సైఫ్ ఖాన్ తో కరీనా మళ్లీ...
కార్గిల్, తషన్, ఖుర్పాన్, ఏజెంట్ వినోద్ చిత్రాల్లో సైఫ్, కరీనాల కెమిస్ట్రీ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అదే ఊపును బాలీవుడ్ తెరపై కొనసాగించేందుకు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ జంట మళ్లీ ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు.
బాలీవుడ్ లో సైఫీనాల మధ్య కెమిస్ట్రీకి మంచి డిమాండ్ ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక పాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కరీనా, సైఫ్ ఆలీ ఖాన్ లు కలిసి మళ్లీ ఓ పాటలో నర్తించేందుకు సిద్దమయ్యారు. సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్న హ్యాప్పీ ఎండింగ్ చిత్రంలో కరీనా ఓ ప్రత్యేక పాటలో నటించేందుకు ఓకే చెప్పిందట!
ఈ చిత్రంలో కరీనాను ఓ పాటలో నటింపచేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి పాటలో కరీనాను చూపించాలనే విషయంపై ఇంకా ఓ అవగాహనకు రాలేదు. త్వరలోనే కరీనా పాట గురించి వివరాలు అందిస్తాం అని హ్యాపీ ఎండింగ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తెలిపారు.
ఇదిలా ఉండగా సైఫ్ ఆలీ ఖాన్, దినేష్ విజన్ సంయుక్తంగా నిర్మించే మరో చిత్రంలో కూడా కరీనా కపూర్ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే యూఎస్ లో జరిగిన షూటింగ్ లో కరీనా పాత్రను కొంత భాగం పూర్తి చేసినట్టు తెలిసింది.