మనోహర ‘ప్యారి’కర్‌ | Sakshi Article On Manohar Parrikar | Sakshi
Sakshi News home page

మనోహర ‘ప్యారి’కర్‌

Published Tue, Mar 19 2019 1:26 AM | Last Updated on Tue, Mar 19 2019 1:47 AM

Sakshi Article On Manohar Parrikar

నివాళి

ఉక్కునరాలు... ఉక్కుకండరాలు... అతడే ఓ సైన్యం.  పాలనలో అతడో చైతన్యం. నిత్యనూతన స్రవంతి. ప్రజల్లో మని షిగా ప్రజల్లో తిరుగుతూ...  అతి సామా న్యుడు అసామాన్యుడిగా నిలిచాడు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అస్థిరతకు చిరునామాగా నిలిచిన గోవా రాజకీ యాల్లో సుస్థిర నినాదాన్ని మార్మోగించాడు. ప్రజలకు సరికొత్త పాలనను అందించి బీజేపీ ప్రభుత్వాల్లో నవశకం పూరించాడు. ఆయనే పరీకర్‌.

మనోహర్‌ పరీకర్‌ డిసెంబర్‌ 13, 1955 గోవాలోని ముపాసలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌ లో చేరి అంచలంచెలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ప్రమోషన్‌ పొందారు. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే తిరిగి ఆర్‌ఎస్‌ఎస్‌లో సంఘ్‌ చాలక్‌గా వ్యవహరించారు. 26 ఏళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలకనేతగా ఎదిగారు. గోవాలో రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృ తం చేశారు.

అద్వానీ రథయాత్రకు గోవాలో నీరాజనం పలికారు. బీజేపీకి జవజీవాలు నింపారు. విభిన్న సంస్కృతుల సంగమమైన గోవాలో కాషా యం జెండా రెపరెపలాడేలా చేయడంలో పరీకర్‌ది ముఖ్యభూమిక. నాలుగుసార్లు గోవా సీఎంగా వ్యవహరించిన పరీకర్‌ 2000 సంవత్సరంలో తొలిసారి, 2017లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతి లక్ష రూపాయలు పొందేలా పథకాన్ని ప్రారంభించి... అక్కడి మహిళా లోకానికి పెద్దన్నగా నిలిచాడు.
 
సింప్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌ పరీ కర్‌. ఎన్నో హంగులు, ఆర్భాటాలతో ఊదరగొడుతున్న నాయకాగణానికి భిన్నంగా పారికర్‌ కన్పిస్తారు. హాఫ్‌ హ్యాండ్‌ షర్ట్‌ ధరించి, సాధారణ దుస్తులతో సగటు భారతీయుడిని ప్రతిబింబిస్తారు. మనోహర్‌ పరీకర్‌ ముఖ్యమంత్రి అయినా, తన సొంత నివా సంలోనే ఉండేవారు. అత్యాధునిక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వినియోగించే ఇన్నోవా కారునే వినియోగించేవారు. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ట్రావెల్‌ చేసేవారు. 63 ఏళ్ల వయసులో సైతం రోజుకు 16 నుంచి 18 గంటలకు పనిచేసేవారు. గోవా మిస్టర్‌ క్లీన్‌గా ఆయనను అక్కడి ప్రజలు పిలుస్తారు. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ప్రధానిగా నరేంద్రమోదీని సమర్థించి... దేశానికి బలమైన నాయకత్వం అవసరమని నినదించారు.

పారికర్‌ సింప్లిసిటీ గురించి చెప్పడానికి ఇక్కడో ఉదంతాన్ని చెప్పాల్సి ఉంటుంది. అది గోవా పనాజీ ప్రాంతం... ఒక యాభై ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర హెల్మెట్‌ పెట్టుకొని స్కూట ర్‌పై గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి 25 ఏళ్ల యువకుడు ఆపకుండా హారన్‌ కొడుతున్నాడు. డీఎస్పీ కొడుకునని.. ఎందుకు నాకు దారివ్వరంటూ ప్రశ్నించాడు. అయితే ఇంతలో హెల్మెట్‌ తీసి ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. నువ్వు డీఎస్పీ కొడుకువైతే... ఈ రాష్ట్రానికి నేను సీఎంనంటూ చెప్పడంతో తెల్లబోయాడు ఆ కుర్రాడు. గోవా ముఖ్యమంత్రి, దేశ రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ ఆ వ్యక్తి.

అసెంబ్లీకి స్కూటర్‌ మీద వెళతారు. ప్రోటోకాల్‌ ఉండదు. పోలీస్‌ కేస్‌లలో జోక్యం ఉండదు.  రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంటే...  యావత్‌ గోవా కంట కన్నీరుపెట్టింది. 
గోవా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మనోహర్‌ పరీకర్‌... దేశ రక్షణ మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. భారత రక్షణ దళాలకు ప్రత్యే కంగా వినియోగించే... ఒక్కో జత షూను ఇజ్రా యెల్‌ నుంచి 25,000కు దిగుమతి చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పరీకర్‌... కొనుగోలు వెనుక వాస్తవాలను నిర్ధారణ చేసుకొని... ఆ తర్వాత భారత కంపెనీ నుంచి నేరుగా రూ‘‘ 2,200కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. తన కేబినెట్‌లో ఉన్న అరుదైన మంత్రి పరీకర్‌ అని, వజ్రసమానుడంటూ ప్రధాని మోడీ నుంచి కితాబు అందుకున్నారు. అందుకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరీకర్‌కు రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ తాను గోవాపైనే ప్రేమ చూపించారు. గోవా ప్రజలంటే అమితమైన ప్రేమ. గోవా ప్రజల సేవ లోనే ప్రాణాలు అర్పించారు.

పురిఘళ్ల రఘురామ్‌
వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకుడు
ఈ–మెయిల్‌ : raghuram.delhi@gmail.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement