పీఈటీ వేధింపులపై విచారణ | Sexual harassment trtial | Sakshi
Sakshi News home page

పీఈటీ వేధింపులపై విచారణ

Published Thu, Mar 20 2014 4:08 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Sexual harassment  trtial

ఆనందపురం, న్యూస్‌లైన్ : మండలంలోని శొంఠ్యాం హైస్కూల్‌లో ఓ విద్యార్థినిపై వ్యాయామోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ రేణుక విచారణ జరిపారు.పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై  పీఈటీ బి. సత్యం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనితో డిప్యూటీ డీఈవో విచారణ జరిపారు.  జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆ విద్యార్థిని ప్రాక్టీస్ సరిగా చేయటం లేదని మందలించడంతో పాటు పీఈటీ చేయి చేసుకున్నట్టు, లైంగిక వేధింపులు జరగలేదని విచారణలో బయటపడిందని డిప్యూటీ డీఈఓ రేణుక తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement