Gova
-
వీడు మహా కేటుగాడు! డైరెక్ట్‌గా పోలీస్టేషన్లనే ఏం చేశాడో తెలిస్తే షాక్!
హైదరాబాద్: తాను బ్రెజిల్‌కు చెందినవాడినని, హైదరాబాద్ పర్యటనకు రాగా తన పర్సుతో పాటు ల్యాప్‌టాప్ కూడా చోరీ అయిందని ఈ నెల 7వ తేదీన అచ్చు విదేశీ యువకుడిలాగా ఉన్న ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు సరైనదేనని నమ్మి పర్సు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆ ప్రాంతానికి వెళ్లి రోజంతా సీసీ ఫుటేజీలు వెతికారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. తనకు తినడానికి కూడా డబ్బులు లేవని ఆ యువకుడు చెప్పగా రూ.500 ఇచ్చి పంపించారు. ఆ మరుసటి రోజు భువనగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అదే యువకుడు తన పర్సు పోయిందని, తాను అమెరికా నుంచి వచ్చానని అక్కడ పోలీసులకు చెప్పగా రోజంతా వారు కూడా సీసీ ఫుటేజీలు వడపోశారు. ఖర్చులకు డబ్బులు లేవని చెప్పగా రూ.1500 ఇచ్చి పంపారు. తాజాగా ఈ నెల 9న అదే యువకుడు మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన పర్సు పోయిందని ఫిర్యాదు చేశాడు. తిండికి డబ్బులు లేవని చెప్పడంతో జాలిపడ్డ అక్కడి పోలీసులు రూ.1000 ఇచ్చి పంపించారు. తీరా ఈ యువకుడి గురించి ఆరా తీస్తే గోవాకు చెందిన సెబీ డిసిల్వాగా గుర్తించారు. సదరు యువకుడు అచ్చం విదేశీ పోలికలతో ఉండటంతో పోలీసులు కూడా విదేశీయుడనే భ్రమపడి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టేవారు. ఖర్చుల కోసం అడిగితే డబ్బులు కూడా ఇచ్చారు. తీరా సదరు యువకుడి గురించి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు గోవాకు చెందిన వాడని, ఇలాగే రాజస్థాన్, బీహార్, గోవాలలో మోసాలకు పాల్పడి రిమాండ్ అయినట్లు తేలింది. రోజువారి ఖర్చుల కోసం ఇలాగే పర్సు పోయిందని ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తూ ఎంతో కొంత పోలీసుల నుంచే తీసుకొని రోజులు గడిపేస్తున్నట్లుగా తేలింది. ఈ సరికొత్త వసూళ్ల పథకం గురించి తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెడుతున్నారు. పోలీసులకు టోకరా వేస్తున్న వైనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ముందు ఈ యువకుడు పర్సు పోయిందని, ల్యాప్‌ట్యాప్ పోయిందని ఫిర్యాదు చేస్తే నమ్మవద్దని చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం! -
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
-
గోవా డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి జాన్ డిసౌజా అరెస్ట్
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
మనోహర ‘ప్యారి’కర్
ఉక్కునరాలు... ఉక్కుకండరాలు... అతడే ఓ సైన్యం. పాలనలో అతడో చైతన్యం. నిత్యనూతన స్రవంతి. ప్రజల్లో మని షిగా ప్రజల్లో తిరుగుతూ... అతి సామా న్యుడు అసామాన్యుడిగా నిలిచాడు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అస్థిరతకు చిరునామాగా నిలిచిన గోవా రాజకీ యాల్లో సుస్థిర నినాదాన్ని మార్మోగించాడు. ప్రజలకు సరికొత్త పాలనను అందించి బీజేపీ ప్రభుత్వాల్లో నవశకం పూరించాడు. ఆయనే పరీకర్. మనోహర్ పరీకర్ డిసెంబర్ 13, 1955 గోవాలోని ముపాసలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరి అంచలంచెలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ప్రమోషన్ పొందారు. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తిరిగి ఆర్ఎస్ఎస్లో సంఘ్ చాలక్‌గా వ్యవహరించారు. 26 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో కీలకనేతగా ఎదిగారు. గోవాలో రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృ తం చేశారు. అద్వానీ రథయాత్రకు గోవాలో నీరాజనం పలికారు. బీజేపీకి జవజీవాలు నింపారు. విభిన్న సంస్కృతుల సంగమమైన గోవాలో కాషా యం జెండా రెపరెపలాడేలా చేయడంలో పరీకర్ది ముఖ్యభూమిక. నాలుగుసార్లు గోవా సీఎంగా వ్యవహరించిన పరీకర్ 2000 సంవత్సరంలో తొలిసారి, 2017లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతి లక్ష రూపాయలు పొందేలా పథకాన్ని ప్రారంభించి... అక్కడి మహిళా లోకానికి పెద్దన్నగా నిలిచాడు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ పరీ కర్. ఎన్నో హంగులు, ఆర్భాటాలతో ఊదరగొడుతున్న నాయకాగణానికి భిన్నంగా పారికర్ కన్పిస్తారు. హాఫ్ హ్యాండ్ షర్ట్ ధరించి, సాధారణ దుస్తులతో సగటు భారతీయుడిని ప్రతిబింబిస్తారు. మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రి అయినా, తన సొంత నివా సంలోనే ఉండేవారు. అత్యాధునిక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వినియోగించే ఇన్నోవా కారునే వినియోగించేవారు. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ట్రావెల్ చేసేవారు. 63 ఏళ్ల వయసులో సైతం రోజుకు 16 నుంచి 18 గంటలకు పనిచేసేవారు. గోవా మిస్టర్ క్లీన్‌గా ఆయనను అక్కడి ప్రజలు పిలుస్తారు. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ప్రధానిగా నరేంద్రమోదీని సమర్థించి... దేశానికి బలమైన నాయకత్వం అవసరమని నినదించారు. పారికర్ సింప్లిసిటీ గురించి చెప్పడానికి ఇక్కడో ఉదంతాన్ని చెప్పాల్సి ఉంటుంది. అది గోవా పనాజీ ప్రాంతం... ఒక యాభై ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూట ర్‌పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి 25 ఏళ్ల యువకుడు ఆపకుండా హారన్ కొడుతున్నాడు. డీఎస్పీ కొడుకునని.. ఎందుకు నాకు దారివ్వరంటూ ప్రశ్నించాడు. అయితే ఇంతలో హెల్మెట్ తీసి ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. నువ్వు డీఎస్పీ కొడుకువైతే... ఈ రాష్ట్రానికి నేను సీఎంనంటూ చెప్పడంతో తెల్లబోయాడు ఆ కుర్రాడు. గోవా ముఖ్యమంత్రి, దేశ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆ వ్యక్తి. అసెంబ్లీకి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. పోలీస్ కేస్లలో జోక్యం ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంటే... యావత్ గోవా కంట కన్నీరుపెట్టింది. గోవా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మనోహర్ పరీకర్... దేశ రక్షణ మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. భారత రక్షణ దళాలకు ప్రత్యే కంగా వినియోగించే... ఒక్కో జత షూను ఇజ్రా యెల్ నుంచి 25,000కు దిగుమతి చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పరీకర్... కొనుగోలు వెనుక వాస్తవాలను నిర్ధారణ చేసుకొని... ఆ తర్వాత భారత కంపెనీ నుంచి నేరుగా రూ‘‘ 2,200కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. తన కేబినెట్లో ఉన్న అరుదైన మంత్రి పరీకర్ అని, వజ్రసమానుడంటూ ప్రధాని మోడీ నుంచి కితాబు అందుకున్నారు. అందుకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరీకర్‌కు రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ తాను గోవాపైనే ప్రేమ చూపించారు. గోవా ప్రజలంటే అమితమైన ప్రేమ. గోవా ప్రజల సేవ లోనే ప్రాణాలు అర్పించారు. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకుడు ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
ఐఎస్ఎల్ సెమీస్‌లో గోవా
చెన్నైయిన్పై 3-1తో విజయం చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది గోవాకు వరుసగా నాలుగో విజయం. ఇప్పటికే సెమీస్‌కు చేరిన చెన్నైయిన్పై గోవా ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శించింది. 23వ నిమిషంలో రోమియో గోల్ చేయగా 41వ నిమిషంలో సాంటోస్ గోల్ చేశాడు. ద్వితీయార్ధం 62వ నిమిషంలో స్లెపికా గోల్‌తో గోవా 3-0 ఆధిక్యం సాధించగా... 90వ ని.లో మారిస్ చెన్నైకి గోల్ అందించాడు. -
అతనితో నా అనుబంధం ప్రత్యేకం : ఇలియానా
‘‘ప్రపంచానికి నా విషయాలు చాటి చెప్పకపోయినా, నా జీవితంలో ఏం జరుగుతుందో మా అమ్మానాన్నలకు బాగా తెలుసు. వాళ్ల దగ్గర దాచాల్సినంత రహస్యాలేమీ నాకు లేవు’’ అంటున్నారు ఇలియానా. ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి, కొన్ని విషయాలు చెప్పారామె. వాటిలో, ఓ విదేశీయుడితో తన అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు ఇలియానా. ఆ విదేశీయుడితో ఈ గోవా భామ మూడు ముళ్లు వేయించుకోవడం ఖాయమనే వార్త కూడా ప్రచారంలో ఉంది. దీని గురించి ఆ ఇంటర్వ్యూలో ఇలియానా స్పష్టం చేస్తూ -‘‘నిజం చెప్పాలంటే నాకు కమిట్మెంట్ ఫోబియా ఉంది. గతంలో నేనో నటుణ్ణి ప్రేమించాను. మా ప్రేమను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. అతన్ని పూర్తిగా నమ్మాను. కానీ, నా నమ్మకాన్ని చాలాసార్లు వమ్ము చేశాడు. దాంతో ఆ అనుబంధాన్ని వద్దనుకున్నాను. ఆ అనుభవం వల్లనో ఏమో ఓ బంధం కొనసాగాలంటే పెళ్లే అవసరం లేదనిపించింది. పెళ్లి చేసుకోకుండా కూడా మంచి కమిట్మెంట్తో ఉండొచ్చనే ఫీలింగ్ ఏర్పడింది. అందుకే ప్రస్తుతం నా అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అలాంటి ప్రకటన అవసరంలేదని తనకూ అనిపించింది. ఇప్పుడు నా లైఫ్ బాగుంది. ప్రస్తుతం వైవాహిక జీవితం మీద నమ్మకం అయితే లేదు. నేను స్వేచ్ఛను ఇష్టపడే అమ్మాయిని. నన్నెవరూ ఏ విషయంలోనూ నిర్భందించలేరు’’ అని పేర్కొన్నారు.