- బీజేపీ సమన్వయకర్త రఘురామ్
దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు
Published Sun, Dec 11 2016 12:01 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
మామిడికుదురు :
దేశ ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. ‘నల్ల ధనం నిర్మూలన–దేశ ప్రయోజనాలు’ అనే అంశంపై శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు భవిష్యత్తులో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండగా స్వార్థపరులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బంగారం జోలికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తరువాత కొనుగోలు చేసిన బంగారం లెక్కలు మాత్రమే సేకరిస్తోందన్నారు. నగదు రహిత సేవలతో కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, మెండా ఆదినారాయణ, చెరుకూరి గోపాలకృష్ణ, రావూరి సుధ, కొల్లు సూర్యారావు, గాడి సత్తిబాబు, నక్కా త్రిలోచనరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement