కీచక టీచర్ సస్పెన్షన్ | The suspension of the head master for dirty behavior with student | Sakshi
Sakshi News home page

కీచక టీచర్ సస్పెన్షన్

Published Mon, Jan 25 2016 6:05 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

The suspension of the head master for dirty behavior with student

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన చందానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫనిరాజ్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం పాఠశాలకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందాయి. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫనిరాజ్ పదిహేను రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

  విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 18న వారు పాఠశాలకు వెళ్లి నిలదీశారు. ఈ ఘటనపై పత్రికల్లో వార్తలు రావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. 20న వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరిశ్చందర్ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

ఘనటకు సంబందించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు సోమవారం పాఠశాలకు అందాయి. ఆయన స్థానంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చంద్రయ్యకు బాధ్యతలు అప్పగించినట్లు వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరిశ్చందర్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement