చర్చనీయాంశమైన శృంగార కథా రచయిత్రిగా... | Saif Ali Khan as flamboyant writer in Happy Ending | Sakshi
Sakshi News home page

చర్చనీయాంశమైన శృంగార కథా రచయిత్రిగా...

Published Sun, Nov 2 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

చర్చనీయాంశమైన శృంగార కథా రచయిత్రిగా...

చర్చనీయాంశమైన శృంగార కథా రచయిత్రిగా...

సైఫ్ అలీఖాన్, ఇలియానా జంటగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ గురించి అటు మీడియాలోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చ ఒకటి హల్‌చల్ చేస్తోంది. పైగా ఆ చర్చ కూడా ఇలియానా పాత్ర గురించే. ఈ సినిమాలో ఇలియానా శృంగార కథల రచయిత్రిగా నటిస్తోందనీ, దానికి తగ్గట్టే అంతకు ముందెప్పుడూ కనిపించనంత అందంగా ఇందులో ఇల్లూ బేబీ కనిపించనుందనీ, బెడ్‌రూమ్ సన్నివేశాల్లో కూడా సైఫ్‌తో కలిసి రెచ్చిపోయి నటించిందనీ ఈ చర్చ సారాంశం. దీనిపై రకరకాల కథనాలు ఇప్పటికే మీడియాలో వచ్చాయి. ఇలియానా మొదట్లో వీటిపై పెద్దగా స్పందించకపోయినా... ఈ గాలివార్తలు శ్రుతి మించి రాగాన పడఢంతో స్పందించక తప్పలేదు.
 
 ‘‘అందరూ అనుకుంటున్నట్లు ఇందులో నేను శృంగార కథల రచయిత్రినే. అయితే... నేను శృంగారాన్ని ఒలకబోశాననే వార్తల్లో మాత్రం నిజం లేదు. ఇందులో నా పాత్ర చాలా పద్ధతిగా ఉంటుంది. రొమాన్స్ అనేది నా రచనల్లో ఉంటుంది తప్ప, నాలో కనిపించదు. నిజానికి ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకిస్తున్నానంటే.. అనవసరంగా అంచనాలు పెరగడం, చివరకు థియేటర్లో వాళ్లు ఊహించినవి లేకపోవడం... వంటి కార ణాలు సినిమా ఫలితంపై ప్రభావితం చేస్తాయి.అందుకే చెబుతున్నా’’ అని వివరణ నిచ్చారు ఇలియానా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement