Dr. Srikanth
-
ఎదలో విషపుగడ్డ!
బ్రెస్ట్ క్యాన్సర్ - జాగ్రత్తలు ప్రతి మహిళా జీవితంలో యుక్తవయసులోకి ప్రవేశించాక ఏదో ఒక దశలో రొమ్ముక్యాన్సర్ గురించి ఆందోళన పడుతుంది. రొమ్ముక్యాన్సర్ కుటుంబాన్ని తీవ్రమైన ఉద్వేగభరితమైన ఒత్తిడికి గురిచేసే అంశం. కానీ అతి త్వరగా కనుక్కుంటే నేడది పూర్తిగా తగ్గే క్యాన్సర్. పైగా రొమ్ము కోల్పోకుండానే ఇంతకు మునుపులాగే ఉండేలా చూడగలరు డాక్టర్లు. వ్యాధి ఆనవాళ్లు కూడా లేకుండా తగ్గించగల క్యాన్సర్ ఇది. అయినా ఆ వ్యాధిపై అనేక అపోహలు. వాటిని దూరం చేసుకొని, రొమ్ము క్యాన్సరపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. లక్షణాలు రొమ్ముకు సంబంధించినవి : రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ముపై అల్సర్స్ రావడం. నిపుల్లో : రొమ్ముపై ర్యాష్ లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం రక్తం వంటి స్రావాలు రావడం. బాహుమూలాల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలియడం భుజం వాపు కనిపించడం. నిర్ధారణ పరీక్షలు : ఎఫ్ఎన్ఏసీ అనే పరీక్ష మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ఛాతీ ఎక్స్‌రే కడుపు స్కానింగ్ ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు). నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో మార్చలేని అంశాలు : వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో బాంధవ్యంలో దగ్గరితనం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ (మోడల్స్) అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. ఒక మహిళకు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉందని తేలితే... దాన్నిబట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. అవి... పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలు ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యాయామం : మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకుని, అలా వారంలో కనీసం ఐదు రోజులైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో నివారించవచ్చు శస్త్రచికిత్సతో నివారణ : బీఆర్సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు. స్వయం పరీక్ష : రొమ్ముక్యాన్సర్‌ను ఎవరికి వారే స్వయంగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మహిళలు తమ రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకుంటూ రొమ్ములో ఏవైనా గడ్డలు చేతికి తగులుతున్నాయా, రొమ్ము ఆకృతిలో తేడా ఉందా, రొమ్ము నిపుల్ నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా, నిపుల్ లోపలికి ముడుచుకుపోయి ఉందా, నిపుల్ మీద ర్యాష్ లేదా వ్రణాలు ఏవైనా ఉన్నాయా అని ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు. కాబట్టి ముందే కనుగొంటే ప్రాణాలనూ, దాంతో పాటే రొమ్మును పూర్తిగా కాపాడుకునేందుకు అవకాశం ఉన్న వ్యాధి ఇది. చికిత్స : రొమ్ముక్యాన్సర్‌కు ఈ రోజుల్లో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన సొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాధి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్క్రీనింగ్ సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు 50 - 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రతి మూడేళ్ల కోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5 శాతం మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యూటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. - డాక్టర్ శ్రీకాంత్,సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
హృద్రోగ సమస్యలు... హోమియో చికిత్స
గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు హోమియోలో మంచి పరిష్కారాలున్నాయి. కాన్స్టిట్యూషన్ పద్ధతిలో లక్షణాల ఆధారంగా ఇచ్చే ఈ మందులతో గుండెకు సంబంధించిన ఎన్నో రకాల జబ్బులను సమర్థంగా నయం చేయవచ్చు. గుండె సమస్యలకు వాడే హోమియో మందులలో కొన్ని... డిజిటాలిస్ : గుండెకు సంబంధించిన వ్యాధులకు డిజిటాలిస్ చాలా ప్రధానమైనది. రోగికి నాడి నెమ్మదిగా కొట్టుకోవడం, గుండె బలహీనంగా ఉండటం, ఒత్తిడి వల్ల వేగం పెరగడం, నాడీకంపన క్రమం తప్పడం, ఆగి ఆగి నెమ్మదిగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీరికి చిన్నపాటి కదలికలకు కూడా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా రోగికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలు. గుండె గోడ కండరం బలహీనపడి ఉబ్బడం, చర్మం చల్లబడటం, నీలివర్ణంలోకి మారడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం... కొందరిలో కామెర్లు, కాలేయం వాపు వంటి వాటికి కూడా డిజిటాలిస్ చక్కగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, మూత్రంలో ఆల్బుమిన్ పోవడం, కాళ్లు వాపు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఇక బృహద్ధమని (అయోర్టా) ఉబ్బడం, గుండెనొప్పి, గుండెవాపు, కొవ్వు చేరి గుండె కణజాలం క్షీణత, హృదయ స్పందనల వేగం తక్కువగా ఉండటం వంటి వివిధ రకాల గుండె సమస్యలకు ఇది వాడదగ్గ ఔషధం. కాక్టస్ : హృదయ సంబంధిత హోమియో ఔషధాలతో తదుపరి ముఖ్యమైన ఔషధం కాక్టస్ అని చెప్పవచ్చు. కాక్టస్ రోగుల్లో గుండెను ఇనుముతో గట్టిగా కట్టినట్లుగా అనిపించడం, గుండె సాధారణ కదలికలు స్తంభించినట్లుగా / అదిమివేసినట్లుగా అనిపించడం ఈ ఔషధం ముఖ్య లక్షణం. గుండెను బంధించినట్లుగా, ఛాతీపై బరువు పెట్టిన భావనకు వీళ్లు గురవుతారు. గుండెనొప్పి, ముళ్లతో గుచ్చినట్లుగా, మెలిదిప్పినట్లుగా ఉండటం... ఈ నొప్పి ఎడమచేతి వరకు పాకడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఔషధం ఉపయోగకరం. విపరీతమైన గుండెదడ, పడుకున్నప్పుడు ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించడం, ఎడమచేతిలో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని ఎలెవనో క్లాక్ రెమిడీ అని కూడా అంటారు. అనగా ఉదయం 11 గంటలు లేదా రాత్రి 11 గంటలకు గాని వ్యాధి లక్షణాలు అధికం కావడం ఈ ఔషధం ప్రత్యేకత. కాల్మియా లాటిఫోలియా : కాల్మియా ముఖ్యంగా నరాలు, గుండె, రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ‘రుమాటిక్ గుండెజబ్బు’ అంటే కీళ్లవాతం వల్ల కలిగే గుండెజబ్బులకు వాడదగిన మందు. విపరీతమైన గుండెదడ, కీళ్లవాతం కారణంగా గుండె కణాలు, గుండె కవాటం మందంగా మారడం, ఆందోళన కలగడం, గుండె స్పందనలు సంకోచవ్యాకోచాలు త్వరితగతిన సంభవిస్తూ ఉండటంతోపాటు మంటతో కూడిన గుండెనొప్పి, ఈ నొప్పి వెనక్కి లేదా చేతికి పాకుతున్నట్లుగా అనిపించడం ప్రధాన లక్షణాలు. గౌట్, కీళ్లవాతం గుండెకు పాకినప్పుడూ, ఎక్కువగా పొగాకు వాడేవారిలో వచ్చే ‘టొబాకో హార్ట్’ వ్యాధికి కూడా ఇది ఉపయోగకరం. అకోనైట్ : ఆందోళన, చనిపోతానేమోనన్న భయం ఈ ఔషధం ముఖ్యలక్షణం. హృదయ స్పందన వేగంగా ఉండటం, ఎడమభుజంలో నొప్పి, ఛాతీలో నొప్పి, గుండెదడ, చేతివేళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇది వాడదగ్గ ఔషధం. రక్తపోటు అధికంగా ఉండి, ఎడమచేతిలో సూదులు గుచ్చినట్లుగా ఉండటం, హఠాత్తుగా వచ్చే గుండెనొప్పికి అకోనైట్ బాగా పనిచేస్తుంది. బృహద్ధమని వాపు, గుండె గోడ కండరం వాపునకూ అకోనైట్ ఉపయోగకరం. నాజా ట్రిపుడియన్స్ : నొప్పి మెడ వెనక భాగంలోకి పాకి, అక్కడి నుంచి ఎడమభుజం, చేతికి వ్యాపించడం, సూదులతో గుచ్చినట్లుగా విపరీతమైన గుండెనొప్పి, నాడి కంపన క్రమం తప్పడం, ఛాతీపైన అదిమినట్లుగా, బరువు పెట్టినట్లుగా అనిపించడం, ఆందోళన, భయంతో పాటు శారీరక శ్రమ పెరిగినప్పుడు గుండెదడ అధికమవ్వడం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. గుండె కణజాల పరిమాణం పెరగడం, కీళ్లవాతం వల్ల వచ్చే హృదయకండరాల వాపు, కంఠవాతం వల్ల వచ్చే పొడిదగ్గు ఉన్నవారికి నాజా చక్కగా పనిచేస్తుంది. లిలియం టిగ్రినం : గుండెనొప్పి, గుండెదడ, వణుకు, తొందరపాటు, ఆవేదన వంటి లక్షణాలు కలిగి ఉండటం, ఛాతీ ఎడమవైపుగా విపరీతమైన నొప్పి కలగడం, ఛాతీ బరువెక్కడం, నొప్పి ఒక అవయవం నుంచి మరొక అవయవానికి పాకడం, నాడీ కంపన వేగం పెరగడం వంటి లక్షణాలు ఉన్నవారికి ‘లిలియం’ ఉపయోగకరం. లిథియం కార్బ్ : దీర్ఘకాలికమైన కీళ్లవాతంతో పాటు హృద్రోగ సమస్యలు, కంటిసమస్యలు ఉన్నవారికి వాడదగిన ఔషధం. చిన్న కీళ్లలో తరచుగా వచ్చే వాపు, గుండెనొప్పి బాదినట్లుగా, సూదులతో గుచ్చినట్లుగా ఉండి, నొప్పి వెనకకు వ్యాపించడం, ముందుకు ఒంగినప్పుడు లేదా మూత్ర విసర్జనకు వెళ్లే ముందు నొప్పి అధికం కావడం, మూత్ర విసర్జన తర్వాత ఉపశమనం... ఈ ఔషధ లక్షణాలు. బెరైటా మూర్ : ఇది ముఖ్యంగా ధమనులు గట్టిపడినప్పుడు, హృదయ సంకోచ ఒత్తిడి (సిస్టోలిక్ ప్రెషర్) పెరిగినప్పుడు, హృదయ వ్యాకోచ ఒత్తిడి (డయాస్టోలిక్ ప్రెషర్) తక్కువ అయినప్పుడు వాడదగిన దివ్యౌషధం. పైన పేర్కొన్న మందులు రోగుల అవగాహన కోసం మాత్రమే. వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో, సరైన మోతాదులో మాత్రమే వాడాలి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
మెనోపాజ్ జబ్బు కాదు... ఒక దశ మాత్రమే!
డాక్టర్ సలహా నా వయసు 45 సంవత్సరాలు. ఇటీవల మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు వచ్చే బాధలు భరించలేకపోతున్నాను. దీనికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకోవడం పరిష్కారం అని మా స్నేహితురాలు చెప్పింది. ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోలో హార్మోన్ రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంటుందా? తెలియచేయగలరు. - ఎమ్. సుమలత, రేపల్లె హెచ్ఆర్టి (హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ)... ఇటీవల చాలామంది మహిళలు ఈ చికిత్స వైపు మొగ్గుచూపుతున్నారు. రుతుక్రమం నిలిచిపోయే దశ (మెనోపాజ్)లో హార్మోన్ల విడుదల స్థాయుల్లో గణనీయమైన మార్పు వస్తుంది. అండాశయం నుంచి అండాలు వెలువడకపోవడం, హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. ఈ మార్పుల సమయంలో దేహం కొన్ని ఒడుదొడుకులకు లోనవుతుంది. ఈ బాధలను తప్పించుకోవడానికి హెచ్ఆర్టి వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఈ చికిత్సలో తక్కువ మోతాదులో హార్మోన్లను ఇస్తుంటారు. రుతుక్రమం ఆగిపోయిన వారికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఇవ్వడం వలన రొమ్ము క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మెనోపాజ్ అనేది జబ్బు కాదు. స్త్రీల జీవితంలో ఇది ఒక దశ. ఈ సమయంలో ఎదురయ్యే సమస్యలకు హోమియోవైద్యంలో చక్కటి పరిష్కారం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ చికిత్స చేయడం ద్వారా మెనోపాజ్ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్, హోమియో వైద్యులు -
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా హోమియోకేర్ వైద్యం
తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణం. ‘‘పైల్స్ లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ అనవచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు తీవ్రతరం, సర్వసాధారణం అవుతున్నాయి. పైల్స్ మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి. వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్త స్రావం కలగటాన్ని పైల్స్ అంటారు. పైల్స్కి కారణాలు, వాటిని తీవ్రతరం చేసే అంశాలు దీర్ఘకాలికంగా మలబద్దకం పొత్తిడుపు ఎక్కువ కాలం వత్తిడికి గురి అనటం దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని రెండురకాలుగా విభజిస్తారు. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. దానిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు. ఫిషర్స్ మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఫిస్టులా అనగా, రెండు ఎపితికల్ కణజాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అని అంటారు. మానవ శరీరంలో ఫిస్టులా అనేది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి. ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది. దానిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి నెలకు 1, 2 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం వలన సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది. కారణాలు: ఊబకాయం గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఊక్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కాలైటిస్ జబ్బులతో బాధపడే వారిలో. నిర్ధారణ పరీక్షలు సిబిపి ఇఎస్ఆర్ ఫిస్టులోగ్రమ్ ఎమ్మారై, సీటీస్కాన్ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఇతర తీవ్రమైన వ్యాధులను, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు చిన్న సమస్యలు అని అనిపిస్తాయి కాని ఇది రోగి దినచర్యలను చాలా ప్రభావితం చేస్తాయి. చాలామంది వివిధరకాల చికిత్సలు చేయించుకొని విసిగి పోయి, చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించుకుంటారు. కాని చాలామందిలో ఈ సమస్యలు తిరగబెట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. హోమియో కేర్‌లో వైద్యం హోమియోకేర్ ఇంటర్ నేషనల్ ‘జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు సరైన పోషకాహారం తీసుకోవడం ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం మాంసాహారం తక్కువగా తినడం మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం సరి అయిన వ్యాయామం చేయడం ఊబకాయం రాకుండా చూసుకోవడం. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
సిస్టిమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్ (SLE)
SLE వలన శరీరంలోని అనేక అవయవాలు వ్యాధికి గురి అవుతాయి. ఇది గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం, రక్తనాళాలు, నాడీవ్యవస్థను పీడిస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్తకణాలు మన సొంత కణాలపై దాడి చేయడం వలన వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇది 15 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జబ్బు యొక్క దిశను ఊహించటం కష్టం. ఇది కొద్దిరోజులు తీవ్రంగానూ (Flare up), కొద్ది రోజులు వ్యాధి లక్షణాలు తక్కువ అవటం జరుగుతుంది. (Remissions) లక్షణాలు ఈ వ్యాధికి గురయ్యే అవయవాన్ని బట్టి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. చర్మము: ముఖచర్మంపై దద్దుర్లు రావటం, చెంప మరియు ముక్కు పైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు రావటం చూస్తాము. దీనినే butterfly Rash అంటాము. డిస్కాయిడ్ లూపస్ (Discoid lupus) : ఈ రకం SLE లో చర్మం ఎర్రబడటం, పొలుసులు రాలటం, చర్మంలోని లో పొరలలో నుంచి దళసరి పగుళ్ళు, రక్తస్రావంతో కూడిన పొలుసులు రాలటం, చర్మంపై నల్లటి మచ్చలు అవటం వంటివి జరుగుతాయి. మూత్రపిండాలు: ఎక్కువ శాతం SLE రోగులలో మూత్రపిండాలు ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుంది. దీనినే Lupus Nephritis అంటారు. మూత్రంలో రక్తకణాలు, ప్రొటీన్లు కోల్పోతాయి. శరీరమంతా వాపులు వస్తాయి, బరువు పెరుగుతుంది. SLE దీర్ఘకాలంలో మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక్కోసారి Dialysis గానీ మూత్రపిండ మార్పిడి గానీ చేయవలసిన అవసరం ఉండవచ్చు. అందువలన వ్యాధి తీవ్రమయ్యే కంటే ముందుజాగ్రత్త పడటం మంచిది. గుండె: SLE రోగులలో గుండెకు సంబంధించిన సమస్యలతో మరణించే వారి సంఖ్య అధికం. ముఖ్యంగా పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ మరియు ఎండోకార్డైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివలన ఆయాసం, జ్వరము, నీరసం మొదలగు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. SLE వలన గుండెలోని రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు వేగంగా, అధికంగా పేరుకుపోవడం వలన గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావటం. SLE సాధారణంగా అనేక కీళ్ళను, ముఖ్యంగా చిన్న కీళ్ళను ప్రభావితం చేస్తాయి. రక్తహీనత, తెల్లరక్తకణాలు తగ్గటం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గటం జరుగుతుంది. దీనివల్ల తరచు ఇన్ఫెక్షన్లకు గురికావటం, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులలో నిమ్ము చేరటం. దీర్ఘకాలంలో SLE వలస Diffuse Interstitial Lung Disease బారినపడే అవకాశం ఉంటుంది. నాడీవ్యవస్థ SLE వ్యాధి బారినపడితే మానసిక అశాంతి, పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి మొదలగు లక్షణాలు వస్తాయి. గర్భిణీలలో SLE వలన పిండ మరణం, గర్భస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. వ్యాధి నిర్థారణ పరీక్షలు CBP, ESR, CUE, రుమటాయిడ్ ఫ్యాక్టర్ C రియాక్టర్ ప్రొటీన్ (C-RP) యాంటీ న్యూక్లియర్ యాంటీ బాడీ (ANA) యాంటీ SM యాంటీ బాడీస్ (Anti SM- - Antibodies) యాంటీ ds DNA, ఇతర పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును. సాధారణంగా ఈ వ్యాధికి అనేక చికిత్స పద్ధతులు ఉన్నప్పటికీ ఏ పద్ధతిలోనూ సంపూర్ణంగా నయం చేసే అవకాశం లేదు. కేవలం హోమియోపతి వైద్యవిధానంలో మాత్రమే మందుల వల్ల ఎటువంటి అసౌకర్యం, దుష్ఫలితాలు లేని చికిత్స చేయవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం, అధునాతనమైన నిపుణులచే SLE ని అదుపులో ఉంచడమే కాకుండా ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. కారణాలు శాస్త్రీయపరంగా SLE వ్యాధికి గల కారణాలు మనకు అందుబాటులో లేవు. కానీ, జన్యుపరమైన, పర్యావరణ కారణాలు మరియు మానసిక ఒత్తిడి వలన ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.