Raghuram
-
ఇప్పుడు మాకు ఓడిపోయే సీట్లు ఇస్తున్నాడు..!
-
రఘురామా.. ప్లీజ్ గెటవుట్!
వైఎస్సార్సీపీ ప్రభంజనంలో గెలిచి తెలుగుదేశం పల్లకి మోస్తోన్న రఘురామ కృష్ణం రాజుకు తన అసలు విలువ ఏంటో ఇపుడు తెలిసొచ్చింది. హస్తినలో కేంద్రమంత్రి అమిత్‌షా నివాసంలోకి వెళ్లాలనుకున్న రఘురామకు ఘోర పరాభవం ఎదురైంది. చంద్రబాబు నాయుడికి చాకిరీ చేసిన రఘురామ.. ఈ అవమానంతో రఘురామ రాజు కుత కుత ఉడికిపోయారు. ఇంత దారుణమా అని రగిలిపోయారు. జగన్ మోహన్ రెడ్డి మేనియాతో 2019లో ఫ్యాన్ ప్రభంజనలో నరసాపురం లోక్ సభ స్థానం నుండి గెలిచి ఎంపీ అనిపించుకున్నారు రఘురామ. ఆ తర్వాత తన గొంతెమ్మ కోరికలు చట్టవిరుద్ధ వ్యాపకాలకు సహకరించడం లేదని జగన్‌కు దూరం జరిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో చేరి కుట్ర రాజకీయాలు చేశారు. నిత్యం ఎల్లో మీడియాలో కూర్చుని ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా అసభ్య పదజాలంతో విష ప్రచారం చేశారు. అయిదేళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీ ద్వారా వచ్చిన పదవి అనుభవిస్తూ చంద్రబాబు నాయుడి దగ్గర టిప్పులు తీసుకుంటూ రాజకీయ భిక్ష పెట్టిన జగన్‌ను విమర్శిస్తూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు రఘురామ. అపుడు ఆయన వైఎస్సార్సీపీ ఎంపీ హోదాలో పార్లమెంటులో కానీ.. బయట కానీ బీజేపీ అగ్రనేతలను కలవగలిగారు. ఆ వాపునే ఆయన బలుపు అనుకున్నారు. తన అసలు బలం ఏంటో ఈ రోజు తెలిసొచ్చింది రఘురామ కృష్ణం రాజుకు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీని ఓడించడం మాట దేవుడెరుగు గట్టి పోటీని కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ లు బిజెపి పొత్తుకోసం మూడు రోజులుగా అమిత్‌షా ఇంటి ముందుపడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సర్లే అని అమిత్‌షా చంద్రబాబు, పవన్ లను తన నివాసంలోకి పిలిచారు. వారితో పాటే షా నివాసంలోకి దూరి వెళ్లిపోదామనుకున్న రఘురామ వారి వెనకాలే వెళ్లారు. బాబు, పవన్ లను లోనికి పంపించిన సెక్యూరిటీ సిబ్బంది రఘురామను మాత్రం ఆగక్కడ అని ఆపేశారు. తాను రఘురామ కృష్ణం రాజుని అని తన గురించి తాను చెప్పుకున్న భద్రతా సిబ్బంది లోనికి పంపలేదు. అక్కడే నిలబడ్డంతో సార్ ప్లీజ్ గెటవుట్ అని చాలా మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. దీంతో రఘురామ ముక్కు ఎగ పీల్చుకుని కుమిలిపోయారు. చేసేదేమీ లేక నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇంత కాలం తనకు అపాయింట్ మెంట్లు ఇచ్చిన బీజేపీ నేతలు.. ఇపుడు తనకి పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వకపోవడం ఎందుకో రఘురామకు నెమ్మదిగా బోధపడ్డం మొదలైంది. తానిపుడు వైఎస్సార్సీపీ లేను కాబట్టే బీజేపీ నేతలు తనని పురుగుని చూసినట్లు చూస్తున్నారని అర్ధమైంది. ఇంత కాలం చంద్రబాబు కోసం చెత్త రాజకీయాలు చేసినా కనీసం చంద్రబాబు అయినా తనని షా నివాసంలోకి తీసుకుపోతారేమోనని రఘురామ అనుకున్నారు. కనీసం షా ఇంట్లోకి వెళ్లిన తర్వాత అయినా సెక్యూరిటీకి ఫోన్ చేయించి తనని లోపలికి రమ్మనమని పిలుస్తారని అనుకున్నారు. అయితే అలాంటివేవీ జరక్కపోవడంతో రఘురామకు బాగా కాలింది. ఈ అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే దిగమింగుకుని కదిలారు రఘురామ. రఘురామకు దీన్ని మించిన షాక్ మునుముందు తగులుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని రఘురామ చెప్పుకున్నారు. టీడీపీ,జనసేన, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ తరపున చేస్తానన్నారు. అయితే ప్రస్తుత వాతావరణం చూస్తోంటే రఘురామకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కనపడ్డం లేదని హస్తిన వర్గాలు అంటున్నాయి. అంటే 2024 ఎన్నికల తర్వాత రఘురామ ఇంటి ముందు మాజీ ఎంపీ అనే బోర్డే సెటిల్ అయిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. :::సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
లోకేష్ పిట్టల దొరకి ఎక్కువ, భట్రాజుకి తక్కువ: రఘురాం
-
ఆక్వా జోన్ విధానం తెచ్చింది చంద్రబాబే..
సాక్షి, అమరావతి: ఆక్వా రంగం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం టీడీపీ నేత నారా లోకేశ్‌ను హెచ్చరించారు. భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అంటే ఏంటో తెలుసా? ఈ జోన్ విధానం తెచ్చిందే మీ తండ్రి చంద్రబాబు హయాంలో కాదా.. ఈ విధానాన్ని 2018లో ప్రారంభించి, మీ తండ్రి చంద్రబాబు మధ్యలో గాలికొదిలేస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక సర్వే ద్వారా జోన్, నాన్ జోన్ పరిధిని నిర్ధారించారని తెలిపారు. రాష్ట్రంలో 4.65 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు 3.27 లక్షల ఎకరాలను తీసుకొచ్చి, యూనిట్ రూ.1.50కే విద్యుత్ సబ్సిడీ అందిస్తూ సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు అండగా నిలుస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు యూనిట్ విద్యుత్ రూ.2కే ఇస్తానని ఆక్వా రైతులకు నమ్మబలికి, డిస్కంలకు చెల్లించాల్సి న సబ్సిడీని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మీ తండ్రి ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించడమే కాదు, రైతుల తరఫున డిస్కమ్‌లకు చెల్లించాల్సి న మొత్తాన్ని అణాపైసలతో సహా చెల్లిస్తున్నట్టు తెలిపారు. నరసాపురంలో దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ ఉందన్న విషయాన్ని కూడా మరచి ‘మాకు అధికారాన్నిస్తే ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా’ అంటూ హామీ ఇవ్వడం లోకేశ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. వెనామియా కల్చర్‌కు అనుమతి లేకున్నా కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్నైనా అమలు చేశారా.. అని ప్రశ్నించారు. మీ తండ్రి హయాంలో రొయ్యల ధరలు గంటకో రీతిలో ఉండేవి. ధరలు పతనమైనప్పుడు ఏనాడైనా జోక్యం చేసుకుని ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులను పిలిపించి మాట్లాడారా.. అంటూ నిలదీశారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కరోనా లాక్డౌన్ సమయంలోనూ రొయ్య రైతులకు ఇబ్బంది లేకుండా రవాణ, ఎగుమతులు కొనసాగేలా చర్యలు తీసుకోవడమే కాదు.. గిట్టుబాటు ధర దక్కేలా సీఎం వైఎస్ జగన్ కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు ప్రాసెసింగ్ ప్లాంట్స్, రైతులతో మాట్లాడి ప్రతి 10 రోజులకోసారి రేట్లు నిర్ణయించి, కచ్చితంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆక్వా రైతుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని వాటిని వివరించారు. -
ఆక్వా స్టార్టప్ కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: ఆక్వారంగంలో అంతర్జాతీయ అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఆక్వాఎక్సేఛంజ్ ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో కలిసి ఆక్వా ఎక్సేఛంజ్ కో–పౌండర్ బండి కిరణ్‌కుమార్, సీఈవో పవన్‌కృష్ణ కలిసి ఇటీవల బెంగళూరులో జరిగిన జీ–20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్ సమ్మిట్–2023లో సాధించిన గ్లోబల్ అవార్డును చూపించారు. అవార్డు సాధించిన ఆక్వా ఎక్సేఛంజ్ ప్రతినిధులను అభినందించిన సీఎం.. చిన్న, సన్నకారు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించేలా ఆలోచనలు చేయాలని సూచించారు. -
ఆక్వా రైతును కాపాడుకుందాం..
సాక్షి, అమరావతి : ఆక్వా రైతును కాపాడుకోకుంటే ఆ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కంపెనీలను హెచ్చరించారు. ఆక్వా రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అదే రీతిలో ఈ పరిశ్రమలు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, హేచరీలు, మందుల కంపెనీల ప్రతినిధులతో శనివారం విజయవాడలో జరిగిన సాధికారత కమిటీ భేటీలో ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు యూనిట్ విద్యుత్ రూ.8కి సరఫరా చేస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రమే యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేసినా ఎగుమతిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతో పాటు హేచరీలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీకి ప్రతినిధుల బృందం వస్తే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఆర్‌జెడ్ పరిధిలోని హేచరీలను మూసివేయాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోగలిగామని, ఆ మేరకు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఏఏ) చట్టసవరణ జరిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. వడ్డి రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనధికారిక, నిబంధనలు పాటించని హేచరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెల్లడించారు. 30 పైసలకే వనామీ సీడ్ సరఫరా నాణ్యమైన వనామీ సీడ్‌ను 30 పైసలకు రైతులకు అందుబాటులో ఉంచుతామని హేచరీ యజమానులు భరోసా ఇచ్చారు. నాణ్యమైన టైగర్ సీడ్ దొరకని కారణంగా ఉత్పత్తి దెబ్బతిని నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో టైగర్ సీడ్ ఉత్పత్తిని తగ్గించాలని రఘురాం కోరగా.. హేచరీల యజమానులు ఆ మేరకు స్పందించారు. బ్రూడ్ స్టాక్ క్వాలిటీ మేనేజ్మెంట్పై సెపె్టంబర్ 29న విశాఖలో జరిగే జాతీయ స్థాయి సెమినార్లో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని హేచరీ ప్రతినిధులు చెప్పారు. జాతీయ రొయ్య హేచరీల సంఘం అధ్యక్షుడు యల్లంకి రవికుమార్, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, సీఏఏ డైరెక్టర్ (చెన్నై) పి.శంకరరావు ఎంపెడా రీజనల్ మేనేజర్ జయభేల్ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. హీరోగా ఎంట్రీ!
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 4న రిలీజ్ కానుంది. పెట్లా రఘురామ్ మూర్తి మాట్లాడుతూ– ‘‘నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి, ఘోస్ట్ రైటర్‌గా చేశాను. ఇక మా సినిమా కథ విషయానికి వస్తే... ఈ చిత్రంలో హీరో గొర్రెల కాపరి. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అని హీరో చెబుతుంటాడు. ఇదే మాటను అతను ఊరి జనంతో చెప్పించాడా లేదా? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. -
వాలంటీర్లు ఉద్యోగులు కాదు. మన ఇంట్లో వాళ్ళు దయచేసి వాళ్ళను...
-
విశ్వసనీయతే అధికారానికి సోపానం
విశ్వసనీయత గల నాయకులకు అధికారం దగ్గరగా ఉంటుంది. అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిపాలన సాగించారు. విశ్వసనీయత కోల్పోయినప్పుడు ప్రజలు వారిని గద్దెదించారు. ఉదాహరణకు ఏ సామాజిక మాధ్యమాలూ లేనటువంటి కాలంలోనే ఇందిరాగాంధీ తప్పు చేస్తే ప్రజలు ఓడించి, అధికారానికి దూరం చేశారు. అందుకే విశ్వసనీయత రాజకీయాల్లో చాలా అవసరం. విశ్వసనీయతతో జ్యోతిబసు మూడు దశాబ్దాలు పరిపాలించారు. లాలూ 15 సంవత్సరాలు, ఒకప్పుడు బిజూ పట్నాయక్, ఇప్పుడు నవీన్ పట్నాయక్, కరుణానిధి, జయలలిత, వైఎస్, మమతా బెనర్జీ, ఎన్టీఆర్... ఇలా అనేక మందిని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా కేజ్రీవాల్ ఢిల్లీ లోనూ విశ్వసనీయతతో గెలుస్తూ వస్తున్నారు. నా విశ్లేషణ ప్రకారం భారతదేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ మొదటి వరుసలో ఉంటారంటే అతిశయోక్తి లేదు. గుజరాత్లో మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి, మరో మూడుసార్లు గుజ రాత్ను బయట ఉండి గెలిపించిన నాయకుడిగా ఖ్యాతి చెందారు. అదే విధంగా 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రజలు నరేంద్ర మోదీని నమ్మి భాజపాను గెలిపించారు. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా 2024 పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టుల తర్వాత మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు ప్రజల అచంచల విశ్వాసంతో అధికారాన్ని చేపట్టారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఐదో సారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత తమ ప్రభావాన్ని ప్రజల్లో నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు ప్రజల్లో విశ్వసనీయ నేతగా మన్ననలు పొందారు. ఒంటిచేత్తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పేదప్రజల మనిషిగా సుస్థిర స్థానాన్నిపొందారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మన్నన, విశ్వాసాలు పొందారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పటికీ, మరో 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒకరితో పొత్తుతోనే గెలుపొందారు. ఒంటరిగా ఎప్పుడు కూడా గెలవలేకపోయారు. 1999 ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి భాజపాతో జట్టుకట్టారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్ళీ భాజపా, జనసేనతో జట్టుకట్టి విజయం సాధించారు. 2019లో తెలుగుదేశానికీ, ఎన్టీఆర్‌కూ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని పరువు పోగొట్టుకున్నారు. ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పేయి చరిష్మాతో పొత్తులో విజయం సాధించారు. మరోసారి నరేంద్ర మోదీ హవాలో గెలుపొందారు. కానీ ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేదు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. జనసేనతో కలవాలనీ, భాజపాతో కూడా కలిసి పనిచెయ్యాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. 2014 పొత్తులను మళ్ళీ పునరావృతం చెయ్యాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒంటరి పోరుతోనే బరిలోకి దిగాలని నిశ్చయించారు. ఏది ఏమైనా రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. - రఘురామ్ పురిఘళ్ళ బీజేపీ సీనియర్ నాయకులు, న్యూఢిల్లీ -
BJP: దక్షిణాదిలో బలపడుతోంది
దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతాపార్టీ దృష్టి అని తరచుగా మనం వింటున్నాం, వార్తలను చదువు తున్నాం. భారతీయ జనతాపార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటక, పాండిచ్చేరిలో మాత్రమే అధికారంలో ఉంది. అయితే పాండిచ్చేరి చాలా చిన్న రాష్ట్రం. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలం పెంచుకోవా లనీ, ఇక్కడ కూడా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యాలనీ అనేక సంవత్సరా లుగా భాజపా అనుకుంటోంది. కేరళ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో భాజపా గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించింది. అయితే సీట్ల విషయంలో ఆశించిన ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం పెంచుకోగలిగింది కానీ సీట్లు మాత్రం రాలేదు. ఇప్పుడు పట్టుదలగా 2024 ఎన్నికల కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. రెండు బలమైన కూటములైన యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య భాజపా ఈసారి తన సత్తా చాటాలని చూస్తోంది. తమిళనాడు విషయానికి వస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భంగపడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుని నాలుగు శాసనసభా స్థానాలను గెలుచుకొంది. ముగ్గురు మాజీ రాష్ట్ర అధ్యక్షులకు కేంద్రంలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పించింది. రాష్ట్ర పార్టీ పగ్గాలను ఐపీఎస్ అధికారీ, యువకుడూ అయిన అన్నామలైకు అప్పగించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కేంద్ర నాయకత్వం. జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకే బలహీనపడటం తెలిసిందే. ఆ విధంగా ఏఐఏడీఎంకే స్థానాన్ని భాజపా భర్తీ చెయ్యాలని చూస్తోంది. 5 దశాబ్దాలుగా ప్రాతీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీ ఎంకేలు ఏలిన చోట జాతీయ పార్టీగా భాజపా... యువ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో తమిళనాడులో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలయిన – వైసీపీ, టీడీపీల మధ్య ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని మాత్రమే గెలిచినప్పటికీ 2019 పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చి ఏకంగా 4 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికలలో మరో రెండు శాసనసభ స్థానాలను గెలిచి మొన్న మునుగోడులో టీఆర్ఎస్కు గట్టి సవాల్ విసిరింది. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఒకవైపు, యువ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తన పాదయాత్రతో మరోవైపు కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు డా. కే. లక్ష్మణ్‌ను రాజ్యసభ సభ్యుడిగానూ, ఓబీసీల జాతీయ అధ్యక్షుడి గానూ చేశారు. డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వారు ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగుర వెయ్యాలని తీవ్రంగా పనిచేస్తున్నారు. మొత్తం మీద దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్థిరమైన వేగంతో ముందుకు సాగుతోంది. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!) - రఘురామ్ పురిఘళ్ళ బీజేపీ సీనియర్ నాయకులు raghuram.bjp@gmail.com -
రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు
-
రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్‌కు సింధు అభినందన
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్‌ను అభినందించారు. సాంకేతికత సహాయంతో ప్రజల ఇళ్లకే వెళ్లి రొమ్ము క్యాన్సర్ ముందస్తు గుర్తింపుపై అవగాహన కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అగ్మెంటెడ్ రియాలిటీ సేవల్ని సోమవారం సింధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల పాలిట రొమ్ము క్యాన్సర్ పెనుశాపంగా మారుతోంది. ఈ క్యాన్సర్ మహమ్మారిపై సమగ్రమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పి రఘురామ్‌కు అభినందనలు. రొమ్ముక్యాన్సర్‌పై నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొన్నాను. ఈ కార్యక్రమం ప్రజలకు చేరువై విజయవంతం అవడంలో నా సెలబ్రిటీ హోదా తోడ్పడితే అది నా అదృష్టంగా భావిస్తాను’అన్నారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.రఘురామ్ మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే ఏదో మాట్లాడకూడని విషయంగా పరిస్థితులు మారాయి. దీనిపై అందరూ అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొనే పరిస్థితులు రావడానికి గత 12 ఏళ్లుగా ఉషాలక్ష్మీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారి లైఫ్‌సైజ్ అగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించి మా సంస్థ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నా దత్తత గ్రామమైన ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయనున్నాం. చరిత్రాత్మకమైన ఇలాంటి కార్యక్రమాల్లో తమకు తోడ్పాటునందించినందుకు పీవీ సింధుకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. 'ఏబీసీస్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్' పేరిట 2017లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే 12 భాషలో దీనిని తయారు చేశారని వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. -
బాబును క్షమించడం కల్లోమాటే!
ఇప్పుడు దేశంలో అందరి చూపు బీజేపీపైనే బీజేపీ ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది. ఎలా ప్రజల అభిమానం చూరగొంటోందన్నదాని పైనే అందరి మథనం. బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా కొందరు కుట్రలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు అందుకు నాయకత్వం వహించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ... ధృతరాష్ట్రుడిలా దాన్ని చూడకుండా నానాయాగీ చేసి ఎన్నికల గోదాలో చతికిలపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో చేస్తున్న కార్యక్రమాలకు తన స్టిక్కర్లు వేసుకొని విర్రవీగిన చంద్రబాబుకు జనం కర్రుగాల్చి వాతపెట్టారు. ఇదంతా కళ్ల ముందు కన్పిస్తున్న వాస్తవమైతే... కొందరు కమ్యూనిస్టు విశ్లేషకులు లేని పోని అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీజేపీపై బురదజల్లాలని చూస్తున్నారు. ‘బాబు భజనలో ఏపీ బీజేపీ’ అంటూ విశ్లేషణలు చేస్తూ... దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలు ఇచ్చిన తీర్పును అభాసుపాలుజేస్తున్నారు. చంద్రబాబుకు బీజేపీ నేతలు కొమ్ముగాస్తున్నారంటూ పెడర్థాలు తీస్తున్నారు. అసలు చంద్రబాబుకు రాష్ట్ర బీజేపీ కొమ్ముగాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంద్రబాబును బీజేపీ చంకన ఎత్తుకుంటుంది? బీజేపీని అనవసరంగా ప్రజల ముందు దోషిగా చూపించాలని ప్రయత్నం చేసిన వ్యక్తిని గత ఎన్నికల్లో ఓడించిన ఘనత పార్టీది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోరాడి... కమలం పార్టీ దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఎన్నికలకు ఏడాది ముందు.... బీజేపీపై విషం చిమ్మారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై వైరం పెంచుకొని విషంకక్కారు. సాక్షాత్తూ తిరుమల సందర్శనకు వచ్చిన బీజేపీ చీఫ్‌పై రాళ్ల దాడి చేయించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే నల్ల బెలూన్లు ఎగురేసి... తన పరువు తీసుకోవడమే కాక... రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిన ఘనుడు చంద్రబాబు. బీజేపీపై అడుగడుగునా దుష్ప్రచారం సాగించిన చంద్రబాబును పార్టీ ఎన్నటికీ క్షమించదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ్మనారాయణ జిల్లా పర్యటనల్లో ఉన్న సమయంలో అనంతపురం, ప్రకాశం జిల్లాలోనూ దాడి చేయించిన ఘటనలను పార్టీ ఎలా మర్చిపోతోంది. పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంటిపై రాళ్ల దాడి చేయించిన హీన చరిత్ర టీడీపీది. ఇవన్నీ తెలియకుండా బాబు భజన చేస్తోన్న బీజేపీ అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదం. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ... చంద్రబాబు దురాగతాలను క్షమించరాదన్న ఉద్దేశం పార్టీ ఓటర్లు, కార్యకర్తలు వైసీపీకి మద్దతుపలికారు. అంతేగానీ టీడీపీకి మద్దతిచ్చేలా ఎలాంటి నిర్ణయాలు బీజేపీ తీసుకోదు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి... ప్రజాకాంక్షలను నీరుగార్చిన చంద్రబాబును భారతీయజనతా పార్టీ ఎన్నిటికీ క్షమించదు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తుంటే... కమ్యూనిస్టు విశ్లేషకులు మాత్రం ఏపీ బీజేపీ చంద్రబాబును కాపాడుతుందంటూ ఘోరంగా విశ్లేషిస్తున్నారు. చంద్రబాబును కాపాడే యోచన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఎంత మాత్రం లేదు. టీడీపీతో కలిసే యోచన భవిష్యత్‌లోనూ పార్టీకి లేనేలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను మింగేసిన టీడీపీ నేతల అవినీతిని జగన్ సర్కారు రుజువు చేయాలి. అవినీతి అనకొండలా దోచేసుకున్న బాబు జమానాపై పూర్తి స్థాయి విచారణ చేయించాలి. చంద్రబాబు అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో... రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. వైసీపీ ప్రజారంజక పాలన చేస్తే స్వాగతిస్తోంది. నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి విజన్ ప్రకారం బీజేపీ సహకారం అందిస్తుంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సూచనలు చేస్తోంది. విమర్శిస్తోంది. శృతిమించే నిర్ణయాలుంటే పోరాటానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధమే. వ్యాసకర్త : రఘురామ్, బీజేపీ సమన్వయకర్త ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని బీజేపీ అధికార ప్రతినిధి పి. రఘురాం ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరాశ నిస్పృహలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణల మీద టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా చంద్రబాబు ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే ఉన్నారని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు మాత్రం ఒడిపోతామనే భయంతో రహస్య పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుడు పి. రఘురాం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ సీఎం చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్, కెఏ పాల్ లాంటి వాళ్ళు ఏమి మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ జిరాక్స్ కాపీలు తయారు చేసి ఇస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనని అన్నారు. విశాఖపట్నం నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలో సిన్సియారిటీ లేదన్నారు. చంద్రబాబు సలహాతోనే ఆయన జనసేన పార్టీలో చేరారని రఘురాం తెలిపారు. -
మనోహర ‘ప్యారి’కర్
ఉక్కునరాలు... ఉక్కుకండరాలు... అతడే ఓ సైన్యం. పాలనలో అతడో చైతన్యం. నిత్యనూతన స్రవంతి. ప్రజల్లో మని షిగా ప్రజల్లో తిరుగుతూ... అతి సామా న్యుడు అసామాన్యుడిగా నిలిచాడు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అస్థిరతకు చిరునామాగా నిలిచిన గోవా రాజకీ యాల్లో సుస్థిర నినాదాన్ని మార్మోగించాడు. ప్రజలకు సరికొత్త పాలనను అందించి బీజేపీ ప్రభుత్వాల్లో నవశకం పూరించాడు. ఆయనే పరీకర్. మనోహర్ పరీకర్ డిసెంబర్ 13, 1955 గోవాలోని ముపాసలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరి అంచలంచెలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ప్రమోషన్ పొందారు. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తిరిగి ఆర్ఎస్ఎస్లో సంఘ్ చాలక్‌గా వ్యవహరించారు. 26 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో కీలకనేతగా ఎదిగారు. గోవాలో రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృ తం చేశారు. అద్వానీ రథయాత్రకు గోవాలో నీరాజనం పలికారు. బీజేపీకి జవజీవాలు నింపారు. విభిన్న సంస్కృతుల సంగమమైన గోవాలో కాషా యం జెండా రెపరెపలాడేలా చేయడంలో పరీకర్ది ముఖ్యభూమిక. నాలుగుసార్లు గోవా సీఎంగా వ్యవహరించిన పరీకర్ 2000 సంవత్సరంలో తొలిసారి, 2017లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతి లక్ష రూపాయలు పొందేలా పథకాన్ని ప్రారంభించి... అక్కడి మహిళా లోకానికి పెద్దన్నగా నిలిచాడు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ పరీ కర్. ఎన్నో హంగులు, ఆర్భాటాలతో ఊదరగొడుతున్న నాయకాగణానికి భిన్నంగా పారికర్ కన్పిస్తారు. హాఫ్ హ్యాండ్ షర్ట్ ధరించి, సాధారణ దుస్తులతో సగటు భారతీయుడిని ప్రతిబింబిస్తారు. మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రి అయినా, తన సొంత నివా సంలోనే ఉండేవారు. అత్యాధునిక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వినియోగించే ఇన్నోవా కారునే వినియోగించేవారు. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ట్రావెల్ చేసేవారు. 63 ఏళ్ల వయసులో సైతం రోజుకు 16 నుంచి 18 గంటలకు పనిచేసేవారు. గోవా మిస్టర్ క్లీన్‌గా ఆయనను అక్కడి ప్రజలు పిలుస్తారు. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ప్రధానిగా నరేంద్రమోదీని సమర్థించి... దేశానికి బలమైన నాయకత్వం అవసరమని నినదించారు. పారికర్ సింప్లిసిటీ గురించి చెప్పడానికి ఇక్కడో ఉదంతాన్ని చెప్పాల్సి ఉంటుంది. అది గోవా పనాజీ ప్రాంతం... ఒక యాభై ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూట ర్‌పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి 25 ఏళ్ల యువకుడు ఆపకుండా హారన్ కొడుతున్నాడు. డీఎస్పీ కొడుకునని.. ఎందుకు నాకు దారివ్వరంటూ ప్రశ్నించాడు. అయితే ఇంతలో హెల్మెట్ తీసి ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. నువ్వు డీఎస్పీ కొడుకువైతే... ఈ రాష్ట్రానికి నేను సీఎంనంటూ చెప్పడంతో తెల్లబోయాడు ఆ కుర్రాడు. గోవా ముఖ్యమంత్రి, దేశ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆ వ్యక్తి. అసెంబ్లీకి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. పోలీస్ కేస్లలో జోక్యం ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంటే... యావత్ గోవా కంట కన్నీరుపెట్టింది. గోవా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మనోహర్ పరీకర్... దేశ రక్షణ మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. భారత రక్షణ దళాలకు ప్రత్యే కంగా వినియోగించే... ఒక్కో జత షూను ఇజ్రా యెల్ నుంచి 25,000కు దిగుమతి చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పరీకర్... కొనుగోలు వెనుక వాస్తవాలను నిర్ధారణ చేసుకొని... ఆ తర్వాత భారత కంపెనీ నుంచి నేరుగా రూ‘‘ 2,200కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. తన కేబినెట్లో ఉన్న అరుదైన మంత్రి పరీకర్ అని, వజ్రసమానుడంటూ ప్రధాని మోడీ నుంచి కితాబు అందుకున్నారు. అందుకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరీకర్‌కు రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ తాను గోవాపైనే ప్రేమ చూపించారు. గోవా ప్రజలంటే అమితమైన ప్రేమ. గోవా ప్రజల సేవ లోనే ప్రాణాలు అర్పించారు. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకుడు ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
‘సీబీఐ అంటే వణుకుతున్న చంద్రబాబు’
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : 'రాష్ట్రంలోఅవినీతి తారా స్థాయికి చేరింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రతీ పనిలోనూ అవినీతి. పిల్లలకు పెట్టే గుడ్లు, కందిపప్పు, పుస్తకాల్లోనూ అవినీతి జరుగుతుంది. ఇంతలా అవినీతి జరగటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ అంటేనే భయపడుతున్నారు. తాను చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని వణికి పోతున్నార'ని బీజేపీ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పురిగళ్ల రఘురాం ఆన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ మంచివారని, దమ్మున్న ప్రధాని అని, రాష్ట్రానికి కావల్పినన్ని నిధులు ఇస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అనడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చెప్పింది మీరు కాదా అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరుతో విసిగిపోయిన కొందరు సీనియర్ తెలుగు దేశం నాయకులు పార్టీని వదలి వెళ్లిపోవాలని చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన 600 అబద్దపు హామీల్లో ఆరు హామీలనైనా నేరవేర్చలేని అసమర్ధ ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. రైతుల కోసం కేంద్రం ప్రకటించిన 17 శాతం ఫసల్‌బీమా కూడా ఇవ్వకుండా అన్నదాతల పొట్టకొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమౌతుంటే చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రాల సీఎంలతో కలిసి ఫొటోలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్లపై మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువత జీవితాలతో అడుకుంటున్నారని రఘురాం విమర్శించారు. -
స్కూల్ యాజమాన్యం అకారణంగా టీసీ ఇచ్చి పంపేస్తే..
సాక్షి, సిటీబ్యూరో : కుమార్తె చదివే స్కూల్ యాజమాన్యం అకారణంగా టీసీ ఇచ్చి పంపేస్తే.. ఆ కారణంగా చిన్నారి తీరని మనోవ్యధకు గురై అనారోగ్యం పాలైతే.. ఏం చేయాలి? ఎందుకొచ్చిన గొడవంటూ మరో స్కూల్లో చేర్పించి ఊరుకోవాలా? తమని అంతటి క్షోభకి గురిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థపై కేసు వేసి న్యాయం కోసం పట్టు వదలక పోరాడాలా? ఈ ప్రశ్నలకు మనలో చాలా మంది మొదటి సమాధానమే వెతుక్కుంటారేమో గానీ.. ఢిల్లీలో నివసించే తెలుగువాడైన రఘురాం మాత్రం అన్యాయం చేసిన పాఠశాలపై అలుపెరగని పోరాటం చేసి గెలిచారు. ఇటీవల వెలుగు చూసిన ఆయన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఎందరో ప్రైవేట్‌పాఠశాలల బాధితుల్లో స్ఫూర్తిని నింపింది. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ విద్యాసంస్థల చట్టవ్యతిరేకవిధానాలు, తీరుతెన్నులపై ఆగ్రహంగా ఉన్నవారికి దన్నుగా మారారు. మరెందరో తన బాటలోనడిచేందుకు కారణమయ్యారు. మా పాప ఢిల్లీలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదివేది. పేరెంట్స్ మీటింగ్స్‌కి నేను అటెండయ్యేవాణ్ని. పలు అంశాలపై యాజమాన్య వైఖరిని తప్పుబట్టేవాడిని. స్కూల్లో అమలు చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులను ప్రశ్నించడంతో యాజమాన్యం నాపై కక్ష పెంచుకుంది. సరైన కారణం లేకుండా నా కూతుర్ని స్కూల్ నుంచి పంపేసింది. అనుకోని శిక్షకు మా పాప తల్లడిల్లింది. అనారోగ్యానికి గురైంది’ అంటూ చెప్పారు రఘురాం. ఢిల్లీలో ఇంద్రప్రస్థ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డీన్ రఘురాం.. దీనిని అంత తేలికగా వదలదలచుకోలేదు. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. పాప భవిష్యత్తు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నా కార్పొరేట్ స్కూల్స్‌కి బుద్ధి చెప్పి మరెందరో పిల్లల తల్లిదండ్రులకు ఆసరా అందించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. . రఘురాం ఏంచెప్పారో ఆయన మాటల్లోనే.. ఐదేళ్ల పోరాటం.. ఈ అంశంపై కోర్టులో న్యాయం కోసం ఐదేళ్లు పోరాటం చేశా. ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చాయి. అయినా లొంగలేదు. చివరికి సెషన్స్ కోర్టు మా చిన్నారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మా పాపను తరగతి గదిలోకి వెళ్లనీయకుండా బయటే ఉంచినందుకు, ఆమెని 7గంటల పాటు స్కూల్లో తరగతులకు హాజరు కానీయకుండా తీవ్రమైన మనోవేదనకు గురిచేసినందుకు.. నష్టపరిహారంగా చెరో రూ.2.5లక్షలు చొప్పున చెల్లించాలంటూ ప్రిన్సిపాల్, స్కూల్ డైరెక్టర్లను ఆదేశించింది. స్కూల్ విద్యార్ఙినులపై ఇప్పటివరకూ వచ్చిన తీర్పులు శారీరక హింస, వేధింపులకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే తొలిసారి చిన్నారి మనోవేదనకు సైతం విలువిచ్చి న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఎందరో తల్లిదండ్రులకు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా కార్పొరేట్ స్కూల్స్ అవకతవకలపై పేరెంట్స్ అవగాహన పెంచుకోవాలి. వీటిపై దృష్టి పెట్టాలి.. స్కూల్లో అడ్మిషన్ల కోసం ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో పిల్లలకు, పేరెంట్స్‌కి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం చట్ట విరుద్ధం. వీటిని మనం అంగీకరించకూడదు. ఫీజులు ఎక్కువ వసూలు చేసే స్కూల్స్ తప్పనిసరిగా ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తున్నాయి. లేకపోతే పేరెంట్స్ ఊరుకోరు. పిల్లలకు పర్సనల్ అటెన్షన్ ఇవ్వలేకే కదా రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం? మరి ఈ మార్కులు ఏమిటి ఇలా వస్తున్నాయి? అంటూ గొడవలకు దిగుతారు. దీంతో ఏదో రకంగా సరిగా చదవని పిల్లలకి కూడా మార్కులు వచ్చేలా చేసేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. యాక్టివిటీ ఛార్జెస్, మిస్లీనియస్ చార్జెస్ అవీ ఇవీ అంటూ సంవత్సరం మొత్తం మీద ఎన్నో రకాల వసూళ్లు చేస్తున్నారు. రకరకాల రూల్స్ పెట్టి వాటిని అతిక్రమించారంటూ పిల్లలకు ఫైన్లు అమలు చేస్తున్నారు. ఇటీవల కోల్‌కతాలోని ఒక స్కూల్లో పిల్లలు ఆడిడాస్ షూస్ వేసుకుని రావాలని రూల్ పెట్టారు. దీనిపై కోర్టుకి వెళితే... ఆ అధికారం మీ లేదంటూ హైకోర్టు మొట్టికాయలు వేసింది. స్కూల్ ఎంబ్లమ్ ఉండాలని నిబంధన పెట్టి యూనిఫామ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటివి తల్లిదండ్రులు గుర్తించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. -
బాలయ్య మాస్టారు
సువర్ణ కదిపి లేపడంతో చటుక్కున మెలకువ వచ్చింది రఘురాంకు – ‘‘లేవండి. మావయ్యగారు ఇంత రాత్రివేళ బయటకు వెళుతున్నారు. అత్తయ్యగారు వద్దంటున్నా వినటంలేదు లేవండి’’.‘‘ఏంటి నువ్వంటోంది?’’ లుంగీ సరి చూసుకుని లేస్తూ భార్యను అడిగాడు. ‘‘అత్తయ్య, మావయ్య మాటలు వినబడుతుంటే తలుపు కొంచం వారగా తెరచివిన్నాను. ‘హోటల్ ఓపెన్‌గానే ఉంటుంది. వెళ్లొస్తాను’ అంటున్నారు మావయ్య. ‘అర్ధరాత్రి కావస్తోంది. ఇప్పుడేం వద్దు. నామాట వినండి. వొద్దు వెళ్లొద్దు’ అని అత్తయ్య బతిమలాడుతున్నారు. ఆయన ససేమిరా వినడంలేదు. ‘కాసేపట్లో వచ్చేస్తాను. నువ్వు పడుకో’ అంటున్నారు. ‘ఇంట్లో పిల్లలంతా ఉంటే మీరిలా ఇప్పుడు వెళ్ళడం బాగోలేదు. నామాట వినండి. పడుకోండి. అవతల కొడుకూ కోడలు, ఇటు అమ్మాయీ అల్లుడు ఉన్నారు. ఆరుగురు మనవలు, మనవరాళ్ళు ఇంట్లో ఉంటే ఇప్పుడు మీరిలా అర్ధరాత్రి దొంగచాటుగా బయటకు వెళ్ళడం.. ఛ ఛ. వొద్దండి. నామాట వినండి. పిల్లలు వింటే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి’ అని అత్తయ్య బతిమలాడుతున్నారు. కాని మావయ్య గారు ఏవీ వినే ధోరణిలో లేరు. అలా గుమ్మం వరకూ అత్తయ్యగారు బతిమలాడుతూనే ఉన్నారు. మావయ్యగారు మృదువుగా ఆమెను వారిస్తూ తలుపు తీసుకుని బయటకు వెళుతున్నారు. ఇక ఆగేలా లేరని మిమ్మల్ని లేపాను.’’ వివరంగా చెప్పింది సువర్ణ. ఏదో చిన్న విషయంగా కనిపిస్తున్నా నాన్నగారి గురించి తెలిసిన వారికీ ఇది పెద్ద విషయమేననిపించింది రఘురాంకు. బాలయ్య మాస్టారంటే చుట్టుపక్కల గ్రామాలు దాటి మండలాలు దాటి అసలు జిల్లాలో తెలియని వారు ఉండరు. గంగూరు జిల్లాపరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా, ఓ సిన్సియర్ మాస్టారుగా, అత్యుత్తమ నైతిక విలువలున్న పెద్ద మనిషిగా ఆయన ఓ హిమవన్నగం. ఎంతో మంది పెద్దలు, రాజకీయ నాయకులు, మేధావులు, టీచర్లు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గౌరవించే సమున్నత మూర్తిమత్వం ఆయనది.నిజానికి ఆయనలో రెండు పార్శా్వలు లేవు. ఇంటా బయటా ఎక్కడైనా అదే ప్రవర్తన. అదే వ్యక్తిత్వం. జీవితమంతా అదే నిబద్ధతతో రూపొందించుకున్న ఆదర్శప్రాయమైన జీవితం. పిల్లల్నీ అలాగే పెంచారు. అలాగే చదివించారు. కొడుకు రఘురాం, కూతురు సుజాత అలాగే పెరిగారు. చక్కగా మాస్టారు పెంచిన విధానంలోనే చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మంచి జంటలను ఎంపిక చేసి చక్కగా పెళ్ళిళ్ళు చేశారు. మళ్ళీ ఇద్దరూ చెరో ఇద్దరిని కని మాస్టారిని తాతను చేశారు. ఆయన ఆదర్శప్రాయంగా నిర్మించిన బాటలోనే పిల్లల జీవితాలు పూలపూల పరిమళతోటలుగా, సరాగాలసిరిమల్లె పందిళ్ళుగా, సుస్వరాల సుమగంధాలు విరజిమ్ముతున్నాయి. వారి కుటుంబాలు వాటి ప్రవర్తన, పాటిస్తున్న నైతిక విలువలు ఎందరో ఊరివారికి ఆదర్శనీయం. ప్రతి పండుగకూ రఘురాం కుటుంబం, సుజాత కుటుంబం పిల్లలతో మాస్టారింటికి వచ్చి తీరాల్సిందే. ఇది ఈసారి, ఈ సంక్రాంతికి కూడా జరిగింది. పగలల్లా పిల్లలూ పెద్దలూ ఎన్నో ఆటలాడారు. కబుర్లు చెప్పుకున్నారు. ఊర్లో తిరిగారు. పొలాల్లో ఎగిరారు. పాడిగేదెలతో ఆవు తువ్వాయిలతో ఎగిరిదూకారు. కోళ్ళ వెంట, బాతుల వెంట పరుగులెత్తారు. కొంగలతో, కోకిలలతో, పాడారు. ఊగారు. తూగారు. ఆడి ఆడి అలిసిపోయారు. అలసి సొలసి ఆనందించారు. మాస్టారు సతీమణి శ్యామలకు మాత్రం ఈ ఆటపాటలతో పాటు వంటింటి పనులన్నీ మీద పడ్డాయి. కోడల్ని, కూతుర్ని కూర్చోబెట్టి తనే అన్నీ చూసుకుంటోంది.. పండుగలకు ఇద్దరు పని మనుషులను పెట్టుకోమని మాస్టారు ఎంతగా బతిమలాడినా వొప్పుకోలేదు. చివరికి పిల్లలు అలా ఐతే ఇంటికి రాము అని సమ్మె ప్రకటిస్తే కొంచం మెత్తగిల్లింది. వచ్చే ఏడాది చూద్దాం అంది. కాని ఈ ఏడాదికే వొప్పుకుంది. కారణం ఓపిక సన్నగిల్లడమే. అదికూడా పని మనుషులు సహకారం వరకే గాని వంటలన్నీ తనే వండాలని వొప్పందం చేసుకుంది. అప్పుడే తనకు తృప్తి అని ప్రకటించింది శ్యామల. ఆ మాత్రమైనా వొప్పుకున్నందుకు తల్లి చేతివంట రుచి మరెవ్వరికీ రాదు కాబట్టి తమకు లొట్టల భాగ్యానికి లోటు రాదు కాబట్టి పెద్దలూ పిల్లలూ అంగీకరించారు.అలా ఈ సంక్రాంతి కూడా మరో చిరస్మరణీయమైన పండుగగా గడుస్తోంది. ఈరోజు మరపురాని విధంగా గడిచిందని అందరూ ఏకగ్రీవంగా ప్రకటించారు. దానికి ప్రధాన కారణం శ్యామల చేసిన పండుగ వంటలు. ఉదయం తలంటుకోగానే తినాలంటూ నాలుగు రకాల స్వీట్స్ వండేసింది. మళ్ళా అరగంటకు టిఫిన్లకు మరో నాలుగైదు రకాలు. అలా గంటగంటకూ, ప్రతి ఆటకు, పాటకు మధ్య మధ్య ఏదో వొకటి అందరి నోటికి అందిస్తూనే ఉన్నారు పనిమనుషులు. పిల్లలు ఎలా లొట్టలేస్తూ తింటున్నారో తిరిగి శ్యామలకు రిపోర్టు వెళుతూనే ఉన్నది. అలా పగలు, రాత్రి ప్రతి క్షణం మృదుమధురంగా గడిచింది.అంతా తిని అలసిసొలసి మామ్మకు, తాతకు థ్యాంక్స్ చెప్పి వారివారి గదుల్లోకి నిష్క్రమించారు. భుక్తాయాసంతో అంతా నిద్రకుపక్రమించారు. ఆ తర్వాత జరిగిందీ సంఘటన. అవతల హాలులో మాస్టారు, శ్యామల మాట్లాడుకుంటున్న మాటలు, విషయం కోడలు సువర్ణ చెవినపడ్డాయి. భర్త రఘురాంను లేపింది. రఘురాంకు తిండి మత్తు, నిద్ర మత్తు వదలిపోయాయి. లేచి లుంగీ సర్దుకున్నాడు. తల్లి శ్యామల లోపలికెళ్ళి తలుపేసుకుంది. ఆమెను అడగాలని ఉన్నా ఏమడిగితే ఏం చెబుతుందో.. ఏ భయంకర నిజాలు వినాల్సి వస్తుందోననిపించింది రఘురాంకు. బావను లేపుదామనుకున్నాడు. అతనో రకం. ఓవర్‌గా రియాక్ట్ అయ్యే బాపతు. విని ఏమంటాడో తెలియదు. చెల్లిని లేపితే? ఊహు.. బావ కూడా లేచొస్తాడు.సువర్ణే బెటరు. తనతో చెప్పి ఊరుకుంది. తనే ఏదైనా చెయ్యాలి. తల్లిదండ్రుల విషయంలో ఇప్పుడు, ఈ వయస్సులో, ఇలాంటి రాత్రివేళ ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటి దేవుడా అనుకుంటూ ప్యాంట్ వేసుకున్నాడు.‘‘ఏం చెయ్యబోతున్నారూ?’’ అంటూ దీర్ఘం తీసింది సువర్ణ, ఎగాదిగా చూస్తూ. ‘‘ఏం తోచటం లేదే’’ అన్నాడు షర్టు గుండీలు పెట్టుకుంటూ. తండ్రి ప్రవర్తన, తండ్రిపై సందేహం, తండ్రిని నిలదీసే సన్నివేశం జీవితంలో వస్తుందని ఎప్పుడూ ఊహించని రఘురాం ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకపోయినా చెప్పులు తొడుక్కుని బయటకు వచ్చాడు. ఇది ఎవరికీ చెప్పే సమస్య కాదని, తనే తేల్చుకోవాలని అస్పష్టంగా అనిపిస్తుంటే వెంటనే ఇంట్లోంచి బయటకు రావటం మినహా మరో మార్గం లేదు. బయట వీధి అంతా ప్రశాంతంగా ఉంది. అసలు ఊరంతా టీవీలు చూస్తూ నిద్రను ఆహ్వానిస్తోంది. గాలి హీటు తగ్గి చల్లచల్లగా గారాలు పోతోంది. నేలపై ఎండుటాకులు గాలికి మెల్లగా హాయిగా కదులుతున్నాయి. ఎక్కడో కుక్క పిల్ల మూలుగు లాంటిది దూరంగా వినిపిస్తోంది. వీధి దీపాలు అక్కడక్కడా ఎక్కువగా, అక్కడక్కడా తక్కువగా వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో దోమలు గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఏదో శబ్దం లాంటిది చెవికి సోకుతోంది. అటూ ఇటూ చూస్తూ కళ్ళు చికిలించి ముందుకు చూస్తూ లుంగీ సర్దుకుంటూ కదులుతున్నాడు. చటుక్కున ఓ సందేహం వచ్చింది. తనిప్పుడు ఎవరి కంటనైనా పడే అవకాశం ఎక్కువగా ఉంది. చూసిన వారెవరైనా పలకరిస్తే, ‘ఎక్కడికి రఘురాం బాబూ?’ అంటే? ‘ఇంత రాత్రేల బయటకు వచ్చారు. నాన్నగారికి చెప్పే వచ్చారా?’ అని డౌటు ప్రకటిస్తే? అటూ ఇటూ చూస్తూ తండ్రి జాడకోసం దూరంగా చూపు సారిస్తూ వడివడిగా నడుస్తున్నాడు. అనుకున్నట్లే జరిగింది. కొండారెడ్డి మావయ్య చూడనే చూశాడు. ‘‘ఏంటల్లుడూ.. ఏంటి ఇంత రాత్రేల రోడ్డుమీద షికారా! ఏంటి.. ఏంటికత?’’ కొంటెతనం మేళవించి, నవ్వుకలిపి వదిలాడు బాణంలాంటి డైలాగు. అంత రాత్రివేళ కూడా ఆయన మీసంమీద చెయ్యి వేసి మెలిదువ్వడం స్పష్టంగా కన్పిస్తోంది.కొండారెడ్డి బాలయ్యకు మంచి స్నేహితుడు. ఆయనపై జోక్ వెయ్యగల చనువు, ధైర్యం, అంతకుమించి నీతి నిజాయితీ గల పెద్ద రైతు. అచ్చతెలుగు రైతు అంటే కొండారెడ్డి మావయ్యే. విన్నవెంటనే కంగుతిన్నాడు రఘురాం. అంతలోనే ఆయన అంతరాత్రి కూడా ఫెళఫెళలాడే పేటేరు ఖద్దరు పంచెలో కనపడటం విస్మయం కలిగించింది. ‘‘నేను సరే. ఏదో కాస్త చల్లగాలి కోసం లుంగీతో బయటకొచ్చాను. నువ్వేంటి మావయ్యా! అర్ధరాత్రి కూడా సోగ్గాడు శోభన్‌బాబులా మెరిసిపోతున్నావ్?’’ అన్నాడు. సోగ్గాడు సినిమా ఆయన ఆరాధ్య సినిమా అని, శోభన్ బాబు అంటే ప్రాణం పెడతాడని రఘురాంకు క్షుణ్ణంగా తెలుసు. అనుకున్నట్లే కొండారెడ్డి పడిపోయాడు. ముసిముసిగా మొదలెట్టి హాయిగా ఆకాశందాకా వినిపించేలా భళ్ళు భళ్ళున నవ్వాడు. పెద్ద సిటీలో పెద్ద హోదాలో ఉన్న రఘురాం లాంటి ఆదర్శ యువకుడు తనతో కొంటెగా పరాచికాలాడటం ఆయనకెంతో ఆహ్లాదంగా అనిపించింది. కాసేపు కాలవ గట్టుకు తీసుకెళ్ళి కబుర్లు చెప్పుకుందామని ప్రతిపాదించబోయాడు గాని మాట్లాడుతూనే ముందుకు కదులుతున్న రఘురాం, ఏదో ఆలోచనలో ఉన్నట్లు గ్రహించి తానూ చుట్ట తాగడానికి ఇంట్లోంచి బయటకొచ్చాడు కాబట్టి ఆ పనిమీద ముందుకు సాగిపోయాడు. ‘హమ్మయ్య’ అనుకున్నాడు రఘురాం. అతనికి కొంచెం చెమట మొదలయ్యింది. ‘నాన్న ఎటు, ఎక్కడికి వెళ్ళినట్లు?’ నడకలో, ఆలోచనలో, వేగంపెరిగింది. మెడ అన్ని పక్కలకూ గిర్రునతిరుగితూ వెదుకుతోంది. బాలయ్య మాస్టారు కనబడలేదు. ఊరు ఊరుగా కొంచం పెద్దదే గాని షాపులు, షాపింగ్ సెంటర్లు, షాపింగ్ ఏరియా అంటూ లేదు. ప్రధాన రోడ్డు మీద మరో ప్రధాన కూడలి. సెంటర్ అంటారు అంతా. ఇప్పుడా సెంటర్ మెదట్లోకి ప్రవేశించాడు రఘురాం. తండ్రి కోసం వెతగదగ్గ చోటు అదే. ఇక్కడే, ఎవరైనా ఏదైనా కొనాలన్నా, అసలు ఈ ఊర్లో దొరికేవి ఏవిటో తెలుసుకోవాలన్నా ఇక్కడే. ఆ సరదా తీర్చుకోవాలి. ఇహ మిగిలింది అంతా నివాస ప్రాంతమే. ఆయా ప్రాంతాలలో తండ్రి కోసం వెదకనక్కరలేదు. మరి ఎటు వెళ్ళినట్లు? సెంటర్ వైపు నడక పెంచాడు.నాలుగడుగులు వేశాడో లేదో, ‘‘రఘు’’ అన్న పిలుపు చాలా దగ్గరలో వినపడి కాలికి ఏదో అడ్డుపడ్డట్లు ఆగిపోయాడు. కొంచం ఆశ్చర్యంతో అటే చూశాడు. ఆ చీకటిలో చిన్న గేదె దూడ లాంటి మనిషి ఆకారం. చొక్కా లేకుండా పంచతో కనిపించాడు. తనను పేరుపెట్టి పిలిచింది ఎవరో అని కళ్ళు చికిలించి చూసిన రఘురాం, చాలా తొందరలోనే ఆ శాల్తిని గుర్తుపట్టాడు. కోటేసు. ఉరఫ్ కోటేశ్వరరావు. కోటేశ్వరరావు రఘురాంకు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్మేట్. అంత సీరియస్‌గా చదువును తీసుకోనివాడు. ఎప్పుడూ క్లాస్‌కు సీరియస్‌గా వచ్చేవాడు కాదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవలు. తల్లి, తండ్రి కష్టపడేవారు. అయినా ఏవో చికాకులు, ఇబ్బందులు. అన్నింటికీ పర్యవసానం స్కూల్ మానేయడం. చెప్పినా అర్థం చేసుకోకపోవడం, అసలు వినడమే తక్కువ. ‘ఇంటికష్టాలు అన్నీ చదువుతో పోతాయిరా’ అని బాలయ్య మాష్టారు ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కించుకునేవాడు కాదు. అయితే రఘురాంకు చాలా ఇష్టం వాడంటే. కారణం అమాయకమైన మంచితనం. మంచి హాస్యదోరణి. స్నేహగుణం. ఎప్పుడూ వెన్నటి ఉండే ఆప్యాయత.ఇప్పుడు కూడా చూడగానే అప్రయత్నంగా పిలిచాడు. రఘురాం విని, చూసి, ఆగాడు.‘‘వొరే కోటేసూ’’ అంటూ ఎప్పటిలాగే ఆత్మీయంగా అతనివైపు నడిచాడు. కోటేసు కూడా అలాగే స్పందించాడు. కానీ కోటేసు దగ్గరకు రాకముందే గప్పున వచ్చింది సారా వాసన. బ్రేకు వేసినట్లు ఆగిపోయాడు రఘురాం. కోటేసు కూడా కాస్త దూరంగా ఆగి పలకరింపుగా నవ్వాడు. రాత్రి బయటకు రావటం వల్ల కలిగే ఇబ్బందుల్లో ఇదోకటని రఘురాంకు అర్థమైంది.‘‘రఘూ.. నువ్వే? ఎప్పుడొచ్చావ్! ఏంటి రాత్రి తిరుగుళ్ళేంటి. మాస్టార్ని పడుకోనిచ్చి రోడ్డెక్కావ్’’ నవ్వాడు. ఎక్కువగా నవ్వాడు. కోటేసు వొరే అనడం, ఏకవచనంతో సంభోదించడం మానేసి చాలా కాలం అయ్యింది. ‘‘నువ్వేంట్రా ఇంత రాత్రప్పుడు ఇట్టా రోడ్లమీద. ఆ పంచ ఏంటి? చొక్కా ఏది? తాగుడు ఎక్కువైయింది. అవునా!’’ కోపం నటిస్తూ మందిలిస్తున్నట్లు నిజమైన స్నేహితుడిలా చురుగ్గా అన్నాడు రఘురాం.ఆనందంతో మందు కిక్కులో మరింతగా నవ్వాడు. ‘‘నేను తాగి రాత్రుళ్ళు రోడ్డుమీద తిరగడం, తూలడం మావులే. గాని తవరేంటి ఇయ్యాల?’’ కోటేసు ఎలా అన్నా అసలు విషయం గుర్తొచ్చింది రఘురాంకు. ‘‘ఆ! నాన్నగారు ఏవన్నా కనపడ్డార్రా కోటేసూ.’’ ఆ ప్రశ్న అడగగలిగిన చనువున్న ఫ్రెండు కోటేసు వొక్కడే. ఈసారి నిజంగానే ఫెళ్ళున నవ్వాడు కోటేసు. సారా తాగిన నాలిక్కి కారం రుచి తగిలినంత తృప్తితో గుటకేసి నవ్వి నవ్వి అన్నాడు – ‘‘ఎవరు? బాలయ్య మేష్టారా! పగలేబెల్లు కోడితెగాని పాటం ఆపడు. రాత్రి ఏడుగంటల టీవీ వార్తలు సమాప్తం అనగానే ముసుగుపెట్టే బాలయ్య పంతులు ఇట్టా అర్ధరాత్రెల వీధిలోకి రావడం? ఏంటి నువ్వూ తాగావా?’’ మళ్ళీ భళ్ళుభళ్ళున నవ్వాడు. తాగి ఉన్న అతనితో లాభం లేదనుకుని ముందుకు కదిలాడు రఘురాం. సెంటర్ కూడలికి వచ్చాడు. అక్కడ చిన్న చిన్న కొట్లు కొన్ని ఉన్నాయి. అలాగే ఒకటీరెండు హోటళ్ళు లాంటివి. పెద్దసైజు బోర్డు రాయించిన భోజన హోటల్ ఉందిగాని భోజనం దొరికేది పగలే. అలాగే టీ బంకులు, మంగలిషాపు, ఇస్త్రీ దుకాణం లాంటివి ఆ సెంటర్ చుట్టుపక్కలా ఉన్నాయి. అలాగే ఊరి అన్ని ప్రాంతాలలో కూడా ఉన్నాయి. సెంటరుకు దగ్గరలోనున్న పక్క సందుల్లో సారా కొట్టు, కొత్తగా బార్, రెస్టారెంట్ లాంటివి కూడా వెలిశాయి. కొత్తగా చికెన్ దుకాణం, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మొదలెట్టారు. ఫ్లెక్సీల పుణ్యమా అని బోర్డుల అందచందాలు, తద్వారా సెంటరు రూపురేఖలు మారిపోయాయి. జనసందోహం లేని నిశ్శబ్దరాత్రి సెంటరు వెన్నెల్లో నగ్నసుందరిలా, ప్రాథమికమైన అందచందాలతో అది రఘురాం లాంటి వారిని కట్టిపడేస్తుంది. అలా సెంటరు మధ్య నిలబడి అంతా కలయ చూస్తున్న రఘురాం చూపు ఎదురుగ్గా ఉన్న సందువైపు మళ్లింది. అంతే! అటే చూస్తున్న రఘురాం నెత్తిన పిడుగు పడినట్లు మ్రాన్పడిపోయాడు.ఆ సందులో పట్టపగల్లా వెలిగిపోతున్న మెర్క్యురీలైటు కాంతిలో రంభ బార్–రెస్టారెంట్ మహాద్వారం నుండి తల వంచుకుని కాళ్ళకు అడ్డుపడకుండా పంచె ఎత్తి పట్టుకుని బయటకొచ్చి వడి వడిగా సాగిపోతున్న బాలయ్య మాష్టారు. తన కన్నతండ్రి, ఊరంతా కీర్తించే మహా మహోపాధ్యాయుడు. నైతిక శ్రేష్టుడు. ఆదర్శగురువు. ప్రశంసనీయ తండ్రి. అత్యుత్తమ భర్త. బార్లోంచి అర్ధరాత్రి బయటకు రావటం. అది తాను చూడటం. ఆదర్శ కుమారుడైన రఘురాం భరించలేకపోయాడు. బాధతో, దు:ఖంతో, ఏదో అవమానంతో అతను ముడుచుకుపోయాడు. హిమవన్నగం అంత తండ్రి సమున్నత వ్యక్తిత్వం వేగంగా కరగసాగింది. ఇది కొత్త అలవాటా, ఎప్పట్నుంచో ఉందా! ఉంటే ఇంతకాలం తనకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు. తల్లి కూడా తెలిసి భరిస్తోందా? పిల్లలకు తెలియకుండా ఎంతలా నటిస్తోంది? ఊర్లో ఎవరికీ తెలియదా! కనీసం కొండారెడ్డి మావయ్యకు తెలియదా. లేక ఇద్దరూ కలిసే తాగుతున్నారా?అసలు ఆయనే అలవాటు చేశాడా? కోటేసుగాడికి తెలుసా! ఇప్పుడేం చెయ్యాలి!పరిపరివిధాల ఆలోచనలు సాగిపోతున్నాయి. ఇంతలో సైకిల్ బెల్ శబ్దం దగ్గరగా మోగడంతో చటుక్కున కదిలాడు. తండ్రి కోసం సందులోకి చూశాడు. నిర్మానుష్యంగా ఉంది. చటుక్కున అన్ని వైపులా చూశాడు. బాలయ్య మాష్టారు కనపడలేదు. ఇంతలోనే ఎటు మాయమైపోయాడు? ఇంటికి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి. ఏడీ ఇటు నా ముందుగా వెళ్ళలేదు. మరి ఎటు వెళ్ళినట్లూ? ఇదేవిటో ఇవ్వాళ నాన్న విచిత్ర ప్రవర్తన వల్ల తనకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి అనుకుంటూ ఇంటివైపు తిరిగి వడివడిగా నడవసాగాడు. అలా వెళుతూనే అటూ ఇటూ చూడటం మానలేదు. ఊహాతీతంగా బాలయ్య మాష్టారు ఓ సందులో కనపడి వడివడిగా మరో సందులోకి మాయమయ్యాడు. ఈసారి గుండె ఆగినట్లయ్యింది రఘురాంకు– ‘ఇదేంటి! నాన్న, ది గ్రేట్ బాలయ్య మాష్టారు, ఆ సందులోకి వెళ్ళాడా! ఆ సందులోంచి వెళితే అలా అలా మరో సందు మరో సందు మా ఇంటికి చేరవచ్చు. అమ్మో అమ్మో అంటే నాన్న మెయిన్ రోడ్డు మీదికిరాకుండా సందు గొందుల్లోంచి బార్‌కు వెళ్లి తాగి తిరిగి ఇంటికి చేరుతున్నాడు’. సీన్ అంతా అర్థమయింది.ఈ వయసులో ఈయనకు ఇదేంబుద్ధి. కోపం ముంచుకొచ్చింది. ఉగ్రుడైపోయాడు. ఇవ్వాళ డైరెక్టుగా అడిగెయ్యాలి. మరింతగా ఆయన దిగజారకముందే, ఆయనను కట్టడి చేయాలి. అమ్మ ఎంత కుమిలి పోతోందో!వేగంగా ఇంటివైపు కదిలాడు. గుమ్మంలో నాన్న. అప్పుడే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అమ్మ గుమ్మంలో నిలబడి ఆయనను లోపలికి తీసుకెళ్ళటానికన్నట్లు నిలబడి ఉంది. ఆయన రాగానే ఆమె కంగారు పడుతూ అటూ ఇటూ చూడటం రఘురాంకు ఎంతో బాధ కలిగించింది. అతను కోపంతోనూ, ఆవేదనతోనూ కదిలిపోతున్నాడు.బాలయ్య మాష్టారు లోపలికి అడుగువేసాడు. శ్యామల అటూ ఇటూ చూసి తలుపు వేసుకోబోయింది. ‘‘అమ్మా! ఆగు.’’ అరుపులా గట్టిగా దృఢంగా అన్నాడు. అన్నంత వేగంగా గుమ్మం దగ్గరగా వెళ్లి లోపలికి అడుగువేసి అంతే వేగంగా తలుపులు మూశాడు. ఇద్దరూ మ్రాన్పడిపోయారు. అప్పుడు దాదాపు అర్ధరాత్రి కావొస్తోంది. బాలయ్య మాష్టారు, రఘురాం ఇద్దరూ వేగంతో, ఆందోళనతో చెమటపట్టి అలసటగా కన్పిస్తుంటే శ్యామల కంగారుగా ఉంది. లోపలి తలుపు కొంచం కదిపి అంతా తాను చూస్తున్నట్లు సువర్ణ ముగ్గురి దృష్టిలోకొచ్చింది. ‘‘ఎక్కడికెళ్ళి వస్తున్నారీ రాత్రివేళ?’’ చటుక్కున తండ్రిని నిలదీస్తున్నట్లు నేరుగా అడిగాడు. జీవితంలో తొలిసారి కొడుకు నిగ్గదీసి ప్రశ్నించడంతో నోటమాట రాలేదు బాలయ్య మాష్టారుకు. ఆయన పక్కకు కదిలిన శ్యామల, ఆయన చేతిలోని సంచి తీసుకుంది. అప్పుడు మెదటిసారి తండ్రి చేతిలో ఉన్న సంచిని చూసాడు రఘురాం. ఆమె ఆయనకు సపోర్టు చేస్తున్నట్లు భావించాడు.‘‘అమ్మా! నువ్వు ఆయనను సపోర్టు చెయ్యొద్దు.’’ అన్నాడు. అతని గొంతు అలా తండ్రిని నిగ్గదీసి అడగటం వారి జీవితంలో మొదటిసారి.‘‘అడుగుతున్నది మిమ్మల్నే నాన్నా! ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లి వస్తున్నారు?’’ మళ్లీ రెట్టించి అడిగాడు. ఇద్దరూ ముఖాలు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సువర్ణ బయటకొచ్చింది. ‘‘ఏవిటి మీ ప్రశ్న? మావయ్యగారు ఎక్కడికి వెళ్లివస్తే మీకెందుకూ. ఆయననే ప్రశ్నిస్తున్నారు. లోపలికి రండి. బాగా పొద్దుపోయింది. అత్తయ్యా! లోపలికి వెళ్ళండి.’’ విషయాన్ని చిన్నదిచేసి రఘురాంను లోపలికి తీసుకెళ్లడం ఆమె ప్రస్తుత కర్తవ్యం.‘‘నాన్న ఎక్కడికి వెళ్లి వస్తున్నారో తెలుసా?’’శ్యామల తెల్లబోయింది. వేగంగా అర్థం చేసుకుని అంతే వేగంగా స్పందించింది – ‘‘రఘూ! ఏవిటా ప్రశ్న. నాన్నగారినే..’’ ‘‘అవును. నాన్నగారినే అడుగుతున్నాను. నువ్వు అడ్డుకోకు.’’ ‘‘ఏవిటండీ! అర్ధరాత్రి ఈ ప్రశ్నలు. పొద్దున్నే మాట్లాడుకోవచ్చు.’’ సువర్ణ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ‘‘నాన్న ఎక్కడికి వెళ్లి వస్తున్నారో తెలిస్తే నువ్విలా మాట్లాడవ్’’ రఘురాం ఎమోషన్ పెరిగిపోతోంది. ‘‘ఏవిట్రా. ఏవిటీ మీటింగు.’’ కళ్ళు నలుముకుంటూ బయటకొచ్చి అడిగింది సుజాత. వెనక భర్త రాజు.‘‘నాన్నగారు ఈ రాత్రివేళ బార్‌కు వెళ్లి.. అంటే.. మందుకొట్టి వస్తున్నారు.’’ అంతా అవాక్కయ్యారు. రెండు నిమిషాలు మౌనం. రఘురాం ఏదో కంటిన్యూ చేయబోయాడు. శ్యామల అంది గట్టిగా – ‘‘రఘూ! మతిపోయి మాట్లాడుతున్నావా..’’. రఘు తగ్గలేదు – ‘‘అవును. నాన్నగారిని బార్ దగ్గర చూశాక నిజంగానే మతిపోయింది నాకు.’’ ఇంకా వివరంగా చెప్పాడు. కోడలు, కూతురు, అల్లుడు నోటమాట లేక అచేతనంగా నిలబడిపోయారు. ముందుగా కదిలింది బాలయ్య మాష్టారు. ‘‘వెళ్ళండి వెళ్ళండి. అంతా లోపలికి వెళ్ళండి. వండినవన్నీ అందరూ తిన్నాక మీ అమ్మకు ఏమీ మిగలలేదు. పిల్లలుకదా పోటీ పడి అన్నీ ఖాళీ చేసేశారు. ఆమె కాసిని నీళ్ళు తాగి పడుకోవడం చూసి నేనే ఏవన్నా తినడానికి తెద్దామని బయటకు వెళ్లాను. పల్లెటూరుకదా, ఇంత రాత్రి సారాకొట్టు, అదే, బారు తప్ప ఏవీలేవు. ఏదో వెజిటబుల్ పలావ్ వేడివేడిగా చేసి ఇచ్చాడు. అదే తెచ్చా. తిను శ్యామలా! చల్లారిపోతుంది.’’ వాతావరణాన్ని చల్లబరచడానికన్నట్లు నవ్వి ‘‘ఆ మాంకాలమ్మ సందులో పరుగు పరుగున వస్తుంటే కుక్కలువెంటబడ్డాయిరా రఘురామా..’’ అంటూ అందరివంకా చూస్తూ జోక్‌గా చెప్పి అందరినీ నవ్వించాడు బాలయ్య మాష్టారు అనే భర్త! మత్తి భానుమూర్తి -
చంపడానికి ముస్లింలు, కాల్చడానికి దళితులు..
సాక్షి, కర్ణాటక: బీజేపీ సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్‌లు చేస్తుందంటూ ట్వీట్ చేసిన రియల్టీ టీవి షో హోస్ట్ రఘురాం ట్వీట్ పై బీజేపీ స్పందించింది. నోరు పారేసుకునే ముందు ఘర్షణల్లో మృతి చెందిన 24 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడాలని సూచించింది. అతడ్ని కెమెరా ముందు బుల్లి, కెమెరా వెనుక సిస్సి అని పేర్కొంటు ట్వీట్ చేసింది. గతంలో బీజేపీ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ‘మా కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యుల నుంచి పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వారి భద్రత విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను ఈ ప్రభుత్వం రక్షించదు. ప్రతి ఇంట్లోని కార్యకర్త జిహాద్ ముక్త కర్ణాటక కోసం పోరాడాలి’ అని ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రఘురాం బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తుందని, అధికారిక ఖాతా నుంచి ఇలాంటి సందేశాలు రావడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. వెంటనే బీజేపీ రఘురాంను బుల్లి, సిస్సి అంటు ఎద్దేవా చేసింది. తర్వాత రఘురాం మరో ట్వీట్ చేశారు. ఇది ఎన్నికల సమయం. మీరు చంపడానికి ముస్లీంలు, కాల్చడానికి దళితులు ఇంకా ఉన్నారు. వెళ్లండి మీ లక్ష్యాన్ని చేరుకోండి అంటూ బీజేపీకి చురకలంటించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయమే ఉన్నందున బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది. ముఖ్యంగా హత్యకు గురైన 20 మంది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల గురించి ప్రస్తావిస్తూ.. తమ కార్యకర్తల మరణాలను రాజకీయ హత్యలుగా చెప్తు ఎన్నికల ముఖ్య ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణటకలో పర్యటించినప్పుడు ప్రధానంగా ఈ అంశాన్నే ప్రస్తావించారు. -
'విడాకులొచ్చాయి.. నా ప్రేమ ఎప్పటికీ నీకోసం..'
సాక్షి, ముంబయి : సాధారణంగా భార్యభర్తలు విడిపోవడం కొంత బాధే. ఎంత అధికారికంగా విడాకులు తీసుకున్నా వారిరువురిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా బాధ ఉండేఉంటుంది. కానీ, బాలీవుడ్‌కు చెందిన ఈ జంట మాత్రం ఎంతో ఖుషీగా విడాకులు తీసుకున్నారు. చాలా సంబరంగా ఆ వార్తను మీడియాతో పంచుకున్నారు. సుప్రసిద్ధమైన రోడీస్ అనే టీవీ కార్యక్రమానికి ఒకప్పుడు హోస్ట్‌గా వ్యవహరించిన రఘురామ్ ఆయన భార్య నటి సుగంధ గార్గ్ విడిపోయారు. ఈ విషయాన్ని రఘురామ్ మీడియాకు వెల్లడించారు. తమకు ఈ వారంలోనే విడాకులు అయ్యాయని అయినప్పటికీ తాము ఒకరికొకరం శ్రేయోభిలాషులమే అంటూ ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. 'కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నీకొరకు నావద్ద ఉన్న ప్రేమలాగా.. మన ఇద్దరి వద్ద ఒకరికోసం ఒకరి వద్ద ఉన్న సంతోషంలాగా.. ఏదీ ముగియలేదు. కొంచెం మారిందంతే.. మరో దశ ప్రారంభమైంది' అంటూ ఆయన పోస్ట్ చేశారు. 2006లో రఘురామ్‌కు సుగంధగార్గ్‌కు వివాహం అయింది. 2016లోనే వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. విడిపోయే సందర్భంలో పెద్ద పార్టీ కూడా ఉంటుందని వారు ప్రకటించారు. ఇప్పటికే పలు టీవీ షోలకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా సుగంధ గార్గ్ కూడా తేరే బిన్ లాడెన్ అనే కామెడీ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అలాగే, పలు టీవీ షోలకు కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. @isugandha Some things never change. Like the love I have for you. Like the fun we have always had together. Nothing ends. It changes and the next phase begins #FriendshipGoals #DivorceGoals A post shared by Raghu Ram (@instaraghu) on Jan 29, 2018 at 12:50am PST -
సుపరిపాలనే గెలిపించింది
అభిప్రాయం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడినా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ గెలుపొందడానికి నరేంద్రమోదీ హామీ పడిన సుపరి పాలనే కారణం. ఆర్థిక సంస్కరణలు కొనసాగింపునకు ఇది ఊతమిచ్చే విజయం. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి 3 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించింది. 19 ఏళ్లపాటు సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించి తన వారసత్వాన్ని తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువ స్థానాలతో (44) కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తరుణంలో అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించడం, ముందున్న ముళ్లబాట మీద నడవటం యువకుడు రాహుల్ గాంధీకి సవాలే. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఒక సవాల్‌ని స్వీకరించినట్లే. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ 5వ తరం నాయకుడు. ప్రస్తుత ఎన్నికలకు వస్తే హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్వవలసిందే. గత 3 దశా బ్దాలుగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే నాయకుణ్ణి పట్టుకుని వేళ్లాడింది కాంగ్రెస్ పార్టీ. కురువృద్ధుడు వీరభద్రసింగ్‌నే నమ్ముకుంది. మరో నాయకుణ్ణి తయారు చేయలేకపోవడం, కాంగ్రెస్ నాయకత్వం అసమర్థతే అనాలి. అనేక రాష్ట్రాల్లో యువతరం నాయకులు ముందుకొస్తుంటే, మరోపక్క హిమాచల్‌లో మాత్రం యువ నాయకత్వాన్ని గానీ, కొత్త నాయకత్వాన్ని గానీ ప్రోత్సహించనందుకే అక్కడ అధికారం కోల్పోయింది. మరోవైపున నరేంద్రమోదీ తన సుపరిపాలనతో ప్రజలకు మరింత దగ్గరవుతూ, ఒక్కో రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇప్పుడు బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయం ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి ఎన్నికనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు సిద్ధమవుతారు. మునిసిపల్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా వీరిద్దరూ ఒకేవిధంగా పనిచేస్తారు. అందరితో పని చేయిస్తారు. విజయాన్ని సాధిస్తారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వలేమితో సతమతమవుతోంది. పెద్ద రాష్ట్రాలైన బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేరనే చెప్పాలి. కొత్త తరం నాయకులు రావాలి. అప్పుడే కొంత కోలుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వడం కూడా అనుమానమే. 27 ఏళ్లుగా కాంగ్రెస్ బిహార్‌లో అధికారానికి దూరంగా ఉంటోంది. అలాగే బెంగాల్లో గత 40 ఏళ్లుగా, ఒడిశాలో గత 20 ఏళ్లుగా అధికారంలోకి రాలేకపోయింది. తమిళనాడు సరేసరి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ గత 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంటోంది. ఒకవైపున ఈ రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి. నాయకత్వాన్ని పెంచాలి. మరోపక్క భాజపా నాయకత్వాన్ని, నరేంద్రమోదీ–అమిత్ షా లను ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే పలు సర్వేలు 2019 ఎన్నికల్లో కూడా ప్రధానిగా నరేం ద్రమోదీకే పట్టం గడుతున్నాయి. అందుచేత రాహుల్ గాంధీ ఏవిధంగా ఎన్నికలకు సిద్ధమవుతారు, ఎలా ఎదుర్కొంటారు? అనేదే ఇప్పుడు ప్రశ్న. గుజరాత్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ గత 23 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఒక నాయకుణ్ణి కూడా తయారు చేయలేకపోయింది. మాధవ్ సింగ్ సోలంకి తర్వాత అంత పెద్ద నాయకుడు గానీ, కొత్త తరం నాయకులు గానీ కాంగ్రెస్ దగ్గర లేరనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న శంకర్ సింగ్ వాఘేలా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒకప్పటి బీజేపీ నాయకుడే. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో నాయకుడు లేడు. మరి ఎన్నికల్లో ఎలా పోరాడతారు, ఎలా గెలుస్తారు? మరోవైపున, సర్దార్ పటేల్ తర్వాత అంత పెద్ద నాయకునిగా నరేంద్రమోదీని గుజరాతీలు అభిమానిస్తారు. గుజరాత్ అభివృద్ధిలో నరేంద్రమోదీ పాత్రని ఎవరూ కాదనలేరు. పటేళ్ల రిజర్వేషన్ల పోరాటంతో బీజేపీ పని అయిపోయిందని, హార్దిక్ పటేల్, జిగ్నేస్, ముగ్గురు యువకులను ముందుపెట్టి, వారితో కాంగ్రెస్ కుల రాజకీయాలు చేసినా, కాంగ్రెస్ పార్టీ గెలవలేక చతికిలబడింది. గుజరాత్లో బీజేపీ వరుసగా 6వ సారి చారిత్రక విజయం సాధించి దేశ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పింది. కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం బీజేపీకి గతం కన్నా 4 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్‌కు మరోవైపున 3 శాతం ఓట్లు ఎక్కువ వచ్చినా బీజేపీ కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం మాత్రం 8 శాతం పైగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొంత నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పక తప్పదు. నోట్ల రద్దు, జీఎస్టీ, రిజర్వేషన్లు, కుల రాజకీయాలు మొదలైన అంశాలు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడ్డాయి. వ్యాపారులు, నిరుద్యోగులు, రైతులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని కాంగ్రెస్ ఎంతో నమ్మకంగా ఉంది. చివరివరకూ కాంగ్రెస్ నాయకులు తమ గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్ ఫలితాలపై చాలా నమ్మకంగా ఉన్నారు. గుజరాత్ సీఎం రూపానీ అంత ఆకట్టుకోలేకపోవడం, తమ పరిపాలన ప్రజలకు అంతగా నచ్చకపోయినా, మోదీ–షా ద్వయం వల్ల బీజేపీకి ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు. ఈ విజయం ముఖ్యంగా మోదీకి మరింత బాధ్యతను పెంచిందని చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు కొనసాగిస్తానని, పటేళ్ల రిజర్వేషన్లు ఇవ్వలేమని కరాఖండిగా చెప్పి మరీ మోదీ గుజరాత్లో విజయం సాధించిన విషయం మనం గమనించాలి. ఈ మాటలు చెప్పడానికి ఎంతో దమ్ముండాలి. వ్యాసకర్త బీజేపీ జాతీయ సమన్వయకర్త ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com పురిఘళ్ల రఘురాం -
దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు
బీజేపీ సమన్వయకర్త రఘురామ్ మామిడికుదురు : దేశ ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. ‘నల్ల ధనం నిర్మూలన–దేశ ప్రయోజనాలు’ అనే అంశంపై శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు భవిష్యత్తులో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండగా స్వార్థపరులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బంగారం జోలికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తరువాత కొనుగోలు చేసిన బంగారం లెక్కలు మాత్రమే సేకరిస్తోందన్నారు. నగదు రహిత సేవలతో కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, మెండా ఆదినారాయణ, చెరుకూరి గోపాలకృష్ణ, రావూరి సుధ, కొల్లు సూర్యారావు, గాడి సత్తిబాబు, నక్కా త్రిలోచనరావు తదితరులు పాల్గొన్నారు. -
నన్ను ఇన్వాల్వ్ చేయకండి..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం అనంతరం మళ్ళీ అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సెప్టెంబర్ 4 తో ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆయన తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెడతారని సహచరులతో చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై స్పందించారు. బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో అదేవిషయంపై వ్యాఖ్యానించారు. తనను అనవసర విషయాల్లోకి లాగొద్దని, తాను ప్రపంచంలో ఎక్కడైనా ఉంటానని రఘురాం రాజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన అసోచామ్ సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రంగ రాజన్ ఆయన భవిష్యత్ జీవితంపై ఎవ్వరూ ఊహా కథనాలు అల్లొద్దని స్పష్టం చేశారు. మరో రెండు నెలలు పదవిలో ఉంటానని, తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తాను నివసించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీరేట్లు కారణం కాదన్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠపరచడం, రుణాలను పెంచడం వంటివి చాలా సున్నితమైన ఆంశాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులకు సాయపడుతున్నట్లు తెలిపారు. -
రాజకీయమంటే ఇదేనా?!
ఏపీలో వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్తేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. నేటి రాజకీయాల్లో పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ అన్న మాటలు రోజురోజుకు కనుమ రుగవుతున్నాయి. గతంలో ఉన్న ఈ విలువలు నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు అస్సలే తెలియదు. కొత్తగా ఎన్నికైన అనేక మంది ప్రజా ప్రతినిధులకు పార్టీ సిద్ధాంతాలంటే ఏంటో బొత్తిగా తెలియదు. జనతా పార్టీ నేతలు, గాంధేయవాదులు, కమ్యూనిస్టులు ఏ విధంగా సిద్ధాంతాల కోసం నిలబడే వారో ఒక్కసారి నేటి మన ప్రజాప్రతినిధులు తప్పక తెలుసుకోవాలి. నాటి నేతలు జీవిత చరమాంకం వరకు నమ్ముకున్న సిద్ధాంతం కోసమే పనిచేశారు, పోరాడారు, జీవించారు. ప్రాణాలు అర్పించారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ అంశంలోనూ రాజీపడలేదు. అలాంటి వారిలో తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, జూపూడి యజ్ఞనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, ప్రగడ కోటయ్య తదితర నేతలు న్నారు. అధికారం కోసం, పదవి కోసం, అవసరం కోసం నిస్సిగ్గుగా పార్టీ మారుతున్న నాయకులు అడుగడుగునా నేడు మనకు దర్శనమిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొందరు నేతలు మాత్రం ఎప్పుడూ అధికారంలోనే ఉంటున్నారని గమనించాలి. పూర్తి స్వార్థంతో పార్టీలు మారడం సర్వ సాధారణమైంది. నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వారు డజను మందికి పైగానే ఉన్నారు. ఇంకొందరు నాలు గైదు పార్టీలు సైతం మారుతున్న పరిస్థితి. సిగ్గూ, ఎగ్గూ లేకుండా పార్టీ మీద పార్టీ మారడంతోనే తామేదో పెద్ద నాయకులమైపోయామని అనుకుంటున్నారు మరికొం దరు. ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలో్లకి మారేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితి గతంలో చిన్న రాష్ట్రాలైన... ఈశాన్య రాష్ట్రాలు, పాండిచ్చేరి, గోవా, హరియాణాలో్ల అధికంగా ఉండేది. ఇప్పుడు ఆ జబ్బు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు, తాజాగా తెలంగాణకు సోకింది. తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపులు అతి పెద్ద జాడ్యంగా మారాయి. గెలిచిన పార్టీని కాదని, అధికార పార్టీలోకి వలస పోవడం ప్రజల కోసమేనని గొప్పలు చెప్పుకునే నేతలు నిత్యం దర్శనమిస్తున్నారు. రాజకీయ మంటేనే గెలుపు, అధికారం అన్నట్టు నేటి తరం నాయకులు సాగిస్తున్న ఈ రాజకీయ వ్యాపార క్రీడ దేశ ప్రజలను విస్తుపోయేలా చేస్తోంది. ఈ ‘నయా రాజ కీయం’ చూసి రాజకీయాలంటే ఇవేనా! రాజకీయ మంటే ఇదేనా! అని యువత అవక్కావుతోంది. తెలంగాణలో పూర్తి మెజారిటీ దక్కకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దాదాపు 20 మందికి పైగా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికార పార్టీలోకి వలసవెళ్లారు. తెలంగాణలో టీడీపీ అన్నదే లేకుండా పోతున్న స్థితిని చూస్తున్నాం. ఆంధ్రా పార్టీలకిక తెలంగాణలో కాలం చెల్లిందని, రాజకీయ పునరేకీకరణతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వలసలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశంలోకి అరడజను మంది ప్రజా ప్రతినిధులు వలస పోయారు. తెలంగాణలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ఏపీలో వైఎస్సార్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయినా ఏపీలోనూ అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందేగాక, ఎన్నికలైన తర్వాత కూడా నాయకులు ఇలా వీలును బట్టి పార్టీలు మారుతుండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముప్పును సూచిస్తోంది. ప్రజాప్రతినిధులుగా తాము గెలుపొందిన పార్టీ ప్రతిపక్షంగా మిగలడంతో ఎన్నికలకు ముందటి తమ మాటలను, ప్రగల్భాలను అన్నిటినీ మరచి అధికార పార్టీలోకి వలస పోవడం రెండు తెలుగు రాష్ట్రాలో్ల నిత్యకృత్యంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పథకం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే లను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంది. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోగా, మంత్రి పదవులు సైతం కట్టబెట్టింది. ఒక పార్టీని పూర్తిగా నాశనం చెయ్యాలని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, చట్టాలను గౌరవించకుండా ఒక ప్రభుత్వం ఇలా వలసలను ప్రోత్సహించడం ఏ మాత్రం సమర్థనీ యం కాదు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు వారితో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల బరిలోకి దించారు. అదే పద్ధతిని ఇప్పుడు పార్టీలు మారుతున్న నేతలూ పాటించాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి, మరోసారి ప్రజల్లోకి వెళ్తేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, రాజ్యాంగ పరి రక్షణ చేయాలని న్యాయస్థానాలు ఎన్నో ఆదేశా లిచ్చాయి. కోర్టులు పలుమార్లు స్పీకర్‌కు తేల్చి చెప్పాయి. రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్న ప్రజా ప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు పార్టీ మారుతున్నారో, పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో, పార్టీ మారడం వల్ల తమకు కలిగిన ప్రతిఫలమేమిటో, నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో వారికి వివరించాలి. వలస పక్షులు సైతం కాలానుగతంగా ఆయా రుతువు లను బట్టి మాత్రమే ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసలు వెళ్తాయి. మన నాయకుల్లా ఎప్పుడుబడితే అప్పుడు వలస పోవు. స్వప్రయోజనాలే పరమావధిగా పార్టీలు మారే నాయకుల, మంత్రుల మాటలకు విలువేముంటుంది? యువత ఇలాంటి వారి నుంచి ఏం నేర్చుకుంటుంది? ఆ నేతల విజ్ఞతకే వదిలేద్దాం. రఘురామ్ ఏపీ బీజేపీ సమన్వయకర్త raghuram.bjp@gmail.com -
టీచర్ ని వేధిస్తున్న హెచ్ఎం
పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు పక్కదారి పట్టాడు. మహిళా పీఈటీని లైంగికంగా వేధించుకుతింటున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు శుక్రవారం ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధిత వ్యాయామ ఉపాధ్యాయురాలు మీడియాకు వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.రఘురామ్ మూడేళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెప్పడానికి వీలుకాని రీతిలో అసభ్య పదజాలంతో హింసిస్తున్నాడు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి, నూజివీడు ఉప విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసింది. వారు సదరు కీచక ప్రధాన ఉపాధ్యాయుడిని పిలిచి మందలించారు. అయినా అతడి తీరులో మార్పు లేదు. దీంతో బాధితురాలు గ్రామ పెద్ద మనుషుల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. వారు కూడా ప్రధాన ఉపాధ్యాయుడు రఘురామ్‌ను తీరు మార్చుకోవాలని సూచించారు. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో బాధితురాలు శుక్రవారం నూజివీడు ఉప విద్యా శాఖ అధికారికి మరోమారు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.