relieve
-
మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!
మలబద్ధకం ఉన్నవారికి అది చాలా బాధాకరమైన సమస్యే అయినప్పటికీ... నిజానికి వారికి అదొక్కటే కాకుండా, దాని నుంచి వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో. అందుకే ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే చాలా రకాల ఆరోగ్య అనర్థాల నుంచి కాపాడుకోవచ్చు. అందుకే దీని నివారణ అంటే చాలా రకాల జబ్బుల నివారణ అని అర్థం చేసుకోవాలి. మలబద్ధకం నివారణకు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పీచుపదార్థాలు (ఫైబర్) మలబద్ధకాన్ని సమర్థంగా నివారిస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోనూ పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితో పాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. చిక్కుళ్లలో ప్రొటీన్‌తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతో పాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది. ఇక పండ్ల విషయానికి వస్తే... పీచు ఎక్కువగా ఉండే బొ΄్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. చక్కెర మోతాదులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే పండ్లను డాక్టర్లు డయాబెటిస్ బాధితులకు తినమంటూ సూచిస్తారు. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మంచిది. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల)కు తగ్గకుండా నీళ్లు తాగడం మంచిది. మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితోపాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. -
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసింది కేంద్రం. గురువారంలోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్‌గా సోమేష్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన మరునాడే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్‌కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. చదవండి: సీఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు -
డిప్యూటీ డీఈఓలు రిలీవ్
అనంతపురం ఎడ్యుకేషన్ : గుత్తి డిప్యూటీ డీఈఓ చాంద్‌బాషా, పెనుకొండ డిప్యూటీ డీఈఓ నాగభూషణంలను విధుల నుంచి రిలీవ్ చేశారు. గుత్తి డిప్యూటీ డీఈఓ(ఇన్చార్జ్)గా పని చేస్తున్న పగడాల లక్ష్మీనారాయణ, పెనుకొండ డిప్యూటీ డీఈఓగా పని చేస్తున్న డైట్ అధ్యాపకులు సుబ్బారావును తప్పిస్తూ 2016 డిసెంబరు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానాల్లో హెచ్ఎంలుగా ఉన్న చాంద్‌బాషా, నాగభూషణంలను అధికారులు నియమించారు. అయితే తాజాగా ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రçస్తుతం పని చేస్తున్న చాంద్‌బాషా, నాగభూషణంల నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాకుండా గతంలో పని చేసిన పగడాల లక్ష్మీనారాయణ, సుబ్బారావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ గుత్తి డిప్యూటీ డీఈగా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అయితే బోధన వృత్తిలో ఉన్నవారిని డిప్యూటీ డీఈఓగా నియమించకూడదనే నిబంధన అమలులో ఉండడంతో పెనుకొండ డిప్యూటీ డీఈఓగా సుబ్బారావును పునర్ నియమించలేదు. -
ఎస్ఈ శేషారెడ్డిపై బదిలీ వేటు
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఓ ఆండ్ఎం సివిల్ ఎస్ఈగా పనిచేస్తున్న శేషారెడ్డిపై బదిలీ వేటు పడింది. గురువారం ఆర్టీపీపీకి వచ్చి ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ సలహాతో శేషారెడ్డి గురువారం రిలీవ్ అయినట్లు విశ్వసనీయం సమాచారం. 600 మెగావాట్లు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తుండటంతో అధికార పార్టీ వారికి నచ్చక ఎన్ఈని బదిలీ చేయించారని పలువురు చర్చించుకుంటున్నారు. -
తెలంగాణ ప్రాంత విద్యుత్ అధికారుల జంప్
చెప్పాపెట్టకుండా రిలీవ్ కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ అధికారులు ఇక్కడి నుంచి జంప్ అయ్యారు. పై అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా సొంతంగా రిలీవ్ అయి తెలంగాణ ప్రాంతానికి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిలో విద్యుత్ భవన్లో సివిల్ విభాగం ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కృష్ణారెడ్డితోపాటు ఏఈలు సుధాకర్ (డోన్ రూరల్), నాగరాజు (కోడుమూరు), వెంకటరమణ (ఆదోని కన్స్ట్రక్షన్), ఏఏఓలు శ్రీనివాసులు (ఎస్ఈ కార్యాలయం), వినోద్‌కుమార్ (కర్నూలు ఈఆర్ఓ), జేఏఓలు స్వప్న (సర్కిల్ కార్యాలయం), సురేష్ (కర్నూలు ఈఆర్ఓ), సబ్ ఇంజినీర్లు సుజాత (విద్యుత్ భవన్లో పర్చేజ్ విభాగం), మహేశ్వర రెడ్డి (పవర్ హౌర్)లు ఈనెల 2వ తేదీ నుంచి విధులకు హాజర కావడం లేదు. ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారం లేకపోవడంతో గైర్హాజర్ (అబ్సెంట్)గా భావిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి అధికారికంగా రిలీవ్ చేసి తెలంగాణకు పంపడంలో జాప్యం జరుగుతుండడంతో వీరంతా చెప్పాపెట్టకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. -
జీతాల కోసం న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు జీతాల కోసం న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్ని కోర్టులో నిలదీయనున్నారు. ఇందులోభాగంగా పిటిషన్ల దాఖలుపై చర్చించేందుకు సోమ, మంగళవారాల్లో భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నారు. అయితే స్థానికత అంశం ఇప్పటికే కోర్టులో ఉన్న కారణంగా, జీతాల కోసం కోర్టుకెళ్లడం ఏమేర సాధ్యమనే దానిపై వారు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. స్థానికత ఆధారంగా ఈ నెల 11న తెలంగాణ ప్రభుత్వం 1,251 మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేసింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏపీ ట్రాన్స్‌కో సైతం కోర్టుకెక్కింది. దీంతో రిలీవ్ ఆర్డర్లను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని టీఎస్ విద్యుత్ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఆ రాష్ట్రం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఏపీ స్థానికతతో రిలీవ్ అయిన ఉద్యోగుల ఏ రాష్ట్రంలోనూ పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీ వరకే వీరంతా తమ సంస్థల్లో పనిచేసినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ఈ మేరకే జీతాల పట్టికలో చేర్చాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు గణాంక శాఖను ఆదేశించారు. వచ్చే పది రోజుల వేతనంలోనూ ఆదాయ పన్ను కింద సింహభాగం చెల్లించాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఈ నెల వేతనం అందే అవకాశం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చేసేందుకు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తెలంగాణలోనే ఉండి న్యాయపోరాటం చేయాలని చెప్పడంతో వారంతా నలిగిపోతున్నారు. -
ఏ రాష్ట్రానికీ కానివారైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు
10 రోజుల జీతాన్నే చెల్లించనున్న టీ సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ కానివారయ్యారు. జూన్ నెలకు సంబంధించిన జీత భత్యాలను ఏ రాష్ట్రం నుంచి పొందాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 1,251 మంది ఏపీ ఉద్యోగులను ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగులు ఈ నెలలో పనిచేసిన 10 రోజుల కాలానికి సంబంధించిన జీతభత్యాలను మాత్రమే జూలై నెలలో చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. రిలీవ్ ఆర్డర్లు జారీ చేయకముందే ఏపీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లడం వల్ల మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం సైతం ఈ ఉద్యోగులను విధుల్లో తీసుకోవడంలో విముఖత చూపింది. తెలంగాణ విద్యుత్ సంస్థల విభజన మార్గదర్శకాలు, రిలీవ్ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్‌బెంచ్ నిలుపుదల చేసింది. ఈ నిర్ణయంపై డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. మళ్లీ ఈ అంశంపై హైకోర్టులో ఓ నిర్ణయం వెల్లడైతేనే ఏపీ ఉద్యోగుల భవితవ్యం తేలే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడం, దానిపై ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వం కౌంటర్ వేయడం, నిర్ణయం వచ్చే సరికి ఏపీ ఉద్యోగులు జూలై నెల జీతాన్ని సైతం కోల్పోయే ప్రమాదముంది.