీక్షలు సిబిపి ఇఎస్ఆర్ ఫిస్టులోగ్రమ్ ఎమ్మారై, సీటీస్కాన్ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఇతర తీవ్రమైన వ్యాధులను, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు చిన్న సమస్యలు అని అనిపిస్తాయి కాని ఇది రోగి దినచర్యలను చాలా ప్రభావితం చేస్తాయి. చాలామంది వివిధరకాల చికిత్సలు చేయించుకొని విసిగి పోయి, చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించుకుంటారు. కాని చాలామందిలో ఈ సమస్యలు తిరగబెట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. హోమియో కేర్‌లో వైద్యం హోమియోకేర్ ఇంటర్ నేషనల్ ‘జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు సరైన పోషకాహారం తీసుకోవడం ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం మాంసాహారం తక్కువగా తినడం మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం సరి అయిన వ్యాయామం చేయడం ఊబకాయం రాకుండా చూసుకోవడం. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
పైల్స్ - హోమియో చికిత్స
పైల్స్ వున్న వారి బాధ వర్ణనాతీతం. మలవిసర్జన తర్వాత ఈ బాధ కొన్ని గంటల వరకు ఉంటుంది. నొప్పి, మంట, దురద ఉండి, సూదులతో గుచ్చుకున్నట్లు వుండి వీరు ఒకచోట కూర్చోలేరు, నిల్చోలేరు. ఈ మొలలు చిట్లడం వలన రక్తస్రావం జరుగుతుంది. చాలారోజుల వరకు రక్తస్రావం అయితే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి ఎనీమియా రావడానికి ఆస్కారం ఉంది. జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, వాహనాలు అధికంగా నడపడం, వేసవికాలం, నీరు అధికంగా తీసుకోకపోవడం వలన ఇవి వస్తాయి. మలద్వారంతో కలుపబడిన పెద్ద పేగు చివరి భాగాన్ని మలనాళం లేదా రెక్టమ్ అంటారు. ఇక్కడ ఉన్న కణజాలంలో అధికంగా ఉండే రక్తనాళాల వాపు వలన ఈ స్థితి వస్తుంది. పురీష నాళం వెలుపలి భాగంలో వస్తే బాహ్య హెమరాయిడ్స్ అని, లోపలి భాగంలో వస్తే లోపలి హెమరాయిడ్స్ అని అంటారు. ఇవి బఠాణీ గింజ లేదా ద్రాక్షపండు పరిమాణంలో గులాబీ రంగులో, మూడు లేదా నాలుగు గుత్తులుగా లేదా విడిగా కూడా ఉండే ఈ స్థితిని మూలశంక (పైల్స్) వ్యాధిగా పేర్కొంటారు. ఎవరికి వస్తుంది..? ... గర్భిణులలో, ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నవారిలో సాధారణంగా చూస్తాం. పిల్లలలో ఈ వ్యాధిని అరుదుగా చూస్తాం. కారణాలు... మలబద్దకం మూలంగా అధికంగా ముక్కుటం దీర్ఘకాలిక విరేచనాలు గర్భస్థ పిండం ఒత్తిడి వలన, అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ల వలన పొత్తికడుపు లేదా పేగులలోని క్యాన్సర్ సంబంధ కణుతుల వలన వంశపారంపర్యంగా అధిక బరువు, స్థూలకాయం హెమరాయిడ్లు, వేరికోస్ సిరల వ్యాధి ఉన్నవారిలో పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం... వంటివి. హెమరాయిడ్లు - రకములు... మొదటి తరగతి (ఫస్ట్ డిగ్రీ పైల్స్): రెక్టమ్ లేదా మలనాళం లోపలే ఉంటాయి; రెండవ తరగతి (సెకండ్ డిగ్రీ పైల్స్): పురీషనాళం తెరచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి, మలద్వారం మూసుకున్న వెంటనే లోపలికి వెళ్లిపోతాయి; మూడవ తరగతి (థర్డ్ డిగ్రీ పైల్స్): వెలుపలికి వచ్చి, హెమరాయిడ్లను లోపలికి చొప్పించిన వెంటనే లోనికి వెళ్లిపోతాయి; నాల్గవ తరగతి (ఫోర్త్ డిగ్రీ పైల్స్): మలద్వారం వెలుపల శాశ్వతంగా వేలాడుతూ ఉంటాయి. లక్షణాలు: చాలామంది ఎక్కువగా లోపలి హెమరాయిడ్ల (ఇంటర్నల్ పైల్స్)తో ఏ లక్షణాలూ లేకుండానే ఉంటారు. మలద్వారం తెరచుకున్న వెంటనే తాజా రక్తం మలద్వారం ద్వారా వెలుపలికి వస్తుంది. మలద్వారం చుట్టూ దురద ఉండవచ్చు. మూడు-నాలుగు దశలలోని హెమరాయిడ్లు, అధికంగా నొప్పి ఉండి చీము వంటి పలుచని ద్రవం విసర్జింపబడుతుంది. నివారించవచ్చా? మొలలు వచ్చిన తరువాత కంటె మొలల లక్షణాలు కనబడిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. మొలలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో మార్పు తీసుకొస్తే నివారించవచ్చు. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు, దప్పిక ఉన్నా లేకున్నా పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తీసుకోవడం, మాంసాహారం, మసాలాలు, పచ్చళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది. ఎక్కువసేపు కూర్చోకుండా, యోగా, వ్యాయామం చేయడం వలన నివారించవచ్చు. హోమియో చికిత్స వలన ప్రయోజనం ఉంటుందా? మొదటి మూడు దళలలోని హెమరాయిడ్లను పూర్తిగా నయం చేయటమేకాక, శస్త్రచికిత్స, అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా హెమరాయిడ్ వలన వచ్చే బలహీనతను తగ్గించి, శాశ్వతంగా రాకుండా చేస్తుంది. హోమియోలో ఆస్కులస్ హిప్, ఆలోస్, హెయాములస్, కొలింగ్ సోనియా, ఆర్గనిక్ ఆల్, నక్సామికా మందులు బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్ ph: 7416 107 107 -
ఆపరేషనే అంతిమ నిర్ణయం కాదు...
ఇవాల్టి రోజుల్లో ప్రతి చిన్న వ్యాధికి ఆపరేషన్ చేయించుకోవలసి వస్తోంది. ఉదాహరణకు మొలలు, సైనస్, ముక్కులో కండరం పెరగడం వంటి వాటికి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అయినా ఏం లాభం...రెండు నుంచి మూడు నెలలలోపు మరల అదే వ్యాధి వస్తూంటుంది. కాని హోమియోపతిలో అయితే, రోగి శారీరక, మానసిక స్థితులను బట్టి మందులు ఇచ్చి, ఆ వ్యాధిని సమూలంగా తొలగించడం ద్వారా మరల మరల రాకుండా చూడవచ్చు. ఫైల్స్, ఫిస్టుల్యా, పిష్షర్స్ మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మల విసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన పురీషనాళం చివర వాచిపోయిన రక్తనాళాలను ‘మొలలు’ (హెమరాయిడ్స్) అంటారు. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో మొలలు తొలిసారిగా కన్పించవచ్చు. వ్యాధి లక్షణాలు: మలద్వారం చుట్టూ దురద మలవిసర్జన సమయంలో నొప్పి మలద్వారం చుట్టూ వాచిపోవడం, ఉబ్బుగా కనిపించడం మల విసర్జన సమయం లో లేదా మల విసర్జన అనంతరం రక్తస్రావం మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం. పాజిటివ్ హోమియోపతి మందులు మలబద్దకాన్ని చాలావరకు నివారిస్తాయి. మందులతో పాటు ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా అనుసరిస్తే, మలబద్దకం, దాని నుంచి వచ్చే తీవ్రతలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. PCOD ఈ సమస్య యుక్తవయస్సులో ఉండే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. PCOD అనగా అండాశయాలలో నీటి బుడగలు ఏర్పడి అవి ఈస్ట్ లాగా డెవలప్ అవుతాయి. దీనివల్ల నెలసరి రాకపోవడం, అండం విడుదల జరుగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య ఎక్కువగా 20-30 సం. వయస్సుగల వారిలో కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు: నెలసరి రాకపోవడం బరువు పెరగడం సంతానం కలగకపోవడం అవాంఛిత రోమాలు ఆమినోరియా జుట్టు రాలడం చర్మం మందంగా మారడం కారణాలు: ఇది ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత వలన మానసిక ఒత్తిడి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఆడవారిలో ముఖ్యంగా నెలసరి, అండం విడుదల జరగాలంటే FSH, LH హార్లోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. FSH హార్మోన్ కన్నా LH హార్లోన్ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిబుడగలు ఏర్పడి అవి కణితిలా మారి అండం విడుదల కాదు. నెలసరి అసలు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి అంటే ఎక్కువగా ఆలోచించి ఎక్కువ బాధపడడం వంటి కారణాలు మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు PCOD ఉన్నవారిలో తొందరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాన్సిల్స్ మన చుట్టూ ఉన్న వాతావరణంలో సహజంగా ఉండే వ్యాధికారక సూక్ష్మక్రిములు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినా, మనం తీసుకునే నీటిద్వారా కాని, ఆహారం ద్వారా కాని ఇవి లోపల చేరి ఇన్ఫెక్షన్స్ని కలుగచేసి కొన్నిరకాల విషపదార్థాలతో చీముని కలుగుజేస్తాయి. అందువల్ల టాన్సిల్స్ వ్యాధి వస్తుంది. టాన్సిల్స్ అనేవి గొంతులో నాలుక వెనుక భాగానికి సమీపంగా రెండువైపులా ఉండే చిన్న బంతుల వంటి నిర్మాణాలు. ఆరోగ్యవంతమైన టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. వ్యాధి లక్షణాలు: గొంతునొప్పి దగ్గు ఆహారం మింగినప్పుడు గొంతులో నొప్పి లేక కష్టంగా ఉండడం మెడ భాగంలో బిళ్ళలు కట్టడం తరచూ జ్వరం రావడం తోటిపిల్లలతో పోలిస్తే నీరసంగా కనిపించడం పెరుగుదల లోపించుట. టాన్సిల్స్ వ్యాధి ఉన్నప్పుడు సరైన వైద్యం చేయకుండా చాలాకాలం నిర్లక్ష్యం చేసినట్లయితే టాన్సిల్స్ లోపల, చుట్టుపక్కల, గొంతులోని ఇతరభాగాలకు చీము చేరుతుంది. మధ్యచెవికి, ముక్కు దగ్గర ఉండే గాలి గదుల్లోకి చేరితే సైనసైటిస్, ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. సైనసైటిస్ సైనస్లో ఇన్ఫెక్షన్ చేరి అక్కడ కఫం, చీము తయారై నిలువ ఉన్నప్పుడు దానిని సైనసైటిస్ అంటారు. ఇది నాసల్ ఎలర్జీ, పాలిప్స్ వంటి వాటివల్ల అధికంగా మ్యూకస్ స్రవించడం వల్ల లేదా రంధ్రం మూసుకుపోవడం వల్ల, లేదా పిప్పిపన్ను ఇన్ఫెక్షన్, సైనస్‌లోకి చేరినా వస్తుంది. టాన్సిల్స్ వ్యాధి, ఎడినాయిడ్స్ వ్యాధి, ముక్కులోపల ఉండే గోడ పక్కకు వంగిన సైనసైటిస్ వస్తుంది. వ్యాధి లక్షణాలు తరచుగా జలుబు ఉండడం ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం ముక్కు, గొంతులోకి కఫం, చీముతో కూడిన కఫం రావడం కొందరికి చెడువాసన వస్తుంది తలనొప్పి నుదుట భాగంలో, కళ్లకింద, కనుబొమ్మల మధ్య, తలకు ఇరుపక్కల, తల వెనుక భాగంలో వస్తుంది. సైనస్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ సైనస్ నుండి ఇతర భాగాలకు వ్యాపించి, గొంతు, శ్వాసనాళాలకు వచ్చి, ఫారింజైటిన్, టాన్సిలైటిన్, బ్రాంకైటిస్ మొదలైన వ్యాధులు రావచ్చు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించిన ఎడల ఎటువంటి ఆపరేషన్ లేకుండా పాజిటివ్ హోమియోపతి మందుల ద్వారా చాలా వరకు నివారించే అవకాశం ఉంది. పొట్ట ఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, అరుగుదల లేకపోవడం, ఉదర భాగం కుడివైపు నొప్పి పొట్ట ఉబ్బరంగా ఉండడం ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకున్నప్పుడు ఇది పిత్తాశయంలో రాళ్ళ వల్ల అని భావించవచ్చు. గాల్స్టోన్కు చికిత్స తీసుకోని యెడల అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. పాజిటివ్ హోమియోపతి మందులు వాడుట వలన వేగవంతమైన, మంచి ఫలితాలు సాధించవచ్చును. వ్యాధి లక్షణాలు: కొంతమందిలో గాల్‌స్టోన్ వలన వికారంగా అనిపించడం, కుడి ఉదర భాగంలో తీవ్రంగా నొప్పి అన్పించడం వంటి లక్షణాలు కన్పించడం జరుగుతుంది ఇటువంటి లక్షణాలు స్టోన్స్ పిత్తాశయం నుంచి జారి పేగులకు కలిసే మార్గంలో అడ్డుపడినప్పుడు కన్పిస్తాయి నొప్పి ఆకస్మికంగా మొదలై 3గంటల వరకు ఉండవచ్చును. నొప్పితో పాటు జ్వరం, అరుగుదల లేకపోవడం, చర్మం, కన్ను యొక్క తెలుపుభాగం పసుపురంగులో మారడం జరుగుతుంది. డయాబెటిస్, అతిబరువు, తక్కువ కెలోరీల ఆహారం, రక్తంలో కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం. ప్రెగ్నెన్సీ, గర్భనిరోధక మాత్రలు, ఓల్డేజ్... కొద్దిమందిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చును. పాజిటివ్ హోమియోపతి వైద్యవిధానంలో ఇటువంటి వ్యాధులు ముఖ్యంగా ముక్కులో కండరం పెరగటం, సైనస్, ముక్కులో కాయలు రావడం వంటి ఇతర కాంప్లికేషన్స్‌కు దారి తీయకుండా చూస్తాయి. వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వ్యాధులు మారుతూ వస్తాయి. ఈ తత్వాన్ని బట్టి మందులు తీసుకుంటే, ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922