ఆస్టియో ఆర్థరైటిస్ | Astiyo Osteoarthritis | Sakshi
Sakshi News home page

ఆస్టియో ఆర్థరైటిస్

Published Mon, Jan 6 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

ఆస్టియో ఆర్థరైటిస్

ఆస్టియో ఆర్థరైటిస్

కీళ్లు బలహీనపడటం, అరుగుదల కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే మృదువైన కుషన్‌లాంటి పదార్థం దెబ్బతినడం వల్ల కీళ్ల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గడంతో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోతాయి. దాంతో నొప్పి, స్టిఫ్‌నెస్ వస్తుంది. ఈ కండిషన్‌కు వయసు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి నలభై ఏళ్లు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబంలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకూ అది వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే బరువు ఎక్కువగా మోసేవారిలో మోకాళ్ల కీళ్లు, వెన్నెముక, తుంటి కీలు ప్రభావితమై ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
 
 ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణాలు :

 అధిక బరువు /స్థూలకాయం
 కీళ్లపై బలమైన దెబ్బ తగలడం (ట్రామా)
 కీళ్లను ఎక్కువగా ఉపయోగించేవారిలో (వృత్తిపరంగా)  
 కొన్ని మెటబాలిక్ వ్యాధులు (ఉదా: ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఐరన్ ఉండే హీమోక్రొమటోసిస్, అలాగే ఎక్కువగా కాపర్‌ను కలిగి ఉంటే విల్సన్స్ డిసీజ్ వంటివి)  రుమటాయిడ్ ఆర్థరైటిస్
 డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండటం
 కొన్నిరకాల మందులను ఎక్కువగా వాడటం (ఉదా: కార్టికోస్టెరాయిడ్స్).
 
 లక్షణాలు :
 నొప్పి: కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉండటం, కదలికలతో ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది
 స్టిఫ్‌నెస్ : కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం. ఫలితంగా కీళ్లలో కదలికలు తగ్గుతుంది
 కదిలేటప్పుడు శబ్దం: కీళ్లు కదిలినప్పుడు ఒక్కొక్కసారి శబ్దాలు వినిపిస్తాయి.   
 వాపు : కీళ్లలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా చేతివేళ్లలో ఉండే కీళ్లలో వాపు రావడం ఎక్కువ. వీటిని హెర్బ్‌డెన్స్ నోడ్స్, బకార్డ్స్ నోడ్స్ అంటారు
 
 వెన్నెముకకు ఈ వ్యాధి వస్తే ఆ రోగుల్లో నడుమునొప్పి, మెడనొప్పి, స్టిఫ్‌నెస్, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
 పరీక్షలు : కీళ్లకు సంబంధించిన ఎక్స్-రేతో ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
 
 జాగ్రత్తలు / నివారణ :
 బరువు తగ్గడం (స్థూలకాయాన్ని తగ్గించుకోవడం)  
 క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పాల ఉత్పాదనలకు సంబంధించిన పదార్థాలను తీసుకోవడం
 విటమిన్-డి లభ్యమయ్యేలా లేత ఎండలో 30 నిమిషాలు నడవటం
 తగినంత వ్యాయామం చేయడం.
 
 చికిత్స : ఈ వ్యాధికి రోగి, అతడి మానసిక / శారీరక లక్షణాల ఆధారంగా కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో హోమియో మందులు ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement