
విడాకులు తీసుకున్న రఘురామ్, సుగంధ గార్గ్
సాక్షి, ముంబయి : సాధారణంగా భార్యభర్తలు విడిపోవడం కొంత బాధే. ఎంత అధికారికంగా విడాకులు తీసుకున్నా వారిరువురిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా బాధ ఉండేఉంటుంది. కానీ, బాలీవుడ్‌కు చెందిన ఈ జంట మాత్రం ఎంతో ఖుషీగా విడాకులు తీసుకున్నారు. చాలా సంబరంగా ఆ వార్తను మీడియాతో పంచుకున్నారు. సుప్రసిద్ధమైన రోడీస్ అనే టీవీ కార్యక్రమానికి ఒకప్పుడు హోస్ట్‌గా వ్యవహరించిన రఘురామ్ ఆయన భార్య నటి సుగంధ గార్గ్ విడిపోయారు. ఈ విషయాన్ని రఘురామ్ మీడియాకు వెల్లడించారు. తమకు ఈ వారంలోనే విడాకులు అయ్యాయని అయినప్పటికీ తాము ఒకరికొకరం శ్రేయోభిలాషులమే అంటూ ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు.
'కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నీకొరకు నావద్ద ఉన్న ప్రేమలాగా.. మన ఇద్దరి వద్ద ఒకరికోసం ఒకరి వద్ద ఉన్న సంతోషంలాగా.. ఏదీ ముగియలేదు. కొంచెం మారిందంతే.. మరో దశ ప్రారంభమైంది' అంటూ ఆయన పోస్ట్ చేశారు. 2006లో రఘురామ్‌కు సుగంధగార్గ్‌కు వివాహం అయింది. 2016లోనే వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. విడిపోయే సందర్భంలో పెద్ద పార్టీ కూడా ఉంటుందని వారు ప్రకటించారు. ఇప్పటికే పలు టీవీ షోలకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా సుగంధ గార్గ్ కూడా తేరే బిన్ లాడెన్ అనే కామెడీ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అలాగే, పలు టీవీ షోలకు కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే తన చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment