Homeopathic Care
-
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా హోమియోకేర్ వైద్యం
తీవ్రమైన నొప్పి, ఎవరికి చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావటం లేదా మలబద్దకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణం. ‘‘పైల్స్ లేదా ఫిషర్స్ లేదా ఫిస్టులా’’ అనవచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఈ సమస్యలు తీవ్రతరం, సర్వసాధారణం అవుతున్నాయి. పైల్స్ మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి. వాపునకు గురి అయి, తీవ్రమైన నొప్పి, రక్త స్రావం కలగటాన్ని పైల్స్ అంటారు. పైల్స్కి కారణాలు, వాటిని తీవ్రతరం చేసే అంశాలు దీర్ఘకాలికంగా మలబద్దకం పొత్తిడుపు ఎక్కువ కాలం వత్తిడికి గురి అనటం దీర్ఘకాలికంగా దగ్గు ఉండటం గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. పైన తెలిపిన కారణాల వలన మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని రెండురకాలుగా విభజిస్తారు. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. దానిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు. ఫిషర్స్ మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఫిషర్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఫిస్టులా అనగా, రెండు ఎపితికల్ కణజాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అని అంటారు. మానవ శరీరంలో ఫిస్టులా అనేది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడే ఫిస్టులాలో ఆనల్ ఫిస్టులా ఒకటి. ఇది ఎక్కువ ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రెండు పిరుదుల మధ్యప్రాంతంలో మలద్వారానికి పక్కన ఏర్పడుతుంది. చర్మం పైన చిన్న మొటిమలాగ ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు మూడు రోజులలో పగిలి చీము కారుతుంది. దానిమూలంగా తీవ్రమైన నొప్పి, చీము, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని తీవ్రతను బట్టి వారానికి నెలకు 1, 2 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడం వలన సాధారణ జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఫిస్టులా ఒక్కొక్కసారి మలద్వారంలోకి తెరచుకోవడం వలన ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ అనో అంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది. కారణాలు: ఊబకాయం గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో, తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో ఊక్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కాలైటిస్ జబ్బులతో బాధపడే వారిలో. నిర్ధారణ పరీక్షలు సిబిపి ఇఎస్ఆర్ ఫిస్టులోగ్రమ్ ఎమ్మారై, సీటీస్కాన్ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా ఇతర తీవ్రమైన వ్యాధులను, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు చిన్న సమస్యలు అని అనిపిస్తాయి కాని ఇది రోగి దినచర్యలను చాలా ప్రభావితం చేస్తాయి. చాలామంది వివిధరకాల చికిత్సలు చేయించుకొని విసిగి పోయి, చివరి ప్రయత్నంగా ఆపరేషన్ చేయించుకుంటారు. కాని చాలామందిలో ఈ సమస్యలు తిరగబెట్టడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. హోమియో కేర్‌లో వైద్యం హోమియోకేర్ ఇంటర్ నేషనల్ ‘జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్దకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు సరైన పోషకాహారం తీసుకోవడం ఆహారంలో పీచు (ఫైబర్) పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం మాంసాహారం తక్కువగా తినడం మలవిసర్జన ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవడం సరి అయిన వ్యాయామం చేయడం ఊబకాయం రాకుండా చూసుకోవడం. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
ఆస్టియో ఆర్థరైటిస్
కీళ్లు బలహీనపడటం, అరుగుదల కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే మృదువైన కుషన్‌లాంటి పదార్థం దెబ్బతినడం వల్ల కీళ్ల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గడంతో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోతాయి. దాంతో నొప్పి, స్టిఫ్నెస్ వస్తుంది. ఈ కండిషన్‌కు వయసు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే బరువు ఎక్కువగా మోసేవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణాలు : అధిక బరువు /స్థూలకాయం కీళ్లపై బలమైన దెబ్బ తగలడం (ట్రామా) కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో (వృత్తిపరంగా) కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి) రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం కొన్నిరకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదా: కార్టికోస్టెరాయిడ్స్). లక్షణాలు : నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉండటం, కదలికలతో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది స్టిఫ్నెస్ : కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం. ఫలితంగా కీళ్లలో కదలికలు తగ్గుతుంది కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి శబ్దాలు వినిపిస్తాయి. వాపు : కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరీక్షలు : కీళ్లకు సంబంధించిన ఎక్స్-రేతో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. జాగ్రత్తలు / నివారణ : బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం) క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పాల ఉత్పాదనలకు సంబంధించిన పదార్థాలను తీసుకోవడం విటమిన్-డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం తగినంత వ్యాయామం చేయడం. చికిత్స : ఈ వ్యాధికి రోగి, అతడి మానసిక / శారీరక లక్షణాల ఆధారంగా కాన్స్టిట్యూషన్ పద్ధతిలో హోమియో మందులు ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ -
హార్మోన్ సమస్యలు- హోమియో చికిత్స
ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోన్లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైన హార్మోన్ సమస్యల గురించి చర్చించుకుందాం. హార్మోన్లు పాలీపెస్టైడ్తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుండి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడుతాయి. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతాయి. ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, వీటి ప్రభావం వలన శరీరంలోని వివిధ సాధారణ జీవనక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత, జీవక్రియలకు తోడ్పడతాయి. మానవుడిలో ఈ హార్మోన్లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు. వివిధ హార్మోన్లు-వాటి అసమతుల్యతల వలన వచ్చే జబ్బులు థైరాయిడ్ హార్మోన్లు (T3, T4) ఇవి థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతాయి. కానీ, వీటి ప్రభావం 90 శాతం మానవుడి జీవనక్రియలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వలన హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్, గాయిటర్ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. హైపోథైరాయిడ్ లక్షణాలు: బరువు పెరగడం, జుట్టు రాలడం, నీరసం, మతిమరుపు, ఋతుచక్ర సమస్యలు మొదలైన వాటికి దారితీస్తుంది. హైపర్‌థైరాయిడ్ లక్షణాలు: బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం మొదలైన సమస్యలకు దారి తీస్తుంది. గాయిటర్: గొంతుకింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవటాన్ని గాయిటర్ అంటాము. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు. హోమియోకేర్ వైద్యం ప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం, అధిక ఒత్తిడికి గురికావడం వలన ఎక్కువ శాతం థైరాయిడ్ బారిన పడటం గమనించాము. థైరాయిడ్ సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా, ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి వ్యక్తిత్వానికి అనుగుణంగా సరి అయిన హోమియో వైద్యం చేయడం ద్వారా థైరాయిడ్, హార్మోన్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు. స్త్రీలలో ఉండే హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటాసిన్ హార్మోన్లు స్త్రీలలో రజస్వల, ఋతుచ్రకం, ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary Sexual Characters) సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు (Menstrual Disorders, PCOD) హిర్సుటిజం (అవాంఛిత రోమాలు) మరియు సంతానలేమి సమస్యలు వస్తాయి. స్త్రీలలో మెనోపాజ్, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వలన Hot Flushes, మానసికఅశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి. టెస్టోస్టిరాన్: ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యతల వలన శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయి. హోమియోకేర్ వైద్యం హార్మోన్ సమస్యలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటికి హోమియో కేర్ వైద్యంతో ఎలాంటి హార్మోన్లు బయటినుండి ఇవ్వకుండా హార్మోన్ అసమతుల్యతలను సరిచేయడం వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఋతుచక్ర సమస్యలు, పీసీఓడీ సమస్యలు, సంతానలేమి, శుక్రకణ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చును. డయాబెటిస్ ఇన్సెపిడిస్: ఇది ADH (యాంటీ డైయూరెటిక్ హార్మోన్) లోపం వలన వస్తుంది. దీనిని అతి మూత్ర వ్యాధి అంటారు. డయాబెటిస్ మెల్లిటస్: ఇది క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ లోపం వలన లేదా తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వలన వస్తుంది. ఇది రెండు రకాలు. టైప్-1 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం వలన వస్తుంది. దీనిని జువైనల్ డయాబెటిస్ మెల్లిటస్ అని అంటారు. ఈ వ్యాధి ఉన్న వారు పూర్తిగా ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడవలసి వస్తుంది. టైప్-2 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వలన వస్తుంది. ఇది ఎక్కువగా 30 సంవత్సరాలు పైబడిన వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ఈమధ్యకాలంలో యుక్త వయస్సులో ఉన్న వారికి కూడా వస్తోంది. డయాబెటిస్తో బాధపడే వారి రక్తంలోని చక్కెర శాతాన్ని సరిగ్గా నియంత్రణ చేయకపోవటం వలన దీర్ఘ కాలంలో డయాబెటిస్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి, గుండె సమస్యలు, అంగస్తంభన సమస్యలు లాంటి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటిస్‌కి హోమియోకేర్‌లో పరిష్కారం డయాబెటిస్‌ను తొందరగా గుర్తించి, తొలిదశలో హోమియోకేర్ ప్రత్యేక ‘హార్మోన్ సెల్ మరియు కాన్స్టిట్యూషనల్’ విధానం ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంది. హోమియోపతి చికిత్స ద్వారా దీర్ఘకాలికంగా డయాబెటిస్తో బాధపడే వారికి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని అదుపులో ఉంచటమే కాకుండా, కాంప్లికేషన్స్‌ను నివారించవచ్చు. కార్టికోస్టిరాయిడ్స్: ఇవి అడ్రినల్ గ్రంథి నుండి విడుదల అవుతాయి. ఇవి అన్ని ముఖ్యమైన జీవనక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్యత వలన కుషింగ్స్ మరియు అడిసన్స్ వ్యాధులు వస్తాయి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. హార్మోన్ సమస్యలకుహోమియోకేర్ వైద్యం హోమియోకేర్ సొంతమైన ప్రత్యేక ‘హార్మోన్ సెల్’ మరియు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ పద్ధతుల ద్వారా అన్ని హార్మోన్ సమస్యలకు కచ్చితమైన, ఎటువంటి దుష్ఫలితాలు లేని వైద్యం అందించి, ఇక మళ్ళీ జీవితంలో తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది.