సాక్షి, విజయవాడ: తిరుమలలో భక్తుల మృతికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం (Talasila Raghuram) అన్నారు. ఈ ఘటనకు కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను బాధ్యులను చేయడం దారుణమంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అధికారులకు ప్రజల కోసం పని చేసే స్వేచ్ఛలేదని దుయ్యబట్టారు.
చంద్రబాబు అధికారులను కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు. అందుకే తిరుమల లాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కులాల ఆధారంగా అధికారులను టార్గెట్ చేయడం దారుణం. తిరుమల తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో కులం ఆధారంగా అధికారులను టార్గెట్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్, జేఈవో దీనికి బాధ్యులు కాదా.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పై కనీసం టీటీడీ బోర్డు సమావేశం కూడా చైర్మన్ నిర్వహించలేదు. చంద్రబాబు ఎదుట టీటీడీ చైర్మన్, ఈవో పొట్లాడుకున్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇదే నిదర్శనం. క్షమాపణలు చెప్పించడం కాదు.. ఆరుగురు మృతికి కారకులను శిక్షించాలి’’ అని తలశిల రఘురాం డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!
ఇది ప్రభుత్వ వైఫల్యమే: ఎంపీ మిథున్‌రెడ్డి
చిత్తూరు జిల్లా: వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట చాలా బాధాకరమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ దారుణానికి కారణమని.. ఇది కేవలం క్షమాపణలు చెప్పి సర్దుకునేంత చిన్న విషయం కాదన్నారు. కచ్చితంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధం లేని అధికారులపై కంటితుడుపు చర్యలు తీసుకున్నారు.
..అసలు ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పవన్ కల్యాణ్ కనీసం తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు ఆ పని కూడా చేయకుండా ఘటన వెనుక కుట్రకోణం అని మళ్లీ రాజకీయం చేయాలని చూశారు. ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment