ఆపరేషన్‌ లేకుండా పైల్స్‌ తగ్గుతాయా?  | Remedies To Piles Disease | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ లేకుండా పైల్స్‌ తగ్గుతాయా? 

Published Thu, Jun 20 2019 8:04 AM | Last Updated on Thu, Jun 20 2019 8:04 AM

Remedies To Piles Disease - Sakshi

నా వయసు 60 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్‌ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? 
– ఎమ్‌డి. మౌలానా, వరంగల్‌ 

పైల్స్‌ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైననొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్‌). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని  బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్‌ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. 

రకాలు: ఇందులో ఇంటర్నల్‌ పైల్స్, ఎక్స్‌టర్నల్‌ పైల్స్‌ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్‌ పైల్స్‌ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్‌టర్నల్‌ పైల్స్‌ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. 

కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్‌ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ∙ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం ∙మద్యం, హెపటైటిస్‌ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. 

చికిత్స: హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చికిత్స చేయవచ్చు. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులను వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement