Happy Ending
-
గూగుల్‌లో వెతికి సినిమాల్లోకి వచ్చా: యంగ్ హీరోయిన్
మా నేటివ్ ప్లేస్ ఒంగోలు. నాన్న ఉద్యోగరీత్యా ఫ్యామిలీ గుజరాత్ షిప్ట్ అయ్యాం. నాన్న రిలయన్స్ ఆయిల్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేవారు. నా చైల్డ్ హుడ్ గుజరాత్ లో గడిచింది. అక్కడి నుంచి కొన్నాళ్లు కువైట్ వెళ్లాం. కువైట్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఇండియాకు తిరిగి వచ్చాక గ్రాడ్యుయేషన్ చేసి కొంతకాలం జాబ్స్ చేశాను. జాబ్స్ ఏవీ నాకు సంతృప్తినివ్వలేదు. మన ఊహకు తగ్గట్లుగా పని చేస్తూ డబ్బులు సంపాదించడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేశా. యాక్టింగ్ అయితే మన ఊహ ప్రపంచానికి తగ్గట్లుగా పని చేయొచ్చని అనిపించి యాక్టింగ్ వైపు వచ్చాను’ అని యంగ్ హీరోయిన్ అపూర్వ రావు అన్నారు. యష్ పూరి, అపూర్వ రావు హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అపూర్వ రావు మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. ► సినిమాల మీద ఆసక్తి ఉన్నా మొదట్లో పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. కొన్నాళ్లకు యాక్టింగ్ వైపు రావాలని నిర్ణయించుకుని హైదారాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ లో జాయిన్ అయి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ టైమ్ లో పరిచయమైన కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్, వారి కామన్ ఫ్రెండ్స్ ద్వారా "హ్యాపీ ఎండింగ్" సినిమా ఆడిషన్స్ కు పిలిచారు. ► తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి, బాగా పర్ ఫార్మ్ చేయాలి అనేది వాళ్ల రిక్వైర్ మెంట్. నేను తెలుగుమ్మాయినే, నేను చేసిన ఆడిషన్ వాళ్లకు నచ్చి ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారు. దీని కంటే ముందు చాలా సినిమాలకు ఆడిషన్ చేశాను. వాళ్లకు నా పర్ ఫార్మెన్స్ నచ్చినా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆఫర్స్ రాలేదు ► "హ్యాపీ ఎండింగ్" సినిమాకు యూత్ పుల్ మూవీ అనే పేరు వచ్చింది. కానీ సినిమాలో చాలా హ్యూమర్, ఫన్ ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు బాగా నవ్వుకుంటారు. మాకు ఆ విషయం తెలుసుకాబట్టి బయట సినిమా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉన్నా...టెన్షన్ పడటం లేదు. సినిమా చూసిన వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్ టైన్ అవుతారు. ► ఈ మూవీలో హీరోకు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాని వల్ల ఆయన చేయాలనుకున్న పనులు చేయలేకపోతాడు. ఈ కాన్ ఫ్లిక్ట్ ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అందుకు అతను చేసే ప్రయత్నాలు హ్యూమరస్ గా ఉంటాయి. ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కూడా చాలా ఫన్ క్రియేట్ చేస్తాయి. ► యష్ గుడ్ కోస్టార్. రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అలాంటి యాక్టర్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉండేది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు శాపం ఉంటుంది. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడో వాళ్లకు ప్రాబ్లమ్ వస్తుంది. అలాంటి అబ్బాయిని అర్థం చేసుకుని, అతనికి సపోర్ట్ గా నిలిచే క్యారెక్టర్ నాది. ఇందులో యోగా ఇన్ స్ట్రక్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తా. యోగా టీచర్ అంటే వాళ్లు మానసికంగా బలంగా ఉంటారు. ఎదుటి వాళ్లను అర్థం చేసుకుంటారు. నా క్యారెక్టర్ ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్ లా అనిపించింది. హీరోయిన్ గా ఫస్ట్ ఫిలింకే కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించడం హ్యాపీగా ఉంది. ► మన సినిమా సెన్సిబిలిటీస్ లోనే హీరోయిన్ గా నా ప్రత్యేకత చూపించాలని కోరుకుంటున్నా. హీరోయిన్స్ శ్రీలీలను చూస్తే తను కూడా మన ఫార్మేట్ మూవీస్ లోనే డ్యాన్సెస్, పర్ ఫార్మెన్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది. అలాగే సమంత భిన్నమైన కాన్సెప్ట్స్ లు సెలెక్ట్ చేసుకుంటోంది. నేను కూడా అలా వెర్సటైల్ నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేయాలని ఉంది. సాయి పల్లవి కెరీర్ చూస్తుంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేందుకు కావాల్సిన మోటివేషన్ కలుగుతుంటుంది. అవకాశాలు వస్తే ఆమెలా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయొచ్చు అని ధైర్యం వస్తుంటుంది. నేను డ్యాన్సులు చేయగలను. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. సింగింగ్ లోనూ ప్రాక్టీస్ ఉంది. ► "హ్యాపీ ఎండింగ్" సినిమాకు పనిచేసిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లమే కాబట్టి చాలా అండర్ స్టాండింగ్ తో వర్క్ చేశాం. దర్శకుడు కౌశిక్ మా అందరి సజెషన్స్, ఆలోచనలు తీసుకునేవారు. అలా టీమ్ వర్క్ గా మూవీ చేశాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. మనం చేసిన క్యారెక్టర్స్ కు మన వాయిస్ ఉంటేనే బాగుంటుందని బిలీవ్ చేస్తాను. అయితే కొన్నిసార్లు చిన్మయి లాంటి వాళ్ల వాయిస్ ఆ క్యారెక్టర్స్ కు అసెట్ అవుతుంటాయి. ►నాకు అడివి శేష్, రానా, నవీన్ పోలిశెట్టి వంటి హీరోస్ తో నటించాలని ఉంది. వాళ్ల మూవీస్ లో ఔట్ పుట్ బాగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక మంచి మూవీని ప్రేక్షకుల దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. -
పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ‘హ్యాపీ ఎండింగ్ ’
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీఎండింగ్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. ఈ టైటిల్ వినగానే చాలా ఊహించుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుందని నిర్మాత అనిల్ పల్లాల అన్నారు. (చదవండి: ఊ అంటావా మావా.. లాంటి పాటలు నేను చేయను: కృతీ శెట్టి) హీరో యశ్ మాట్లాడుతూ.. ‘హ్యాపీ ఎండింగ్ అనేది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. సినిమా మీద ప్రేమతోనే ఈ హ్యాపీ ఎండింగ్ తీశాం’ అన్నారు. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను అని హీరోయిన్ అపూర్వ రావు పేర్కొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మిత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు కార్తీక్ రత్నం, హీరో తిరువీర్ తదితరులు పాల్గొన్నారు. -
వస్తామన్న బస్సు రానే వచ్చింది.. తండ్రిని ఆగం పట్టిచ్చిన ఆన్లైన్ గేమ్స్!
భిక్కనూరు (నిజామాబాద్): మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారి భార్య, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆనంద్‌గౌడ్ వారి ఆచూకీని నాలుగు గంటల్లోనే కనుగొనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏమి జరిగిందంటే.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యా పారి వీరమల్లి శ్రీనివాస్‌కు భార్య శాలిని అలియాస్ అశ్విని, ఇద్దరు కుమారులు వరుణ్, లోకేష్‌లు ఉన్నారు. శాలిని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని ఈనెల ఒకటవ తేదీ తిప్పాపూర్ నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ తండ్రిని పరామర్శించి 3వ తేదీ కరీంనగర్లో బస్సు ఎక్కి కామారెడ్డికి మధ్యాహ్నం 3.50 గంటలకు చేరుకుంది. తన భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి తిప్పాపూర్ రావడానికి రామాయంపేటలో బయలుదేరుతున్నానని భిక్కనూరు నుంచి తనను తిప్పాపూర్ తీసుకెళ్లాలని సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన భిక్కనూరు బస్టాండ్‌కు వచ్చాడు. బస్సులో రాకపోగా ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో తీవ్ర ఆందోళన చెందారు. చదవండి👉 ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం ఆమె కుమారులు సెల్ఫోన్లో గేమ్ ఆడటంతో చార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ఆఫ్ ఆయ్యింది. కాగా తండ్రి మీద ఉన్న మమకారంతో ఆమె తిరిగి కరీంనగర్ వెళ్ళాలని నిర్ణయించి కుమారులతో కలిసి సిరిసిల్లి బస్సు ఎక్కారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్ళారు. అయితే ఎస్సై ఆనంద్‌గౌడ్ తీవ్రంగా కృషి చేసి ఫోన్ సిగ్నల్ ఆధారంగా సిరిసిల్లలో ఉన్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్సైని పలువురు అభినందించారు. చదవండి👉🏻 వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్ -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
పెదకాకాని(గుంటూరు జిల్లా): కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసు బృందాలు క్షేమంగా ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. పెదకాకాని మండలం నంబూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శివదుర్గ యానాదికాలనీలో ఈనెల 24న రెండేళ్ల బాలుడు జీవాను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టింది. సెల్‌టవర్ డంప్, సీసీ కెమెరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సది్వనియోగం చేసుకుని నిందితుల ఆచూకీ గుర్తించారు. విజయవాడ వాంబేకాలనీలో నిందితులను గుర్తించిన పోలీసు బృందాలు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించాయి. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. నిందితులు రూ.1.60 లక్షలకు విక్రయించిన బాబు జీవాను, కొనుగోలు చేసినవారిని, మధ్యవర్తులుగా వ్యవహరించినవారిని వెంటబెట్టుకుని జిల్లాకు చేరారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం మూడు రోజులుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు బాబును చూపించడంతో వారి కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. సిబ్బందికి ప్రశంసల జల్లు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ దుర్గాప్రసాద్ నేతృత్వంలో పనిచేసిన పోలీసు బృందాలు బాబును క్షేమంగా తీసుకుని తిరిగిరావడంపై అధికారులు, ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
విశాఖ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
-
స్వప్న అదృశ్యం కథ సుఖాంతం
-
అనంతలో కిడ్నాపైన బాలుడు క్షేమం
-
ట్రైన్ నం. 2016 ...చిన్న సినిమా ఎక్స్‌ప్రెస్
రైల్వే స్టేషన్ బాగా రద్దీగా ఉంది... 2016 ఎక్స్‌ప్రెస్‌కి బాగా గిరాకీ ఉంది ప్రయాణికులకే కాదు.. సమోసాలకీ, కూల్ డ్రింకులకీ సూపర్‌గా వర్కవుట్ అయింది. 2016లో చిన్న బడ్జెట్ సినిమా ‘చుకు... చుకు’ అంటూ డ.. డ..డ (అంటే డబ్బింగ్ సినిమాలని అర్థం) సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ని తలదన్నే ఎక్స్‌ప్రెస్ సినిమాగా పేరు తెచ్చుకుంది. యస్... 2016 తెలుగు సినిమా హీరో ఎవరంటే ‘కథే’ అనాలి. బడా బడా స్టార్ హీరోలు చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన సంవత్సరంలోనే.... కొన్ని ఛోటా మోటా సినిమాలు కంటెంట్‌తో భారీ కలెక్షన్లు రాబట్టాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. స్టార్ హీరోల సిన్మాలతో పాటు కథాబలం ఉన్న సిన్మాలను సైతం ఆదరించిన తెలుగు ప్రేక్షకులూ హీరోలనే చెప్పుకోవాలి. ఒక్కసారి 2016ని రివైండ్ చేసుకుంటే... భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ‘క్షణం’ ఒకటి. అసలు ‘క్షణం’లో ఏముందండీ... బడా స్టార్స్ లేరు, భారీ సెట్స్, హంగామా లేదు, సో కాల్డ్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా కానే కాదు. మరి, ఏముంది? క్షణక్షణం ఉత్కంఠ కలిగించే కథ, కథనం ఉన్నాయి. కన్నకూతురి అన్వేషణలో ఓ తల్లి పడే మనోవేదన ప్రేక్షకుల మనసుల్ని తడిమింది. ఆమెకు సహాయం చేయాలని పరితపిస్తున్న మాజీ ప్రియుడి ప్రయత్నాలు ఫలించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారంటే.. ప్రేక్షకులు సినిమాలో ఎంతగా లీనమయ్యారో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ రెండు కోట్లతో తీసిన ‘క్షణం’ ఎవరూ ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా టీమ్ అందరికీ మంచి పేరొచ్చింది. ‘క్షణం’ హిట్‌తో మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో అడవి శేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నవేనట! ఇక, ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు ఇప్పటివరకూ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. కారణం ఏంటంటే.. మంచి కథ కోసం వెతుకుతున్నారట! మళ్లీ మళ్లీ చూశారు ‘క్షణం’ గతేడాది ఫస్టాఫ్ ఫిబ్రవరిలో విడుదలైతే... సెకండాఫ్ జూలైలో వచ్చిన మరో చిన్న సినిమా ‘పెళ్లి చూపులు’ కూడా భారీ హిట్ సాధించింది. నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది. అసలు ‘పెళ్లి చూపులు’ కథలో ఉన్నదేంటి? బీటెక్ కంప్లీట్ చేసి, షెఫ్ కావాలనుకునే హీరో... ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే హీరోయిన్... ‘పెళ్లి చూపులు’కి ఓ ఇంటికి వెళ్లబోయిన హీరో ఆమె ఇంటికి వెళ్లడం... తర్వాత ప్రేమ, వగైరా వగైరా కథ ఇంతే. కానీ, అందులోని పాత్రలు, సందర్భాలతో ప్రేక్షకులు తమను తాము రిలేట్ చేసుకున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్ సహజత్వానికి దగ్గరగా తీయడంతో ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూశారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత హీరో విజయ్ దేవరకొండకి బడా బడా నిర్మాణ సంస్థల్లో నటించే ఛాన్సులు వచ్చాయి. సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌లో ‘ద్వారక’, గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, ‘అర్జున్‌రెడ్డి’ అనే మరో సినిమా చేస్తున్నారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్ మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని కథ సిద్ధం చేసుకుంటున్నారు. అనువాదం కూడా అదిరింది స్ట్రయిట్ సినిమాలే కాదండీ... కథే హీరోగా వచ్చిన డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల దుమ్మ దులిపాయి. సినిమా బాగుంటే చాలు, మాకు భాషాబేధం లేదని ‘ద జంగిల్ బుక్’, ‘బిచ్చగాడు’, ‘మన్యం పులి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు మెట్రో నగరాల్లో మాత్రమే ఎక్కువగా ఆడుతుంటాయి. ఒకవేళ తెలుగులో డబ్ చేసి విడుదల చేసినా బి, సి సెంటర్లలో చిల్లర తప్ప పెద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. అందుకే తక్కువ మొత్తానికే అనువాద హక్కులు దక్కించుకున్నారు. కానీ, ఎక్కువ లాభాలే చూశాను. ‘ద జంగిల్ బుక్’ భారతీయ సినీ ప్రముఖుల దిమ్మ తిరిగే వసూళ్లు సాధించింది. ఒక్క తెలుగులోనే కాదు.. భారతీయ భాషలన్నిటిలోనూ అనువాదమైన ఈ హాలీవుడ్ చిత్రం హిట్ హిట్ హుర్రే అనిపించుకుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన, టీవీలో చూసిన మోగ్లీ కథ కావడంతో మన ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు. తమిళ డబ్బింగ్ ‘బిచ్చగాడు’ అయితే తెలుగులో కళ్లు చెదిరే కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమా తెచ్చిన ఇమేజ్‌తో విజయ్ ఆంటోని తర్వాతి సినిమా ‘భేతాళుడు’ తెలుగులో భారీగా విడుదలైంది. 2015 వరకూ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు తెలుగులో పెద్ద మార్కెట్ లేదు. స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’లతో మన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మలయాళ డబ్బింగ్ ‘మన్యం పులి’తో మన ముందుకు వచ్చారు. ఇందులో యాక్షన్ సీన్లు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించిందంటే కారణం సినిమాలో కథే. ఇప్పుడు మరో మలయాళ హిట్ ‘ఒప్పం’ తెలుగు డబ్బింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి మోహన్‌లాల్ రెడీ అయ్యారు. కొత్త ఏడాదిలోనూ కాలరెగరేస్తుందా? 2016లో రెండు మూడు కోట్లతో తీసిన సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి, కాలరెగరేయడంతో ‘చిన్న సినిమా’కి పెద్ద రేంజ్ వచ్చింది. దాంతో పదుల సంఖ్యలో ‘లో–బడ్జెట్’ సినిమాలు ప్రారంభమవుతున్నాయి. 2017లోనూ మరిన్ని ఛోటా సినిమాలు రానున్నాయి. కింగ్‌లాంటి కంటెంట్‌తో తీస్తే.. ఈ ఏడాది కూడా చిన్న సినిమా తొడగొడుతుందని చెప్పొచ్చు. అయితే చిన్న సినిమాల పరిస్థితి బాగుంది కదా అని హడావిడిగా మొదలుపెట్టేసి, ‘మమ’ అనిపిస్తే మాత్రం హిట్ కష్టమే. అందుకే మంచి కథ, సరైన ప్లానింగ్‌తో సినిమాలు తీస్తే హిట్టవుతాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. పాయింటే కదా! మీడియమ్... విజయం ఘనం! మంచి కథతో కూడిన డిఫరెంట్ సినిమాలు చేసే యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకరు. ‘స్వామి రారా’తో మొదలుకుని ఆ తర్వాత నిఖిల్ చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. ప్రేక్షకుల్లో తనకున్న పేరును నిలబెట్టుకుంటూ గతేడాది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చేశారు. పెద్ద నోట్ల చలామణీ రద్దు చేసిన తర్వాత విడుదలైన ఈ మీడియమ్ బడ్జెట్ సినిమా మంచి హిట్టయింది. కంటెంట్ బాగుంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిరూపించింది. ఇక, భారీ చిత్రాలు నిర్మించే గీతా ఆర్ట్స్ తీసిన మీడియమ్ బడ్జెట్ సినిమా ‘శ్రీరస్తు సుభమస్తు’ అల్లు శిరీష్‌కి మంచి హిట్ అందించింది. హ్యాపీ ఎండింగ్ ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని నిరూపించిన మరో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. 2016 డిసెంబర్ 31కి ఒక్క రోజు ముందు విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. క్యారెక్టర్ లెంగ్త్ గురించి ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఇంతియాజ్ అలీగా నటించిన నారా రోహిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే ఇందులో నటించిన మరో హీరో శ్రీవిష్ణు కూడా మంచి పేరు తెచ్చుకోగలిగారు. దర్శకుడు సాగర్ చంద్రపై ఇండస్ట్రీ దృష్టి పడింది. సుమారు రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమా 15 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2016కి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది. కమెడియన్స్ కేరాఫ్ హిట్ ఫిల్మ్స్! కమెడియన్స్ శ్రీనివాసరెడ్డి, సప్తగిరిలు గతేడాది హీరోలుగా హిట్స్ అందుకున్నారు. అలాగని వీళ్లేమీ ఫుల్ టైమ్ హీరోలుగా మారలేదు. కమెడియన్స్‌గా సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు. మంచి కథ, తన బాడీ లాంగ్వేజ్‌కి సూటవుతుందని ఫీలవడంతో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో సప్తగిరి హీరో అయ్యారు. కామెడీతో పాటు డ్యాన్సులు, యాక్షన్ కూడా బాగా చేశారనే పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఫస్ట్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆల్రెడీ ‘గీతాంజలి’తో హీరోగా ఓ హిట్ అందుకున్న శ్రీనివాసరెడ్డి, మరోసారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదీ హిట్ అన్పించుకుంది. కమెడియన్స్‌గా వీళ్ల ఇమేజ్‌తో పాటు కథలో కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు వీళ్లను హీరోలుగా మంచి మార్కులతో పాస్ చేసేశారు. ఈ ఏడాది కూడా కొంతమంది కమెడియన్లు హీరోలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమెడియన్ షకలక శంకర్ హీరోగా ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ’ అనే సినిమా కమిట్ అయ్యారు. ఈ నెల 5న ఈ చిత్రం ఆరంభం కానుంది. – సాక్షి సినిమా డెస్క్ -
బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నా!
ఒక్కోసారి ఏం చేస్తున్నాం? ఏం చేయబోతున్నాం? అనే విషయాల్లో క్లారిటీ ఉండదు. డైలమాలో పడిపోతాం. ఆ మధ్య ఇలియానా పరిస్థితి అదే. నమ్మి చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఇక.. ఏ కథని నమ్మాలి, దేన్ని నమ్మకూడదో తెలియకుండా పోయిందట. ‘హ్యాపీ ఎండింగ్’ ఫెయిల్యూర్ తర్వాత ఇలియానాకి ఓ బంగారంలాంటి అవకాశం వచ్చిందట. బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ డెరైక్టర్‌తో పెద్ద నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించిందని ఇలియానా పేర్కొన్నారు. ఆ సినిమా పేరు మాత్రం ఇల్లూ బేబి చెప్పడంలేదు. అందులో ఇలియానాకి ఆఫర్ చేసిన పాత్ర అటు గ్లామర్ ఇటు పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నదట. ఈ పాత్రకు నన్నే ఎందుకు అడిగారు? అని ఆ చిత్రనిర్మాతను అడిగానని ఇలియానా చెబుతూ - ‘‘కథ, నా పాత్ర నచ్చాయి. కానీ, వర్కవుట్ అవుతుందో? లేదో అని డౌట్. అందుకే నన్నెందుకు అడుగుతున్నారు? అన్నాను. అప్పుడా నిర్మాత ‘మీరైతే బాగా చేయగలుగుతారని నమ్మకం’ అన్నారు. నటిగా నా మీద నాకు డౌట్ లేదు కానీ, సినిమా జడ్జిమెంట్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయాను. దాంతో నా అంతట నేనే వేరే హీరోయిన్ పేరు సూచించాను. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నందుకు నేనేం పశ్చాత్తాపపడలేదు. ఏదీ మన చేతుల్లో ఉండదు. ఒక్కోసారి అలా జరిగిపోతుంది. బాధపడితే మళ్లీ ఆ సినిమా రాదు కదా. అందుకే లైట్ తీసుకున్నా’’ అన్నారు. -
ఏడాదంతా అదే చేశా!
ఇలియానా ఇప్పుడేం చేస్తున్నారు? చేతినిండా సినిమాలైతే లేవు. జస్ట్ ఒకే ఒక్క సినిమా ఉందట. అది కూడా హిందీ సినిమా. ఆ సినిమా చిత్రీకరణ ఆరంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. అది పట్టాలెక్కితేనే ఆ సినిమా అయినా ఉన్నట్లు లెక్క. చేతిలో సినిమాలేవీ లేకపోయినా ఇలియానా బిజీగానే ఉన్నారట. ఎలా? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ మధ్య ఇలియానాకు కొత్తగా ఒక ఇష్టం ఏర్పడింది. అదే ‘ఫొటోగ్రఫీ’. ఒక మంచి కెమేరా కొనుక్కోవాలనుకున్నారట. షాపింగ్ అంటూ మాల్స్ చుట్టూ తిరిగే బదులు ఇంటిపట్టునే కూర్చుని ఆన్లైన్లో కొనుక్కుంటే బెటర్ కదా అనుకున్నారు. ఆన్లైన్ ద్వారా ఓ మంచి కెమేరా కొనుక్కున్నారు. అది చేతికి అందినప్పటి నుంచీ కంటికి నచ్చిందల్లా తన కెమెరాతో క్లిక్‌మనిపిస్తున్నారు. ‘‘పిల్లలను ఎక్కువగా ఫొటోలు తీస్తున్నాను. వాళ్లు బెస్ట్ మోడల్స్ అని నా అభిప్రాయం. ఈ ఏడాది ఎక్కువగా ఫొటోలు తీయడమే చేశా’’ అని చెప్పారు. హిందీలో ఆమె చేసిన చివరి చిత్రం ‘హ్యపీ ఎండింగ్’ గత ఏడాది విడుదలైంది. ‘ఏడాది పాటు సినిమాలు ఒప్పుకోకుండా ఎందుకు ఖాళీగా ఉన్నారు?’ అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే - ‘‘ఈ ఏడాది కాలంలో చాలా కథలు విన్నాను. నన్ను ఎగ్జయిట్ చేసే కథ ఏదీ రాలేదు. మంచి కథ, చక్కని పాత్ర అయితేనే చేయాలనుకుంటున్నా. అలా అనుకోవడం వల్లే ఈ గ్యాప్ వచ్చింది’’ అని పేర్కొన్నారు. -
అద్భుతం అంటే ఇదే....
-
అద్భుతం అంటే ఇదే....
చెన్నై: మానవత్వం మంటగలిసిపోతున్న వార్తలను చూసి ఊసూరుమంటున్న వారికి ఊరట కలిగించే వార్త ఇది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మనుషులు స్పందిస్తున్నారు అనడానికి ఈ తల్లీ కూతుళ్ల ఉదంతమే నిదర్శనం. అనూహ్య పరిణామాలతో ఇబ్బందుల్లో పడ్డ తల్లీకూతుళ్లను ఆదుకొని, ఒక విద్యార్థిని భవిష్యత్తుకు చెన్నైలోని టీ-వాకర్లు పునాది వేసిన వైనం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. స్వాతి అనే విద్యార్థిని కాలేజీలో అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. ఆమె తల్లితో కలిసి చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చేరుకుంది. తీరా అక్కడికొచ్చాక తను చేసిన తప్పేంటో అర్థమైంది. మార్నింగ్ వాక్ చేస్తున్న కొంతమందిని అడ్రస్ గురించి వాకబు చేసినపుడు వారికి విషయం అర్థమైంది. కోయంబత్తూరులోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్లాల్సిన తాము.. పొరపాటున వేరేచోటకు వచ్చామని తెలుసుకున్నారు. అప్పటికి చాలా తక్కువ సమయమే మిగిలి ఉండడంతో ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. తల్లీ కూతుళ్లు ఆశలు వదిలేసుకుని దిగాలు పడినా, ఆ వాకర్స్ మాత్రం ఈ విషయాన్ని వదిలేయలేదు. ఎలాగైనా స్వాతిని కౌన్సెలింగ్ సెంటర్‌కు చేర్చాలనుకున్నారు. తమ గ్రూపు సభ్యులను సంప్రదించారు. తలా ఇంత వేసుకుని అప్పటికప్పుడు సుమారు పదివేల రూపాయలకు పైగా పోగేశారు. ఆగమేఘాల మీద తల్లీకూతుళ్లను విమానంలో కోయంబత్తూరుకు పంపారు. ఎయిర్పో ర్ట్లో వారిని రిసీవ్ చేసుకొని యూనివర్సిటీకి చేర్చడానికి అక్కడ మరికొందరు సిద్ధంగా ఉన్నారు. అంతేనా.. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కి జరిగిందంతా వివరించి ఆమెకు సీటును ఖాయం చేసేందుకు కృషి చేశారు. ఇదంతా విన్న ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. కానీ నిర్ణీత సమయంలో యూనివర్సిటీకి చేరుకుని, తమ సీటును ఖాయం చేసుకుంది స్వాతి. స్వాతికి సాయం చేసిన వాకర్స్ టి-వాకర్స్ పేరుతో నడుస్తున్న గ్రూపు సభ్యులు. ఈ విషయాన్నివిషయాన్ని వారు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదిపుడు నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. దీనిపై స్వాతి సంతోషంతో పొంగిపోయింది. ఇది తన జీవితంలో జరిగిన అద్భుతమని పేర్కొంది. తమకోసం వాకర్స్ గ్రూపు ఖర్చుపెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. అటు స్వాతి తల్లి తంగ పొన్ను కూడా తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. వాళ్లకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదన్నారు. ఏం చేసి వారి రుణం తీర్చుకోగలమని సంతోషపడ్డారు. -
ఈసారైనా లక్ తగులుతుందా?
-
చర్చనీయాంశమైన శృంగార కథా రచయిత్రిగా...
సైఫ్ అలీఖాన్, ఇలియానా జంటగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ గురించి అటు మీడియాలోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చ ఒకటి హల్చల్ చేస్తోంది. పైగా ఆ చర్చ కూడా ఇలియానా పాత్ర గురించే. ఈ సినిమాలో ఇలియానా శృంగార కథల రచయిత్రిగా నటిస్తోందనీ, దానికి తగ్గట్టే అంతకు ముందెప్పుడూ కనిపించనంత అందంగా ఇందులో ఇల్లూ బేబీ కనిపించనుందనీ, బెడ్రూమ్ సన్నివేశాల్లో కూడా సైఫ్‌తో కలిసి రెచ్చిపోయి నటించిందనీ ఈ చర్చ సారాంశం. దీనిపై రకరకాల కథనాలు ఇప్పటికే మీడియాలో వచ్చాయి. ఇలియానా మొదట్లో వీటిపై పెద్దగా స్పందించకపోయినా... ఈ గాలివార్తలు శ్రుతి మించి రాగాన పడఢంతో స్పందించక తప్పలేదు. ‘‘అందరూ అనుకుంటున్నట్లు ఇందులో నేను శృంగార కథల రచయిత్రినే. అయితే... నేను శృంగారాన్ని ఒలకబోశాననే వార్తల్లో మాత్రం నిజం లేదు. ఇందులో నా పాత్ర చాలా పద్ధతిగా ఉంటుంది. రొమాన్స్ అనేది నా రచనల్లో ఉంటుంది తప్ప, నాలో కనిపించదు. నిజానికి ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకిస్తున్నానంటే.. అనవసరంగా అంచనాలు పెరగడం, చివరకు థియేటర్లో వాళ్లు ఊహించినవి లేకపోవడం... వంటి కార ణాలు సినిమా ఫలితంపై ప్రభావితం చేస్తాయి.అందుకే చెబుతున్నా’’ అని వివరణ నిచ్చారు ఇలియానా. -
సైఫ్‌తో హాట్ హాట్‌గా...
రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా బతకాల్సిందే... అనే సూత్రాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు ఇలియానా. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి చాలామంది భామలే వెళ్లారు కానీ... ఇలియానా అంత వేగంగా అక్కడి పద్ధతుల్ని ఆకళింపు చేసుకున్న తార మాత్రం లేరనే చెప్పాలి. తొలి సినిమా ‘బర్ఫీ’ మినహా ఆ తర్వాత ఇలియానా చేసిన రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి. నిజానికి ఇలాంటి అపజయాలు ఎదురైన ఏ హీరోయిన్ అయినా... వెంటనే వెనక్కు వచ్చేస్తారు. కానీ... ఇలియానా అలా కాకుండా, బికినీ ఫొటో షూట్‌తో అక్కడ బోలెడంత పాపులారిటీ తెచ్చేసుకున్నారు. అక్కడి హీరోలతో క్లోజ్‌గా ఉండటమే కాక, కథానాయికలతో దోస్తీ కడుతూ ఉత్తరాది భామగా మారిపోయారు. ఇదిలావుంటే... ఇటీవలే సైఫ్ అలీఖాన్ జోడీగా ఇలియానా నటించిన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ట్రయిలర్స్‌లో ఇలియానా హాలీవుడ్ లుక్ చూసి బాలీవుడ్ జనాలు సైతం ఫిదా అయిపోతున్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే... ఈ సినిమా దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకెలు కథ రీత్యా ఇందులో ఓ బెడ్రూమ్ సీన్ చిత్రీకరించారట. సైఫ్, ఇలియానా కాంబినేషన్లో రూపొందిన ఈ సన్నివేశంలో ఇలియానా హాట్ హాట్‌గా నటించారని యూనిట్ వర్గాల టాక్. ఈ విధంగా... జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్ సంప్రదాయాలను పాటిస్తూ, చకచకా హిందీ తెరపై అగ్ర నాయికల జాబితాకి చేరిపోతున్నారు ఇలియానా. -
ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో నటి ఇలియానా ప్రేమలో పడ్డారంటూ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇలియానా నటిస్తున్న చిత్రాల షూటింగ్ లొకేషన్స్‌లో ఆండ్రూ కనిపించడం ఈ వార్తకు ఊతమిచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న హిందీ చిత్రాల్లో ఒకటైన ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రం లొకేషన్‌కు ఆండ్రూ తరచుగా వెళుతున్నారట. లాస్ ఏంజిల్స్‌లో ఈ చిత్రం షూటింగ్ జరిగినప్పుడు ఆండ్రూ దర్శనమివ్వని రోజు లేదని సమాచారం. అంతే కాదు... ఈ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర కూడా చేశారట. చిత్రదర్శకులు డీకే కృష్ణ, రాజ్ నిడుమోరు అడగ్గానే ఆండ్రూ కాదనకుండా ఈ పాత్ర చేశారనీ, తన ప్రేయసి (?) ఇలియానాతో కలిసి ఆయన ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తారనీ భోగట్టా. కెమెరా పట్టుకుని ఫొటోలు తీయడం తప్ప కెమెరా ముందు నటించడం తెలియని ఆండ్రూకు ఇలియానా స్వయంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సైఫ్ ఆలీఖాన్‌తో గోవా భామ ఎంజాయ్!
గోవా బ్యూటీ ఇలియానా హిట్లుమీద హిట్లు కొడుతోంది. టాలీవుడ్లో ఓ వెలుగువెలిగి ఆ తరువాత బాలీవుడ్లో అడుగుపెట్టింది మొదలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. బర్ఫీ మూవీతో బెస్ట్ డెబ్యూగా అవార్డు సంపాదించుకుంది. తెలుగులో దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇలియానా టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తర్వాత పోకిరి. సూపర్ డూపర్ హిట్. ఇక చెప్పేదేముంది. దాంతో హవా కొనసాగించింది. అయితే ఇటీవల ఇలియానాకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఈ నాజూకు నడుం భామ బాలీవుడ్‌పై కన్నేసింది. బాలీవుడ్లో అడుగుపెట్టడంపెట్టడంతోనే సూపర్‌డూపర్ హిట్ కొట్టింది. ఇలియానా తొలిసారిగా హిందీలో నటించిన బర్పీ చిత్రంతో మంచి పేరు మూటకట్టుకుంది. అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. మాస్ మసాలాలు లేవు. దాంతో ఇది కిందిస్థాయి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఈ సుందరి జాగ్రత్తలు పాటించడం మొదలు పెట్టింది. పూర్తి కమర్షియల్ సినిమాల మాత్రమే ఓకే చేప్పడం మొదలు పెట్టింది. అటువంటివాటిలో హ్యాపీ ఎండింగ్ ఒకటి. ఈ చిత్రంలో ఇలియానా సైఫ్ఆలీఖాన్తో జతకడుతోంది. ఈ చిత్రం షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. సైప్, ఇలియానా మధ్య కెమిస్ట్రి బాగా కుదిరినట్లు చెబుతున్నారు. లండన్ షెడ్యూల్లో ఇలియానా సైఫ్ ఆలీఖాన్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఎంజాయ్ అంటే వేరేలా అర్ధం చేసుకోకండి. అదేనండి పార్కులు చుట్టూ తిరగడం, డిన్నర్లలో పాల్గొనడం.... వంటివండి. ఆ తరువాత సైఫ్ జంటిల్మేన్ అని కితాబు కూడా ఇచ్చింది. -
మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం!
‘ఆఫ్‌బీట్ సినిమాల్లో నటించడం బాగానే ఉంటుంది. కానీ, వరుసగా అవే సినిమాలు చేస్తే ప్రేక్షకులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ‘బర్ఫీ’ తర్వాత నేను కావాలని కమర్షియల్ సినిమాలు ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే కమర్షియల్ సినిమాలకే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ ఉంటుంది’’ అంటున్నారు ఇలియానా. ప్రస్తుతం ఆమె హిందీలో ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘మై తేరా హీరో’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ షూటింగ్ మంచి అనుభూతినిచ్చిందని ఇలియానా పేర్కొంది. ఇక, ‘హ్యాపీ ఎండింగ్’ గురించి ప్రత్యేకంగా చెబుతూ - ‘‘ఇందులో సైఫ్ అలీఖాన్ సరసన నటిస్తున్నాను. యూఎస్‌లో ఆ మధ్య ఓ భారీ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. సైఫ్ జెంటిల్‌మేన్. కరీనా కూడా చాలా మంచిది. మా షూటింగ్ లొకేషన్‌కి తను వచ్చేది. అప్పుడు మేం ముగ్గురం బాగా ఎంజాయ్ చేశాం. లంచ్‌కి, డిన్నర్స్కి వెళ్లేవాళ్లం. నాకైతే షూటింగ్ చేస్తున్నట్లుగా లేదు. సెలవులను ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపించేది. కొన్ని సినిమాలకే ఇలా జరుగుతుంటుంది’’ అన్నారు ఇలియానా. -
సైఫ్ ఖాన్ తో కరీనా మళ్లీ...
కార్గిల్, తషన్, ఖుర్పాన్, ఏజెంట్ వినోద్ చిత్రాల్లో సైఫ్, కరీనాల కెమిస్ట్రీ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అదే ఊపును బాలీవుడ్ తెరపై కొనసాగించేందుకు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ జంట మళ్లీ ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. బాలీవుడ్ లో సైఫీనాల మధ్య కెమిస్ట్రీకి మంచి డిమాండ్ ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక పాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కరీనా, సైఫ్ ఆలీ ఖాన్ లు కలిసి మళ్లీ ఓ పాటలో నర్తించేందుకు సిద్దమయ్యారు. సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్న హ్యాప్పీ ఎండింగ్ చిత్రంలో కరీనా ఓ ప్రత్యేక పాటలో నటించేందుకు ఓకే చెప్పిందట! ఈ చిత్రంలో కరీనాను ఓ పాటలో నటింపచేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి పాటలో కరీనాను చూపించాలనే విషయంపై ఇంకా ఓ అవగాహనకు రాలేదు. త్వరలోనే కరీనా పాట గురించి వివరాలు అందిస్తాం అని హ్యాపీ ఎండింగ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తెలిపారు. ఇదిలా ఉండగా సైఫ్ ఆలీ ఖాన్, దినేష్ విజన్ సంయుక్తంగా నిర్మించే మరో చిత్రంలో కూడా కరీనా కపూర్ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే యూఎస్ లో జరిగిన షూటింగ్ లో కరీనా పాత్రను కొంత భాగం పూర్తి చేసినట్టు తెలిసింది.