మలబద్ధకం ఉన్నవారికి అది చాలా బాధాకరమైన సమస్యే అయినప్పటికీ... నిజానికి వారికి అదొక్కటే కాకుండా, దాని నుంచి వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో. అందుకే ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే చాలా రకాల ఆరోగ్య అనర్థాల నుంచి కాపాడుకోవచ్చు. అందుకే దీని నివారణ అంటే చాలా రకాల జబ్బుల నివారణ అని అర్థం చేసుకోవాలి. మలబద్ధకం నివారణకు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి...
పీచుపదార్థాలు (ఫైబర్) మలబద్ధకాన్ని సమర్థంగా నివారిస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోనూ పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితో పాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది.
చిక్కుళ్లలో ప్రొటీన్‌తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతో పాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది.
ఇక పండ్ల విషయానికి వస్తే... పీచు ఎక్కువగా ఉండే బొ΄్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. చక్కెర మోతాదులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే పండ్లను డాక్టర్లు డయాబెటిస్ బాధితులకు తినమంటూ సూచిస్తారు. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మంచిది.
పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల)కు తగ్గకుండా నీళ్లు తాగడం మంచిది.
మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితోపాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment