బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నా! | ileana d'cruz miss Happy Ending movie offer | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నా!

Published Wed, Aug 17 2016 11:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నా! - Sakshi

బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నా!

ఒక్కోసారి ఏం చేస్తున్నాం? ఏం చేయబోతున్నాం? అనే విషయాల్లో క్లారిటీ ఉండదు. డైలమాలో పడిపోతాం. ఆ మధ్య ఇలియానా పరిస్థితి అదే. నమ్మి చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఇక.. ఏ కథని నమ్మాలి, దేన్ని నమ్మకూడదో తెలియకుండా పోయిందట. ‘హ్యాపీ ఎండింగ్’ ఫెయిల్యూర్ తర్వాత ఇలియానాకి ఓ బంగారంలాంటి అవకాశం వచ్చిందట.  బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ డెరైక్టర్‌తో పెద్ద నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించిందని ఇలియానా పేర్కొన్నారు.
 
 ఆ సినిమా పేరు మాత్రం ఇల్లూ బేబి చెప్పడంలేదు. అందులో ఇలియానాకి ఆఫర్ చేసిన పాత్ర అటు గ్లామర్ ఇటు పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్నదట. ఈ పాత్రకు నన్నే ఎందుకు అడిగారు? అని ఆ చిత్రనిర్మాతను అడిగానని ఇలియానా చెబుతూ - ‘‘కథ, నా పాత్ర నచ్చాయి. కానీ, వర్కవుట్ అవుతుందో? లేదో అని డౌట్. అందుకే నన్నెందుకు అడుగుతున్నారు? అన్నాను. అప్పుడా నిర్మాత ‘మీరైతే బాగా చేయగలుగుతారని నమ్మకం’ అన్నారు.
 
  నటిగా నా మీద నాకు డౌట్ లేదు కానీ, సినిమా జడ్జిమెంట్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయాను. దాంతో నా అంతట నేనే వేరే హీరోయిన్ పేరు సూచించాను. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నందుకు నేనేం పశ్చాత్తాపపడలేదు. ఏదీ మన చేతుల్లో ఉండదు. ఒక్కోసారి అలా జరిగిపోతుంది. బాధపడితే మళ్లీ ఆ సినిమా రాదు కదా. అందుకే లైట్ తీసుకున్నా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement