అనంతపురం ఎడ్యుకేషన్ : గుత్తి డిప్యూటీ డీఈఓ చాంద్‌బాషా, పెనుకొండ డిప్యూటీ డీఈఓ నాగభూషణంలను విధుల నుంచి రిలీవ్ చేశారు. గుత్తి డిప్యూటీ డీఈఓ(ఇన్‌చార్జ్)గా పని చేస్తున్న పగడాల లక్ష్మీనారాయణ, పెనుకొండ డిప్యూటీ డీఈఓగా పని చేస్తున్న డైట్ అధ్యాపకులు సుబ్బారావును తప్పిస్తూ 2016 డిసెంబరు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానాల్లో హెచ్‌ఎంలుగా ఉన్న చాంద్‌బాషా, నాగభూషణంలను అధికారులు నియమించారు.
అయితే తాజాగా ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రçస్తుతం పని చేస్తున్న చాంద్‌బాషా, నాగభూషణంల నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాకుండా గతంలో పని చేసిన పగడాల లక్ష్మీనారాయణ, సుబ్బారావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ గుత్తి డిప్యూటీ డీఈగా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అయితే బోధన వృత్తిలో ఉన్నవారిని డిప్యూటీ డీఈఓగా నియమించకూడదనే నిబంధన అమలులో ఉండడంతో పెనుకొండ డిప్యూటీ డీఈఓగా సుబ్బారావును పునర్ నియమించలేదు.
డిప్యూటీ డీఈఓలు రిలీవ్
Published Fri, Mar 31 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
Advertisement
Advertisement