తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు.
ఈ సమస్యలకు కారణం. ‘‘పైల్స్ లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ అనవచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు తీవ్రతరం, సర్వసాధారణం అవుతున్నాయి.
పైల్స్
మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి. వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్త స్రావం కలగటాన్ని పైల్స్ అంటారు.
పైల్స్‌కి కారణాలు, వాటిని తీవ్రతరం చేసే అంశాలు
దీర్ఘకాలికంగా మలబద్దకం
పొత్తిడుపు ఎక్కువ కాలం వత్తిడికి గురి అనటం
దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం
గర్భధారణ సమయంలో
కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.
పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని రెండురకాలుగా విభజిస్తారు.
ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు.
ఎక్స్‌టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు.
దానిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు.
ఫిషర్స్
మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది.
కారణాలు:
దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.
గర్భధారణ సమయంలో కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.
క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది.
ఫిస్టులా
అనగా, రెండు ఎపితికల్ కణజాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అని అంటారు. మానవ శరీరంలో ఫిస్టులా అనేది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి.
ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది.
దానిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి నెలకు 1, 2 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం వలన సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది.
కారణాలు:
ఊబకాయం
గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఊక్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కాలైటిస్ జబ్బులతో బాధపడే వారిలో.
నిర్ధారణ పరీక్షలు
సిబిపి
ఇఎస్‌ఆర్
ఫిస్టులోగ్రమ్
ఎమ్మారై, సీటీస్కాన్
మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఇతర తీవ్రమైన వ్యాధులను, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు చిన్న సమస్యలు అని అనిపిస్తాయి కాని ఇది రోగి దినచర్యలను చాలా ప్రభావితం చేస్తాయి. చాలామంది వివిధరకాల చికిత్సలు చేయించుకొని విసిగి పోయి, చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించుకుంటారు. కాని చాలామందిలో ఈ సమస్యలు తిరగబెట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.
హోమియో కేర్‌లో వైద్యం
హోమియోకేర్ ఇంటర్ నేషనల్ ‘జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వైద్యం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు
సరైన పోషకాహారం తీసుకోవడం
ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం మాంసాహారం తక్కువగా తినడం
మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం
సరి అయిన వ్యాయామం చేయడం
ఊబకాయం రాకుండా చూసుకోవడం.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99
టోల్ ఫ్రీ: 1800 102 2202
బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా హోమియోకేర్ వైద్యం
Published Sat, Jan 11 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement