నా వయసు 59 ఏళ్లు. నాకు రెండు చేతుల జాయింట్లు (కీళ్లు) నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి.
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తే తనపట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి.
సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది.
ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
యానల్ ఫిషర్ సమస్యకు చికిత్స ఉందా?
నా వయసు 39 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా?
దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుం దాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాం తంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది.
►కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.
►చికిత్స : జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
సయాటికా నొప్పి తగ్గుతుందా?
నా వయసు 40 ఏళ్లు. నేను వృత్తిరీత్యా రోజూ దాదాపు 70 కి.మీ. బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్లను కలిస్తే నా సమస్య ‘సయాటికా’ అని అంటున్నారు. దయచేసి దీనికి తగిన పరిష్కారం సూచించండి.
నేటి జీవనశైలితో వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది సయాటికా. శరీరంలోని నరాలన్నింటిలోనూ పొడవైనది సయాటికా. ఇది వీపు కింది భాగం నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాదాపు 90 శాతం మంది ప్రజల్లో జీవితకాలంలో ఏదో ఒకసారి ఇది కనిపిస్తుంది.
►కారణాలు : ∙ఎముకల్లో ఏర్పడే ఒత్తిడి వల్ల వెన్నుపాము నుంచి వచ్చే నరాలు కంప్రెస్ అవుతాయి. దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరం వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ∙శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు.
►లక్షణాలు : కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం ∙కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి ∙బరువులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం.
►నిర్ధారణ పరీక్షలు : ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై.
►చికిత్స : సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,
ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment