సాక్షి, కర్ణాటక: బీజేపీ సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్‌లు చేస్తుందంటూ ట్వీట్ చేసిన రియల్టీ టీవి షో హోస్ట్ రఘురాం ట్వీట్ పై బీజేపీ స్పందించింది. నోరు పారేసుకునే ముందు ఘర్షణల్లో మృతి చెందిన 24 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడాలని సూచించింది. అతడ్ని కెమెరా ముందు బుల్లి, కెమెరా వెనుక సిస్సి అని పేర్కొంటు ట్వీట్ చేసింది. గతంలో బీజేపీ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ‘మా కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యుల నుంచి పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వారి భద్రత విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను ఈ ప్రభుత్వం రక్షించదు. ప్రతి ఇంట్లోని కార్యకర్త జిహాద్ ముక్త కర్ణాటక కోసం పోరాడాలి’ అని ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రఘురాం బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తుందని, అధికారిక ఖాతా నుంచి ఇలాంటి సందేశాలు రావడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. వెంటనే బీజేపీ రఘురాంను బుల్లి, సిస్సి అంటు ఎద్దేవా చేసింది.
తర్వాత రఘురాం మరో ట్వీట్ చేశారు. ఇది ఎన్నికల సమయం. మీరు చంపడానికి ముస్లీంలు, కాల్చడానికి దళితులు ఇంకా ఉన్నారు. వెళ్లండి మీ లక్ష్యాన్ని చేరుకోండి అంటూ బీజేపీకి చురకలంటించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయమే ఉన్నందున బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది. ముఖ్యంగా హత్యకు గురైన 20 మంది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల గురించి ప్రస్తావిస్తూ.. తమ కార్యకర్తల మరణాలను రాజకీయ హత్యలుగా చెప్తు ఎన్నికల ముఖ్య ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణటకలో పర్యటించినప్పుడు ప్రధానంగా ఈ అంశాన్నే ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment