Krishna Gadu Ante Oka Range 2023 Film Releasing on August 4 - Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. హీరోగా ఎంట్రీ!

Published Sun, Jul 30 2023 3:25 AM | Last Updated on Sun, Jul 30 2023 3:10 PM

Krishna Gadu Ante Oka Range film releasing on August 4 - Sakshi

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. రాజేష్‌ దొండపాటి దర్శకత్వంలో పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్‌ మూర్తి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 4న రిలీజ్‌ కానుంది. పెట్లా రఘురామ్‌ మూర్తి మాట్లాడుతూ– ‘‘నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి, ఘోస్ట్‌ రైటర్‌గా చేశాను. ఇక మా సినిమా కథ విషయానికి వస్తే... ఈ చిత్రంలో హీరో గొర్రెల కాపరి. కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌ అని హీరో చెబుతుంటాడు. ఇదే మాటను అతను ఊరి జనంతో చెప్పించాడా లేదా? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement