Sugandha Garg
-
‘ఆర్య’, ‘గిల్టీ మైండ్స్’ ఫేం సుగంధా గర్గ్ గురించి ఈ విషయాలు తెలుసా?
జీవితాన్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్లలో సుగంధా గర్గ్ ఒకరు. ఆమె ఎవరు? హాట్ స్టార్‌లో ‘ఆర్య’, అమెజాన్ ప్రైమ్‌లో ‘గిల్టీ మైండ్స్’ చూసిన వాళ్లకు బాగా తెలుసు సుగంధా ఎవరో! అయితే ఆమె గాయని కూడా! ఎమ్‌టీవీ ‘కోక్ స్టూడియో సీజన్ 2’ లో సుగంధా తన గాన మాధుర్యాన్ని వినిపించింది. ఆమె గురించి కొన్ని వివరాలు.. ►పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో. పెరిగింది హైదరాబాద్‌లో. తల్లిదండ్రులు.. మీనా గర్గ్, శేఖర్ గర్గ్. సుగంధా.. ఢిల్లీలోని మైత్రేయి కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది. ►పద్దెనిమిదేళ్ల వయసులోనే బీబీసీ చానెల్లో ఉద్యోగం వచ్చింది.. హోస్ట్‌గా. ఆమె నిర్వహించిన షో పేరు ‘హాథ్ సే హాథ్ మిలా’. ఫొటోగ్రఫీలోనూ శిక్షణ పొందింది. నటి కావాలని కలలు కన్నది. ►డిగ్రీ అయిపోగానే ముంబై చేరింది. సినిమా అవకాశాల కోసం దరఖాస్తుల పర్వం మొదలుపెట్టింది. అలా తెచ్చుకున్న మొదటి చాన్స్ ‘జానే తూ యా జానే నా’ సినిమా. తర్వాత లాస్ట్ డాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలూ చేసింది. ►‘తెరే బిన్ లాడెన్’తో సుగంధాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు అదే సినిమా సీక్వెల్లోనూ అవకాశాన్నిచ్చింది. ఆమె నటనా ప్రతిభ అంతర్జాతీయ ప్రేక్షకులకూ పరిచయం అయింది.. ది కైట్ – పతంగ్, కాఫీ బ్లూమ్ వంటి చిత్రాలతో. ► థియేటర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోంది. ‘ఐ హావ్ గాన్ మార్కింగ్ అండ్ సమ్‌టైమ్స్’ అనే నాటకంలోని సుగంధా అభినయానికి అభినందనల వర్షం కురిసింది. ► ఈ తరానికీ దగ్గరవడానికి ఓటీటీని ప్లాట్‌ఫామ్‌గా చేసుకుంది. ఆర్య, గిల్టీ మైండ్స్‌తో యూత్‌కూ ఫేవరెట్‌గా మారింది. ►ఇంకో విషయం.. సుగంధా దక్షిణాది చిత్రసీమలోనూ ఎంట్రీ ఇచ్చింది. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ‘సిలోన్’ అనే తమిళ (నిజానికిది ద్విభాషా చిత్రం. ఇంగ్లిష్‌లోనూ విడుదలైంది) చిత్రంతో. ‘సిలోన్ సినిమాలోని రజిని పాత్రలో సుగంధా ఒదిగిపోయింది. ఆ రోల్ ఇంకెవరు చేసినా న్యాయం చేయగలిగేవాళ్లు కాదు. అది ఆమెకు మాత్రమే సాధ్యమైంది’ అంటూ సుగంధా నటనకు ముగ్ధుడయ్యాడు సంతోష్ శివన్. నాకు వచ్చిన ప్రతి పనినీ అమితంగా ప్రేమిస్తా. రాని పనినీ అంతే ఇష్టంగా నేర్చుకుంటా. అందిన జీవితాన్ని అందినట్టుగా ఆస్వాదించడంలో ఉన్న ఆనందమే వేరు - సుగంధా గర్గ్ -
మాజీ భర్త కుటుంబాన్ని క్లిక్‌మనిపించిన నటి!
టెలివిజన్ నిర్మాత, నటుడు రఘురాం, అతడి భార్య కెనడియన్ సింగర్ నటాలీ డి లూసియోలు తమ కుమారుడు రిథమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ముగ్గరి ఫొటోలను రఘురాం మాజీ భార్య, టీవీ నటి సుగంధ గార్గ్... వీరి ఫొటో షూట్‌ను నిర్వహించారు. తన కుమారుడు రిథమ్‌తో కలిసి ఉన్న ఫొటోలతో పాటు, భార్య నటాలి డి లూసియోతో కలిసి ఉన్న ఫొటోలకు ‘ప్రెజెంటింగ్.. ప్రౌడ్ పేరెంట్స్, బేబీ రిథమ్, డ్యాడీ లైఫ్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి షేర్ చేశారు. కాగా ఈ పోస్టుకు ‘ఈ ఫొటోలను తీసినందుకు ధన్యవాదాలు’ అంటూ మాజీ భార్య సుగంధకు రఘురాం కృతజ్ఞతలు తెలిపారు. సుగంధ జార్గ్ తీసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ ‘రిథమ్ ఎంత ముద్దుగా ఉన్నాడు’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 6వ తేదిన రఘురాం భార్య నటాలి.. రిథమ్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. (అందుకే నా కొడుకుకు ఆ పేరు: నటుడు) View this post on Instagram Presenting... The Proud Parents! #BabyRhythm #DaddyLife @nataliediluccio Pic: @isugandha Thank you so much for the pics, Kuhu! A post shared by Raghu Ram (@instaraghu) on Jan 19, 2020 at 9:52pm PST ఇక రఘురాం షేర్ చేసిన ఈ పోస్టుకు ఆయన మాజీ భార్య సుగంధ గార్గ్.. ఆయనకు, నటాలికి హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. ‘ ఈ ఫోటో గడిచిన జ్ఞాపకాలకు గుర్తు... వెల్కమ్ రిథమ్. నువ్వు యోధులకు జన్మించావు’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2006లో సుగంధ గార్గ్, రఘురాంలు వివాహవ చేసుకోగా, 2016లో వీరిద్దరూ విడుకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018లో కెనడియన్ సింగర్ నటాలిని ఆయన వివాహం చేసుకున్నారు. View this post on Instagram A photo to commemorate the passing of time..Welcome Rhythm...You’ve been born to warriors. @instaraghu @nataliediluccio A post shared by Sugandha (@isugandha) on Jan 17, 2020 at 12:21pm PST -
'విడాకులొచ్చాయి.. నా ప్రేమ ఎప్పటికీ నీకోసం..'
సాక్షి, ముంబయి : సాధారణంగా భార్యభర్తలు విడిపోవడం కొంత బాధే. ఎంత అధికారికంగా విడాకులు తీసుకున్నా వారిరువురిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా బాధ ఉండేఉంటుంది. కానీ, బాలీవుడ్‌కు చెందిన ఈ జంట మాత్రం ఎంతో ఖుషీగా విడాకులు తీసుకున్నారు. చాలా సంబరంగా ఆ వార్తను మీడియాతో పంచుకున్నారు. సుప్రసిద్ధమైన రోడీస్ అనే టీవీ కార్యక్రమానికి ఒకప్పుడు హోస్ట్‌గా వ్యవహరించిన రఘురామ్ ఆయన భార్య నటి సుగంధ గార్గ్ విడిపోయారు. ఈ విషయాన్ని రఘురామ్ మీడియాకు వెల్లడించారు. తమకు ఈ వారంలోనే విడాకులు అయ్యాయని అయినప్పటికీ తాము ఒకరికొకరం శ్రేయోభిలాషులమే అంటూ ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. 'కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నీకొరకు నావద్ద ఉన్న ప్రేమలాగా.. మన ఇద్దరి వద్ద ఒకరికోసం ఒకరి వద్ద ఉన్న సంతోషంలాగా.. ఏదీ ముగియలేదు. కొంచెం మారిందంతే.. మరో దశ ప్రారంభమైంది' అంటూ ఆయన పోస్ట్ చేశారు. 2006లో రఘురామ్‌కు సుగంధగార్గ్‌కు వివాహం అయింది. 2016లోనే వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. విడిపోయే సందర్భంలో పెద్ద పార్టీ కూడా ఉంటుందని వారు ప్రకటించారు. ఇప్పటికే పలు టీవీ షోలకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా సుగంధ గార్గ్ కూడా తేరే బిన్ లాడెన్ అనే కామెడీ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అలాగే, పలు టీవీ షోలకు కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. @isugandha Some things never change. Like the love I have for you. Like the fun we have always had together. Nothing ends. It changes and the next phase begins #FriendshipGoals #DivorceGoals A post shared by Raghu Ram (@instaraghu) on Jan 29, 2018 at 12:50am PST