deputy deo
-
ఒకే ఒక్కడు!
హెచ్ఎం, డెప్యూటీ డీఈఓ, డీసీఈబీ కార్యదర్శి మూడు పోస్టుల బాధ్యత ఒకరికే – ఏ పోస్టుకూ న్యాయం జరగని వైనం – గాడి తప్పుతున్న డీసీఈబీ అనంతపురం ఎడ్యుకేషన్: పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతేడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు జిల్లా సాధారణ పరీక్ష మండలి(డీసీఈబీ) అత్యంత కీలకమయ్యాయి. ప్రశ్నపత్రాల తయారీ మొదలు.. ముద్రణ, అన్ని స్కూళ్లకు పంపిణీ, పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా చాలా రహస్యంగా నిర్వహించాల్సి ఉంది. ఈ మొత్తం బాధ్యత డీసీఈబీదే. జిల్లాలో డీసీఈబీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. రెండేళ్లగా నిర్వహించిన పరీక్షల తీరును పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. విద్యార్థులకు అత్యంత కీలకమైన సంగ్రహణాత్మక మదింపు(సమ్మేటివ్) పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో బహిరంగంగా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పరీక్షలు ప్రారంభం కాకముందే అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు విద్యార్థుల చేతుల్లోకి చేరడం డీసీఈబీ పనితీరుకు అద్దం పడుతోంది. మూడు పోస్టుల్లో ఆయనే.. ప్రస్తుతం జిల్లా సాధారణ పరీక్ష మండలి కార్యదర్శిగా పని చేస్తున్న నాగభూషణం మూడు పోస్టులకు ‘ఒకే ఒక్కడు’గా వ్యవహరిస్తున్నారు. ఈయన లేపాక్షి మండలం చోళసముద్రం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పెనుకొండ డిప్యూటీ డీఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన మూడు పోస్టులు ఒక్కరికే అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది. డమ్మీగా డీసీఈబీ సభ్యులు డీసీఈబీలో కార్యదర్శితో పాటు మరో 8 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ ఇలా అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. పేరుకు మాత్రమే సభ్యులు కానీ.. చాలా మందికి తమ విధులు కూడా తెలియని పరిస్థితి. ఏదో కార్యదర్శి సమాచారం చేరవేస్తే వచ్చి తూతూమంత్రంగా సమావేశంలో పాల్గొని సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డీసీఈబీ సభ్యులు తమ విధుల గురించి అడగరు.. అధికారులు పనులు పురమాయించరు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పంపిణీ, పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన డీసీఈబీ కార్యదర్శి, సభ్యులు కనీసం ఒక్క పరీక్ష కేంద్రం కూడా తనిఖీ చేసిన దాఖలాల్లేవు. దీనికితోడు కార్యదర్శి నాగభూషణం మూడు పోస్టుల్లో కొనసాగడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ముందుకొస్తే బాధ్యతలు ఒకే వ్యక్తి మూడు పోస్టుల్లో కొనసాగడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే డీసీఈబీ కార్యదర్శి విషయంలో ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. పోనీ ప్రధానోపాధ్యాయుల్లో ఎవరైనా ఔత్సాహికులు ముందుకొస్తే కార్యదర్శి పోస్టులో నియమించే విషయం పరిశీలిస్తాం. - లక్ష్మీనారాయణ, డీఈఓ -
డిప్యూటీ డీఈఓలు రిలీవ్
అనంతపురం ఎడ్యుకేషన్ : గుత్తి డిప్యూటీ డీఈఓ చాంద్‌బాషా, పెనుకొండ డిప్యూటీ డీఈఓ నాగభూషణంలను విధుల నుంచి రిలీవ్ చేశారు. గుత్తి డిప్యూటీ డీఈఓ(ఇన్చార్జ్)గా పని చేస్తున్న పగడాల లక్ష్మీనారాయణ, పెనుకొండ డిప్యూటీ డీఈఓగా పని చేస్తున్న డైట్ అధ్యాపకులు సుబ్బారావును తప్పిస్తూ 2016 డిసెంబరు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానాల్లో హెచ్ఎంలుగా ఉన్న చాంద్‌బాషా, నాగభూషణంలను అధికారులు నియమించారు. అయితే తాజాగా ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రçస్తుతం పని చేస్తున్న చాంద్‌బాషా, నాగభూషణంల నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాకుండా గతంలో పని చేసిన పగడాల లక్ష్మీనారాయణ, సుబ్బారావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ గుత్తి డిప్యూటీ డీఈగా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అయితే బోధన వృత్తిలో ఉన్నవారిని డిప్యూటీ డీఈఓగా నియమించకూడదనే నిబంధన అమలులో ఉండడంతో పెనుకొండ డిప్యూటీ డీఈఓగా సుబ్బారావును పునర్ నియమించలేదు. -
డిప్యూటీ డీఈఓ ఆకస్మిక తనిఖీలు
యాలాల(రంగారెడ్డి): యాలాల మండలంలోని పగిడియాల, ముద్దాయిపేట ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ డీఈఓ హరీష్ చందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా విద్యార్థులు ఏ విధంగా వత్తిడిని జయించాలి అనే అంశంపై మాట్లాడారు. దీంతో పాటు డిజిటల్ క్లాసుల ద్వారా ప్రముఖ సైకాలిజిస్టు డా. బి.వి పట్టాభిరామ్.. వత్తిడి సంబంధిత సీడీలను విద్యార్థుల ముందు ప్రదర్శించారు. డీఈవో హరీష్ చందర్ తో పాటు మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఈ ఆకస్మిక తనిఖీలలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. -
కీచక టీచర్ సస్పెన్షన్
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన చందానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫనిరాజ్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం పాఠశాలకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందాయి. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫనిరాజ్ పదిహేను రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 18న వారు పాఠశాలకు వెళ్లి నిలదీశారు. ఈ ఘటనపై పత్రికల్లో వార్తలు రావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. 20న వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరిశ్చందర్ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఘనటకు సంబందించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు సోమవారం పాఠశాలకు అందాయి. ఆయన స్థానంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చంద్రయ్యకు బాధ్యతలు అప్పగించినట్లు వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరిశ్చందర్ తెలిపారు. -
ఫుట్‌పాత్‌పై పాఠశాల సీజ్..వెంటనే వెనకడుగు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లో మున్సిపల్ పార్కును ఆనుకొని ఫుట్‌పాత్‌పై గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రై వేట్ పాఠశాలను విద్యాశాఖాధికారులు బుధవారం సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు షేక్‌పేట మండల విద్యాశాఖ అధికారులు అక్కడకు చేరుకుని సీజ్ చేశారు. అయితే, తమకు ఈ స్కూల్ తప్పితే అందుబాటులో మరొకటి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో వారు వెనక్కి తగ్గారు. డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు అప్పటికప్పుడే ఆ పాఠశాలను ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించారు. ఇద్దరు ప్రభుత్వ టీచర్లను అపాయింట్ చేశారు. ఇక నుంచి ప్రభుత్వ టీచర్లే ఇక్కడ విద్యార్థులకు పాఠాలు చెప్తారని చెప్పి వెళ్లడం విశేషం. -
అసభ్య ప్రవర్తనతో టీచర్ సస్పెన్షన్
రంగారెడ్డి జిల్లా: తోటి టీచర్లతో, విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాలు...రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్న రాజేందర్‌పై ఇటీవలి కాలంలో అధికారులకు పలు ఆరోపణలు అందాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డిప్యూటీ డీఈవో ఉషారాణి ఇటీవల పాఠశాలను సందర్శించి విచారించారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించిన డీఈవో రమేశ్ హిందీ పండిట్ రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (కుత్బుల్లాపూర్) -
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది
కడప ఎడ్యుకేషన్: అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తే ఎంతో గౌరవప్రదమైందని అలాంటి వృత్తికి కళంకం తేవద్దని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని కడప నగరం నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన జిల్లా కలెక్టర్ కేవీ రమణతోపాటు అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆర్జేడీ రమణకుమార్, మేయర్ సురేష్‌బాబు, శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి రాజారత్నం ఐజాక్, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, డీఈఓ కుంభ అంజయ్య, డీఎస్ఓ రెహమాన్ , డిప్యూటి డీఈఓలు రంగారెడ్డి, ప్రసన్న అంజనేయులు, విజయలక్ష్మీ, ఎంఈఓ నాగమునిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యాన్ని పెంచాలన్నారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులే పిల్లలకు మార్గదర్శకులని, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కానివారు నిరుత్సాహం చెందవద్దని సూచించారు. ఎంపికైన వారు మరింత భాద్యతగా పనిచేయాలన్నారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ దేశంలోనే అధికంగా గౌరవించే వ్యక్తి ఉపాధ్యాయుడేనన్నారు. మిగతా ఏవృత్తిలోనైనా మచ్చలుండవచ్చని ఈ వృత్తిలో మాత్రం అలాంటివి ఉండవన్నారు. ఆర్జేడీ రమణకుమార్ మాట్లాడుతూ ఈ దినం ఉపాధ్యాయ లోకం గర్వించదగ్గ రోజన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహోన్నతుడు సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న కళలను వెలికి తీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువుతోపాటు సమాజ సేవ, నైతిక విలువలను కూడా నేర్పించాలన్నారు. -
పీఈటీ వేధింపులపై విచారణ
ఆనందపురం, న్యూస్‌లైన్ : మండలంలోని శొంఠ్యాం హైస్కూల్లో ఓ విద్యార్థినిపై వ్యాయామోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ రేణుక విచారణ జరిపారు.పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పీఈటీ బి. సత్యం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో డిప్యూటీ డీఈవో విచారణ జరిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆ విద్యార్థిని ప్రాక్టీస్ సరిగా చేయటం లేదని మందలించడంతో పాటు పీఈటీ చేయి చేసుకున్నట్టు, లైంగిక వేధింపులు జరగలేదని విచారణలో బయటపడిందని డిప్యూటీ డీఈఓ రేణుక తెలిపారు.