అతనితో నా అనుబంధం ప్రత్యేకం : ఇలియానా
అతనితో నా అనుబంధం ప్రత్యేకం : ఇలియానా
Published Sat, Sep 28 2013 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘ప్రపంచానికి నా విషయాలు చాటి చెప్పకపోయినా, నా జీవితంలో ఏం జరుగుతుందో మా అమ్మానాన్నలకు బాగా తెలుసు. వాళ్ల దగ్గర దాచాల్సినంత రహస్యాలేమీ నాకు లేవు’’ అంటున్నారు ఇలియానా. ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి, కొన్ని విషయాలు చెప్పారామె. వాటిలో, ఓ విదేశీయుడితో తన అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు ఇలియానా. ఆ విదేశీయుడితో ఈ గోవా భామ మూడు ముళ్లు వేయించుకోవడం ఖాయమనే వార్త కూడా ప్రచారంలో ఉంది.
దీని గురించి ఆ ఇంటర్వ్యూలో ఇలియానా స్పష్టం చేస్తూ -‘‘నిజం చెప్పాలంటే నాకు కమిట్‌మెంట్ ఫోబియా ఉంది. గతంలో నేనో నటుణ్ణి ప్రేమించాను. మా ప్రేమను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. అతన్ని పూర్తిగా నమ్మాను. కానీ, నా నమ్మకాన్ని చాలాసార్లు వమ్ము చేశాడు. దాంతో ఆ అనుబంధాన్ని వద్దనుకున్నాను. ఆ అనుభవం వల్లనో ఏమో ఓ బంధం కొనసాగాలంటే పెళ్లే అవసరం లేదనిపించింది. పెళ్లి చేసుకోకుండా కూడా మంచి కమిట్‌మెంట్‌తో ఉండొచ్చనే ఫీలింగ్ ఏర్పడింది.
అందుకే ప్రస్తుతం నా అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అలాంటి ప్రకటన అవసరంలేదని తనకూ అనిపించింది. ఇప్పుడు నా లైఫ్ బాగుంది. ప్రస్తుతం వైవాహిక జీవితం మీద నమ్మకం అయితే లేదు. నేను స్వేచ్ఛను ఇష్టపడే అమ్మాయిని. నన్నెవరూ ఏ విషయంలోనూ నిర్భందించలేరు’’ అని పేర్కొన్నారు.
Advertisement
Advertisement