Anandapuram
-
విశాఖ జిల్లా ఆనందపురంలో ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం
-
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్‌పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్‌ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్‌ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్‌లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్‌లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్‌ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్‌ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్‌లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్‌కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్‌తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
ఇంటికి రావద్దన్నారని.. నారాయణ విద్యార్థి ఆత్మహత్య
ఆనందపురం ( భీమిలి): మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ రామచంద్రరావు శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం, తెట్టంగి గ్రామానికి చెందిన పొట్నూరు లక్ష్మణరావు, సుమతి దంపతులకు ఇద్దరు పిల్లలు శరణి, ముఖేష్ ఉన్నారు. వారిలో ముఖేష్‌ను ఈ ఏడాది మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. చదవండి: తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు! ఇదిలా ఉండగా ముఖేష్ శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అందరూ నాగులచవితికోసం ఇంటికి వెళ్తున్నారని తమ గదిలో నలుగురు విద్యార్థులమే మిగిలామని తాను కూడా ఇంటికి వస్తానని కోరాడు. అయితే ఇంటికి రావద్దని తల్లి దండ్రులు వారించారు. కాగా రాత్రి హాస్టల్లో నిర్వహిస్తున్న స్టడీ అవర్‌లో ఉన్న ముఖేష్ మధ్యలోనే తన గదిలోకి వెళ్లి, చేతిపై లైఫ్నిల్ అని రాసుకుని నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది కొన ఊపిరితో ఉన్న ముఖేష్‌ను తగరపువలసలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును ఎస్ఐ నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది! క్షణికావేశంలో..
ఆనందపురం (భీమిలి): క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. భార్యాభర్తల మధ్య జరిగిన వాదోపవాదాలు తారాస్థాయికి చేరి హత్యకు పురిగొల్పాయి. పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది. మండలంలోని శొంఠ్యాంలో శనివారం మధ్యాహ్నం జరిగిన హత్య ఘటన రాత్రి వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన పంతుల సూర్య తీర్ధ ప్రసాద్ 20 ఏళ్ల కిందట మండలంలోని శొంఠ్యాం గ్రామానికి వలస వచ్చారు. ఆయనకు విశ్వనాథశాస్త్రి అనే కుమారుడు, వెంకట లలితాదేవి(35) అనే కుమార్తె ఉన్నారు. కాగా వెంకట లలితాదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు కలిగిన తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయారు. మళ్లీ ఎనిమిదేళ్ల కిందట విజయనగరానికి చెందిన ఆండ్ర రవికుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, కుమారుడుతో వెంకట లలితాదేవి శొంఠ్యాంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలు స్థానికంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడే వారని స్థానికులు అంటున్నారు. శనివారం ఆ దంపతుల పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో పెళ్లి రోజునాడు కూడా భర్త తనకు అచ్చటా, ముచ్చటా చూడలేదని సరదాగా కనీసం బయటకు కూడా తీసుకెళ్లలేదని వెంకట లలితాదేవి భర్తతో గొడవ పడింది. ఇంటి వద్దే ఉన్న వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని ఆపుకోలేని రవికుమార్ సుత్తితో లలితాదేవి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయింది. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన జరిగిన తర్వాత రవికుమార్ పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రవి చేరుకుని విచారణ జరిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే.. -
విశాఖ జిల్లా ఆనందపురం ఎంపీపీగా డెంటల్ డాక్టర్
-
బస్సు ఢీకొని యువతి దుర్మరణం
ఆనందపురం(భీమిలి): మండలంలోని వేములవలస జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతి గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విజయా మెడికల్ సెంటర్లో పని చేస్తున్న చలపతి మాలతి, మల్లేశ్వరిలు ఒక వాహనంపై వారితో పాటు పలువురు వాహనాలపై తగరపువలసలో ఉన్న తమ స్నేహితురాలు పాపకు జరుగుతున్న నామకరణ కార్యక్రమంలో పాల్గొనడానికని విశాఖ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. వారి ద్విచక్ర వాహనాలు మండలంలోని వేములవలస జాతీయ రహదారిపైకి చేరుకునే సరికి వెనుక వైపు నుంచి వస్తున్న విశాఖ నుంచి రాజాం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక వైపు కూర్చున్న చలపతి మాలతి(26) రోడ్డుపై తూలి పడడంతో ఆర్టీసీ బస్సు వెనుక టైరు తలపై నుంచి వెళ్లి పోయింది. ఈ సంఘటనలో మాలతి తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మల్లేశ్వరి రోడ్డుపై పడిపోయి గాయాలు పాలయింది. మృతి చెందిన మాలతి విజయా మెడికల్ సెంటర్లో రిసెప్సనిస్ట్‌గా పని చేస్తుండగా ఆమెకు ఇటీవలే ఓ పాప జన్మించిందని పొలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఎస్ఐలు శ్రీనివాస్, గణేష్, ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లను అదుపులోకి తీసుకున్న ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేసిన అతివేగం
ఆనందపురం(భీమిలి): అతివేగం కాటేసింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకొంది. మరో ముగ్గిరిని క్షతగాత్రులను చేసింది. కుటుంబ సభ్యులను విదేశాలకు సాగనంపి దైవదర్శనం చేసుకొని ఆనందంగా ఇంటికి బయటుదేరిన ఆ కుటుంబంపై విధి పగబట్టింది. మార్గమధ్యలో ఇంటి పెద్దలను తీసుకుపోయి కుటుంబ సభ్యులను దిక్కులేని వారిని చేసింది. మృతులు విజయనగరం జిల్లా కణపాక వాసులు. జాతీయ రహదారిపై వెల్లంకి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం కలెక్టరేట్ దరి కణపాక గ్రామానికి చెందిన పతివాడ సత్యనారాయణ విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా, గొట్లాంలో ఉన్న గాయత్రి కళాశాల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. భార్య కృష్ణవేణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా కుమారుడు విజయనగరంలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కుమార్తె సమీరకు వివాహం కాగా భర్తతో విదేశాల్లో స్థిరపడింది. సమీరాను అమెరికా పంపించడానికని శుక్రవారం సత్యనారాయణ, భార్య కృష్ణవేణి కారులో విశాఖ వెళ్లి విమానంలో రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ఉదయం కుమార్తెను అమెరికా వెళ్లే విమానం ఎక్కించారు. పని మీద వెళ్లి హైదరాబాద్‌లోనే ఉన్న సత్యనారాయణ, కృష్ణవేణిల కుమారుడు సందీప్‌తో కలిసి విమానంలో తిరిగి విశాఖ వచ్చేశారు. అప్పటికే నగరంలో ఉన్న సందీప్ భార్య అనూష, ఆమె కుమారుడు సాకేష్ (2)లను తీసుకొని ఐదుగురూ కారులో సింహాచలం చేరుకొని దర్శనం చేసుకొన్నారు. మధ్యాహ్నం భోజనాలు చేసుకొని విజయనగరం బయలుదేరారు. కారు వెల్లంకి గ్రామ సమీపానికి చేరుకునే సరికి జాతీయ రహదారిపై ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల లారీని వెనక వైపు నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారు ముందు భాగం అంతా లారీ వెనుక భాగంలో ఇరుక్కు పోయింది. దీంతో వాహనాన్ని నడుపుతున్న సత్యనారాయణ (59), ముందు సీట్లో కూర్చున్న అతని కుమారుడు సందీప్(30) ఇరుక్కు పోవడంతో తీవ్రంగా గాయపడి కారులోనే మృతి చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న కృష్ణవేణి, అనూష, సాకేష్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడి కారులో చిక్కుకు పోయిన కృష్ణవేణి, అనూష, సాకేష్లను 108 వాహనంలో చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం డిక్కీ రేకు విడిపోయి లారీకి అతుక్కుపోయి ఉండడాన్ని చూస్తే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తెరుచుకోని ఎయిర్ బ్యాగ్‌లు హ్యూందాయ్ కంపెనీకి చెందిన ఐ – 20 మోడల్ కారు ప్రమాదానికి గురైంది. అందులో ఎయిర్ బ్యాగ్‌లు సౌకర్యం ఉందని మృతుల బంధువులు తెలుపుతున్నారు. కాగా ప్రమాద సమయంలో అవి తెరుచుకొని ఉంటే ప్రాణాలు నిలిచేవని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. నుజ్జునుజ్జయిన కారు ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం తునాతునకలైంది. ఇంజిన్ భాగాలు విడిపోయి రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. స్టీరింగ్‌తో సహా అన్నీ ఊడి పోయాయి. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మధురవాడ ట్రాఫిక్ ఏసీపీ వి.కృష్ణవర్మ, సీఐ హిమబిందు, ఆనందపురం సీఐ ఆర్.గోవిందరావు, ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు చేతికి గాయాలయ్యాయి. బ్యాగ్‌తో పరారైన యువకుడికి దేహశుద్ధి ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం అందించాల్సి ఉండగా ఓ ప్రబుద్ధుడు కారులో నుంచి బయటకు తుళ్లి పోయిన డబ్బులు, వస్తువులతో ఉన్న బ్యాగ్‌ని పట్టుకొని పారిపోవడాన్ని గమనించిన కొంత మంది స్థానికులు వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిది మండలంలోని మిందివానిపాలెం గ్రామంగా గుర్తించారు. -
మా జీవితాలతో ఆడుకుంటున్నారు
విశాఖ జిల్లాలో గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన పరీక్ష రాయనివ్వలేదని కన్నీటి పర్యంతం ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవలోని ఏక్యూజే డిగ్రీ కళాశాల కేంద్రంగా శనివారం నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష సందర్భంగా గందరగోళం నెలకొంది. పేపర్ లీకైందన్న ప్రచారంతో తొలత అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. అయితే పరీక్ష ప్రారంభమైన అనంతరం సుమారు 40 మంది విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకోకుండా కాలయాపన చేసి సమయం అయిపోయిందంటూ పరీక్ష రాయనీకుండా పోలీసులతో బయటకు గెంటేశారని వారు ఆరోపించారు. పరీక్ష కేంద్రంలో పేపర్ లీకైందని, మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ తమకు న్యాయం కావాలంటూ కళాశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. గంట పాటు పరీక్ష రాసిన అనంతరం తమను బయటకు గెంటి వేశారంటూ కొంత మంది కన్నీటి పర్యంతమయ్యారు. మొదట రోజు పరీక్ష రాస్తుండగా మధ్యలో బయోమెట్రిక్‌ని తీసుకున్నారని, కానీ ఈ రోజు తమ జీవితాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు గొడవ చేయకుండా అక్కడి నుంచి పంపేశారు. అయితే ఆన్లైన్లో ద్వారా ప్రశ్న పత్రాలు కేంద్రంలోనే ముద్రించి అభ్యర్థులకు అందించడం వలన పేవర్ లీక్‌కు ఆస్కారం లేదని అధికారులు కొట్టి పారేస్తున్నారు. మెయిన్స్ రెండో పేపర్‌కు ఈ కేంద్రంలో 1417 మంది హాజరు కావాల్సి ఉండగా శనివారం 760 మంది వచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమకు కేటాయించిన పరీక్ష హాలుకు హాజరై బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. -
ఆకట్టుకున్న ఎయిర్ క్రాఫ్ట్‌ల ప్రదర్శన
ఆనందపురం : మండలంలోని శొంఠ్యాంలో ఉన్న ఎన్‌ఎస్‌ఆర్టీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులగా జరుగుతున్న ఆర్సి ఎయిర్ క్రాఫ్ట్‌వర్క్ షాపు గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎయిర్ క్రాఫ్ట్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. మెకానికల్ విభాగాధిపతి మురళీకష్ణ ఆధ్వర్యంలో మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధి నితిన్కష్ణ, బంద సభ్యులు రూపొందించిన వివిధ రకాల ఎయిర్ క్రాఫ్ట్‌లను ప్రదర్శనలో ఉంచడంతో పాటు అవి వివిధ రంగాలలో ఎలా ఉపయోగపడతాయో, అవి పనిచేసే విధానాన్ని ప్రదర్శించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.రవికుమార్, కరస్పాండెంట్ ఎన్.ప్రసాదరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్లు బి.రామాంజనేయులు, కోన రామప్రసాద్లు పాల్గొన్నారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
ఆనందపురం (విశాఖపట్నం) : ఇద్దరు పిల్లలతో సహా గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యం అయింది. తెలిసినవాళ్ల దగ్గర, బంధువుల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో.. ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస గ్రామానికి చెందిన మాధురి తన ఇద్దరు పిల్లలతో నిన్న(శుక్రవారం) గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పీఈటీ వేధింపులపై విచారణ
ఆనందపురం, న్యూస్‌లైన్ : మండలంలోని శొంఠ్యాం హైస్కూల్లో ఓ విద్యార్థినిపై వ్యాయామోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ రేణుక విచారణ జరిపారు.పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పీఈటీ బి. సత్యం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో డిప్యూటీ డీఈవో విచారణ జరిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆ విద్యార్థిని ప్రాక్టీస్ సరిగా చేయటం లేదని మందలించడంతో పాటు పీఈటీ చేయి చేసుకున్నట్టు, లైంగిక వేధింపులు జరగలేదని విచారణలో బయటపడిందని డిప్యూటీ డీఈఓ రేణుక తెలిపారు. -
ముంపు.. వెంటాడే ముప్పు
మునగపాక, న్యూస్‌లైన్ : వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. వాన తగ్గి, వరద ముప్పు తప్పినా ఆ భయం ప్రజల్ని పీడకలలా వెంటాడుతోంది. అయితే కొన్ని ప్రాం తాలను మాత్రం వరద నీరు ఇప్పటికీ వీడలేదు. ప్రజలకు ముంపు నీటితో బాధలు ఇం కా తప్పడం లేదు. మండలంలోని చూచుకొండ, గ ణపర్తి, యాదగిరిపాలెం గ్రామాల్లో వరదనీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఆయా గ్రామాల కాలనీల్లో చేరిన నీరు బయటకు పోయే మార్గం లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. చూ చుకొండ పీఏసీఎస్ ఎదురుగా వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో రా కపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. చూచుకొండ ఎస్సీ కాలనీ, చూచుకొం డకు వెళ్లే రోడ్డుపై కూడా ఇం కా వరదనీరు తగ్గలేదు. దీంతో వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. యాదగిరిపాలెంలో ఆవ కాలువ నుంచి వచ్చే వరదనీరు తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ఆనందపురంలోనూ వరదనీటి ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని సాగునీటి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
ఆరు లేన్ల రహదారికి అడ్డంకి
=చేతులెత్తేసిన నిర్మాణ సంస్థ =టెండర్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: ఆనందపురం- అనకాపల్లి మధ్య తలపెట్టిన ఆరులేన్ల రహదారి నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. రూ.760 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండేళ్ల కిందట దక్కించుకున్న సంస్థ ఇప్పటి దాకా ప్రారంభించలేదు. దీంతో ఈ టెండర్లు రద్దుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 58.222 కిలో మీటర్ల దూరం ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్లుగా కసరత్తు జరుగుతోంది. ప్రాథమికంగా రూ. 760 కోట్ల వ్యయమయ్యే ఈ పనికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెండేళ్ల కిందట టెండర్లు పిలిచింది. ట్రాన్స్ట్రాయ్ నిర్మాణ సంస్థ సుమారు 25 శాతం తక్కువ అంచనాలతో టెండర్లు వేసి పనులను దక్కించుకుంది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు బ్యాంక్ గ్యారంటీగా చూపింది. టెండర్లు ఖరా రై నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంటు చేసుకున్న తర్వాత ఆ సంస్థ రోడ్డు నిర్మాణ పనుల మీద అనాసక్తి చూపుతూ వచ్చింది. నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంటు పూర్తయిన రెండు మూడు నెలల్లోపే పనులు ప్రారంభించాల్సి ఉండగా ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తలేదు. దీంతో అధికారులు అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. ట్రాన్స్ట్రాయ్ అభ్యర్థన మేరకు అనేక సార్లు గడువు పొడిగించారు. కానీ టెండర్లు ఖరారై రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చివరి నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. నవంబర్ 13వ తేదీ లోగా పనులు ప్రారంభించకపోతే టెండరు రద్దు చేస్తామని ఇందులో స్పష్టం చేసినట్టు సమాచారం. పనులు దక్కించుకున్న సమయానికి ఇప్పటికీ నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఆరు లేన్ల నిర్మాణ పని తమకు గిట్టుబాటు కాదని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పనుల జాప్యానికి తమ తప్పేమీ లేదని, అందువల్ల తాము చూపిన బ్యాంక్ గ్యారంటీ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలనే వాదన లేవనెత్తినట్టు తెలుస్తోంది. టెండరు రద్దు చేసినా తమ బ్యాంక్ గ్యారంటీ విడుదల చేస్తే సదరు పని వదిలేసుకోవడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం టెండరు రద్దు చేస్తే బ్యాంక్ గ్యారంటీ మొత్తం వెనక్కి వచ్చే అవకాశం లేదని, ఇదే జరిగితే సదరు సంస్థ న్యాయపోరాటానికి దిగితే కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ తీవ్ర ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఖరారు చేసిన టెండరు అగ్రిమెంటులో 58.222 కిలో మీటర్ల దూరంలో భూసేకరణతో పాటు నాలుగు పెద్ద బ్రిడ్జిలు, 8 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 34 చిన్న బ్రిడ్జిలు, 60 బాక్స్ కల్వర్టులు, 148 పైప్ కల్వర్టులు, 78 శ్లాబ్ కల్వర్టులతో పాటు అగనంపూడి వద్ద టోల్గేట్ భవనం నిర్మించాల్సి ఉంది. ఆనందపురం నుంచి సబ్బవరం,పెందుర్తి మీదుగా అనకాపల్లి హైవేలోకలిసే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విశాఖ నగరంలో కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశం ఉంది. ఇలాంటి భారీ నిర్మాణ పనికి సంబంధించిన టెండరు ఒక్కసారి రద్దయితే మళ్లీ తాజా అంచనాలు రూపొందించడం, టెండర్లు నిర్వహించడం, ఖరారు చేయడం లాంటి పనులకు మరో ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.