విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య | Kiran Rao Comments On Divorce With Aamir Khan | Sakshi
Sakshi News home page

Kiran Rao: విడాకులు తీసుకుని మూడేళ్లు.. ఇంకా అవే ఆలోచనల్లో!

Published Mon, Jul 22 2024 5:20 PM | Last Updated on Mon, Jul 22 2024 5:28 PM

Kiran Rao Comments On Divorce With Aamir Khan

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ 'లాల్ సింగ్ చద్దా' ఘోరమైన డిజాస్టర్ కావడంతో తాత్కాలికంగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా సరే కిరణ్ ఇంకా ఆ జ్ఞాపకాల్లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డివోర్స్ తీసుకున్నా కానీ తను సంతోషంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

'మనం ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాం. అలానే బంధాలు అనేవి కొత్త రూపు సంతరించుకోవాలి. ఆమిర్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లపాటు ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనాన్ని నేను ఎంజాయ్ చేశా. కానీ ఇప్పుడు నాకు ఆజాద్ (కొడుకు) తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఒంటరి కాదు. చాలామంది విడాకులు తీసుకున్నా తర్వాత ఒంటరిగా ఉండలేక సతమతమవుతుంటారు. నాకు ఆ విషయంలో భయం లేదు. ఎందుకంటే ఇరు కుటుంబాలు నాకు ఇప్పటికీ అండగా ఉన్నాయి. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు' అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చింది.

కిరణ్ రావ్ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 'యానిమల్' రిలీజ్ టైంలో పరోక్షంగా మూవీపై సెటైర్ వేశారు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈమెకు కౌంటర్ ఇచ్చేశాడు. దీంతో ఈమె సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్'.. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి, భర్త నుంచి తప్పిపోతే ఏం జరిగిందనేదే స్టోరీ. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మరోసారి తన విడాకులు గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement