వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. వాన తగ్గి, వరద ముప్పు తప్పినా ఆ భయం ప్రజల్ని పీడకలలా వెంటాడుతోంది.
మునగపాక, న్యూస్‌లైన్ : వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. వాన తగ్గి, వరద ముప్పు తప్పినా ఆ భయం ప్రజల్ని పీడకలలా వెంటాడుతోంది. అయితే కొన్ని ప్రాం తాలను మాత్రం వరద నీరు ఇప్పటికీ వీడలేదు. ప్రజలకు ముంపు నీటితో బాధలు ఇం కా తప్పడం లేదు. మండలంలోని చూచుకొండ, గ ణపర్తి, యాదగిరిపాలెం గ్రామాల్లో వరదనీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు.
ఆయా గ్రామాల కాలనీల్లో చేరిన నీరు బయటకు పోయే మార్గం లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. చూ చుకొండ పీఏసీఎస్ ఎదురుగా వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో రా కపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. చూచుకొండ ఎస్సీ కాలనీ, చూచుకొం డకు వెళ్లే రోడ్డుపై కూడా ఇం కా వరదనీరు తగ్గలేదు. దీంతో వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.
యాదగిరిపాలెంలో ఆవ కాలువ నుంచి వచ్చే వరదనీరు తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లపు ఆనందపురంలోనూ వరదనీటి ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని సాగునీటి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.