Bollywood Star Heroes Divorce Cases In Telugu: ఫస్ట్‌ రీనా.. సెకండ్‌ కిరణ్‌... ఫాతిమా నం. 3 - Sakshi
Sakshi News home page

Aamir Khan Divorce: ఫస్ట్‌ రీనా.. సెకండ్‌ కిరణ్‌... ఫాతిమా నం.3

Published Tue, Jul 6 2021 1:16 AM | Last Updated on Wed, Jul 7 2021 8:23 AM

Something is going on Bollywood Industry - Sakshi

ఫాతిమా సనా షేక్‌,∙ఆమిర్‌ ఖాన్‌

శుభాకాంక్షలు ఆమిర్‌... ఫాతిమా... ఈ బంధం అయినా సుదీర్ఘంగా సాగాలి! తెరపై కూతురు.... నిజజీవితంలో భార్య!! మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అంటారు కానీ.. ఏ మాత్రం పర్‌ఫెక్ట్‌ కాదు!! ‘సత్యమేవ జయతే’కి హోస్ట్‌ చేశాడు... కానీ ఫాతిమా కోసం కిరణ్‌ని వదిలేశాడు!! ఫస్ట్‌ రీనా.. సెకండ్‌ కిరణ్‌... ఫాతిమా నం. 3 !!   ...గడచిన రెండు రోజులుగా సోషల్‌ మీడియా నిండా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే.

‘మా పదిహేనేళ్ల వివాహ బంధాన్ని ముగిస్తున్నాం.. విడిపోతున్నాం’ అని ఆమిర్‌ ఖాన్, కిరణ్‌ రావు గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఊహల్లో ఉన్న పేరు ‘ఫాతిమా సనా షేక్‌’.
కిరణ్, ఆమిర్‌; ఫాతిమా, ఆమిర్‌
‘దంగల్‌’ (2016)లో ఆమిర్‌కి కూతురిగా నటించింది ఫాతిమా. ఆ తర్వాత ఆమిర్‌ నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ (2018) లోనూ నటించింది. ఈ సినిమాలు పూర్తయ్యాక కూడా ఆమిర్, ఫాతిమా టచ్‌లోనే ఉంటున్నారని బాలీవుడ్‌ కథనం. అవార్డు వేడుకలకు, పెద్దింటి ఫంక్షన్లకు ఇద్దరూ జోడీగా వెళ్లారనే వార్తలు కూడా ఉన్నాయి. ఆమిర్‌ ఇంటికి ఫాతిమా రాకపోకలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ‘కుఛ్ కుఛ్‌ హో రహా హై?’ (ఏదో ఏదో జరుగుతోంది) అనే వార్తలు మొదలయ్యాయి. అప్పట్లో ఆ వార్తలను ఫాతిమా ఖండించింది కూడా. ‘‘ఇలాంటివి ఎదుర్కోవడం నాకస్సలు అలవాటు లేదు.

నేను ఎప్పుడూ కలవని అపరిచితులు నా గురించి ఏదేదో రాస్తున్నారు. నిజమేంటో వాళ్లకు తెలియదు. అయితే ఆవి చదివినవాళ్లు మాత్రం నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా రాయాలంటే, నన్నే అడిగితే చెబుతాను కదా. నిజాలు తెలియకుండా ఏవేవో ఊహించుకోవడం బాధగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వార్తలను విస్మరించడం నేర్చుకుంటున్నాను’’ అని ఫాతిమా పేర్కొన్నారు. అప్పుడు అలా స్పందించిన ఫాతిమా సనా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ‘ఆమిర్‌కి రీల్‌ లైఫ్‌లో కూతురు... రియల్‌ లైఫ్‌లో భార్య’ అనే విమర్శలు వినిపిస్తున్నా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ‘మౌనంగా ఉందంటే అవుననే కదా’ అని కూడా నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

భావప్రకటన స్వేచ్ఛ
అయితే ఆమిర్‌–ఫాతిమా మధ్య ఏం ఉందో తెలియకుండా దారుణంగా విమర్శించడం సరి కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ విమర్శిస్తున్నవారిలో కొందరు మాత్రం ‘భావప్రకటన స్వేచ్ఛ’ను తెరపైకి తెచ్చారు. దానికి ఆమిర్‌–కిరణ్‌లను కారణంగా చెబుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఓ కార్యక్రమంలో ఆమిర్‌ మాట్లాడుతూ – ‘‘దేశంలో జరుగుతున్న అల్లర్లు సహించలేనివిగా ఉన్నాయి. అభద్రతా భావం నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం పిల్లలకు క్షేమం కాదు.దేశం వదిలి వెళ్లిపోదామా అని నా భార్య కిరణ్‌ భయం వ్యక్తం చేసింది’’ అనడం చర్చకు దారి తీసింది.

ఇప్పుడు ఆమిర్‌–కిరణ్‌ విడాకుల వ్యవహారం నేపథ్యంలో.. దేశం పట్ల ఆమిర్‌కి ఏమాత్రం గౌరవం లేదని, అప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘మాకు కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంది. మేం కూడా మా అభిప్రాయాలను చెబుతున్నాం. ఈ విషయంలో నువ్వు.. కిరణ్‌.. నీ ప్రియురాలు (ఫాతిమా) మమ్మల్ని ఏమీ చేయలేరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ ఆమిర్‌కి తెలియనిది కాదు. కానీ మౌనం వహించారు. మరి.. విమర్శలకు గురవుతున్న ఆమిర్‌–ఫాతిమా నోరు విప్పితేనే చాలామంది నోళ్లు మూతబడే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంచి.. 56 ఏళ్ల ఆమిర్, 29 ఏళ్ల ఫాతిమా మధ్య నిజంగానే ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వీరిది మూడు ముడుల బంధం గా మారుతుందా? అనేది కాలమే చెప్పాలి.

విఫలమైన వివాహబంధాలు
హిందీ పరిశ్రమలో విఫలమైన వివాహ బంధాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు...
► బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఓంపురి 1991లో సీమా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఎనిమిది నెలలకే వీరు విడాకులు తీసుకుని వేరయ్యారు. ఆ నెక్ట్స్‌ ‘అన్‌లైక్లీ హీరో: ద స్టోరీ ఆఫ్‌ ఓంపురి’ అంటూ తన బయోగ్రఫీ రాసిన జర్నలిస్టు నందితా పురిని 1993లో వివాహం చేసుకున్నారు ఓంపురి. అయితే పెళ్లి చేసుకున్న పదేళ్లకు ఓంపురి, నందిత విడాకులు తీసుకున్నారు.

► నటి పూజా భట్, మనీష్‌ మఖీజా 2003లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు.
ఓంపురి, నందిత; సైఫ్, అమృత
► అర్బాజ్‌ ఖాన్, మలైకా అరోరా 1998లో పెళ్లి చేసుకున్నారు. 2017 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరో  అర్జున్‌ కపూర్‌తో మలైకా ప్రేమలో ఉన్నారని టాక్‌. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోనున్నారట.

► కరిష్మా కపూర్, అజయ్‌ దేవగణ్‌ లవర్స్‌ అని గతంలో బాలీవుడ్‌ కోడై కూసింది. తర్వాత ఇద్దరి మనసుల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత అభిషేక్‌ బచ్చన్‌తో 2002లో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి జరగలేదు. 2003లో వ్యాపారవేత్త సంజయ్‌ని పెళ్లాడారు కరిష్మా. 2014లో ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. 2016కి విడాకులు మంజూరయ్యాయి.

► నటుడు సైఫ్‌ అలీఖాన్‌ 1993లో నటి అమృతా సింగ్‌ను పెళ్లాడారు. 2004లో ఇద్దరూ విడిపోయారు. 2012లో హీరోయిన్‌ కరీనా కపూర్‌తో సైఫ్‌ ఏడడుగులు వేశారు.
ఇంకా హిందీ పరిశ్రమలో ఏడడుగులు వేసి, ఆ తర్వాత విడిపోయిన వారిలో నటుడు యాక్టర్, డైరెక్టర్‌ ఫర్హాన్‌– హెయిర్‌ స్టైలిస్ట్‌ అధునా భబానీ, రణ్‌వీర్‌ షోరే–కొంకణా సేన్‌ శర్మ, అనురాగ్‌ కశ్యప్‌– కల్కీ కొచ్లిన్‌ తదితరులు ఉన్నారు.


మలైకా, అర్బాజ్‌; హృతిక్, సుజానె; కరిష్మా, సంజయ్‌

హృతిక్‌ రోషన్‌కి 26 ఏళ్లకే పెళ్లయింది. 2000లో సుజానే ఖాన్‌ని పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2013లో విడివిడిగా ఉండటం ఆరంభించిన హృతిక్‌–సుజానేలకు 2014లో విడాకులు మంజూరయ్యాయి. పిల్లలిద్దరూ తల్లి, తండ్రి దగ్గర ఉంటుంటారు. భార్యాభర్తలుగా తాము విడిపోయినా పిల్లల బర్త్‌డేలు కలిసి చేస్తూ, కలిసి హాలిడే ట్రిప్‌లకు వెళుతూ తల్లితండ్రులుగా పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement