టీచర్ ని వేధిస్తున్న హెచ్ఎం | The headmaster sexual assault a female teacher | Sakshi
Sakshi News home page

టీచర్ ని వేధిస్తున్న హెచ్ఎం

Published Fri, Feb 12 2016 12:55 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

The headmaster sexual assault a female teacher

పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు పక్కదారి పట్టాడు. మహిళా పీఈటీని లైంగికంగా వేధించుకుతింటున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు శుక్రవారం ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధిత వ్యాయామ ఉపాధ్యాయురాలు మీడియాకు వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.రఘురామ్ మూడేళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
 చెప్పడానికి వీలుకాని రీతిలో అసభ్య పదజాలంతో హింసిస్తున్నాడు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి, నూజివీడు ఉప విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసింది. వారు సదరు కీచక ప్రధాన ఉపాధ్యాయుడిని పిలిచి మందలించారు. అయినా అతడి తీరులో మార్పు లేదు. దీంతో బాధితురాలు గ్రామ పెద్ద మనుషుల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. వారు కూడా ప్రధాన ఉపాధ్యాయుడు రఘురామ్‌ను తీరు మార్చుకోవాలని సూచించారు. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో బాధితురాలు శుక్రవారం నూజివీడు ఉప విద్యా శాఖ అధికారికి మరోమారు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement